జిల్లాలో పని చేస్తున్న హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న హోం గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డిజిపి కార్యాలయం నుండి వచ్చిన ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి అందజేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని,పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని,ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.
welfare
హోమ్ గార్డ్స్ అధికారులు,సిబ్బంది ఎవరికైన సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని,రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.నిరంతరం ఎండనకా,వాననకా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి అత్యవసర సమయాలలో ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని,క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు ఉల్లగింస్తే భవిష్యత్తులో శాఖ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్, హోమ్ హార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే,మేయర్
#ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని…
#31 డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ, నేటిధాత్రి :
పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ గార్లతో కలిసి 31 వ డివిజన్ హంటర్ రోడ్డులో వాసవి కాలనీ మరియు గాయత్రి కాలనీ లలో రూ.88.73 లక్షలతో నూతన అంతర్గత రోడ్లు నిర్మాణ పనులకు. శంకుస్థాపన చేశారు.తొలుత ఎస్సీ కాలనీలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల చేతుల్లో అభివృద్ధికి నోచుకోని అన్ని ప్రాంతాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.గతంలో కూడా ఎన్నికల ముందు,ఎన్నికల తరువాత పర్యటించిన క్రమంలో నా దృష్టికి వచ్చిన అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ,విద్యుత్తు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం కలిసికట్టుగా ముందుకు వెళ్తుందని అన్నారు.ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు సకాలంలో పనులను ప్రారంభించుకోవాలని సూచించారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్టడుగు వర్గాలకు అండగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్,డివిజన్ అధ్యక్షుడు సురేందర్,నాయకులు సత్తు రమేష్,కృష్ణ,తాళ్లపల్లి రాజు,బింగి రమేష్ యాదవ్,మామిండ్ల సురేష్ మరియు మునిసిపల్ అధికారులు స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
నెన్నెల మండలంలో అసత్య ప్రచారం చేసిన ఒకరిపై కేసు నమోదు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన దుర్గం రవిపై గురువారం కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ శుక్రవారం తెలిపారు.ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడని నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన అత్తిని బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోల నాయకులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర కార్మిక,ఉపాధి కల్పన,మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి గురువారం పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై మంత్రి తో చర్చించినట్లు తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నం మల్లయ్య,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బిజినెస్ కరస్పండెంట్ కమల్
పరకాల నేటిధాత్రి
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తీసుకువచ్చిన తక్కువ ధరకే అధిక ప్రయోజనాల గల యాక్సిడెంట్ భీమా పాలసీకి ప్రజల నుండి కార్మికుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని ఇండియన్ పోస్ట్పేమెంట్ బ్యాంక్ బిజినెస్ కరస్పండెంట్ కమల్ అన్నారు.శుక్రవారంరోజున బిర్లా సిమెంటు ఉద్యోగులు,కార్మిక సంఘ సభ్యులు కలిసి 649/849 రూపాయల ప్రీమియాలకు 10,15 లక్షల భీమా కవరేజ్ తో ఉన్న పాలసీని తీసుకున్నారని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది చాలా మంచి అవకాశమని ఇతర కార్మిక సంఘాలతో పాటు అందరూ పాలసీ తీసుకోవాలని,మనం పని చేస్తున్నంతవరకూ భద్రత అవసరమవుతుందని,పాలసీ వివరాలకు 8885111943 నెంబర్ కు లేదా సమీప ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చుంచు కమలాకర్ ని సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన ఎస్సై సంతోష్
శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి డ్రగ్స్,గంజాయి,మద్యం ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై సంతోష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని పాఠశాలల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు.రాబోయే రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని తెలిపారు.విద్యార్థులు,యువత,కార్మికులు,పౌరులు చెడు వ్యసనాల బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని అన్నారు.మత్తు పదార్థాల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.విద్య సంస్థలలో అవగాహన సదస్సు నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్ధలను వివరిస్తున్నట్లు పేర్కొన్నారు.అలాగే కేసులో ఇరుకుతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేస్తూ తరచూ తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాలు వినియోగించరాదు గంజాయి మత్తు పదార్థాలకు బానిస అయిన వారిని అందులో నుంచి బయటకు వచ్చేందుకు పునరావాస కేంద్రాలకు పంపిస్తూ ఎక్కడైనా గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.
