జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభం…

జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభం…

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి.మండలం. రామచంద్రపురం గ్రామంలో. జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీలో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం. రామచంద్రపురం గ్రామంలో. గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో. గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ. గ్రామంలో ప్రజలందరికీ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమం లో. భాగంగా ప్రజలకు. గ్రామంలో ఉపాధి అవకాశాలు ఉండడంతో ప్రజలకు పని దొరకడం జరుగుతుందని. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామీణులకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండడంతో పాటు ఉపాధి ఉంటుందని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్. ఉపసర్పంచ్ పొన్నాల నర్సింలు. వార్డు మెంబర్లు. గడ్డం లహరి. గంధం లక్ష్మి. గంధం రమేష్. పంతం శేఖర్. పొన్నాల అమృత. గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాకూరిమాధవరెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల చక్రపాణి. ఫీల్డ్ అసిస్టెంట్ పూర్ణ.చందర్. మరియు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన సర్పంచ్….

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన సర్పంచ్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ. పరిధిలోని కె.సి.ఆర్.నగర్ .ఆరో. వార్డుకు చెందిన .వేముల.నగేష్ దినకర్మ.సందర్భంగా .వారి కుటుంబానికి. 50.కేజీల బియ్యం.అందజేసిన.గ్రామ సర్పంచి. గడ్డం. రచన మధుకర్. సందర్భంగా. గత కొన్ని రోజులుగా. కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతూ. ఆపరేషన్ అయిన తర్వాత కొద్ది రోజులకు అనారోగ్య సమస్యతో చనిపోయిన వేముల నగేష్ కుటుంబానికి. అండగా ఉంటామని. ప్రజా ప్రభుత్వ పెద్దల ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి నగేష్ కూతురు స్నేహ చదువులకు తాము అండగా ఉంటామని వారు చెప్పారని. అలాగే ఆరో వార్డు సభ్యులు కొండ భరత్ దృష్టికి వేముల నగేష్ కుటుంబ సభ్యులు గతంలో చెప్పగానే వెంటనే సర్పంచి ప్రభుత్వ అభివృద్ధి శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు చెప్పగానే ఎల్.ఓ.సి .మంజూరు చేయించడం జరిగిందని తద్వారా ఆపరేషన్ జరిగిందని. కొద్ది రోజుల తర్వాత అనారోగ్యంతో బాధపడి మృతిచెందగా. వారి కుటుంబాన్ని పరామర్శించి మన ధైర్యం చెప్పి వారి కుటుంబానికి. గ్రామ సర్పంచిగా మా వంతు సహాయంగా ఈరోజు 50 కేజీల బియ్యం వారి కుటుంబానికి అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉప.సర్పంచి కొండ శ్రీకాంత్. వార్డు సభ్యులు కొండ భరత్. కుసుమ హేమంత్. గాజుల రాంప్రసాద్. కాజా. మల్లికార్జున. రమేష్. సతీష్. అంబటి లావణ్య. తదితరులు పాల్గొన్నారు

పసిపాప హత్య కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి..

