అంకుషాపుర్ గ్రామంలో లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమం..

అంకుషాపుర్ గ్రామంలో లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమం

సత్వర న్యాయం కావాలంటే లోక్ అదాలత్ ఒకటే మార్గం

పారా లీగల్ వాలంటర్ అంబాల నరేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

టేకుమట్ల మండలం అంకుషాపుర్ గ్రామంలో పారా లీగల్ వాలంటర్ అంబాల నరేందర్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ పై గ్రామ ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు. మండలంలోని అంకుషాపుర్ గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద గ్రామ పెద్దలు గ్రామ ప్రజల తో కలిసి లోక్ అదాలత్ పై గ్రామ ప్రజలు కు అవగాహన కార్యక్రమం నిర్వహించి అందులో భాగంగా అంకుషాపుర్ గ్రామంలో పారా లీగల్ వాలంటర్ అంబాల నరేందర్ మాట్లాడుతూ
మాట్లాడుతూ లోక్ అదాలత్ ను వినియోగించుకోండి సమస్యలను పరిష్కరించుకోవాలని, సత్వర న్యాయం కావాలంటే లోక్ అదాలత్ ఒక్కటే మార్గమని, చిరకాలంగా కోర్టు నందు పరిష్కారం కానీ నిలిచిపోయిన మీ కేసులను లోక్ అదాలత్ ద్వారా తక్కువ వ్యవధిలో ఖర్చు లేకుండా మీ కేసులను పరిష్కరించుకోవచ్చని మార్చి 28 రోజున జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తగ్గేదే లేదన్న స్థితిలో బీఆరఎస్

· కాంగ్రెస్ పెద్దలు జాగ్రత్త పడకపోతే పుట్టిమునిగే ప్రమాదం

· కేవలం 50కంటే ఎక్కువ స్థానాల్లో గెలవడం ప్రజల పూర్తి మద్దతుకు సంకేతం కాదు

· 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటం విపక్ష బలానికి సంకేతం

· నెంబర్ గేమ్ కాదు “వోటింగ్ శాతం” ముఖ్యం

· రానున్న కాలం కాంగ్రెస్‌కు టైట్ రోప్ వాక్ అనే చెప్పాలి

· రేవంత్ సహా మంత్రులు హైకమాండ్ భజన తగ్గించుకోవాలి

· ఇది ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతుంది

· అధికారంలోకి వస్తేనే కదా హైకమాండ్ పెత్తనం

· ఓడిపోతే హైకమాండ్ పట్టించుకోదు

· ప్రజలే హైకమాండ్ అని గుర్తించి ప్రభుత్వం పనిచేయాలి

· ఇందిరమ్మ భజన “తెలంగాణ ఆత్మగౌరవం” నినాదానికి దారితీస్తుంది

· అధికారం ఇచ్చేది ప్రజలు మాత్రమే

హైదరాబాద్, నేటిధాత్రి: 