పటేల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మోగడంపల్లి పీ.ఆర్. టి.యు అధ్యక్షులు, ఎంపీపీఎస్ తొట్టి తండా ప్రధానోపాధ్యాయులు చంద్రుడు రాథోడ్ గారి పదవి విరమణ అభినందన సభకు ఈరోజు శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వృత్తి నిబద్ధతకు మారుపేరు గారని, ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరని అన్నారు చంద్రు రాథోడ్ ఎన్నో సేవలు అందించారని, ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వారికి దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరు రాథోడ్, కేషు ,సంజు,భీమ్,గులాబ్ సింగ్,రాం శెట్టి, దేవిధాస్,చందర్ స్వామి,కిషన్,శంకర్ చౌహాన్,నరేష్,నాయకులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో విద్యుత్ షాక్ తో జూనియర్ లైన్ మెన్ మృతి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన చేలుకల ప్రవీణ్ (28)జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తూ బుధవారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే చేలుకల మల్లయ్య గంగు తల్లితండ్రుల రెండవ కుమారు డైన ప్రవీణ్ అనాధ అయిన సౌమ్యను ప్రేమ వివాహం చేసుకొని మహబూబాబాద్,గంగారం మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు.బుధవారం రాత్రి కోమట్ల గూడెం రోడ్డు సమీపంలో త్రీఫేస్ విద్యుత్ కు అంతరాయం ఏర్పడడంతో సబ్ స్టేషన్ నుంచి ఎల్ సి తీసుకొని మరమ్మతు చేస్తుండగా ఒక్క సారిగా విద్యుత్ ప్రవహించి ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.అలాగే మృతుని భార్య సౌమ్య ప్రస్తుతం 9 నెలల గర్భవతి అని తనకు పుట్ట బోయే బిడ్డకు జన్మ ఇవ్వక ముందే తన తండ్రి మృతి చెందడం వల్ల తన కుటుంబ సభ్యులు,గ్రామస్తులు శోక సముద్రంలో మునిగిపోయారు.
ఈ సారి చదరంగం కాదు రణరంగమే బిగ్‌బాస్9 ప్రోమో వచ్చేసింది…
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో, ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (BiggBoss) కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో, ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీజన్ ప్రారంభమయ్యే సమయంలో ఆ షోను వ్యతిరేకించేవారు అవాకులు, చవాకులు పేలినా.. ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం బాగానే ఉంటుంది. ఇప్పటికి ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదవ సీజన్‌కు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం సడన్‌గా ప్రోమో విడుదల చేసి వీక్షకులకు, బిగ్‌బాస్ అభిమానులకు షాక్ ఇచ్చారు.
సరికొత్త రూల్స్, టాస్క్‌లతో మరింత ఆసక్తికరంగా ఎవరూ ఊహించిన రీతిలో ఉంటుందని హోస్ట్ నాగార్జున (Nagarjuna) స్పష్టం చేశారు. ఆటలో అలుపు వచ్చింనంత తొందరగా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్దం చేస్తే సరిపోదు కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈ సారి చదరంగం కాదు రణరంగమే అంటూ ఘూటుగా చెబుతూ షోపై క్యూరియాసిటీ పెంచారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైలర్ అవుతోంది. మీరూ ఓల క్కేయండి. కాగా ఈ షో సెప్టెంబర్లో స్టార్ట్ అవనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో న్యూస్ హాల్‌చల్ చేస్తున్నప్పటికీ మేకర్స్ నుంచి అధికారికి ప్రకటన అయితే రాలేదు. ఇందుకు సంబంధించిన విషయాలు త్వరలో తెలియజేయనున్నారు.
ఇదెక్కడి మాస్ రా మామ తమ్ముడు రిలీజ్‌కు ముందే రిటర్న్స్…
నితిన్, దిల్ రాజుల చిత్రం తమ్ముడు విడుదలకు ముందే సేఫ్ జోన్‌లోకి చేరినట్లు తెలుస్తుంది.
నితిన్ (Nithiin) హీరోగా వకీల్ సాబ్, MCA, చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వం వహించిన చిత్రం తమ్ముడు (Thammudu). కాస్త విరామం తర్వాత దిల్ రాజు నిర్మిస్తున్న.
