మొహరం ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.

మొహరం ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఇస్లామిక్ మొహరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని,సంపద, సమృద్ధి కలుగాలని డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంవత్సరకాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా కృషి చేస్తానని, ఇస్లామిక్ నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు దీవెనలు అందిస్తారని ఆశిస్తూ డాక్టర్ ఉజ్వల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

వర్షం కోసం మహిళల ప్రత్యేక పూజలు.

వర్షం కోసం మహిళల ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్, కుప్పానగర్, అల్లిపూర్, మాచ్నూర్, తదితర గ్రామాలకు చెందిన మహిళలు గంగా పూజలో పాల్గొన్నారు. మహిళలు రాగి కలశాలలో నీటిని నింపి ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు అనంతరం దత్తగిరి క్షేత్రంలో పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్తో కలిసి జ్యోతిర్లింగాలకు నీటితో అభిషేకం చేశారు.

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ నాయకులు.

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ నాయకులు

◆: జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ మాదిగ,అబ్రహం

జహీరాబాద్ నేటి ధాత్రి:

కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా సంగారెడ్డి జిల్లాకు పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన పీ ప్రావీణ్య గారిని మర్యాదపూర్వకంగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో
రామరపు శ్రీనివాస్ మాదిగ, వి స్ రాజు మాదిగ,అబ్రహం మాదిగ, బుచ్చంద్ర మాదిగ, పెద్ద గీత మాదిగ,కవిత మాదిగ, ఉల్లాస్ మాదిగ, విజయ్ మాదిగ, అశోక్ మాదిగ, ఫోటోల్ల వెంకటేష్ మాదిగ, నిర్మల్ మాదిగ,కృష్ణ మాదిగ,నటరాజ్ మాదిగ, నవీన్ మాదిగ,వీరయ్య మాదిగ, మోహన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

చిత్రపురి హౌసింగ్ సొసైటీ స్కాం పై సినిమా నిర్మాణం.

24 విభాగాల్లోని కార్మికుల శ్రమ దోపిడీని చూపించబోతున్నాం.

 

అర్హులైన కార్మికులకు ఇల్లు చెందకుండా సినీ పెద్ద (గద్ద) ల వ్యవహారం చూపిస్తాం.

 

సినీ పరిశ్రమకు సంబంధం లేని “ఎన్నారై” లకు ఇల్లు ఎలా ఇచ్చారు చూడబోతున్నారు.

 

డిసెంబర్లో సినిమా విడుదల చేయబోతున్నాం.

 

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం జి శివశంకర్ పటేల్.

 

“నేటిధాత్రి”,ఫిలింనగర్.

చిత్రపురి హౌసింగ్ సొసైటీ స్కాంపై త్వరలో తెలుగులో సినిమా రెండు భాగాలుగా మీ ముందుకు రాబోతుంది. త్వరలో పూజా పూజా కార్యక్రమం నిర్వహించి సినిమా మొదలు పెడతామని జీవి శివశంకర్ పటేల్ తెలిపారు.

 

సినిమా కార్మికులకు దక్కాల్సిన ఇల్లును అదే సినిమా పెద్దలు గద్దల లాగా, రాబందుల్లాగా వాలి పెద్ద మనుషుల ముసుగులో ఎలా దోచుకున్నారు అని చిత్రంలో చూపించబోతున్నాము. ఇందులో సినిమా ఇండస్ట్రీలో గల 24 క్రాఫ్ట్ లో గల సినిమా కార్మికుల బాధలను, కష్టాలను, ఇబ్బందులను మరియు శ్రమ దోపిడిని చూపించబోతున్నాము.

 

త్వరలో పూజా కార్యక్రమం తో ప్రారంభం అతిరథ మహారధులు సమక్షంలో , సినిమా ఇండస్ట్రీ చిత్రపురి పోరాట యోధులతో మరియు ముఖ్యంగా 24విభాగంలోని కార్మికుల సహకారంతో

కుమ్ములాటలు…కొట్లాటలు

`గతిశీలత లేని గ్రాండ్‌ ఓల్ట్‌ పార్టీ

`పేరుకే పార్టీ ప్రక్షాళన

`‘ఎంపిక’లు తప్ప ‘ఎన్నికలు’ లేవు

`కొన్ని రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల నియామకాలు పూర్తి

`కానీ పారదర్శకత ఏదీ?

`పేరుకే రాష్ట్ర అధ్యక్షులకు స్వేచ్ఛ

`కొనసాగుతున్న అధినాయకత్వ జోక్యం

`ప్రభావం చూపని రాహుల్‌ నాయకత్వం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీ 2024 ఎన్నికల్లో ‘నైతిక’ విజయం సాధించానని చెప్పుకుంటున్న నేపథ్యంలో, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని రాహుల్‌గాంధీ పిలుపునివ్వడంలో అర్థముంది. పార్టీని కింది స్థాయినుంచి పునర్‌నిర్మాణం చేసుకుంటూ వస్తే రాబోయే ఎన్నికల్లో కొత్త అన్ని స్థాయిల్లో కొత్త నాయకత్వం మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీని విజయపథంలో పయనింపజేస్తారన్న ఆయన ఆలోచన సముచితమే. కానీ ఇప్పటికే ఫ్యాక్షనిజం, బలహీన నాయకత్వం, గొంతెమ్మ కోర్కెల తో నెత్తినెక్కి సవారీ చేస్తున్న సహచర పార్టీలు వంటి సమస్యలతో కునారిల్లుతున్న గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ ఎంతమేర రాహుల్‌ గాంధీ ఆశయ సాధన దిశగా ఎంతవరకు ముందుకెళ్లగలుగుతుందనే ది ప్రస్తుతం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 

గత దశాబ్దకాలంగా పరిశీలిస్తే జరిగిన ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోతూవచ్చిందే తప్ప ఏమాత్రం పురోగతి కనిపించలేదు. బలమైన నాయకత్వలేమి బాగా దెబ్బతీస్తున్నదన్నసంగతి పార్టీ సీనియర్‌ నాయకులకు బాగా తెలిసినప్పటికీ, పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి బలహీనంగా వున్నదన్న సంగతి కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో కేవలం 44 స్థానాల్లో గెలిచిన పార్టీ, 2019లో 52 స్థానాలు, 2024లో 99 లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. ఈవిధంగా 99 సీట్ల గెలుపును నైతిక విజయంగా కాంగ్రెస్‌ భావిస్తున్నప్పటికీ పార్టీ నాయకత్వం లో ఇంకా పూర్తి జ్ఞానబోధ కలగలేదన్నది మాత్రం ముమ్మాటికీ నిజం. ఇందుకు గొప్ప ఉదాహరణ హర్యానా. మితిమీరిన ఆత్మవిశ్వాసం పార్టీ కొంపముంచింది. ప్రత్యర్థి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి విజయం సాధించడానికి పార్టీ స్వయంకృతాపరాధాలే ప్రధాన కారణం. ఇక మహారాష్ట్రలో పార్టీ ఓటమి పాలవడం, ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌యాదవ్‌ కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడానికి ఇష్టపడకపోవడం వంటివి పార్టీకి కోలుకోలేని దెబ్బలుగా చెప్పక తప్పదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ప్రక్షాళన చేపట్టి, 2024, డిసెంబర్‌ 5న రాష్ట్రంలోని అన్ని కాంగ్రెస్‌ కమిటీలను పూర్తిగా రద్దుచేసింది.  