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 1537 వార్డుల్లో విజయం సాధించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బీఆరఎస్ చెక్కుచెదరలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవం కంటే రేవంత్ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిపై బీఆరఎస్ చేసిన విస్తత ప్ర చారం ఏస్థాయిలో పనిచేసిందో మనకు చాలా అర్థమవుతుంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశ మేమంటే కాంగ్రెస్ 1537 వార్డుల్లో గెలిచినా, 1200 నుంచి 1400 వార్డుల్లో బీఆరఎస్ గట్టిపోటీ ఇచ్చిందంటే విపక్షంలో వున్నా, పార్టీ క్షేత్రస్థాయిలో బలీయమైన ఓటుబ్యాంకును కలిగివున్నదనే అర్థం. అంతేకాదు మొత్తం 116 మున్సిపాలిటీల్లో 38 హంగ్ ఏర్పడ్డాయంటే కాం గ్రెస్ బలం అనేదానికంటే, బీఆరఎస్ సత్తా అని గుర్తించాలి. ఎందుకంటే ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో అధికారపార్టీకే అత్యధిక సానుకూలత వుంటుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో వున్న బీఆరఎస్‌కు 90శాతం మున్సిపాలిటీలు స్వాధీనం కావడాన్ని పరిశీలిస్తే ఈసారి కాంగ్రెస్ పనితీరు “నెంబర్ గేమ”లో బాగుందనిపించినా, ఓటింగ్ పరంగా పరిశీలిస్తే పనితీరు ఆశించినస్థాయిలో లేదని చెప్పక తప్పదు. చాలా వార్డుల్లో పదికంటే తక్కువ ఓట్లతో గెలుపు సాధించిన సందర్భాల్లో రీకౌంటింగ్‌కు డిమాండ్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బీఆరఎస్, బీజేపీలు ఈవిధంగా స్వల్ప ఓట్ల మార్జిన్‌తో ఓటమి పాలైనప్పుడు రీకౌంటింగ్‌లు జరిగాయి. ఈ అంశాలను పరిశీలిస్తే రాష్ట్రంలో విపక్షాల బలహీనపడలేదన్న సత్యం కాంగ్రెస్ నేతలకు నిద్రలేని రాత్రులను మిగల్చవచ్చు. నెంబర్‌గేమ్ మాట అట్లా వుంచితే ఇంతటి బలమైన ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదంటే 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్ ప్రభుత్వం మరింత గట్టి పనితీరును ప్రదర్శించకపోతే పుట్టి మునగడం ఖాయమన్న సంకేతాలను ఈ ఎన్నికల ఫలితాలు ఇస్తున్నాయి. అంతేకాదు ఈ ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు చిహ్నం కూడా! అందువల్ల ప్రభుత్వ పెద్దలు, ప్రతి దానికీ విపక్షాలను విమర్శించడం మాని తామేం చేస్తున్నదీ ప్రజలకు విడమరచి చెప్పి అభిమానాన్ని సంపాదించుకునే యత్నం చేయాలి. గత ప్రభుత్వంలో పనిచేసినవారిలో కొంతమంది రేవంత్ మంత్రివర్గంలో కూడా వుండటంతో, అదేపనిగా బీఆరఎస్‌పై చేస్తున్న విమర్శలు బూమరాంగ్ అయి, వీరే సమాధా నం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బీఆరఎస్‌ను విమర్శించడమంటే తమను తా ము వేలెత్తిచూపుకున్నట్టే! ప్రజలు అమాయకులు కారు. అధికారపక్షం చేసే ప్రతి పనిని వారుపరిశీలించి, ఓటింగ్ రూపంలో మార్కులు వేస్తారన్నది గుర్తించాలి. 

విశ్లేషిస్తే 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిందంటే, విపక్షం చాలా బలంగా వున్నదనేగా అ ర్థం. కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆరఎస్‌లు చెరి 8 స్థానాలను గెలుచుకున్నాయి. వికారాబాద్‌జిల్లా పరిగి మున్సిపాలిటీలో మొత్తం 18 స్థానాల్లో కాంగ్రెస్, బీఆరఎస్‌లు చెరి 8 వార్డులను Âకైవసం చేసుకున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో మొత్తం 77 స్థానాల్లో బీఆరఎస్‌కు 30, కాంగ్రెస్‌కు 29 వచ్చాయి. అంటే అధికారపార్టీ కంటే బీఆరఎస్‌కు ఒక్కస్థా నం ఎక్కువ. జనగాం 30 వార్డుల్లో, తొర్రూరు 16 వార్డుల్లో వచ్చిన ఫలితాల పుణ్యమాని ఛైర్‌పర్సన్ ఎన్నికకు ‘టై’ పరిస్థితి ఏర్పడింది. విచిత్రమేమంటే కాంగ్రెస్‌కు చెందిన ఎక్స్`అఫిసియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ చెరిసమానం కావడంతో తప్పనిసరిపరిస్థితుల్లో లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో చాలా స్థానాల్లో తక్కువ మార్జిన్లు వుండటంతో రీకౌం టింగ్ చేయాల్సి వచ్చింది. కరీంనగర్, సంగారెడ్డి, పరిగి ప్రాంతాల్లో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడం గమనార్హం. అసీఫాబాద్, దేవర కొండ, ఆలంపూర్, కోహిర్, కేసముద్రం, అమరచింత, క్యాతనపల్లి వార్డుల్లో ఏ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. ఒక్కో వార్డు గెలుపు, ఛైర్‌పర్సన్ స్థానానికి కీలకంగా మారడంతో ఎంతో ఉత్కంఠ నెలకొంది. కేసముద్రంలో 8`8 స్థానాల్లో గెలుపుతో రెండు పార్టీలుఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీపడ్డాయి. అయితే జగిత్యాల పరిస్థితి భిన్నం. ఇక్కడ కాంగ్రెస్‌కు 12, బీఆరఎస్‌కు 4 స్థానాలు రాగా 14 వార్డులను ఇండిపెండెంట్లు గెలుచుకోవడంతో ఛైర్‌పర్సన్ ఎన్నికకు చాలా విచిత్ర పరిస్థితి నెలకొంది. 