ఈ చిత్రంలో సప్తమి గౌడ (Sapthami Gowda), లయ (Laya), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), సౌరభ్ సచ్‌దేవా, స్వసిక కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాక సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
మూవీ జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు పుల్ స్వింగ్‌లో చేస్తున్నారు.
అయితే సినిమాకు మరీ హైప్ ఇవ్వకుండా, కత గురించి ఎక్కడా మరీ ఎక్కువగా చెప్పకుండా జాగ్రత్తగా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
సినిమా థియేటర్‌లు.
ఈ చిత్రం విడుదలకు ముందే సేఫ్ జోన్‌లోకి చేరినట్లు తెలుస్తుంది.
సుమారు రూ.70 కోట్ల వరకు బడ్జెట్‌తో తెరకెక్కగా చిత్రీకరణ సమయంలోనే హీరో, దర్శకుడు తమ రెమ్యునరేషన్లలో కాస్త తగ్గించుకోవడం ఆ విషయాన్ని వారు బహిరంగంగా చెప్పి మరి సినిమాను వార్తల్లో నిలిచేలా చేశారు కాగా.
కరోనా సమయంలో నానితో తీసిన వీ సినిమాను అమెజాన్‌లో డైరెక్ట్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన దిల్ రాజు మొదటి నుంచి ఆ తర్వాత కూడా తన ప్రతీ సినిమాను అమెజాన్ ప్రైమ్‌కు మాత్రమే ఇస్తూ మంచిగానే రికవరీ చేసుకుంటూ వస్తున్నారు.
ఇప్పుడు తన కొత్త చిత్రం తమ్ముడు విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫాం చేతిలో పెట్టడం ఆశ్చర్యం కలిగించింది.
ఇదిలాఉంటే ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకోగా, ఓటీటీ, హిందీ డబ్బింగ్, శాటిలైట్, ఆడియో రైట్స్ ఇలా నాన్ థియేట్రికల్ మొత్తం కలిపి రూ.38 కోట్ల మేర రికవరీ అయినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ రూ.75 కోట్లలో ముందే సగం పూడడంతో మేకర్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఇక థియేటర్లో విడుదలై మూవీ ఓ మోస్తరుగా ఉందని టాక్ వచ్చినా పెట్టిన పెట్టుబడిని మించి లాభాల బాట పట్టి నితిన్‌కు, దిల్ రాజుకు మంచి హిట్ పడ్డట్టేనని అనుకుంటున్నారు.
దీంతో మొత్తానికి తమ్ముడు (Thammudu) సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్టే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలిమరి.
విడుదల తర్వాత తమ్ముడు ఎంతమేరకు బాక్సాఫీస్ కలెక్షన్లు రాబడుతారో అంటూ సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ ముద్దుగుమ్మలు సమంత , డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల లు ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తున్నారు.
టాలీవుడ్ ముద్దుగుమ్మలు సమంత (Samantha Ruth Prabhu), డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela)లు ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తున్నారు.
దీంతో వారిని చూడడానికి ఫ్యాన్స్, సినీ లవర్స్‌కు రెండు కళ్లు చాలడం లేదు.
తాజాగా ముంబైలో నిర్వహించిన జీక్యూ సంస్థ మోస్ట్ ఇన్‌ఫ్వూయెన్షియల్ యంగ్ ఇండియన్స్2025 (GQ Most Influential Young Indians 2025) పేరిట నిర్వహించిన కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లు తమదైన శైలిలో భిన్న రీతుల్లో ఒక్కొక్క రకమైన డ్రెస్సింగ్‌తో హజరై ఆ వేడుకను కలర్‌ఫుల్ చేశారు.