అహమ్మదాబాద్‌ పార్టీ సమావేశంలో తీర్మానించిన మేరకు 2025 ఏప్రిల్‌ నెలలో సంఘటన్‌ శ్రీజన్‌ అభియాన్‌ (ఎస్‌ఎస్‌బి) పేరుతో అధికారికంగా పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రక్రియ 2024 డిసెంబర్‌లోనే ప్రారంభం కావడం గమనార్హం. ఈ పక్రియలో భాగంగా 2025 జనవవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాలకు పార్టీ అధ్యక్షులతో సహా 133 పార్టీ నిర్వాహకులను నియమించింది. వీటితో పాటు పట్టణ ప్రాంతాల్లో సిటీ యూనిట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అనుకున్న తడవుగా కేవలం రెండు నెలల కాలంలో యు.పి.లో ఈ ప్రక్రియను కాంగ్రెస్‌ పూర్తిచేయగా, అన్ని విషయాల్లో ముందుటామని చెప్పుకునే భాజపా ఈవిషయంలో రాష్ట్రంలో వెనుబడి వుండటం గమనార్హం. నిజానికి బీజేపీ 2024లో డిసెంబర్‌లోనే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. బూత్‌ లెవెల్‌, మండలస్థాయి నాయక త్వాల ఎన్నికలు పూర్తయ్యాయి కానీ, జిల్లాస్థాయి నాయకత్వ ఎన్నికల ప్రక్రియ జనవరి నెలాఖరుకు పూర్తి కాలేదు. అయితే మార్చి నెలాఖరుకు మొత్తం 98 సంస్థాగత జిల్లా అధ్యక్షుల్లో 70 మంది ఎన్నికను పూర్తిచేసింది. ఇంకా 28 మంది ఎన్నిక పూర్తికావాల్సి వుంది. దీన్ని పరిశీలిస్తే జిల్లాఅధ్యక్షుల ఎన్నికల్లో కాంగ్రెస్‌ వేగంగా మరింత సమర్థవంతంగా పనిచేసిందనే చెప్పాలి. అయితే సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో రెండు పార్టీల మధ్య ఒక ప్రధానమైన తేడాను గుర్తించవచ్చు. కాంగ్రెస్‌ నేరుగా జిల్లా అధ్యక్షులను నియమిస్తే, భాజపా మాత్రం బూత్‌ స్థాయి, మండలస్థాయి నాయకత్వ ఎన్నికలు పూర్తిచేసిన తర్వాతనే జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ చేపడుతుండటం. ఇక యు.పి.లో కాంగ్రెస్‌ చివరిసారి అధికారంలో వున్నది 1985 కాగా, భాజపా అధికార ప్రస్థానం 2017 నుంచి మొదలైంది. 

కాంగ్రెస్‌కు ఇదే మొదటిసారి కాదు

హిందీ బెల్ట్‌లో కాంగ్రెస్‌ పార్టీ పునర్‌నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడం ఇదే మొదటిసారి కాదు. 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఘోర పరాజయం (మొట్టమొదటిసారి అతితక్కువ లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది) తర్వాత రాహుల్‌ గాంధీ పార్టీ సంస్థాగత పునర్‌నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని భావించారు. అంతేకాదు జిల్లా, రాష్ట్ర యూనిట్లకు మరిన్ని అధికారాలు, ఇస్తామని కూడా వాగ్దానం చేశారు. మరి ఈ మార్పులకు సంబంధించి ఇచ్చిన హామీ,హమీగానే మిగిలిపో యింది. యధావిధిగా కాంగ్రెస్‌ సంస్కృతికి అనుగుణంగా ఎన్నికలు లాంఛనప్రాయంగా ముగియడంతో హిందీ బెల్ట్‌లోని దాదాపు అన్ని పార్టీ యూనిట్లు క్రియారహితంగా మిగిలిపోయాయి. అ ప్పటినుంచి కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీని క్షేత్రస్థాయినుంచి బలోపేతం చేసే యత్నాలు ఇంతవరకుచేపట్టలేదు. కాకపోతే నాయకత్వ స్థాయిలో కొన్ని మార్పులు చేపట్టిన మాట వాస్తవం. సచిన్‌పైలెల్‌, మిలింద్‌ దియోరా, జితిన్‌ప్రసాద్‌ వంటి యువనాయకులను కీలక కమిటీల్లోకి తీసుకోవడం మరియు 2019 ఓటమి తర్వాత రాహుల్‌ గాంధీని పార్టీ ప్రెసిడెంట్‌గా రిజిస్ట్రేషన్‌ చేయడం మినహా పార్టీ నాయకత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమాలేవీ లేవు. 2022 మే నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన నవచింతన్‌ శిబిరంలో పార్టీని ప్రజల్లోకి ప్రభావశీలకంగా తీసుకెళ్లేందుకుగట్టి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించిన మేరకు, భారత్‌ జోడో యాత్రకు రాహుల్‌ గాంధీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, తాము అధికారంలోకి వస్తేకులగణన చేపడతామంటూ హామీ ఇవ్వడం గమనార్హం. ఇదే శిబిరంలో పార్టీ అంతర్గ నిర్మాణ ప్ర క్రియను మరింత సుస్థిరం చేయాలని, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలకుఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయించినా ఇప్పటివరకు అటువంటిదేమీ జరగకపోవడం గమనార్హం. మొత్తంమీద చెప్పాలంటే సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణ ఏమాత్రం జరగలేదన్నది కఠిన వాస్తవం. 