మొత్తం ఎన్నికలు పూర్తయ్యాక తెలంగాణ ఎన్నికల సంఘం ఒక ప్రకటన జారీచేస్తూ మొత్తం93 మున్సిపాలిటీలను కాంగ్రెస్, 19 బీఆరఎస్ గెలుచుకున్నాయని వెల్లడించింది. కానీ మొ త్తం 116 మున్సిపాలిటీల్లో 38 అంటే 1/3శాతం హంగ్ ఫలితాలన్నివ్వడాన్ని గమనిస్తే, కాం గ్రెస్, బీఆరఎస్‌లు ఇక్కడ సమాన బలంతో వున్నాయన్నది అర్థమవుతుంది. దేవరకొండ మున్సిపాలిటీని కేవలం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుతో మాత్రమే కాంగ్రస్ తన ఖాతాలోవేసుకోగలిగింది. అలంపూర్, కేసముద్రంలో కూడా ఇదే పరిస్థితి. ఇవన్నీ హంగ్ ఏర్పడిన 38 మున్సిపాలిటీల్లో కొన్ని. ఇంకా చాలా మున్సిపాలిటీను కాంగ్రెస్ చాలా తక్కువ మెజారిటీలేదా లాటరీల ద్వారా మాత్రమే స్వాధీనం చేసుకోగలగడాన్ని గమనిస్తే, బీఆరఎస్ ఎక్కడా బలహీన పడలేదన్న సంగతి స్పష్టమవుతోంది. 

ఇక వార్డుల్లో కూడా కేవలం సింగిల్ ఓటు మెజారిటీలో కాంగ్రెస్ విజయం సాధించినవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే వుండటం గమనార్హం. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలిచాడు. జనగాం మున్సిపాలిటీలోని 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి, బీఆరఎస్‌పై కేవలం రెండు ఓట్ల తేడాతోనే గట్టెక్కడం గమనార్హం. తొర్రూరులోని 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఓట్లు కేవలం 3. దేవరకొండ మున్సిపాలిటీలోని 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి 4ఓట్ల మార్జిన్‌తో గెలిచాడు. ఆలంపూర్, క్యాతనపల్లిల్లో కూడా 3`4 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిన స్థానాలు బాగానే వున్నాయి. అభ్యర్థి గెలుపు పది ఓట్లకంటే తక్కువ వున్నప్పుడు రీకౌంటింగ్ కోరడం సహజం. ఈ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. 

బద్ధవైరంగా వున్న కాంగ్రెస్, బీఆరఎస్‌ల మధ్య పరస్పర అవగాహన కూడా కొన్ని మున్సిపాలిటీల్లో కనిపించింది. ఇది స్థానిక నాయకత్వాల మధ్య వున్న అవగాహనే కారణమని చెప్పక తప్పదు. ఇక్కడ పార్టీల వైరుధ్యం కంటే, స్థానిక నాయకుల సమన్వయం ప్రాధాన్యత వహించా యని అర్థం చేసుకోవాలి. ఒక కోణంలో ఆలోచిస్తే దీన్కొక సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. కామారెడ్డి మున్సిపాలిటీలో 11 మంది బీఆరఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ అభ్యర్థికిì మద్దతివ్వగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు వైస్‌ఛైర్మన్‌గా బీఆరఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. అమరచింత మున్సిపాలిటీలో మరో విచిత్రం జరిగింది. బీఆరఎస్ తరపున గెలిచిన కౌన్సిలర్ కాం గ్రెస్‌లో చేరడంతో, సీపీఎం మద్దతుతో పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆరఎస్ కౌన్సిలర్, కాంగ్రెస్‌లోకి చేరగా, బీజేపీ మద్దతుతో మున్సిపా లిటీని గెలుచుకుంది. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆరఎస్ కౌన్సిలర్ మరో ముగ్గురు ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్‌లో చేరగా, మరో కాంగ్రెస్ కౌన్సిలర్‌ను బీఆరఎస్ చేర్చుకోవడం ‘తగ్గేదే లేదు’ రాజకీయం నడిచింది. రాయ్‌కల్‌లో కాంగ్రెస్ మద్దతులో బీఆరఎస్ కౌన్సిలర్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ బీజేపీని దెబ్బకొట్టడానికి ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయన్న సంగతి సుస్పష్టం. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీని అధికా రంలోకి రాకుండా చేయడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆరఎస్‌లు ఏకం కావడం మరో విచి త్రం. మొత్తంమీద పరిశీలిస్తే నాలుగు సందర్భాల్లో కాంగ్రెస్ మద్దతుతో బీఆరఎస్ కౌన్సిలర్లకు పోస్ట్‌లు (వైస్‌ఛైర్మన్) రావడం గమనార్హం. 