పసిపాప హత్య కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ హెచ్చరిక

నెక్కొండ, నేటి ధాత్రి

బీసీ నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉండటం, బీసీ మంత్రులు ప్రభుత్వంలో ఉన్నా బీసీ బిడ్డలకు న్యాయం జరగకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు అధికార పార్టీ మౌన సమ్మతి ఇస్తోందని మండిపడ్డారు.నాగర్‌కర్నూల్ మండలం చాకలి ఐలమ్మ గారి సెంటర్ పరిధిలోని కుమ్మెర గ్రామంలో కుమ్మరి మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన కుల అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. దైవ దర్శనానికి వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని తక్కువ కులం వారు అంటూ గుడిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం, నోటికొచ్చినట్లు దుర్భాషలాడటం దొరల పాలన కొనసాగుతుందనే దానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రకళ జగ్గయ్య దంపతులపై కుల ఉన్మాదంతో దాడి చేసి, వెంట్రుకలు పట్టుకుని ఈడ్చి, జాతరకు వచ్చిన జనాలపైకి విసిరి కొట్టడం అత్యంత అమానుషమని తెలిపారు. విషయం ఏమిటని అడిగిన వారి చిన్న కుమారుడు గణేష్‌పై కూడా అధికార పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ సహా నలుగురు కలిసి పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు.
పసిపాపను చూసైనా వదిలేయాలని తల్లిదండ్రులు కాళ్ల మీద పడి వేడుకున్నా, కనికరం లేకుండా రెండు నెలల చిన్నారిని కాలితో తన్ని చంపడం కుల రాక్షసత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ పసిపాప మృతికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించాలని, ఇది ప్రభుత్వ హత్యతో సమానమని గటిక అజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.నిందితులను గుర్తించినప్పటికీ ఇప్పటికీ అరెస్టులు జరగకపోవడం వెనుక రాజకీయ అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. దోషులను కాపాడే ప్రయత్నం కొనసాగితే బీసీ, బహుజన సమాజం మౌనంగా ఉండదని హెచ్చరించారు. ఎంతటి వారైనా సరే దోషులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బహుజనులపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ పై అవగాహన సదస్సు…

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ పై అవగాహన సదస్సు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ సాయం ఉపాధి శిక్షణ కేంద్రం సిరిసిల్ల వారు గ్రామీణ మహిళలకు అవగాహన. మగ్గం వర్క్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా. సారంపల్లి గ్రామ సర్పంచ్ గుగ్గిల లావణ్య నరసయ్య. ఉప సర్పంచ్ పాలకవర్గం వారి ఆధ్వర్యంలో. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం. నిర్వహిస్తు మగ్గం వర్క్ కోర్సులో. 19 నుంచి 50 సంవత్సరాల మహిళలకు ఈ కోర్సులో 31 రోజుల ఉచిత శిక్షణ ఉంటుందని ఈ సందర్భంగా ప్రారంభిస్తూ ఈరోజు సారంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంవద్ద అవగాహన సదస్సు కార్యక్రమంనిర్వహించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో. RSETI. కృష్ణవేణి. సంతోష్. మాట్లాడుతూ ఇట్టి ఉచిత శిక్షణ ఉపాధి. అవకాశాలను గ్రామీణ ప్రాంతం యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని. పిలుపునిస్తూ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ సాయం ఉపాధి శిక్షణలో.భాగంగా ఈరోజు సారం పెళ్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని. ఇందుకుగాను మహిళలు ప్రతి గ్రామంలో అందరు వినియోగించుకోవాలని ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలను వినియోగించు కోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ గుగ్గిల లావణ్య నరసయ్య. ఉప సర్పంచ్ సిరిసిల్ల వంశీ. వార్డు సభ్యులు. గుండి శారద. దాసరి లలిత. రాధా వినయ్. గ్రామపంచాయతీ కార్యదర్శి హరిత. ఐ.కె.పి.సిసి. నాగరాజు. మహిళా సంఘం అధ్యక్షురాలు కొయ్యడ పద్మ. వంగపల్లి యమునా. కాంగ్రెస్ మానవహక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్లభరత్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేలా రాజు. గడ్డమీది శ్రీనివాస్. గుగ్గిళ్ళ రాము. సిరిసిల్ల రమేష్. గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు

గుండె పోటుతో యువ రైతు మృతి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువ రైతు గుండెపోటుతో మృతి…

గుండె పోటుతో యువ రైతు మృతి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువ రైతు గుండెపోటుతో మృతి

జమ్మికుంట ( నేటి ధాత్రి)

జమ్మికుంట మండలం జగ్గయ్య పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్య పల్లి గ్రామానికి చెందిన గుజ్జ గోపాలరావు (45) అనే రైతు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పొలంలో నీటి పరిశీలిస్తున్న క్రమంలో గుండెపోటు కు గురయ్యాడు. పొలంలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

బైక్ పై బీదర్ టు హైదరాబాద్…..

