శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి జూపల్లి.

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని గురువారం తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థాన అధికారులు, పండితులు, ఇతర సిబ్బంది వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మ‌ల్లికార్జున స్వామి, భ్ర‌మ‌రాంభ అమ్మ‌వారిని ఎన్నిసార్లు చూసినా త‌నివి తీర‌దని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. అనంతరం శ్రీశైలం డ్యాంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బోటు ప్రయాణం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. పర్యాటక అవకాశాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, భద్రత, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి తదితర విషయాలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు శ్రీశైలం లో ఆల్ ఇండియా వెలమ సంక్షేమ భవన్ ను మంత్రితో కలిసి ప్రారంభించి, అనంతరం అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

శ్రీశైల మల్లన్న అభిషేకం స్పర్శ దర్శనం చేసుకున్న శ్రీ దుర్గా మాత రియల్ ఎస్టేట్ సభ్యులు.

శ్రీశైల మల్లన్న అభిషేకం స్పర్శ దర్శనం చేసుకున్న శ్రీ దుర్గా మాత రియల్ ఎస్టేట్ సభ్యులు

కొల్చారం (మెదక్) నేటిధాత్రి:

తూప్రాన్ పట్టణ శ్రీ దుర్గా మాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీశైలం లోని దివ్య భవ్య మహిమాన్విత పుణ్య క్షేత్రం అయిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున ఆలయం లో స్పర్శ దర్శనం చేసుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ రావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దగ్గర ఉండి ప్రత్యేక పూజలు చేయించి అత్యంత ప్రామాణికమైన శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం చేయించి ఆలయ సంప్రదాయ పద్ధతిలో అభిషేకం హారతి అర్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో తూప్రాన్ మున్సిపల్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ లయన్ కుమ్మరి రమేష్, లయన్ గరిగే నర్సింగ్ రావు,తాటి విశ్వం,వడియారం నరసింహులు. ఈఓ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్ బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – శుక్ల పక్షం రోజు బృహస్పతివాసరే ఆర్ద్ర నక్షత్రం
అమృతకాలం –
రాహుకాలంలో స్పర్శ దర్శనం చేసుకోవడం వలన వ్యాపార వృద్ధి చెంది దినదిన అభివృద్ధి చెందుతామని తెలిపారు.
సూర్యోదయం కంటే ముందు మల్లన్న దర్శనం ఎంతో మేలు చేసే గొప్ప శుభ ఫలితాలను ఇస్తుంది అని అన్నారు.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు…అని వేదపండితులు ఆశీర్వచన ఇచ్చారని తెలిపారు.
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి!! అదే మన కర్తవ్యం అని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version