మొత్తంమీద పరిశీలిస్తే కాంగ్రెస్ సొంతంగా గెలిచింది 66 మున్సిపాలిటీల్లో! మరో 25 ము న్సిపాలిటీలను అలయన్స్‌లు లేదా ప్రత్యర్థి పార్టీలనుంచి వలసనలను ప్రోత్సహించడం ద్వారా కైవసం చేసుకోగలిగింది. బీఆరఎస్ మొత్తం 18 ఛైర్‌పర్సన్ పోస్టులను సొంతంగా గెలుచు కుంది. ఇక వైస్‌ఛైర్‌పర్సన్ పోస్టులను కాంగ్రెస్ ఇతరపార్టీలతో జట్టు కట్టడం ద్వారా 84 వైస్‌ఛైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ పోస్టులను పొందగలిగాయి. వార్డుల విషయానికి వస్తే మొత్తం 2996 వార్డుల్లో, 1537 కాంగ్రెస్, బీఆరఎస్ 717, బీజేపీ 261 వార్డులను గెలుచుకున్నాయి. ఇక స్ట్రైక్‌రేట్ విషయానికి వస్తే కాంగ్రెస్ 51.3%, బీఆరఎస్‌కు 26.1%. మొత్తం 7 ము న్సిపల్ కార్పొరేషన్లలో ఐదింటిని కాంగ్రెస్ గెలుచుకున్నా, రామగుండం, మంచిర్యాల, నý£్గండ కార్పొరేషన్లను మాత్రం సొంతంగా గెలుచుకోగలిగింది. మిగతా రెండింటిలో ఇతరుల మద్దతు అవసరమైంది. నెంబర్ గేమ్‌లో 93‘94 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లినా సొంతబలంలో గెలి చింది కేవలం 66 మున్సిపాలిటీల్లోనే అన్నది గమనార్హం. మిగిలిన స్థానాల్లో వలసలను ప్రో త్సహిచడం, మద్దతు కోసం రాజకీయాలు నడపడం, ఎక్స్‘అఫిసియో మెంబర్ల ఓట్ల ద్వారా గెలవగలిగిందనేది సత్యం. మొత్తంమీద ఈ గణాంకాల ఆధారంగా విశ్లేషించినప్పుడు కాంగ్రె స్‌కు పూర్తిస్థాయి మద్దతు లేదన్న సంగతి స్పష్టమవుతోంది. ఇదే సమయంలో బీఆరఎస్ బలహీన పడిందన్న వాదనలూ సరికాదు. ఇక ముందు కాంగ్రెస్ పాలన టైట్ రోప్ వాక్ అనే చెప్పాలి. ఏమాత్రం తప్పు జరిగినా క్యాష్ చేసుకోవడానికి బీఆరఎస్ అనుక్షణం పొంచి వుం టుందనేది సత్యం!

ఘనంగా చేరికలు.. ఘోరంగా ఓటములు!

`గొప్పలు చెప్పుకున్నా.. గెలుపులు గుండు సున్నా?

`ఎన్నికల కోసం సవాళ్లు..అన్నింటా అపజయాలు?

`ఈ రెండేళ్ల కాలంలో లక్షల మంది బీఆరఎస్ లో చేరారు?

`కేటీఆర్, హరీష్ లు ఎక్కడికెళ్లినా చేరికల జాతరలు సాగిస్తున్నారు.

`ఇరామ్ లేకుండా వారంలో రొండుసార్లైనా తెలంగాణా భవన్లో వేలాది మందికి కండువాలు కప్పుతూనే వున్నారు.

`జిల్లాలలో ఎక్కడికెళ్లినా ఇదే కండువాలు కప్పని ప్రోగ్రామే ఉండడం లేదు!

`అధికారంలో వున్న పదేళ్లు ప్రతి చోట కప్పుకుంటూనే పోయారు.

`సభలు, సమావేశాలలో కండువాలు గొప్పగా కప్పుతున్నారు! 

`ఎన్నికల సమయంలో కుప్పలు తెప్పలుగా పార్టీలో చేరుతున్నారు?

`బీఆరఎస్ లో చేరిన వాళ్లంతా ఎవరికి ఓట్లేస్తున్నారు?

`బీఆరఎస్ అభ్యర్థులు అంతటా ఎందుకు ఓడిపోతున్నారు?

`కండువాలు కప్పే ప్రచారమంతా తూతు మంత్రమేనా

`చేరికలన్నీ అబద్దమా? కప్పే కండువాలు కల్పితమా?

`ఎవరిని మోసం చేస్తున్నారు? మీకు మీరే మోసం చేసుకుంటున్నారు?

