ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్.

ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్…

 

AP BJP Chief: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి పేరు ఖరారైందని ఎమ్మెల్సీ సోమువీర్రాజు తెలిపారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు.

విజయవాడ, జూన్ 30: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా (AP BJP New Chief) మాజీ ఎమ్మెల్సీ మాధవ్ (Former MLC Madhav) పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాల మేరకు మాధవ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా వెల్లడించే వరకు పేరు చెప్పవద్దని కమలం పార్టీ నాయకులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బీజేపీ చీఫ్‌ ఎంపిక నేపథ్యంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్త బాస్‌పై మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యిందన్నారు.రాష్ట్ర రాజకీయ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అధ్యక్ష పదవికి పేరు నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు. అధికారికంగా అధ్యక్షుడి పేరు ప్రకటించడమే మిగిలి ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు.బీజేపీ ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధ్యక్ష ఎంపిక జరుగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నామినేషన్లు వేయడం, సాయంత్రం ఉపసంహరణ జరుగుతుందన్నారు. రేపు అధికారికంగా అధ్యక్షుని పేరు ప్రకటిస్తారన్నారు. రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతోందని చెప్పారు. అధిష్టానం నిర్ణయాలను అందరూ గౌరవిస్తారని..స్వాగతిస్తారని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు.

ఈ సారి చద‌రంగం కాదు ర‌ణరంగ‌మే బిగ్‌బాస్9 ప్రోమో వ‌చ్చేసింది

ఈ సారి చద‌రంగం కాదు ర‌ణరంగ‌మే బిగ్‌బాస్9 ప్రోమో వ‌చ్చేసింది…

 

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్‌ ఉందో, ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (BiggBoss) కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్‌ ఉందో, ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీజన్‌ ప్రారంభమయ్యే సమయంలో ఆ షోను వ్యతిరేకించేవారు అవాకులు, చవాకులు పేలినా.. ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం బాగానే ఉంటుంది. ఇప్పటికి ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిద‌వ సీజన్‌కు ముస్తాబ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా గురువారం స‌డ‌న్‌గా ప్రోమో విడుద‌ల చేసి వీక్ష‌కుల‌కు, బిగ్‌బాస్ అభిమానుల‌కు షాక్ ఇచ్చారు.

సరికొత్త రూల్స్‌, టాస్క్‌లతో మరింత ఆసక్తికరంగా ఎవరూ ఊహించిన రీతిలో ఉంటుందని హోస్ట్‌ నాగార్జున (Nagarjuna) స్పష్టం చేశారు. ఆట‌లో అలుపు వ‌చ్చింనంత తొంద‌ర‌గా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్దం చేస్తే స‌రిపోదు కొన్ని సార్లు ప్ర‌భంజ‌నం సృష్టించాలి. ఈ సారి చద‌రంగం కాదు ర‌ణరంగ‌మే అంటూ ఘూటుగా చెబుతూ షోపై క్యూరియాసిటీ పెంచారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో బాగా వైల‌ర్ అవుతోంది. మీరూ ఓల క్కేయండి. కాగా ఈ షో సెప్టెంబ‌ర్లో స్టార్ట్ అవ‌నున్న‌ట్లు సామాజిక మాధ్య‌మాల్లో న్యూస్ హాల్‌చ‌ల్ చేస్తున్న‌ప్ప‌టికీ మేక‌ర్స్ నుంచి అధికారికి ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ఇందుకు సంబంధించిన విష‌యాలు త్వ‌ర‌లో తెలియ‌జేయనున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version