బైక్ పై బీదర్ టు హైదరాబాద్…..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి : ఎండు గంజాయిని అక్రమంగా తరలించి
సొమ్ము చేసుకుని వాటితో జల్సాలు చేసుకోవడం ఓ యివకుడు అదే వృత్తిగా చేసుకున్నాడు. శంషాబాద్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (30) తన బైక్ పై బీదర్ నుంచి అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్నాడు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి సమీపంలోని బ్రిడ్జి వద్ద ఎక్సైజ్ అధికారులు ముందస్తు సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టగా అక్రమంగా తరలిస్తున్న 1.114 కిలోల ఎండు గంజాయితో అజయ్ కుమార్ వారికి పట్టుబడ్డాడు. అతడు వద్ద నుంచి ఒక మొబైల్ ఫోను, బైకును స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో కూడా ఇతడు పోలీసుల కళ్ళు కప్పి ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎక్సెజ్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో సీఐ శంకర్, ఎస్సై లు అనుదీప్, హన్మంతు, కానిస్టేబుల్స్ అరుణజ్యోతి, అంజిరెడ్డి, సాయి శివకాంత్, రాజేష్, శివకృష్ణలు ఉన్నారు.

ఎంపిడిఓ ను సన్మానించిన కార్యాలయ సిబ్బంది..

ఎంపిడిఓ ను సన్మానించిన కార్యాలయ సిబ్బంది

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ డిప్యూటీ సీఈఓ పదోన్నతి పొందిన సందర్భంగా వారిని శాలువాతో కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ నవీన్ కుమార్,కార్యాలయ పర్యవేక్షకులు శైలశ్రీ,ఎంజిఎన్ ఆర్ఇజిఎస్ ఏపిఓ ఇందిర,జూనియర్ సహాయకులు ప్రియాంక,టీఏ సుమలత,కంప్యూటర్ ఆపరేటర్ అనిత,కార్యాలయ సిబ్బంది,సుదమల్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనలకు కృషి : 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం…

మౌలిక సదుపాయాల కల్పనలకు కృషి : 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం

◆-: ఖాదర్ నగర్ వాగులో పేరుకుపోయిన చెత్త తొలగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఫయాజ్ నగర్ వార్డులో నెలకొని ఉన్న సమస్యలను సమూలంగా పరిష్కరించి కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించెందుకు కృషి చేస్తామని 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం అన్నారు. శుక్రవారం నాడు పట్టణంలోని ఫయాజ్ నగర్ వార్డులో భాగమైన ఖాదర్ నగర్ కాలనిలో గల వాగులో పూర్తిగా చెత్తతో నిండిపోవడంతో మురికి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడటంతో కౌన్సిలర్ ప్రతినిధి మొహమ్మద్ అక్రం జేసిబి యంత్రం సహాయంతో చెత్తను తొలగింపజేసి వాగులో నీటిని సజావుగా వెళ్లేందుకు చెత్తను తీసివేయించారు. ఈ సందర్భంగా అక్రం మాట్లాడుతూ వార్డు ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ కాకుండా ప్రభుత్వం పంపిణీ చేసిన చెత్త బుట్టలో వేసి తడి మరియు పొడి చెత్తను వేరువేరుగా వేసి ట్రాక్టర్ లో వేయాలని కోరారు.