ఈ సందర్భంగా సమంత (Samantha), శ్రీలీల (Sreeleela) ఇద్దరు ఒకేసారి కలుసుకుని ఫొటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తిని నేనే…
ఈ తరుణంలో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిని తానేనని హీరో అధర్వ మురళి అన్నారు
డీఎన్‌ఏ (DNA Movie) విజయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నానని, ఈ తరుణంలో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిని తానేనని హీరో అధర్వ మురళి (Atharvaa Murali) అన్నారు. ఒలింపియా మూవీస్ పతాకంపై జయంతి అంబేత్‌కుమార్ సమర్పణలో నెల్సన్ వెంకటేశన్ (NelsonVenkatesan) దర్శకత్వంలో ఎస్.అంబేత్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘డీఎన్‌ఏ’. రెడ్ జెయింట్ మూవీస్ గత శుక్రవారం రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో ఉండటంతో చిత్ర బృందం ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించగా హీరో అధర్వ మురళి, హీరోయిన్ నిమిషా సజయన్ (Nimisha Sajayan), నటుల కాళి వెంకట్, సుబ్రహ్మణ్య శివ సహా చిత్ర బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధర్వ మురళి (Atharvaa Murali) మాట్లాడుతూ, ‘ఈ చిత్రం నిర్మాణం నుంచి విజయం వరకు పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా సక్సెస్ చేసిన మీడియా, ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ విజిట్‌కు వెళ్ళినపుడు, ప్రతి థియేటర్‌లో అనూహ్య స్పందన లభించింది. ఈ సినిమా విజయం నా కెరీర్‌కు ఎంతో ముఖ్యం. అందుకే సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. ఇపుడు ఈ ప్రపంచంలో నాకంటే సంతోషకరమైన వ్యక్తి మరొకరు లేరు. ఇంతటి మంచి విజయాన్ని అందించిన దర్శకనిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు.
‘ఒక మంచి చిత్రంలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని హీరోయిన్ నిమిషా (Nimisha Sajayan) అన్నారు. దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ (NelsonVenkatesan) మాట్లాడుతూ, ‘ప్రస్తుత పరిస్థితుల్లో తమిళ సినిమాలో ఒక చిత్ర విజయం అంటే కేవలం దర్శకుడు మంచి చిత్రాన్ని రూపొందించడమే కాదు. ఆ సినిమా మార్కెటింగ్, ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్, ఇలా ప్రతి ఒక్కటీ అనుకూలంగా ఉన్నపుడే ఆ మూవీ ఘన విజయం సాధిస్తుంది. ఈ సినిమా విజయంలో తెరపైన, తెర వెనుక కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అన్నారు
మందమర్రి ఫోటో&వీడియో గ్రాఫర్స్. వెల్ఫేర్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు మామిడాల మధుకర్ గారికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది విషయం తెలుసుకుని.ఈరోజు వల్ల స్వగృo మందమర్రి పాత బస్టాండ్ కు వెళ్లి యోగ క్షేమములు తెలుసుకొని. మా యూనియన్ సంఘం ఫాండ్ నుండి తక్షణ సహాయం కింద 5000/- రూపాయల చెక్కు కుటుంబానికి అందజేయడం జరిగినది కార్యక్రమంలో. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్. మందమరి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. కోశాధికారి బద్రి సతీష్.. గౌరవ సలహాదారులు నక్క తిరుపతి. జాడి ముకుందం. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరాజ్ ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అనిధర్ రెడ్డి. ఆర్ సుజిత్. నక్క పవన్.ప్రచార కార్యదర్శి కందుకూరి శ్రీకాంత్ మాజీ ఉపాధ్యక్షులు విక్టరీ అశోక్. బసం అంజి. వరుణ్. తదితరులు పాల్గొన్నారు
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిని గోపి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ శాఖ నూతన బిజెపి కార్యవర్గం నియమించడం జరిగినది. ఇందులో భాగంగా ఉపాధ్యక్షులుగా మోర శ్రీహరి మరియు అంకారపు రాజు, కాంభోజ శ్రీధర్, పల్లికొండ నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండ సురేష్, మేర్గు శ్రీనివాస్, పట్టణ కార్యదర్శులుగా కోడంతవి సురం వినయ్ పంపరి అర్జున్, కోడం శ్రీనివాస్, కోశాధికారిగా ఇoజపురి మురళి బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖగా నియమితులయ్యారని జిల్లా బిజెపి అధ్యక్షుడు తెలిపారు.
థగ్‌లైఫ్ సినిమా ఫెయిల్యూర్‌కు మణిరత్నం ప్రేక్షకులకు క్షమాపణ లు చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంపై మ ద్రాస్ టాకీస్ స్పందించింది.