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను మరింత బలోపేతం చేయాలని గత ఏప్రిల్‌లో జరిగిన అహమ్మదాబాద్‌ సదస్సులో పార్టీ నాయకత్వం నిర్ణయించింది. జూన్‌ 3వ తేదీన రాహుల్‌ గాంధీ భోపాల్‌లో పర్యటించినప్పుడు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులకు అగ్రనాయకత్వంతో ప్రత్యక్ష సంబంధాలుంటాయని హామీ ఇచ్చారు. అంతేకాదు స్థానికంగా అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తించే స్వేచ్ఛను దిగువస్తాయి నాయకత్వానికి అప్పగిస్తామని, వీరి కార్యకలాపాల్లో అధిష్టానం జోక్యం చేసుకోదని కూడా ఆయన స్పష్టం చేశారు. కేవలం వివాదం ఏర్పడినప్పుడు మాత్రమే అధిష్టానం కలుగజేసుకుం టుందన్నారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జితు పట్వారీ మాట్లాడుతూ బ్లాక్‌ మరియు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను ప్రజల ఆమోదంమేరకే నియమిస్తాం తప్ప, కొందరు నాయకులు ఎంపిక చేసినవారిని నియమించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. టిక్కెట్ల పంపిణీ మరి యు దిగువ స్థాయి కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. మరి ఇటువంటి నియామకాలు నిష్పాక్షిక రీతిలో జరిగేందుకు కాంగ్రెస్‌ జిల్లా స్థాయిలో ఐదుగురు పరిశీలకును నియమిస్తుంది. ఇప్పటివరకు కుటుంబపాలనకు అలవాటు పడిన పార్టీకి ఈ రకమైన ఏర్పాట్లు చాలా అవసరం కూడా! ఇదే సమయంలో నియామకా లు జరిపే సమయంలో కాంగ్రెస్‌ కులాలను పరిగణలోకి తీసుకోవడం మారో సానుకూల పరిణామం. ఉత్తరప్రదేశ్‌లో జిల్లా స్థాయి నాయకత్వ ఎంపికలో పార్టీ కులాలు, వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం గమనార్హం. ముఖ్యంగా బీసీలు, ఎస్సీ వర్గాలకు చెందినవారిని ఎక్కువమందిని నియమించడం ఇక్కడ కీలకం.

ఇప్పటివరకు సాధించేమిటి?

సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానం పార్టీ పరంగా అభిలషణీయమే అయినప్పటికీ, దీన్ని చిత్తశుద్ధితో అమలు జరిపింది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే. మిగిలినరాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచని సమస్యలు యధాతథంగా వుండటం గమనార్హం. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో జిల్లా, పట్టణ పార్టీ అధ్యక్షులను కాంగ్రెస్‌ నియమించినప్పటికీ, బూత్‌, బ్లాక్‌, మండలస్థాయి నాయకత్వ ఎంపిక చేపట్టలేదు. జిల్లా కమిటీల కార్యవర్గాల ఎన్నిక కూడా పెండిరగ్‌లోనే కొనసాగుతోంది.ఉత్తరప్రదేశ్‌తో పాటు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ మరియు హర్యానా రాష్ట్రాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియకు పరిశీలకుల నియామకం పూర్తవడ మే కాదు ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. ఎన్నిక ప్రక్రియలో తీవ్ర అసంతృప్తిలో వున్న నాయకులకు పోస్టులు ఇవ్వడం శుభ పరిణామం. ఇటువంటి నాయకులు చాలా సంవత్సరాలుగా క్రియాశీలకంగా లేకపోవడం పార్టీని బాగా దెబ్బతీసింది. ఇదిలావుండగా ఇప్పటివరకు హర్యానాలో చాలా జిల్లాలకు కాంగ్రెస్‌ అధ్యక్షులను ఎంపిక చేసినప్పటికీ, ఇప్పటివరకు వారి పేర్లను అధికారికంగా వెల్లడిరచలేదు. ఇక మధ్య ప్రదేశ్‌లో ప్యానల్‌ ఎంపిక తుదిదశలో కొనసాగుతోంది. 

ఎన్నికలు జరపాలి, పారదర్శకంగా ప్రక్రియను కొనసాగించాలని ఎంతగా చెబుతున్నా, చాలా ప్రాంతాల్లో జిల్లా/బ్లాక్‌ అధ్యక్షులను ఎంపిక చేయడం మాత్రమే జరుగుతోంది. ఇదంతా ఎప్పటి మాదిరిగానే పారదర్శక రహితంగా, కొందరు నేతల నిర్ణయాల ప్రకారం జరుగుతుండటంతో మళ్లీ పార్టీలో అసంతృప్తులు యథాతథంగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు గతంలో రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చిన విధంగా, కొత్త జిల్లా నాయకత్వానికి కేంద్రనాయకత్వంతో సంబంధాలు ఏర్పడటంలేదు. ఉదాహరణకు యు.పి.లో కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులతో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వర్చువల్‌గా సమావేశమయ్యారు. అదే ఉత్తరప్రదేశ్‌నుంచే పార్లమెంట్‌కు ఎన్నికైన రాహుల్‌ గాంధీ వీరితో ముచ్చటించలేదు. అయితే యు.పి. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షు డు అజయ్‌రాయ్‌ బహిరంగ కార్యక్రమాలు, సభల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈవిధంగా రాష్ట్రంలో పార్టీకి తానే చోదకశక్తి అని తెలియజెప్పేవిధంగా ఆయన కార్యక్రమాలు కొనసాగుతుండటం గమనార్హం. గుజరాత్‌లోని పార్టీ నాయకత్వం ఇదే విధమైన వ్యవహారశైలితో ముందుకెళుతోంది. అయితే జిల్లా అధ్యక్షులను ఎంపికే చేసే పరిశీలకుల బృందాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, గుజరాత్‌ ఇన్‌చార్జ్‌ ముకుల్‌ వాసిక్‌లు కలవడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే వికేం ద్రీకరణ పార్టీలో చెప్పడానికి మాత్రమే పరిమితమన్న సత్యం మరోసారి వెల్లడైంది. 

జూన్‌ 3, 4 తేదీల్లో రాహుల్‌ గాంధీ భోపాల్‌, చండీగఢ్‌ల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ యన మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన పరిశీలకులను కలుసుకున్నారు. ఈ పరిశీలకులే జిల్లా అధ్యక్షులను ఎంపిక చేస్తారు. కానీ రాహుల్‌ గాంధీ పర్యటన హర్యానాపై పెద్దగా ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఇదిలావుండగా బిహార్‌లో వచ్చే ఆక్టోబర్‌ానవంబర్‌లో ఎన్నిక లు జరుగనున్నాయి. రాష్ట్రంలో ఈ నియామకాలు అత్యవసరం కానీ ఈ దిశగా పార్టీ నాయక త్వం ఇప్పటివరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. ఇక రాజస్థాన్‌ వంటి మరికొన్ని రాష్ట్రాలో పీసీసీలు పాత పద్ధతినే అనుసరిస్తూ నియామకాలను జరుపుతున్నాయి. ము ఖ్యంగా రాజస్థాన్‌లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఈవిధంగా ముందుకు పోతున్నది. 