కరీంనగర్. డెయిరీ ఆధ్వర్యంలో పుస్తెమట్టలు అందజేత…

కరీంనగర్. డెయిరీ ఆధ్వర్యంలో పుస్తెమట్టలు అందజేత…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం.నరసింహుల.పల్లి గ్రామంలో యాదవ రెడ్డి యదా.లక్ష్మి కూతురు వివాహానికి.పుస్తె. మట్టలు. అందజేసిన కరీంనగర్ డైరీ. ఈ సందర్భంగా చిన్న లింగాపూర్ రూట్ సూపర్వైజర్ గడ్డం సతీష్ రెడ్డి మాట్లాడుతూ. కరీంనగర్ డైరీ. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా .కళ్యాణమస్తు పథకంలో. భాగంగా ఆడబిడ్డ పెళ్లికి ఇస్తే మట్టలు అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం .నరసింహుల.పల్లి గ్రామంలో పాడి రైతు కొండేటి యాదిరెడ్డి.యాదలక్ష్మి ల కూతురు వెన్నెల వివాహం జరుగుతుండగా వారి వివాహానికి కరీంనగర్ డైరీ. ఆధ్వర్యంలో.పుస్తె .మట్టల పథకంలో భాగంగా .అడవిడ్డ పెళ్లికి అందజేయడం జరిగిందా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. నరసింహుల.పల్లి పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు మంద దేవయ్య. డైరెక్టర్లు.కోoడేటి.రాములు. పల్లె నర్సింలు. సెక్రెటరీ గో డిసెలబాబు. తదితరులు పాల్గొన్నారు

యాదవ సంఘం అడిషనల్ బిల్డింగ్ పనులు ప్రారంభం…

యాదవ సంఘం అడిషనల్ బిల్డింగ్ పనులు ప్రారంభం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో యాదవ సంఘం బిల్డింగ్ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండేపల్లి గ్రామంలో యాదవ సంఘం అడిషనల్ బిల్డింగ్ కు. ఐదు లక్షల .రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో మండే పల్లి గ్రామ సర్పంచ్. గాధగోని సాగర్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. ఉప సర్పంచ్. యాస.సందీప్. మహిళా మండలి అధ్యక్షురాలు ధర్మారెడ్డి .హరికరెడ్డి. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆసాని మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి. లింగాల భూపతి. మూర్తి మహిపాల్ రెడ్డి. చంద్రారెడ్డి. వార్డు సభ్యులు.బోడపట్ల. రాకేష్. బండి రేణుక. యాదవ సంఘం అధ్యక్షులు కాసాని శ్రీనివాస్. ఉపాధ్యక్షులు .గుంటి శ్రీనివాస్. ప్రధాన కార్యదర్శి బండి చేన్న. రమేష్. క్యాషియర్. ఒగ్గు మల్లేశం. సలహాదారులు బండి శ్రీకాంత్. కనకయ్య. అమరగోoడ. ప్రభుదాస్. జగ్గానిమల్లేశం. మాజీ అధ్యక్షులు.అమరగోండ మొండయ్య.ఏనుగుల దేవయ్య తదితరులు పాల్గొన్నారు

తుదిశ్వాస వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన గొప్ప నాయకుడు శ్రీరాముల రామచంద్రం-చాడ…

తుదిశ్వాస వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన గొప్ప నాయకుడు శ్రీరాముల రామచంద్రం-చాడ

కరీంనగర్, నేటిధాత్రి:

 

నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా తన జీవితాంతం తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన గొప్ప నాయకుడు శ్రీరాముల రామచంద్రమని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన సిపిఐ మానకొండూర్ మండల మాజీ కార్యదర్శి శ్రీరాముల రామచంద్రం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను చాడ వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పరామర్శించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు శ్రీరాముల రామచంద్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి ఆయన కుటుంబానికి తీరని లోటని, గత నలభై సంవత్సరాలకు పైగా సిపిఐ పార్టీలో గ్రామ స్థాయి కార్యదర్శిగా, మండల కార్యదర్శిగా, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారని, మండలంలో అనేక గ్రామాల్లో పార్టీ విస్తరణ కోసం పనిచేశారని, ప్రజా సంఘాలను ఏర్పాటు చేశారని, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా కూడా కొంత కాలం పనిచేశాడని, ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారని, అనేక ప్రజా, వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఉద్యమాలు చేశాడని, కొండపల్కల గ్రామంలో పార్టీ కార్యాలయం నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడని కొనియాడారు. డెబ్బై ఐదు ఏళ్ల వయస్సులో కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వాడని, నేటి తరం వారికి ఆదర్శంగా నిలుస్తూ ఉండేవాడని, సీనియర్ నాయకులుగా మండలంలో ఆయన పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారని, తన తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన క్రమ శిక్షణ కలిగిన నాయకుడని అలాంటి నాయకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఆయన మృతి పార్టీకి వారి కుటుంబానికి తీరని లోటని పార్టీ వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని చాడ వెంకటరెడ్డి తెలిపారు. పరామర్శించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, మండల కార్యదర్శి బండ రాజిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బూడిద సదాశివ, గ్రామ శాఖ కార్యదర్శి ఎరబోయిన సదయ్య, వార్డు సభ్యులు శాతరాజు సంపత్, నాయకులు భద్రయ్య, పొచమల్లు, రమేష్, నాంపల్లి, కొమురయ్య, రాజు, తదితరులున్నారు.