సినిమా టైమింగ్స్
ఇటీవల ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల మధ్యకు వచ్చి డిజాస్టర్‌గా నిలవడమే కాక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న చిత్రం థగ్‌లైఫ్ (Thug Life). అయితే ఈ సినిమా ఫెయిల్యూర్‌కు ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం (Manirathnam) ప్రేక్షకులకు క్షమాపణ లు చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంపై మ ద్రాస్ టాకీస్ (Madras Talkies) స్పందించింది. చిత్ర దర్శకుడు మణిరత్నం ప్రేక్షకులకు సారీ చెప్పినట్టుగా అసత్య ప్రచారం చేయొద్దని కోరింది.
సినిమా టైమింగ్స్
‘ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారని, దీంతో అభిమానులకు మణిరత్నం (Manirathnam) సారీ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు. నిజానికి మణిరత్నం ఎవరికీ క్షమాపణ చెప్పలేదు. ఆ సినిమా అభిమానులను సంతృప్తి పరచలేదని, అందుకే ఆయన సారీ చెప్పినట్టుగా సాగుతున్న ప్రచారం అబద్దమని మద్రాస్ టాకీస్ స్పష్టం చేసింది.
సినిమా టైమింగ్స్
కాగా, రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాయి. కమల్ హాసన్ (Kamal Haasan), శింబు (Silambarasan), నాజర్, త్రిష (Trisha), అభిరామి వంటి అగ్రతారాగణం నటించగా, ఏఆర్.రెహ్మాన్ (AR Rahman) సంగీతం. జూన్ 5వ తేదీన విడుదలైంది.
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు…
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను డి.సురేశ్‌బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు భారీ ధరకు సొంతం చేసుకున్నారు. ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్‌మెంట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలవుతోంది. తాజాగా చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘చికిటు’ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ హుషారైన గీతంలో వింటేజ్ స్టైల్లో అదిరిపోయే స్టెప్పులతో అభిమానుల్ని ఖుషీ చేశారు రజనీకాంత్.
శ్రీశైల మల్లన్న అభిషేకం స్పర్శ దర్శనం చేసుకున్న శ్రీ దుర్గా మాత రియల్ ఎస్టేట్ సభ్యులు
కొల్చారం (మెదక్) నేటిధాత్రి:
తూప్రాన్ పట్టణ శ్రీ దుర్గా మాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీశైలం లోని దివ్య భవ్య మహిమాన్విత పుణ్య క్షేత్రం అయిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున ఆలయం లో స్పర్శ దర్శనం చేసుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ రావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దగ్గర ఉండి ప్రత్యేక పూజలు చేయించి అత్యంత ప్రామాణికమైన శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం చేయించి ఆలయ సంప్రదాయ పద్ధతిలో అభిషేకం హారతి అర్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో తూప్రాన్ మున్సిపల్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ లయన్ కుమ్మరి రమేష్, లయన్ గరిగే నర్సింగ్ రావు,తాటి విశ్వం,వడియారం నరసింహులు. ఈఓ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్ బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం – శుక్ల పక్షం రోజు బృహస్పతివాసరే ఆర్ద్ర నక్షత్రం అమృతకాలం – రాహుకాలంలో స్పర్శ దర్శనం చేసుకోవడం వలన వ్యాపార వృద్ధి చెంది దినదిన అభివృద్ధి చెందుతామని తెలిపారు. సూర్యోదయం కంటే ముందు మల్లన్న దర్శనం ఎంతో మేలు చేసే గొప్ప శుభ ఫలితాలను ఇస్తుంది అని అన్నారు. సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు…అని వేదపండితులు ఆశీర్వచన ఇచ్చారని తెలిపారు. గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి!! అదే మన కర్తవ్యం అని తెలిపారు.
కన్నప్ప అనే శివ భక్తుడు ఉండేవాడు ఇప్పటికీ ఆయనను ఆరాధిస్తుంటారు కన్నప్ప సినిమా కథ కల్పితం కాదు అది మన చరిత్ర.
మన మధ్యలో జీవించిన ఓ వ్యక్తి కథ’ అని అన్నారు హీరో మంచు విష్ణు…
కన్నప్ప అనే శివ భక్తుడు ఉండేవాడు. ఇప్పటికీ ఆయనను ఆరాధిస్తుంటారు. ‘కన్నప్ప’ సినిమా కథ కల్పితం కాదు.. అది మన చరిత్ర. మన మధ్యలో జీవించిన ఓ వ్యక్తి కథ’ అని అన్నారు హీరో మంచు విష్ణు.
ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు తెగాయి.
ఇదంతా శివ లీల అనిపిస్తోంది. కుటుంబమంతా కలసి ఈ చిత్రాన్ని హాయిగా చూడాలని కోరుకుంటున్నాను. అందుకే నేను టికెట్ రేట్లు పెంచలేదు. ఏపీలో కొన్ని చోట్ల మాత్రమే పెంచాం. నా నలుగురు పిల్లలు ఈ చిత్రంలో నటించారు.
ఓ తండ్రిగా నా పిల్లల్ని తెరపై చూడటం ఆనందంగా ఉంది. దేవుడు, భక్తుడికి మధ్యలో ఎవరూ ఉండాల్సిన పని లేదు. మూఢ నమ్మకాలు అవసరం లేదు. దేవుడి మీద మనసారా భక్తి ఉంటే చాలు అని చెప్పాలని అనుకున్నాం.
ఈ చిత్రంలో మోహన్‌లాల్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘‘కన్నప్ప’ చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం’ అని చెప్పారు. నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
ఒట్టేసి చెబుతున్నా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు నటుడు కౌశల్ మాట్లాడుతూ ‘ప్రస్తుత తరమంతా ‘కన్నప్ప’ చిత్రాన్ని చూడాలి’ అని కోరారు.
విశ్వ జంపాల,న్యాయవాది మరియు విశ్వ సమాజం వ్యవస్థాపకులు…
మహబూబాబాద్ గార్ల నేటి ధాత్రి:
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల విద్యా-వైద్య సంస్థలను నిర్వహిస్తూన్నాయి. వాటి నిర్వాహాణకు సరిపడా నిధులు మాత్రం కెటాయించడం లేదు. అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూన్నాయి.భారతదేశంలో పథకాలకు కొదువ లేదు, పైసలకు కొరత లేదు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుస్తూన్నారు. ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు మారుతున్నారు, కాని ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు.
స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికి సగటు భారతీయుని ప్రాథమిక హక్కులైన కూడు-గూడు-గుడ్డ తో పాటు విద్యా- వైద్యం-ఆరోగ్యం సమకూర్చడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ పూరిత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తూన్నాయి.
సమగ్ర విద్యా- వైద్య- ఆరోగ్య విధానాన్ని రూపొందించడంలోను, అమలు చేయడంలోను పూర్తిగా విఫలం చెందాయి. పూర్తి నిర్లక్ష్య దోరణి ప్రదర్శిస్తున్నాయి. ఓట్లు దండుకోవడంలో, సీట్లు దక్కించుకోవడంలో కనబరిచిన శ్రద్ధాశక్తులలో పది శాతం కల్గి వున్న “అక్షర భారత్ – ఆరోగ్య భారత్” నిర్మాణం జరిగి ఉండేది.
దీని పర్యావసానమే విద్యా -వైద్య రంగాలలో ప్రైవేటీకరణ- కార్పోరేటికరణ ప్రభలంగా పెరిగి పోయింది. విద్యా – వైద్య రంగంలో కార్పోరేట్ విష పోకడలు మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమించాయి.
సమస్యల సాలెగూళ్ళలో చిక్కి ప్రభుత్వ విద్యా- వైద్య సంస్థలు ప్రజాదరణ కోల్పోతున్నాయి.
కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెపుతున్న ప్రభుత్వాలు విద్యా- వైద్య సంస్థల్లో నేటికి కనీస మౌళిక వసతులు కూడా కల్పించలేదు.
కమిటీలు, కమీషన్లు వేస్తూ, కడుపు నింపని సంక్షేమ పథకాలతో కాలయాపన చేస్తూ మీన వేశాలు లెక్కపెడుతున్నాయి. చిత్తశుద్ధి లోపించిన ప్రభుత్వాల పనితీరు ప్రజల పాలిటి శాపంగా మారింది.
లక్షలాది మంది విద్యార్థినీ విద్యార్థులు పోషక ఆహార లోపం, రక్తహీనత, కంటి, దంత, మూత్ర సంబంధిత వ్యాధులతో బాదపడుతున్నారు.సమాజ మనుగడకు విద్యా-వైద్యం-ఆరోగ్యం అతి ప్రధాన మైనవి. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రధాన లక్షణం.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకుంటున్న భారత పాలక వర్గాలు ఆచరణలో దానికి భిన్నమైన వైఖరిని కల్గి వున్నాయి.
