హలో బీసీ చలో ఇందిరా పార్క్ మహాధర్నాకు కదిలిన డిఎస్పి నాయకులు.
చిట్యాల, నేటిదాత్రి :
హాలో బీసీ ఛలో ఇందిరా పార్క్ (హైదరాబాద్ )
జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవులు రిటైల్డ్ ఐ ఏ ఎస్ డా. విశారదన్ మహారాజ్ పిలుపు మేరకు 42%బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నేడు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ– జేఏసీ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును 9 వ షెడ్యూల్ లో చేర్చాలి. అనే డిమాండ్ తో.* హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న మహాధర్నాన్ని విజయవంతం చేయడం కోసం ధర్మ సమాజ్ పార్టీ నాయకులు చిట్యాల మండలం నుండి బయలుదేరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు శీలపాక నాగరాజ్, మండల నాయకులు పుల్ల అశోక్, రత్న రమేష్, చిలుముల కృష్ణ, పర్లపల్లి వంశీ మరియు వంగ రాంబాబు గౌడ్ పాల్గొన్నారు.
