మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన.

మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోల నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర కార్మిక,ఉపాధి కల్పన,మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి గురువారం పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై మంత్రి తో చర్చించినట్లు తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నం మల్లయ్య,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.

మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

అవినీతిని రూపుమాపి అభివృద్ధి చేసి చూపిస్తా

ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం,రసూల్ పల్లి,జైపూర్ వద్ద శనివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నియోజికవర్గానికి విచ్చేసిన మంత్రి వివేక్ వెంకట్ స్వామికి కాంగ్రెస్ నాయకులు మేళ తాళాలతో,బాణసంచా కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికి పూలమాలలతో,శాలువాలతో సత్కరించారు.జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికిన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేదవారికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు.అలాగే పేదవారికి సన్న బియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేశారు.ప్రజా పాలనలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అక్రమ అరెస్టులకు తావు లేకుండా చూసే బాధ్యత తనదే అని అన్నారు. పేదవారికి ఉచిత విద్య అందించాలనే కృషితో సోమనపల్లి గ్రామంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తానని అన్నారు.అలాగే చెన్నూరు నియోజకవర్గం లో అక్రమంగా ఇసుక రవాణా,మట్టి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.నేను ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎన్నుకున్న నాయకుడిని నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యోగక్షేమాలు చూసుకుంటూ వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలను అందే విధంగా నా సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version