పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పాలసీకి గొప్ప స్పందన.

పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పాలసీకి గొప్ప స్పందన

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బిజినెస్ కరస్పండెంట్ కమల్

పరకాల నేటిధాత్రి

 

 

 

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తీసుకువచ్చిన తక్కువ ధరకే అధిక ప్రయోజనాల గల యాక్సిడెంట్ భీమా పాలసీకి ప్రజల నుండి కార్మికుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని ఇండియన్ పోస్ట్పేమెంట్ బ్యాంక్ బిజినెస్ కరస్పండెంట్ కమల్ అన్నారు.శుక్రవారంరోజున బిర్లా సిమెంటు ఉద్యోగులు,కార్మిక సంఘ సభ్యులు కలిసి 649/849 రూపాయల ప్రీమియాలకు 10,15 లక్షల భీమా కవరేజ్ తో ఉన్న పాలసీని తీసుకున్నారని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది చాలా మంచి అవకాశమని ఇతర కార్మిక సంఘాలతో పాటు అందరూ పాలసీ తీసుకోవాలని,మనం పని చేస్తున్నంతవరకూ భద్రత అవసరమవుతుందని,పాలసీ వివరాలకు 8885111943 నెంబర్ కు లేదా సమీప ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చుంచు కమలాకర్ ని సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

నేటి ధాత్రి లో ప్రచురితమైన వార్తకు స్పందన.

నేటి ధాత్రి లో ప్రచురితమైన వార్తకు స్పందన
• కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో

నిజాంపేట: నేటి ధాత్రి

 

కష్టించిన పంట వానపాలు
ప్రచురితమైన వార్తకు రెవెన్యూ అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కొనుగోలు అయినప్పటికీ లారీలు రావడం లేదని రైతులు ఆరోపించడంతో బుధవారం వార్త నేటి దాత్రిలో ప్రచురితమైంది. ఈ మేరకు నిజాంపేట మండల తాసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి లు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు నిర్వాహకులకు కొనుగోలు వేగవంతం చేయాలని సూచించడం జరిగిందన్నారు. అలాగే రైస్ మిల్ నిర్వాహకులకు లారీలను త్వరితగతిన అన్లోడ్ చేయాలని సూచించడం జరిగిందన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించడం జరిగిందన్నారు.

నేటి ధాత్రి వార్తకు విద్యుత్ అధికారుల స్పందన.

నేటి ధాత్రి వార్తకు విద్యుత్ అధికారుల స్పందన

నిజాంపేట: నేటి ధాత్రి

 

నేటి ధాత్రిలో ప్రచురితం అయిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన టేకుమల్లి యాదయ్య పొలం వద్ద 11 కేవి కరెంట్ వైర్లు “ప్రమాదకరంగా 11 కేవి విద్యుత్ వైర్లు” అనే శీర్షికతో శనివారం ప్రచురితం కాగా సంబంధిత కరెంట్ ఎఈ గణేష్ స్పందించి సిబ్బందిని పంపించి నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రైతు యాదయ్య మాట్లాడుతూ.. తమ సమస్య పరిష్కారనికి తోడుగా నిలిచిన నేటి ధాత్రి న్యూస్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version