సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌..

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

పురుషుల ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌ సెప్టెంబరు 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ శనివారం వెల్లడించాడు. ప్రధాన ప్రత్యర్థులు…

టోర్నీ వేదిక యూఏఈ

14, 21న ఇండో-పాక్‌ మ్యాచ్‌లు

గ్రూప్‌ ఎ: భారత్‌, పాకిస్థాన్‌, ఒమన్‌, యూఏఈ.

గ్రూప్‌ బి: శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌, హాంకాంగ్‌.

కరాచీ/న్యూఢిల్లీ: పురుషుల ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌ సెప్టెంబరు 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ శనివారం వెల్లడించాడు. ప్రధాన ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఒకే గ్రూపు నుంచి తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబరు 14న దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. ఆపై సూపర్‌ ఫోర్‌లో భాగంగా సెప్టెంబరు 21న భారత్‌-పాక్‌ మరోసారి ఢీకొంటాయి. ఇక..రెండు జట్లు కనుక ఫైనల్‌కు చేరితే ముచ్చటగా మూడోసారి తలపడతాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సూపర్‌-4కి చేరతాయి. సూపర్‌-4లో ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో తలపడుతుంది. సూపర్‌-4 నుంచి రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబరు 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టోర్నీని టీమిండియా ఆరంభిస్తుంది. 19న ఒమన్‌తో తలపడుతుంది. భారత్‌ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరిగే అవకాశముంది.

ఈ సారి చద‌రంగం కాదు ర‌ణరంగ‌మే బిగ్‌బాస్9 ప్రోమో వ‌చ్చేసింది

ఈ సారి చద‌రంగం కాదు ర‌ణరంగ‌మే బిగ్‌బాస్9 ప్రోమో వ‌చ్చేసింది…

 

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్‌ ఉందో, ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (BiggBoss) కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్‌ ఉందో, ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీజన్‌ ప్రారంభమయ్యే సమయంలో ఆ షోను వ్యతిరేకించేవారు అవాకులు, చవాకులు పేలినా.. ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం బాగానే ఉంటుంది. ఇప్పటికి ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిద‌వ సీజన్‌కు ముస్తాబ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా గురువారం స‌డ‌న్‌గా ప్రోమో విడుద‌ల చేసి వీక్ష‌కుల‌కు, బిగ్‌బాస్ అభిమానుల‌కు షాక్ ఇచ్చారు.

సరికొత్త రూల్స్‌, టాస్క్‌లతో మరింత ఆసక్తికరంగా ఎవరూ ఊహించిన రీతిలో ఉంటుందని హోస్ట్‌ నాగార్జున (Nagarjuna) స్పష్టం చేశారు. ఆట‌లో అలుపు వ‌చ్చింనంత తొంద‌ర‌గా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్దం చేస్తే స‌రిపోదు కొన్ని సార్లు ప్ర‌భంజ‌నం సృష్టించాలి. ఈ సారి చద‌రంగం కాదు ర‌ణరంగ‌మే అంటూ ఘూటుగా చెబుతూ షోపై క్యూరియాసిటీ పెంచారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో బాగా వైల‌ర్ అవుతోంది. మీరూ ఓల క్కేయండి. కాగా ఈ షో సెప్టెంబ‌ర్లో స్టార్ట్ అవ‌నున్న‌ట్లు సామాజిక మాధ్య‌మాల్లో న్యూస్ హాల్‌చ‌ల్ చేస్తున్న‌ప్ప‌టికీ మేక‌ర్స్ నుంచి అధికారికి ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ఇందుకు సంబంధించిన విష‌యాలు త్వ‌ర‌లో తెలియ‌జేయనున్నారు.

జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా జూలై 9 వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జహీరాబాద్ డివిజన్ కన్వీనర్ మహిపాల్ కోరారు. జహీరాబాద్ లో గురువారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా సమ్మెలో పాల్గొనాలని కోరారు.     

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version