ఎన్నికల ప్రక్రియ అంటూ కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించినా అందులో పూర్తిస్థాయిలో చిత్తశుద్ధి కనిపించడంలేదు. ఫలితంగా ఎన్నికల ప్రక్రియే ఒక ప్రహసనంగా మారుతోంది. ఇందుకు ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూడా కారణమని చెప్పాలి. కుటుంబ పాలన, ఏకపక్షనిర్ణయాలకు అలవాటు పడిన కాంగ్రెస్‌ సంస్కృతికి ఈ ఎన్నికల ప్రక్రియ ఎంతమాత్రం పొసిగేది కాదని వివిధ రాష్ట్రాల సంస్థాగత పునర్నిర్మాణాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతుంది.

పల్లెల్లో పై చేయి ఎవరిది?

`ఎన్నికల వాతావరణం మొదలైంది!

`మూడు నెలల్లో ఎన్నికలు?

`నేటిధాత్రి ప్రాథమిక సర్వేలో కాంగ్రెస్‌ పై చేయి కనిపిస్తోంది.

`అధికారంలో వుండడం కాంగ్రెస్‌ కు అదనపు బలం.

`పల్లెల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ కొంత బలంగానే వుంది!

`ప్రజా వ్యతిరేకత పెద్దగా లేదు!

`అలాగని సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ మరింత బలపడిరది లేదు.

`సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదన్న భావన కూడా పెద్దగా వ్యక్తం కావడం లేదు.

`సన్న బియ్యం ప్రభావం కాంగ్రెస్‌ కు అనుకూలం.

`ఇందిరమ్మ ఇండ్లతో కాంగ్రెస్‌ ఓట్లను కొల్లగొట్టే అవకాశం.

`సాగు సమస్యలు, కరంటు కొరత లేదు.

`మొత్తానికి కాంగ్రెస్‌ కు అనుకూలం పవనాలే కనిపిస్తున్నాయి.

-బీఆర్‌ఎస్‌ పార్టీ పరంగా పటిష్ఠంగా వుంది.

-ఓట్ల రూపంలో మేలు జరుతుందా అనే సందేహం మాత్రం వుంది.

-బీఆర్‌ఎస్‌ నాయకులు, క్యాడర్‌ మాత్రం ఉత్సాహంగా వున్నారు.

-కాంగ్రెస్‌ తో పోల్చితే బిఆర్‌ఎస్‌ నాయకులే దూకుడు మీద వున్నారు.

-బీజేపీ బలం కొంత పెరుగొచ్చు.

-ఈసారి పల్లెపోరులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లకు గట్టి పోటీ ఇవ్వొచ్చు.

-పట్టణ ప్రాంతాలకు సమీపంలో వున్న గ్రామాలలో బీజేపీ పుంజుకున్నది.

-హిందుత్వ నినాదం మరింత పెరడం బిజేపికి సానుకూలం.

-బీజేపీ మూడో స్థానమే కొనసాగేలా వాతావరణం కనిపిస్తోంది.

-గతం కన్నా మెరుగైన ఫలితాలు బీజేపీ అందుకోనుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