ఉమెన్ ఎంపవర్‌మెంట్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

ఉమెన్ ఎంపవర్‌మెంట్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

మహిళల శక్తి దేశాభివృద్ధికి పునాది

భూపాలపల్లి నేటిధాత్రి

బుధవారం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారత కేంద్రం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్‌మెంట్ ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మహిళల సాధికారత, విద్య, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి సంఘాల బలోపేతం చేయాలన్నారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. మహిళల భద్రత, స్వాభిమానంతో జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు.
ఈ ర్యాలీలో మహిళా సంఘాల సభ్యులు, యువతులు, స్థానిక నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కొమ్మాల జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు

కొమ్మాల జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు

కొమ్మాల జాతర బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ సమీక్ష

మార్చి 3 నుంచి 8 వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

నర్సంపేట,నేటిధాత్రి:

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పౌర సంబంధాల శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో నిర్వహిస్తూన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కలెక్టరేట్ లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 3 నుంచి మార్చి 8 వరకు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.పోలీస్, ఆరోగ్య, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ, పౌర సంబంధాల, అగ్నిమాపక తదితర శాఖలు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధంచేసి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.జాతర సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణలు, చలువ పందిళ్లు, క్యూ లైన్లు, త్రాగునీటి సదుపాయం, అన్నదాన కార్యక్రమాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, వైద్య శిబిరాలు, శానిటేషన్ చర్యలు సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జాతర ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పౌర సంబంధాల శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారిని సూచించారు.సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, ఆర్డీవో సుమ, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

రోడ్ల దుస్థితిపై ప్రజల ఆవేదన: పాలకులపై నిప్పులు…

రోడ్ల దుస్థితిపై ప్రజల ఆవేదన: పాలకులపై నిప్పులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గత 5 సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి మారలేదని, సర్పంచ్లు మారుతున్నా రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి 26 నెలలు పాలించినా పరిస్థితి మారలేదని, జహీరాబాద్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, పనికి వెళ్లే కూలీలు రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, బడంపేట్ సర్పంచ్లు కూడా రోడ్ల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రింగ్ రోడ్లు ఉన్న చోట్ల, లేని చోట్ల కూడా ఇదే పరిస్థితి అని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఓట్లు మాత్రమే కావాలని పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఒకసారి వచ్చి ప్రజల ఇబ్బందులను చూడాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కోహిర్ మండలంలో రోడ్లు బాగుచేయాలని లేదా కొత్త రోడ్లు వేయాలని కోరుతున్నారు.

అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి: ఎంపీ సురేష్ కుమార్..

అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి: ఎంపీ సురేష్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పురపాలక సంఘంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో, స్థానిక ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మరియు గౌరవ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా, జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కమీషనర్ జైత్ రాం, ఎంఆర్ఎ దశరథ్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకం…

గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల మేడపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామ నూతన సర్పంచ్ కొల్లూరు అరుణ ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ మజహర్ అహ్మద్, గ్రామ కార్యదర్శి కాంచన రాథోడ్ నేతృత్వంలో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన సర్పంచ్ గ్రామ అభివృద్ధికి అధికారుల సమన్వయంతో పనులను చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సమస్య, వీధి దీపాలు తదితర సమస్యలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదేవిధంగా దశలవారీగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి లబ్దిదారులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. నూతన సర్పంచ్ గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు.పారిశుధ్య పనులపై గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బంటు శేఖర్, సిహెచ్ నిర్మలా లక్ష్మణ్, స్వప్న దిలీప్, రాములు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు

తొలగించిన అర్బన్ ఏరియా ఆసుపత్రిని తిరిగి అందుబాటులోకి తెవాలి..

