మంచు విష్ణు క‌న్న‌ప్ప ఎలా ఉందంటే ట్విట్ట‌ర్ రివ్యూ.

 మంచు విష్ణు క‌న్న‌ప్ప ఎలా ఉందంటే ట్విట్ట‌ర్ రివ్యూ…

క‌న్న‌ప్ప చిత్రం అన్ని అవాంత‌రాల‌ను దాటుకుని ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విదేశాల‌లో ఇప్ప‌టికే సినిమా షోలు ప‌డిపోయాయు.

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇండియ‌న్ సూప‌ర్ స్టార్స్ అక్ష‌య్ కుమార్‌, ప్ర‌భాస్‌, మోహాన్ లాల్ వంటి మ‌హా మ‌హులు న‌టించిన‌ క‌న్న‌ప్ప (Kannappa) చిత్రం అన్ని అవాంత‌రాల‌ను దాటుకుని ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విదేశాల‌లో ఇప్ప‌టికే సినిమా షోలు ప‌డిపోయాయు. మ‌న ద‌గ్గ‌ర కూడా కొన్ని ప్రాంతాల‌లో ప్రీమియ‌ర్లు వేయ‌డంతో చాలా మంది సినిమా చూసి క్ష‌ణం గ్యాప్ ఇవ్వ‌కుండా వెనువెంట‌నే త‌మ త‌మ సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ సినిమా ఎలా ఉంది, న‌టీన‌టులు ఎలా చేశార‌నే అంశాల‌ను తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రి వీక్ష‌కులు ఎలాంటి రిపోర్టులు ఇచ్చారో, ఇస్తున్నారో Kanappa Review ఇక్క‌డ చూద్దాం.

 

ఫ‌స్టాప్ కాస్త ల్యాగ్‌, బోర్ ఫీల్ వ‌చ్చినా ద్వితియార్ధ‌మే అద్భుతంగా ఉంద‌ని, ముఖ్యంగా ప్ర‌భాస్ వ‌చ్చిన త‌ర్వాత‌, ఆపై చివ‌రి 30 నిమిషాలు సినిమాకు ఆయువు ప‌ట్ట‌ని అంటున్నారు. అధేవిధంగా సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్‌, పాట‌లు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయ‌ని, పాటల్లోని సాహిత్యం కూడా అర్థ‌వంతంగా ఉండి అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు. ఈ త‌రానికి క‌న్న‌ప్ప గురించి తెలియ‌జేసే ప్ర‌య‌త్నం బావుంద‌ని, ప్ర‌ధానంగా మంచు విష్ణు న‌ట‌న, తిన్న‌డు నుంచి క‌న్న‌ప్పగా మారిన క్ష‌ణం మెస్మ‌రైజింగ్‌గా ఉంద‌ని, పూర్తిగా భ‌క్తిభావం పెరిగేలా చేస్తూ క్లైమాక్స్ స్ట‌న్నింగ్‌గా రూపొందించార‌ని అనేక మంది సోష‌ల్ మీడియాల్లో త‌మ‌, త‌మ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.

శివుడే నన్ను ఎంచుకున్నాడు

శివుడే నన్ను ఎంచుకున్నాడు

విష్ణు కథానాయకుడిగా ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా…

విష్ణు కథానాయకుడిగా ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘దాదాపు ఏడెనిమిదేళ్లు కష్టపడి ఈ సినిమా తీశాం. ఇందులో నటించమని అడిగిన వెంటనే అంగీకరించిన మా బావ ప్రభా్‌సకు కృతజ్ఞతలు. ఈ సినిమాను శివుడు ఆశీర్వదించాడు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో ఎవరెవరు పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది. ఈ చిత్ర ప్రయాణం నన్ను చాలా మార్చింది. ‘కన్నప్ప’ కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎంచుకున్నాడని భావిస్తున్నా’’ అని మంచు విష్ణు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, రఘుబాబు, శివబాలాజీ, కౌశల్‌ పాల్గొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version