 తెలంగాణ పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలో ఆ జోష్‌ కనిపిస్తోంది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం వుంది. అందుకు కసరత్తు జరుగుతోంది. దాంతో నేటిధాత్రి ప్రాధమిక సర్వే నిర్వహించింది. ఏ పార్టీ పరిస్ధితి ఎలా వుందన్నదానిపై కొంత అంచనా వేసింది. దాని ప్రకారం ఎంతైనా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుండడం మూలంగా స్దానిక సంస్ధల ఎన్నికలు కొంత అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం వుంది. పైగా పార్టీ తెలంగాణ పల్లెల్లో బలంగానే వుంది. అధికారంలో వుండడంతోపాటు, సంక్షేమ పధకాలు అందాలంటే సహజంగా ప్రజలు కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారని చెప్పడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో చాలా వరకు నిజం లేదు. ప్రభుత్వంపై పల్లెల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. సంక్షేమ పధకాల అమలుపై కూడా పెద్దగా స్పందన లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పే మాటలను కూడా జనం నమ్ముతున్నట్లే వున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగాలేదన్న మాటలు ప్రజలు కూడా అర్దం చేసుకుంటున్నట్లే వున్నారు. కాని ప్రభుత్వాన్ని పెద్దగా నిందించినట్లు కనిపించడం లేదు. కాని ఓ సెక్షన్‌ఆఫ్‌ సోషల్‌ మీడియా చేస్తున్న హడావుడిలో పెద్దగా నిజం లేదు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలప్పుడే బిఆర్‌ఎస్‌ మీడియా లేనిపోని అవాస్తవాలు విపరీతంగా ప్రచారం చేసింది. కాని ప్రజలు కాంగ్రెస్‌, బిజేపిలను మాత్రమే ఆదరించారు. బిఆర్‌ఎస్‌ చేసిన హడావుడి ఎక్కడా కనిపించలేదు. అదికార కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు దూరం చేసుకోలేదు. ఇప్పుడు కూడా పరిస్దితి అలా గుంభనంగానే వుంది. ప్రజలు ప్రభుత్వం వ్యతిరేక అభిప్రాయంతో లేరు. కాకపోతే సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల సందర్భంలో వున్నంత బలంగా కాంగ్రెస్‌ వున్నట్లు కూడా కనిపించడ ంలేదు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రధానంగా పల్లెల్లో ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం ప్రభావం స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వుంటుందనేది కనిపిస్తోంది. పైగా కొత్తగా వచ్చిన రేషన్‌ కార్డులు, వాటి వల్ల ఏకకాలంలో వచ్చిన మూడు నెలల సన్న బియ్యం కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాబావం వ్యక్తమౌతోంది. పదేళ్లుగా తెలంగాణ పల్లెల్లో ప్రజలు రెండు పడకల గదుల ఇండ్లపై ఆశలు పెట్టుకున్నారు. కాని కేసిఆర్‌ ఒక్క ఇల్లు కూడా పల్లెల్లో ఇవ్వలేదు. కాని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తోంది. పట్టాల పంపిణీ కూడా పూర్తయంది. ఇండ్లకు ముగ్గులు పోస్తున్నారు. కొన్ని చోట్ల ఇండ్లు పూర్తయి, గృహప్రవేశాలు కూడా శ్రావణ మాసంలో జరగనున్నాయి. మొత్తానికి ఎన్నికల ముందు పల్లె ప్రజల్లో ఒక ఆనందం మాత్రం కనిపించే పరిస్దితులు కనిపిస్తున్నాయి. పల్లెల్లో రైతులు కూడా పెద్దగా అసంతృప్తితో లేరు. సాగు సమస్యలు ఎక్కడా లేవు. కరంటు కొరత కూడా లేదు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే స్ధానిక సంస్దల ఎన్నికలు పూర్తిచేస్తే కాంగ్రెస్‌ పరిస్దితి మరోరకంగా వుండేది. ఆ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌ చేసిన హడావుడి ఉత్తదే అని తేలిపోయింది. కేసిఆర్‌ను ప్రజలు నమ్మలేదు. పార్లమెంటు ఎన్నికల్లో కారుకు ఒక్కసీటు కూడా ఇవ్వలేదు. అదే సమయంలో స్దానిక సంస్దల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ఎంతో బలం పెరిగేది. కారు పరిస్ధితి మరింత డీలా పడేది. ఆ సమయంలో ఎన్నికలు జరిగితే బిజేపికి పెద్దగా ఉపయోగమయ్యేది కాదు. స్ధానిక సంస్దల ఎన్నికల్లో అధికారపార్టీకి ఎంతో కొంతమేలు జరగడం అన్నది సర్వసాదారణం. పైగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల అమలులో కొన్ని ఎంతో పేరును తెచ్చిపెట్టాయి. ఇక బిఆర్‌ఎస్‌ పరిస్ధితి కూడా కొంత మెరుగైన స్ధితిలోనే వుంది. బిఆర్‌ఎస్‌లో నాయకులు, కార్యకర్తలు బలంగానే వున్నారు. కాంగ్రెస్‌ నాయకులతో పోల్చితే బిఆర్‌ఎస్‌ క్యాడరే ఎక్కువ ఉత్సాహంగా వున్నట్లు కనిపిస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికలు ఈసారి కూడా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ల మధ్యనే జరిగేలావున్నాయి. కాకపోతే బిఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్‌ వున్నా ఓట్ల రూపంలో సానుకూలత ఏర్పడుతుందా? లేదా? అన్నది కొంత కాలం ఆగితే గాని అర్ధం కాకపోవచ్చు. ఎందుకంటే నాయకులు కోరుకున్నంతగా ప్రజలు ఎన్నికల ఆలోచనల్లో లేరు. బిఆర్‌ఎస్‌కు కూడా కొన్ని మైనస్‌లు చాలా వున్నాయి. గత పదేళ్ల కాలంలో బిఆర్‌ఎస్‌ రేషన్‌కార్డులను తొలగించే ప్రక్రియ చేసింది. వివాదాలు మూట గట్టుకున్నది. ఓడిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మోసం చేసింది.ఓటమి పాలైంది. ప్రజలకు సన్నబియ్యం ఇస్తానని చెప్పి బిఆర్‌ఎస్‌ మాట మార్చింది. కాని రేవంత్‌ సర్కారు సన్న బియ్యం ఇస్తోంది. ప్రజలకు కడుపు నిండా అన్నం పెడుతోంది. పదేళ్ల తార్వత ఇందిరమ్మఇండ్ల జోరు సాగుతోంది. రేషన్‌కార్డుల జారీ జరుతోంది. కాని దాన్ని కాంగ్రెస్‌ ప్రచారం చేసుకోలేకపోతోంది. రాష్ట్ర స్దాయిలో ముఖ్యమంత్రి స్దానంలో కూర్చునే శక్తివున్న నాయకులు ఏవరూ లేరు. కాని అవకాశం వస్తే సిఎం. అవుదామనుకుంటున్న వాళ్లున్నారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను మంత్రులు తిప్పికొట్టడంలో విఫలమౌతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా పని మేం చేసుకుంటూ పోతే చాలు. వివాదాలు ముఖ్యమంత్రి రేవంత్‌ చూసుకుంటారన్న భావనలో వున్నారు. ఇదికూడా కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. ఇక బిఆర్‌ఎస్‌ ప్రజల్లో లేకపోకపోయినా, నాయకులు, కార్యకర్తల హడావుడి మాత్రం సజీవంగానేవుంది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవుల పరిస్దితిపైనే ఆలోచనలున్నాయేగాని, కాంగ్రెస్‌కు వాళ్ల నయాపైసా లాభం లేకుండాపోయింది. లోలోన రగిలిపోతున్నారు. పార్టీ మారినా వారి మనసు ఇంకా కారులోనే వున్నట్లుంది. మరో వైపు సుప్రింకోర్టు తీర్పు ఎలావుంటుందో అన్న భయంలోనే వున్నారు. దాంతో పార్టీకి ఇది కూడా ఇబ్బందికరమైన పరిస్దితినే తెచ్చిపెట్టింది. అయితే కారు బలం ఈ మధ్య కాలంలో ఎంతో కొంత పెరిగిందనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలల్లో ముఖ్యంగా రైతుల్లో ఎంతో కొంత అసంతృప్తి వుందనేది నిజం. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ పరమైనసమావేశాల్లో పాల్గొనేందుకు ఇష్టపడడం లేదు. ప్రజల్లోకి వెళ్లడం లేదు. హైదరాబాద్‌ను విడిచి వెళ్లడం లేదు. ఈ విషయంలో సిఎం.రేవంత్‌ రెడ్డి హెచ్చరించినా, ఫలితం లేకుండాపోతోంది. ప్రజల్లోకి వెళ్తే ఆరుగ్యారెంటీలపై ప్రశ్నిస్తున్నారన్న భయం కూడా ఎమ్మెల్యేల్లోవుంది. కాని ఇంకా సమయం వుంది. అన్నీ అమలు చేస్తామని ప్రజలకు నచ్చజెప్పడంలో కాంగ్రెస్‌ నాయకులు విఫలమౌతున్నారు. దాంతో ప్రజలు బిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. ఎన్నికల నాటికి పరిస్దితులు ఎలా వుంటాయో చెప్పలేం. కాని కేసిఆర్‌ మీద సానుభూతి పెరుగుతుందనేది వాస్తవం. బిఆర్‌ఎస్‌లో కవిత వ్యవహారం ఆ పార్టీకి ఇబ్బందులు సృష్టించినట్లు కనిపించినా, ప్రజల్లో మాత్రం కేసిఆర్‌ మీద క్రేజ్‌ తగ్గడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో కేసిఆర్‌ స్వయంగా ప్రచారం చేసినా, పామ్‌ హౌజ్‌ దాటి బైటకు రాడని తెలిసినా, ప్రజలు ఇంకా కేసిఆర్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారన్నది కాంగ్రెస్‌నేతలు ఆలోచించుకోవాలి. ఇక బిజేపికి స్దానికంగా పెద్దగా బలం పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పట్టణ ప్రాంతాల్లో వున్న ఆ మాత్రం జోష్‌ కూడా ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. జాతీయ రాజకీయాల ప్రభావంకూడ బిజేపి మీద కనిపిస్తున్నాయి. బిజేపి ఈ మధ్య ఎలాంటి హడావుడి కూడా చేయడం లేదు. రాష్ట్ర స్దాయిలోనే స్ధబ్దుగా బిజేపి రాజకీయలు కనిపిస్తున్నాయి. అది పల్లె మీద కూడా ప్రభావం చూపుతాయని చెప్పడంలో ఎంలాంటి సందేహం లేదు. గత స్ధానిక సంస్ధల ఎన్నికల కన్నా, ఈసారి బిజేపికి పల్లెల్లో కొంత బలం పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే అవి మెజార్టీ స్ధానిక సంస్ధలను గెల్చుకునేంతగా లేదని మాత్రం చెప్పొచ్చు. పట్టణ ప్రాంతాలకు సమీపంలోవున్న గ్రామాల్లో బిజేపి కొంత బలంగా వుంది. దాని ప్రభావం మున్సిపల్‌ ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. అయితే ముందుగా మున్సిపల్‌ ఎన్నికలు జరిగి, బిజేపికి కొంత అనుకూల వాతావరణ ఏర్పడితే, అది పల్లెలోకూడా కనిపించే అవకాశం వుండేది. పల్లె నుంచి బిజేపి బలం పెరగడం అన్నది ఇప్పట్లో అనుకునంత సాద్యం కాకపోవ్చు. ఏది ఏమైనా రాజకీయ పార్టీల ఉనికి ఎంతోముఖ్యం. నిత్య రాజకీయాలే ఆ పార్టీలకు శరణ్యం. పల్లె పోరులో కాంగ్రెస్‌దే పై చేయి కావొచ్చనేది చాల మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.