తొలగించిన అర్బన్ ఏరియా ఆసుపత్రిని తిరిగి అందుబాటులోకి తెవాలి..

◆-: కౌన్సిల్ సమావేశంలో గాళంఎత్తిన కౌన్సిలర్..

◆-: అదేవిధంగా ఇళ్ల మొటేషన్లు అయ్యేలా కరెంట్ మీటర్ల కు పర్మిషన్లు అందేలా చూడాలి..

◆-: 35 వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ప్రవీణబేగం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రజలంద రికీ అందుబాటులో ఉండే ఆరోగ్య నిమిత్తం గత ప్రభుత్వం ఏరియా అర్బన్ ఆసుపత్రిని ఏర్పాటు చేయగా రెండు మూడు నెలల క్రితం దాన్ని తొలగించడం జరిగింది. మంగళవారం నాడు మున్సిపల్ మున్సిపల్ సర్వసభ సమావేశంలో 35వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ప్రవీణబేగం కౌన్సిల్ లో గుర్తు చేస్తూ మళ్లీ ఆసుపత్రిని సద్వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ కౌన్సిల్లో గాళం విప్పడం జరిగింది. అదేవిధంగా ఐడిఏయంటి కాలానికి సంబంధించిన నిరుపేదలు ఇండ్లు కట్టుకోగా వాటికి అసెస్మెంట్ లు కావచ్చు, రిజిస్ట్రే షన్లు కావచ్చు, కరెంట్ మీటర్లు ఇవ్వకపోవడం శోచ నీయకరమైన విషయమని, కావున వాటన్నిటిని పరి గణించి వాటిని కూడా మీ దృష్టిలో ఉంచుకొని వెంటనే అసెస్మెంట్ లు గానీ, రిజిస్ట్రేషన్లు గాని,మొ టేషన్లు గాని, ఐడిఎయంటి కాలనీలో ఇల్లు కట్టుకున్న ప్రతి ఇంటికి పర్మిషన్ ఇవ్వాలని యంపిని, మున్సిపల్ చైర్మన్ ను కమిషనర్ ను, కౌన్సిల్ సర్వసభ సమావేశంలో ఆమె కోరారు..

ఎంహెచ్.పిఎస్ జిల్లా కన్వీనర్‌గా తిక్కరాజు మాదిగ ఎన్నిక…

ఎంహెచ్.పిఎస్ జిల్లా కన్వీనర్‌గా తిక్కరాజు మాదిగ ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

మాదిగ హక్కుల పరిరక్షణ సమితి భూపాలపల్లి జిల్లా కన్వీనర్‌గా తిక్కరాజు మాదిగను నియమించిన
వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ అనంతరం తిక్క రాజుకు నియమక పత్రాన్ని అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా
తిక్కరాజు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు సంఘం కోసం సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తానని వారు అన్నారు

డేంజర్ స్పాట్…..

డేంజర్ స్పాట్……..!?

◆-: నిమ్జ్ ఎక్స్ రోడ్డుపై తరచూ
ప్రమాదాలు

◆-: తండ్రి, కొడుకులకు విరిగిన కాళ్లు

◆-: పట్టించుకోని అధికారులు

◆-: నివారణకు చర్యలు తీసుకోండి:
వాహనదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్, ఎల్లోయి, చిలేపల్లి గ్రామ శివారులో నిమ్ పరిశ్రమల కోసం ఉగ్గేలి నుంచి బర్దిపూర్ గ్రామ శివారుకు నూతనంగా నిర్మించిన రహదారి ప్రమాణాలకు నిలయంగా మారింది. మాచ్చూర్ కేంద్రీయ విద్యాలయం క్రాస్ రోడ్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉగ్గేలి. కృష్ణాపూర్ నుంచి వచ్చే వాహనాలు, జహీరాబాద్ నుంచి ఝరాసంగం వైపు వెళ్లే వాహనదారులు ఈ మార్గంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల మాచ్నూర్ గ్రామానికి చెందిన తండ్రి, కొడుకులు