భారత దేశంలో భూస్వాములు- పెట్టుబడిదారులు ప్రైవేట్- కార్పోరెట్ శక్తులుగా ఎదిగి పాలక వర్గాలుగా అవతరించాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గ ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా అంతర్గత ఎజెండాను అమలు చేస్తూన్నాయి.
ప్రభుత్వ అనుమతితోనే విద్యా-వైద్య రంగాల్లో కార్పోరేటీకరణ విష ఫలాలనందించే వట వృక్షంగా పెరిగిపోయింది.
కార్పోరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ పాలక వర్గంలో కీలక భాగమై కూర్చున్నాయి.
విధానాల రూపకల్పనలో, అమలులో చక్రం తిప్పుతున్నాయి.
ఈ వర్గాలే సేవా రంగాలైన విద్యా-వైద్య రంగాలను అత్యంత లాభ సాటి వ్యాపారంగా మార్చాయి. ఈ వర్గాలే ప్రజలను కార్పొరేట్ రాజకీయాల వైపు మళ్లిస్తూ ఎన్నికల ప్రక్రియను, ప్రభుత్వాలను శాసిస్తున్నాయి.
ప్రైవేట్, కార్పోరేట్ విద్యా-వైద్య సంస్థల మధ్య నెలకొన్న తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీ కారణంగా స్వార్ధం, అవినీతి అక్రమాలతో కూడిన తప్పుడు విధానాలకు పూనుకుంటున్నారు.పారి శుద్యం, త్రాగు నీరు, మల మూత్ర శాలలు, భోజన శాలలు, వంట శాలలు, పడకలు, పక్కా భవనాలు, ప్రహారి నిర్మాణాలు, మురుగు కాల్వలు, ఈగలు, దోమలు, శిధిలావస్థలో వున్న భవనాలు, విద్యుత్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఫర్నీచర్, వైద్య పరికరాలు, మందులు తదితర మౌళిక వసతులు, సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు ఆదరణ కోల్పోతున్నాయి.
వీటికి తోడు అరకొర నిధుల కెటాయింపు, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, అవినీతి, నిర్లక్ష్యం తదితర ప్రధాన సమస్యలు ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలను నిత్యం పట్టి పీడిస్తున్నాయి.
సమస్యల వలయంలో చిక్కిన ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయాయి.
ఒకప్పుడు విదేశీయులు, దోపిడి దొంగల భీభత్సంతో ప్రజలు అభద్రత భావంతో బ్రతికేవారు.
నేడు విద్యా-వైద్యం అందక జీవితంపై భయంతో, బెంగతో, అభద్రతా భావంతో జీవనం సాగిస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏండ్లుగా పాలక వర్గాల మోసపూరిత, కుట్ర బుధ్ధితో విద్యా-వైద్య-ఆరోగ్య, ఉపాధి అవకాశాలు సామాన్య ప్రజలకు అందకుండా పోయాయి. వలసలు, అప్పులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
ఆకలి చావులైనా, ఆత్మ హత్యలైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి.
నేడు దేశంలో జరుగుతున్న రైతు ఆత్మ హత్యలు, కుల వృత్తి దారుల ఆత్మ హత్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూన్న ప్రజా వ్యతిరేక విధానాల మూలంగానే ఈ ఆత్మ హత్యలు జరుగుతున్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థ పూరిత అనాలోచిత నిర్ణయాలు-నిర్లక్ష్యాల మూలాలే నేటి ఆత్మ హత్యలకు కారణాలు.ప్రజా ద్రోహులు, పెట్టుబడిదారులు, కార్పోరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మమేకమవుతున్నాయి
ఇది చాలా ప్రమాదకరం. ప్రజలకు ఉపకరించే ప్రభుత్వ పథకాలను, లక్ష్యాలను నిర్వీర్యం చేస్తూ తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ శక్తుల కలయిక.