ముగిసిన వనపర్తి జిల్లా సగర సంఘం ఎన్నికల నామినేషన్ ల ఘట్టం

వనపర్తి జిల్లా సగర సంఘం ఎన్నికల నామినేషన్ ల దాఖలు ఘట్టం ముగిసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ల ప్రక్రియ కొనసాగింది. అధ్యక్షులుగా 5 గురు అభ్యర్థులు 6 సెట్ ల నామినేషన్ లను దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి గా 4 గురు, కోశాధికారి గా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముత్యాల హరికిషన్ సగర, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు గౌరక్క సత్యం సగర, మోడల ఆంజనేయులు సగర లు నామినేషన్ లను స్వీకరించారు. ఎన్నికల అబజర్వర్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర పర్యవేక్షించారు.

నామినేషన్ లు దాఖలు చేసిన అభ్యర్థులు

అధ్యక్షులుగా

1) చీర్ల జనార్ధన్ సగర

2) కె. వెంకటస్వామి సగర

3) చిలుక సత్యం సగర 

4) మోడల తిరుపతయ్య సగర (2 సెట్లు)

5) పోతులపల్లి నరేందర్ సగర

ప్రధాన కార్యదర్శిగా

1) గొబ్బూరి చెన్రాయుడు సగర

2) జి. స్వామి సగర

3) కె. వెంకటస్వామి సగర

4) చీర్ల జనార్ధన్ సగర

కోశాధికారిగా

1) చీర్ల నాగరాజు సగర

2) గంటి సత్యం సగర

భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.

భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం..

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి..
– ఎస్సై దికొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి రావాలని “ఇది ఒక వ్యక్తిని చంపడమే కాదు, సమాజంలోని అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది. డ్రగ్కు నో చెప్పడంలో యువత అప్రమత్తంగా ఉండాలి మరియు బాధ్యతగా ఉండాలి” అని పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా ( సే నో టూ డ్రగ్స్ ) అనే నినాదం తో పొత్కపల్లి ఓదెల మోడల్ స్కూల్, హై స్కూల్, కస్తూర్బా విద్యార్థులతో విద్యార్థులతో కలిసి ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఓదెల సెంటర్లో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు మరియు ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించడం సమాజం యొక్క ప్రధాన బాధ్యత అని చుట్టూ జరుగుతున్న అనైతిక కార్యకలాపాల గురించి వారిలో అవగాహన పెంచాలి.డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల ప్రభావం ఇప్పుడు పల్లెప్రాంతాలకూ విస్తరించిందనీ,వీటి నుంచి యువతను కాపాడుకోవాలి” అని తెలిపారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణాకు సులభ మార్గాలనీ, విద్యార్థులు,యువత వీటికి బలవుతున్నారనీ,మత్తులో ఉన్న వ్యక్తి తన చర్యల్ని గుర్తించలేని స్థితికి చేరతాడనీ,ఈ అలవాటు అనేక ఆరోగ్య సమస్యలతో పాటు నేరపూరిత జీవితానికి దారితీస్తుందని అన్నారు.
అంతేకాకుండా సరదా కోసం అయినా డ్రగ్స్ వైపు అడుగు వేయకండనీ,ఇవి కేవలం వ్యక్తిని కాదు, కుటుంబాన్నీ నాశనం చేస్తాయనితెలిపారు. డ్రగ్స్‌కి బలైపోకుండా మీ భవిష్యత్తును కాపాడుకోనీ విజేతలుగా ఎదగండి” అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల విద్యాధికారి రమేష్, అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శిగా మనోహర్ రెడ్డి

భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శిగా మనోహర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి అర్బన్ బిజెపి అధ్యక్షులు గీస సంపత్ భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శిలుగా కరివేద మనోహర్ రెడ్డి జోరు కృష్ణ శీలం రాజును నియమించడం జరిగింది ఈ సందర్భంగా కరివేద మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో అర్బన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ అభివృద్ధి కి నా వంతు కృషి చేస్తానని అన్నారు తన ఎన్నికకు సహకరించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిధ రెడ్డి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా నాయకులు దొంగల రాజేందర్ బట్టు రవి అర్బన్ అధ్యక్షులుగీస సంపత్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు

యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఉత్తమ వ్యాసరచన పోటీ

యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఉత్తమ వ్యాసరచన పోటీ విద్యార్థులకు ప్రశంస పత్రాలు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారు నిర్వహించిన యాంటీ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు విజేతలుగా నిలిచిన పదవతరగతి చదువుతున్న సిరి కి డ్రాయింగ్ లో మొదటి బహుమతి, వ్యాస రచనలో లక్ష్య మొదటి బహుమతి గా మెడల్,సర్టిఫికెట్ జిల్లా కలెక్టర్ సందీప్ ఝా బహుమతి ప్రదానం చేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు L. శారద, ఉపాధ్యాయులు ఎలగొండ రవి,రమేష్ బాబు సతీష్ బాబు,రాజలింగం, రజని మరియు ఉపాధ్యాయ బృందం అభినందలను తెలియజేశారు.

సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….!

* సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….!

నారాయణపురం గ్రామ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల ఆద్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట వంటావార్పు…

ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల డిమాండ్..

తహసిల్దార్ జి.వివేక్ కి వినతి పత్రం అందజేత.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

మా భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వండి సారు అంటూ కేసముద్రం మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నారాయణ పురం గ్రామ రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతుల ఆద్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి నాయక్ మాట్లాడుతూ తాము గత 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1827 ఎకరాల భూములను 2017లో గత ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అటవీ భూములుగా పేర్కొంటూ పట్టాలు రద్దు చేసిందని 1959 సంవత్సరంలోని 2384 జీవో నెంబర్ ప్రకారం నారాయణపురం గ్రామంలోని భూములను 2021 ,ఫిబ్రవరిలో రెవెన్యూ పట్టా భూములుగా తేల్చింది.

 

 

 

 

గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జూన్ 2021 లో ఎంజాయ్మెంట్ సర్వే చేసి 1827 ఎకరాల్లో 1633 ఎకరాలు సాగుభూమిగా తెల్చి ఇందులో 633 ఎకరాలకు పట్టాలు ఇచ్చిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 94 జారీ చేసి రైతు పేరు తండ్రి పేరు అనే చోట వస్తున్న అడవి అనే పదం తొలగించారని కానీ గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఆరు నెలలు గడుస్తున్న అధికారులు కాలయాపన చేస్తూ పాస్ పుస్తకాల జారీ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో ఉన్న పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిశీలించి మా గ్రామ భూ సమస్యను పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేలా కృషి చేయాలని తహసిల్దార్

 

 

 

 

 

 

జి. వివేక్ కుమార్ కి వినతి పత్రం అందజేసి తక్షణమే మా గ్రామ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిచో రైతులందరం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నూతన భూభారతి చట్టంలో తమ భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని..దేశానికి అన్నం పెట్టే రైతన్న అనాధగా మారే పరిస్థితి ఎదుర్కొంటుందని మా గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేక దాదాపు 700 మంది రైతులకు పంట రుణాలు రుణమాఫీ రైతు భరోసా రైతు భీమా ఇతర ప్రభుత్వం పథకాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

 

 

ఈ కార్యక్రమంలో సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, మిరియాల యాకుబ్ రెడ్డి, కొయ్యగూరి రాంరెడ్డి ,జాటోత్ వెంకన్న, బానోత్ భాష గుగులోత్ లక్ పతి, బానోత్ శంకర్ , ధరంసోత్ శ్రీను , దారావత్ వీరన్న, ధరావత్ మాతృ, జాటోత్ రమేష్, గుగులోత్ శంకర్,ఇస్లావత్ సురేష్, గుగులోతు వెంకన్న, ధారావత్ బీమా, ధారావత్ దేవా ,ధారావత్ రమేష్, జాటోత్ సరిత, బానోతు రంగమ్మ, బానోత్ కమల, ధరావత్ కాంసల్య, ధరావత్ కమలమ్మ రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఆధారాలతో వార్త రాస్తే జర్నలిస్ట్ పై దాడి

ఆధారాలతో వార్త రాస్తే జర్నలిస్ట్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య

గణపురం మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం
మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు పరిధిలో తాడ్వాయిలో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లో అక్రమాoగా పైసల్ వసూలు చేస్త్తున్నట్టు ఆధారాలతో వార్తను ప్రచురించిన రిపోర్ట్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దుర్మార్గం అని గణపురం బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు అన్నారు సమాజంలో బాధ్యతయుతాంగా ప్రజల పక్షనా నిరంతరంగా పనిచేస్తున్న పత్రిక విలేకరులపై దాడి చేయడం సరిఅయింది కాదని అన్నారు దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరరు.ప్రభుత్వంనికి ప్రజలకు వరదిగా వున్నా జర్నలిజంపై అందరు బాధ్యత యూతంగా ఉండాలని అన్నారు.

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి

మెడికల్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

ఈనెల 29 ఆదివారం రోజున రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి సిఈఆర్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ మునీర్ జ్ఞాపకార్థం మునీర్ మెమోరియల్ ఆధ్వర్యంలో కరీంనగర్ రెనే హాస్పిటల్, మంచిర్యాల మెడి లైఫ్ హాస్పిటల్ వారు నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ క్యాంపును విజయవంతం చేయాలని రెండో వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, రెనే హాస్పిటల్ జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ లు అన్నారు. అనంతరం మెడికల్ క్యాంపు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు మునీర్ జ్ఞాపకార్థం సింగరేణి క్లబ్ లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, గత మూడు సంవత్సరాలుగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ అభిలాష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు, వసీముద్దీన్, శంకర్, పాషా, సారయ్య, రాజేందర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల సమస్యలను పరిష్కరించండి .

రైతుల సమస్యలను పరిష్కరించండి

— చేనేత పద్మ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్–

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

వీణవంక మండల కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారి సమస్యలు పరిష్కరించాలని చేనేత పద్మ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్ వీణవంక మండల తహసిల్దార్ అంబటి రజితను కోరారు. గురువారం రోజున తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమ నిబంధనలు పాటిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు. వారి వెంట సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరు శ్రీనివాస్ ఉన్నారు.

గండ్ర దంపతులకు బాల రాముడి చిత్రపటాన్ని .!

గండ్ర దంపతులకు బాల రాముడి చిత్రపటాన్ని బహుకరించిన అభిమాని

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా వాస్తవ్యులు, గండ్ర దంపతుల వీరాభిమాని తిరుపతి నాయక్ ఇటీవల సూర్యనాయక్ తండా నుండి అయోధ్య సైకిల్ యాత్ర ముగిం చుకొని వచ్చి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు వరం గల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కలిసి బాల రాము డి చిత్ర పటాన్ని బహుకరిం చారు.ఈ సందర్భంగా తనతో పాటు తిరుపతి పాదయాత్ర చేయడమే కాక, సూర్య నాయక్ తండా నుండి అయో ధ్య సైకిల్ యాత్ర చేసి విజయ వంతంగా పూర్తిచేసుకున్న తిరుపతి దంపతులను శాలువాతో సత్కరించారు.

మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ

మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించిన తొర్రూరు డి.ఎస్.పి కృష్ణ కిషోర్

యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని తొర్రూరు డీ ఎస్పీ క్రిష్ణ కిషోర్ యువతకు విజ్ఞప్తి చేశారు.