 

ప్రమాదానికి గురై ఇద్దరి కాళ్లు విరగడంతో ఆసుపత్రి పాలయ్యారు. బర్దిపూర్, ఝరాసంగం గ్రామాలకు చెందిన పలువురు కూడా ఇదే ప్రాంతంలో ప్రమాదా లకు గురైనట్లు తెలిసింది. కేంద్రీయ విద్యాలయ సమీపంలో నాలుగు రోడ్లు కలిసే కూడలి వద్ద ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నూతన రోడ్డుపై రేడియం స్టిక్కర్లు వేసినప్పటికీ వాహనదారులు వాటిని పట్టించుకోవడం లేదు.. దీనికి తోడు ఝరాసంగం వైపు, అటు పస్తాపూర్ వైపు వెళ్లే రహదారులపై వాహనాలు అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయి. నాలుగు రోడ్ల కూడలి వద్దకు

 

 

 

రాగానే వేగం అదుపుతప్పడంతో ప్రమాదాలు జరు గుతున్నాయి. రెండు వైపులా ట్రాఫిక్ సిగ్నల్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించవ చ్చని ప్రయాణికులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే కుప్పానగర్ సమీపంలో ఏడు ప్రమాదకరమైన రోడ్డు మలుపులు ఉన్నాయి. కుప్పానగర్ శివాజీ విగ్రహం సమీపంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ప్రమాదాల్లో మృతి చెందారు. అనేక మూగజీవులు ప్రాణాలు కోల్పోయాయి. కుప్పానగర్ శివారులోని జట్టప్ప బా వి మూల, మల్లన్న గుట్ట క్రాస్ రోడ్, శివాజీ విగ్రహం. ప్రభుత్వ పాఠశాల, హైమద్ దర్గా, గొల్ల రవి పాలం వద్ద ప్రమాదకరమైన మలుపులు ఉన్నా యి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలన్నీ నివారణ చర్యలు చేపట్టాలని ప్రయాణి కులు, వాహనదారులు ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేశారు.

తునికకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి…

తునికకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి

తునికాకు సేకరణకు సంబంధించిన పనులు ప్రారంభించాలి

కట్ట రేటు ₹10 కు పెంచాలి.

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

తునికి ఆకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి తునికాకు శాఖకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వారు మాట్లాడుతూ వరి పంట తర్వాత పోనికాకు రెండవ అతిపెద్ద పంటగా ఉందని అట్లాంటిది ఫిబ్రవరి నెల పూర్తి కావస్తున్న టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కొమ్మ కొట్టే పనులు పూర్తి చేయకపోవడం చూస్తుంటే పేదలకు ఉపాధి కల్పించడంలో ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్య వైఖరి కనపడుతుందని వారు విమర్శించారు. ఇప్పటివరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు డివిజన్లో 30 యూనిట్లుకు గాను 188 కల్లాలు ఉండగా అందులో ఇప్పటివరకు ఐదు యూనిట్లు 34కల్లాలకు మాత్రమే టెండర్లు అయ్యాయని, ఇంకా 25 యూనిట్లు ఎక్కువగాను 150 కల్లాలు సేల్ కావాల్సి ఉందని ఈనెల చివరి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోతే ప్రభుత్వమే తునికకు సేకరణకు సంబంధించిన పనులు ప్రారంభించాలని, అదేవిధంగా కట్టకు పది రూపాయలు నిర్ణయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేనియెడల మార్చి ఫస్ట్ నుండి ఆందోళన పోరాటాలకు పూనుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!
Exit mobile version