ఎమ్మెల్యే జర్నలిస్టులకు బే షరతు గా క్షమాపణ చెప్పాలి .

ఎమ్మెల్యే జర్నలిస్టులకు బే షరతు గా క్షమాపణ చెప్పాలి

బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం జర్నలిస్టులను అవమానకరంగా మాట్లాడిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఊర నవీన్ రావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆదివారం మంత్రుల రాక సందర్భంగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జర్నలిస్టులను ఉద్దేశించి ఏం రాస్తారో రాసుకోండి అని ఏం పీకలేరని మాట్లాడడం దారుణం అన్నారు. జర్నలిస్టుల పట్లఅనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి మండల శాఖ అధ్యక్షులు ఊర నవీన్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

థ‌గ్‌లైఫ్ మ‌ణిర‌త్నం క్ష‌మాప‌ణ‌ చెప్ప‌లేదు.

థ‌గ్‌లైఫ్ మ‌ణిర‌త్నం క్ష‌మాప‌ణ‌ చెప్ప‌లేదు…

 

థ‌గ్‌లైఫ్ సినిమా ఫెయిల్యూర్‌కు మణిరత్నం ప్రేక్షకులకు క్షమాపణ లు చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంపై మ ద్రాస్‌ టాకీస్ స్పందించింది. 

సినిమా టైమింగ్స్
ఇటీవ‌ల ఎన్నో అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల మ‌ధ్య‌కు వ‌చ్చి డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాక తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న చిత్రం థగ్‌లైఫ్ (Thug Life). అయితే ఈ సినిమా ఫెయిల్యూర్‌కు ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం (Manirathnam) ప్రేక్షకులకు క్షమాపణ లు చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంపై మ ద్రాస్‌ టాకీస్ (Madras Talkies) స్పందించింది. చిత్ర దర్శకుడు మణిరత్నం ప్రేక్షకులకు సారీ చెప్పినట్టుగా అసత్య ప్రచారం చేయొద్దని కోరింది. 
సినిమా టైమింగ్స్

‘ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారని, దీంతో అభిమానులకు మణిరత్నం (Manirathnam) సారీ చెప్పినట్టుగా సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్‌ చేస్తున్నారు. నిజానికి మణిరత్నం ఎవరికీ క్షమాపణ చెప్పలేదు. ఆ సినిమా అభిమానులను సంతృప్తి పరచలేదని, అందుకే ఆయన సారీ చెప్పినట్టుగా సాగుతున్న ప్రచారం అబద్దమని మద్రాస్‌ టాకీస్‌ స్పష్టం చేసింది. 

సినిమా టైమింగ్స్

కాగా, రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాయి. కమల్‌ హాసన్ (Kamal Haasan), శింబు (Silambarasan), నాజర్‌, త్రిష (Trisha), అభిరామి వంటి అగ్రతారాగణం నటించగా, ఏఆర్‌.రెహ్మాన్ (AR Rahman) సంగీతం. జూన్‌ 5వ తేదీన విడుదలైంది.

మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ క్షమాపణ.

మంత్రి సీతక్క ( ఆదివాసీ ) కు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ క్షమాపణ చెప్పాలి

ఆదివాసీలు అంటే అంత చులకనా

*రాష్ట్ర మొదటి అధికార భాష
తెలుగు తెలుగు తెలియనిమీరు తెలంగాణ శాషనసభలోఉండడం సబబా?
సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

జమ్మికుంట :నేటిధాత్రి

 

మంత్రి గారికి హిందీ, ఇంగ్లీష్ రాదు .. సరే ..
మరి
మీకు తెలుగు ఎందుకు రాదు ?
రాష్ట్ర మాతృబాష తెలుగు
రాష్ట్ర మొదటి అధికార భాష తెలుగు.
అలాంటి తెలుగు తెలియని
తెలంగాణ శాషన సభలో
మీరు ఉండటం సబబా .
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిగారు కదా !
రాష్ట్రం లో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార బాషా తెలుగు నేర్చుకోవాలనే సామజిక బాధ్యత మీకు ఉండాలి కాని లేదు.

అసెంబ్లీ లో అందరు సభ్యులు మంత్రులు తెలుగులోనే మాటాడుతున్నప్పుడు ఏం అర్ధం అవుతుంది మీకు ?

ఏదోకటి అసెంబ్లీ లో ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుందా ?

రాష్ట్రం లో సమస్యలు నీకు ఎలా అర్ధం అవుతాయి మీకు ?

ఇతరులకు
హిందీ , ఇంగ్లీష్ రాకపోతే
వారిపై అంత చిన్న చూపా ?

ఆదివాసీలు ( ఎస్టీ ) లు అంటే
అంత చిన్న చూపా ?

మీ అహంకారాన్ని తగ్గించుకొని ,

ఆదివాసీ బిడ్డ అయిన
గౌరవ మంత్రివర్యులు
సీతక్క గారికి మీరు
క్షమాపణ చెప్పాలి.

అప్పుడే మీరు ఉన్న
శాసన సభ కు ,
శాసన సభ్యులు గా ఉన్న మీకు
గౌరవం ..

కొసమెరుపు…

మంత్రి సీతక్క ను అవమానించిన అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను ఖండించక పోవడం , శాసన సభలో ఎవరూ కూడా సీతక్కకు క్షమాపణ చెప్పాలి అని నిలదీయక పోవడం  ఆశ్చర్యం.

హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.

హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే

బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్

పరకాల నేటిధాత్రి

అయోధ్య నుండి అక్షింతలు రాలేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ బియ్యన్ని ఊరు రా ఇంటింటా పంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని నిన్న కరీంనగర్ లో జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం లో కేటీఆర్ మాట్లాడిన విధానాన్ని పరకాల పట్టణశాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు గాజులు నిరంజన్ ఖండిస్తున్నామని అన్నారు.అనంతరం మాట్లాడుతూ హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముల వారిని కించపరించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని,అక్షింతలకు,తలంబ్రాలకు తేడా తెలియని కేటీఆర్ మాట్లాడిన వైఖరి హిందూ సమాజాన్ని కించపరచడమేనని,హిందువుల మనోభావాలు దెబ్బతినెలా మాట్లాడిన కేటీఆర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలి.!

కేసీఆర్ కు బండి సంజయ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలి

బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ చెన్నూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్‌ రాజా రమేష్‌, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో బండి సంజయ్ మీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించడంలో ధైర్యం చేయని బండి సంజయ్ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటం అవివేకమని అన్నారు. కేంద్రంలో మంత్రి పదవి చేపట్టిన ఆయన రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధికి సహకరించాల్సిందిపోయి.. అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి నోరు జారితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు జాడి శ్రీనివాస్,రామిడి కుమార్,గడ్డం రాజు,టైలర్ రాజు, జక్కనబోయిన కుమార్, స్వరూప మాజి కౌన్సిలర్ల పోగుల మల్లయ్య,రేవేల్లి ఓదెలు, జిలకర మహేష్,పారుపెల్లి తిరుపతి,యువ నాయకులు ఆర్నే సతీష్,కొండ కుమార్, లక్ష్మీ కాంత్, ఆశనవేణి సత్యనారాయణ,చంద్రకిరన్, సాయి కృష్ణ,దినేష్,క్రాంతి, నస్పూరి శివ,గోనే రాజేందర్, బుధగడ్డ రమేష్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version