భారత దేశ ప్రజలు విజయానికి, విజయం తాలూకు ఫలాలను ఆస్వాదించడానికి మధ్య ఉన్న సంధికాలంలో ఉన్నారు. ప్రజల నోటి కాడి ముద్దను దళారులు గుంజుకునేందుకు ప్రభుత్వ విధానాలే దోహదం చేస్తూన్నాయి.
ప్రజా ద్రోహులు-రాజకీయ దళారులు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తూన్నారు.
విద్యా-వైద్యం-ఉపాధి మొదలైన మౌళిక రంగాలలో విధానాలు రూపొందించడం- అమలుపర్చడంలో ప్రజలు మరింత చైతన్యవంతమైన పోరాట స్పూర్తిని కలిగియుండాలి.
విద్య-వైద్య రంగాలలో కార్పోరేటీకరణ మానవజాతి మనుగడకే సమస్యగా తయారై ప్రజా జీవనానికి పెను సవాలుగా మారింది. ప్రజలందరికీ సమానమైన, నాణ్యమైన విద్య వైద్యం అందాలంటే విద్యా – వైద్యం జాతీయీకరణ చేయడమే ఏకైక పరిష్కారం.
విద్యా-వైద్యం జాతీయీకరణ జరిగేంత వరకు దోపిడి పీడన ఆగేంత వరకు అలుపెరగని పోరాటం చేయడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
మంచు విష్ణు కన్నప్ప ఎలా ఉందంటే ట్విట్టర్ రివ్యూ…
కన్నప్ప చిత్రం అన్ని అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే విదేశాలలో ఇప్పటికే సినిమా షోలు పడిపోయాయు.
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇండియన్ సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహాన్ లాల్ వంటి మహా మహులు నటించిన కన్నప్ప (Kannappa) చిత్రం అన్ని అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే విదేశాలలో ఇప్పటికే సినిమా షోలు పడిపోయాయు. మన దగ్గర కూడా కొన్ని ప్రాంతాలలో ప్రీమియర్లు వేయడంతో చాలా మంది సినిమా చూసి క్షణం గ్యాప్ ఇవ్వకుండా వెనువెంటనే తమ తమ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సినిమా ఎలా ఉంది, నటీనటులు ఎలా చేశారనే అంశాలను తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి వీక్షకులు ఎలాంటి రిపోర్టులు ఇచ్చారో, ఇస్తున్నారో Kanappa Review ఇక్కడ చూద్దాం.
సినిమా ఆరంభమమే శివ పార్వతుల మీద ప్రారంభమై, తిన్నడు, అక్కడి గ్రామాలు, గ్రూపుల గురించి చూయించారని పేర్కొంటున్నారు. ప్రతీ ప్రేమ్ విజువల్‌గా, టెక్నికల్‌గా అద్బుతంగా తీర్చిదిద్దారని, అంటున్నారు. అంతేగాక ఫస్టాప్‌లో అనేక క్యారెక్టర్ల పరిచయం, మోహన్ లాల్, మోహన్ బాబుల పాత్రలు ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీతో సినిమా మరో స్థాయికి వెళ్లిందని చాలా మంది తమ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు మొదటి నుంచి ట్రోలింగ్ జరిగినట్లు సినిమా లేదని చాలా జాగ్రత్తగా, అనేక పరిశోధనలు చేసి మరి తీసినట్లు ఉందని చెబుతున్నారు.
ఫస్టాప్ కాస్త ల్యాగ్, బోర్ ఫీల్ వచ్చినా ద్వితియార్ధమే అద్భుతంగా ఉందని, ముఖ్యంగా ప్రభాస్ వచ్చిన తర్వాత, ఆపై చివరి 30 నిమిషాలు సినిమాకు ఆయువు పట్టని అంటున్నారు. అధేవిధంగా సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్, పాటలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయని, పాటల్లోని సాహిత్యం కూడా అర్థవంతంగా ఉండి అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ తరానికి కన్నప్ప గురించి తెలియజేసే ప్రయత్నం బావుందని, ప్రధానంగా మంచు విష్ణు నటన, తిన్నడు నుంచి కన్నప్పగా మారిన క్షణం మెస్మరైజింగ్‌గా ఉందని, పూర్తిగా భక్తిభావం పెరిగేలా చేస్తూ క్లైమాక్స్ స్టన్నింగ్‌గా రూపొందించారని అనేక మంది సోషల్ మీడియాల్లో తమ, తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.