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

 

 

 

అంతర్జాతీయ మాధికద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మాధక ద్రవ్యాల  నిర్మూలన పై అవగాహన ర్యాలీ ని తొర్రూరు డీఎస్పీ కిష్ణ కిషోర్ ప్రారంభించారు …ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ….యువత మత్తులో చిత్తవుతున్నారని…మాదకద్రవ్యాలనువిక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా 1908 గాని పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని మాదకద్రవ్యాల అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా  అవగాహన పెంపొందించేందుకు పోలీసులు పలు అవగాహన కర్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఈ ర్యాలీలో తొర్రూర్ తాసిల్దారు గారు సబ్ డివిజన్లోని, సీ.ఐ లు. ఎస్సైలు పోలీస్ సిబ్బంది, పలు శాఖల అధికారులు, వివిధ పాఠశాలల  విద్యార్థులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి.

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి…

మహబూబాబాద్/ నేటి దాత్రి

 

 

నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఏఎస్ఐ వెంకటరెడ్డి లు అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల దుర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన సదస్స నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్‌ అని, మత్తు బారి నుంచి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే బయటకు రావడం కష్టమని తెలిపారు. యువత మత్తు సేవించి తమ శరీరాన్ని అనారోగ్యం పాలు చేసుకుంటున్నారన్నారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని, డ్రగ్స్‌కు బానిసైన వారి కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం తెలిసిన వెంటనే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 100 లేదా 14446 కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే యువజన సంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు మహబూబాద్ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా చేయడంలో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రకాష్ బాబు, కవిరాజు, శ్రీనివాస్, బాబు, సతీష్, మహేందర్, నాగేశ్వరావు, సుధాకర్, యాకన్న, వెంకటేశ్వర్లు, రామ్మూర్తి, సుభాష్ అధ్యాపకేతర బృందం ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ పోలీస్ సిబ్బంది లింగన్న, సుధీర్,
తదితరులు పాల్గొన్నారు.

నిధులు మావి.. గొప్పలు మీవా..?

నిధులు మావి.. గొప్పలు మీవా..?

మా హయాంలోని నిధులతో శంకుస్థాపనలు చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు…

బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

నిధులు మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసి అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేస్తూ మేమే నిధులు విడుదల చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు.

 

 

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్ మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో విడుదల చేసిన నిధులతో 14వ వార్డులో పనులు జరిగితే వాటిని కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని, నిధులు మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

 

 

 

 

 

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించారని, ప్రస్తుత ఎమ్మెల్యే నిధులు తీసుకురాకున్నా సరే నిధులు తీసుకొచ్చానని చెప్పడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. మంత్రికి మునిసిపాలిటీపై అవగాహన లేదని, ఏ నిధులు ఎక్కడ వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని ఇక మంత్రిగా రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారని ఎద్దేవా చేశారు. 14వ వార్డు సీనియర్ నాయకులు గడ్డం రాజు మాట్లాడారు.

 

 

 

సిసి రోడ్డు, డ్రైనేజీ, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ పనులు పూర్తయి రెండు నెలల క్రితమే ఓపెన్ చేశామని మళ్లీ శంకుస్థాపనల చేయడం చూస్తే నవ్వొస్తుంది అన్నారు. కాంగ్రెస్ నాయకుల తీరు, మంత్రి వివేక్ పద్ధతులు మార్చుకొని మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించేలా చొరవ తీసుకోవాలే తప్ప ఇలాంటి ప్రారంభించిన పనులను మళ్లీ ప్రారంభించడం విడ్డూరమని అన్నారు.

 

 

 

బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్,గడ్డం రాజు,పోగుల మల్లయ్య,రేవెల్లి ఓదెలు,జిలకర మహేష్, అలుగుల సత్తయ్య, ఎల్లబెల్లి మూర్తి, కొండ కుమార్, యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్,గాజుల చంద్రకిరణ్,వేనంక శ్రీనివాస్,నందిపేట సదానందం, పైతారి ఓదెలు, కల్వల సతీష్,శివ,మణి తదితరులు పాల్గొన్నారు.

బడిబాటకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్వి మండల నాయకులు

బడిబాటకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్వి మండల నాయకులు

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలల పురోగతికి బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపుమేరకు
మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్వి రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బాలుర, బాలికల ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా వాటిని ఎంఈఓ కార్యాలయం లో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు వినతి పత్రంను ఎంఈఓ అందుబాటులో లేనందున కంప్యూటర్ ఆపరేటర్ మామి డి రజిత పలు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం అంద జేశారు.

 

ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర పాఠశాలలో గోడలకు పెచ్చులు ఊడిపోయి శిధిలా వస్థకు చేరుకున్నాయి వాటిని పునర్మించాలని మరియు కంప్యూటర్ క్లాసులు చెప్పా లని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో కొత్త బెంచీలను ఏర్పాటు చేయాలి విద్యార్థులు ఆడుకోవ డానికి ఆటస్థలం ఏర్పాటు చేయాలి కోతుల సమస్యల నుండి విముక్తి కల్పించాలి కంప్యూటర్ క్లాస్ లను నేర్పిం చాలి మండల కేంద్రంలో రెండు ప్రభుత్వ బాల,బాలికల పాఠశాలలు ఎందుకని విద్యా ర్థుల సంఖ్య తక్కువ ఉన్నం దున ఒకే దగ్గర తరగతులు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కూతాటి రమేష్ ,బిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు పురాణం చంద్రశేఖర్, బిఆర్ ఎస్వి జిల్లా నాయకులు అంబాటి అఖిల్ పాల్గొన్నారు

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం .

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

అంతర్జాతీయ మాదకద్రవ్యా దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో విద్యార్థులచే స్కిట్ (నాటిక ) ప్లకార్డ్స్ లను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత పోకడ చూస్తుంటే జీవితమంటేనే మత్తు. మత్తులోనే వుంది గమ్మత్తు అనుకుంటున్నారు. నిజానికి జీవితమంటే మత్తు కాదు. జీవితాన్ని చిత్తు, చిత్తుగా ఓడించేది మత్తు అనే నిజాన్ని తెలుసుకోవాలి నేటి యువత. ఈ విధంగా యువతరాన్ని దారి మల్లించి చెడు మార్గంలో నడిపిస్తున్న దురాలవాట్లలో గంజాయి, హెరాయిన్, కొకైను, మార్ఫిన్, ఆల్కహాల్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనదని తెలిపారు.డ్రగ్స్ వాడినట్టు, అమ్మినట్టు తెలిస్తే మన రాష్ట్రం లో కొత్తగా అమల్లోకి వచ్చిన ఎమర్జెన్సీ నెంబర్ 112 కు తెలిపినట్లైతే తగు చర్యలు తీసుకొంటారని విద్యార్థులకు సూచించారు. చివరగా విద్యార్థులచే డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మదా, జ్యోష్ణ, రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version