ఈ సారి చద‌రంగం కాదు ర‌ణరంగ‌మే బిగ్‌బాస్9 ప్రోమో వ‌చ్చేసింది

ఈ సారి చద‌రంగం కాదు ర‌ణరంగ‌మే బిగ్‌బాస్9 ప్రోమో వ‌చ్చేసింది…

 

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్‌ ఉందో, ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (BiggBoss) కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్‌ ఉందో, ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీజన్‌ ప్రారంభమయ్యే సమయంలో ఆ షోను వ్యతిరేకించేవారు అవాకులు, చవాకులు పేలినా.. ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం బాగానే ఉంటుంది. ఇప్పటికి ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిద‌వ సీజన్‌కు ముస్తాబ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా గురువారం స‌డ‌న్‌గా ప్రోమో విడుద‌ల చేసి వీక్ష‌కుల‌కు, బిగ్‌బాస్ అభిమానుల‌కు షాక్ ఇచ్చారు.

సరికొత్త రూల్స్‌, టాస్క్‌లతో మరింత ఆసక్తికరంగా ఎవరూ ఊహించిన రీతిలో ఉంటుందని హోస్ట్‌ నాగార్జున (Nagarjuna) స్పష్టం చేశారు. ఆట‌లో అలుపు వ‌చ్చింనంత తొంద‌ర‌గా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్దం చేస్తే స‌రిపోదు కొన్ని సార్లు ప్ర‌భంజ‌నం సృష్టించాలి. ఈ సారి చద‌రంగం కాదు ర‌ణరంగ‌మే అంటూ ఘూటుగా చెబుతూ షోపై క్యూరియాసిటీ పెంచారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో బాగా వైల‌ర్ అవుతోంది. మీరూ ఓల క్కేయండి. కాగా ఈ షో సెప్టెంబ‌ర్లో స్టార్ట్ అవ‌నున్న‌ట్లు సామాజిక మాధ్య‌మాల్లో న్యూస్ హాల్‌చ‌ల్ చేస్తున్న‌ప్ప‌టికీ మేక‌ర్స్ నుంచి అధికారికి ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ఇందుకు సంబంధించిన విష‌యాలు త్వ‌ర‌లో తెలియ‌జేయనున్నారు.

నల్లాల నీళ్లు రాకపోవడంతో.

నల్లాల నీళ్లు రాకపోవడంతో
రవినగర్ గ్రామస్తుల నిరసన

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలంలోని పరశురాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రవి నగర్ లో నల్లాలు రాకపోతుండడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా గ్రామస్తులు గ్రామంలో నీటి వసతి కొరకు ఏర్పాటుచేసిన బోర్ లు పనిచేయకపోతుండటంతో పాటు ఓహెచ్ ద్వారా అందించాల్సిన తాగు నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి తమకు నీటి వసతి ఏర్పాటు చేయాలని శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.

రెండవసారి మారగాని బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శిగా రెండవసారి మారగాని బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక

మరిపెడ నేటిధాత్రి:

ఒంటె కొమ్ము లక్ష్మారెడ్డి గార్డెన్ లో మరిపెడ మండలం ఐదవ మహాసభ జరగగా మరిపెడ మండలంలోని నీలికుర్తి గ్రామానికి చెందిన మారగాని బాలకృష్ణ గౌడ్ ఉన్నంత విద్యావంతుడైన మొదటి నుండి వామపక్ష విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసి బాలకృష్ణ నూ గుర్తించి సిపిఐ పార్టీ మరిపెడ మండలం కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషిచేసిన బాలకృష్ణని తిరిగి 5వ మండల మహాసభలో రెండవసారి సిపిఐ మరిపెడ మండలం కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది
భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై కార్మిక శ్రామిక బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరిపెడ మండలంలో పార్టీ సూచించిన విధంగా నిరంతరం పోరాటాలు కొనసాగిస్తానని తెలియజేశాడు ఈ ఎన్నికకు సహకరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారధికి జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి కి సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు

సజావుగా గ్రామసభ నిర్వహణ.

సజావుగా గ్రామసభ నిర్వహణ…..

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచర్యాగడి గ్రామంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి నవీన్ కుమార్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ వద్ద జరిగిన ఈ సమావేశంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించారు. గ్రామంలో వీధిదీపాల సమస్య, మురుగు నీటి నిల్వ, త్రాగునీటి కొరత వంటి సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఇంటి యజమాని ఇంటిపన్ను సహా ఇతర పన్నులను చెల్లించాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version