`తెలంగాణా లో ఐదేళ్ల క్రితమే 60 లక్షల మంది కార్యకర్తలు వున్నారని చెప్పారు?

`ఈ ఐదేళ్ల కాలంలో కొన్ని లక్షల మందికి కండువాలు కప్పారు?

`ఆ ఓట్లన్నీ ఎవరికి పోతున్నాయి? బి ఆర్ ఎస్ కు ఓటములే ఎందుకు మిగులుతున్నాయి?

`ఈ రెండేళ్లలో గర్వాంగా గెలిచామని చెప్పుకునే ఫలితాలు చూసారా?

`పార్లమెంట్ ఎన్నికల్లో అంత తిరస్కారం ఎందుకొచ్చింది అని సమీక్షించు కున్నారా?

`ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే దైర్యం చేశారా?

`పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో బొక్క బోర్లా మళ్ళీ పడ్డారా?

`అయినా పార్టీ లో అంతర్ మదనం జరుగుతోందా?

`నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకున్నారా?

`అసలు పార్టీ కార్యకర్తలకు గౌరవం ఉందా?

`రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయా?

`పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం వుందా?

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                    

 కొన్ని ప్రశ్నలకు సమధానం వుండదు అంటుంటారు. అంటే తప్పించుకోవాలనుకున్నప్ప్పుడో, తప్పించుకోలేని పరిస్దితుల్లో అందరూ చెప్పే ఏకైక సమాదానం ఇది. నిజానికి సమాదానం లేని ప్రశ్నలు ఈ ప్రపంచంలోనే వుండవు. వుంటే అవి ప్రశ్నలే కావు. బిఆరఎస్ రాజకీయాలు కూడా అలాగే వుంటున్నాయి. పార్టీ అభిమానులు కూడా జీర్ణించుకోలేనంత ఇబ్బందికరంగా వుంటున్నాయి. బిఆరఎస్ వరస ఓటములను ఎందుకు చవి చూస్తోందన్నదానిపై ఇప్పటికీ ఆ పార్టీలో ఎవరికీ క్లారిటీ లేదు. సమాదానం చెప్ప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అదికారంలో వున్నప్ప్పుడు ఏది చేసినా సాగుతుంది. ప్రతిపక్షంలో వున్నప్ప్పుడు కొట్లాడిందే ఎక్కడైనా లెక్కకొస్తుంది. ఈ విషయం బి ఆరఎస్ నాయకులకు ఒంట బట్టడంలేదు. ఎంత సేపు సులువుగా జనం ఆదరిస్తే బాగుండు అనుకుంటున్నారు. పైగా వచ్చేది మేమే అని కలలు కంటూ వున్నారు. అదికారంలోవున్నప్ప్పుడు అలాగే అనుకున్నారు. ఓడిపోయారు. ఇప్ప్పుడూ అలాగే అనుకుంటున్నారు ఓడిపోతున్నారు. కాని పోరాటం చేద్దామన్న సోయి లేదు. పోరాటం చేసి జనం మనసు చూరగొంటామన్న ముందడుగు లేదు. దేనికైనా కాలమే సమాదానం చెబుతుందనే దోరణిలో వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద వున్న వ్యతిరేకతతో గెలుస్తామని అనుకుంటున్నారు. పోరాటం చేయడంలో బిఆరఎస్‌ను మించిన పార్టీ మరొకటి లేదంటారు. ఉద్యమాలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. గతంలో అనేకం చేశాం..తెలంగాణ తెచ్చామని పదే పదే చెబుతుంటే ఈ తరం యువతరం వింటుందే గాని అయితే ఏంటి? అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అప్ప్పుడు బిఆరఎస్‌కు తెలంగాణ సమాజమంతా తోడుంది. అందుకే బిఆరఎస్ ఏది చేసినా అప్పటి పాలకులు భయపడ్డారు. ఇప్ప్పుడు స్వరాష్ట్రం. తెలంగాణ సమాజమంతా బిఆరఎస్ వెంట ఇప్ప్పుడు లేరు. వుంటే ఆ పార్టీకి గత ఎన్నికల్లో ఓటమే వుండేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ కాలం వేరు. స్వరాష్ట్రంలో పోరాటం వేరు. బిఆరఎస్ పోరాటానికి ప్రజలు తోడు రావాలని కోరుకోవడం తప్ప్పు కాదు. కాని ప్రజల కోసం కొట్లాడాలనుకున్నప్ప్పుడు ప్రజలను ఆకర్షించాలి. తెలంగాణ కోసం కొట్లాడినప్ప్పుడు కేసిఆర్ ఒక్కరే. ఇప్ప్పుడు కూడా బిఆరఎస్ ఒక్కటే అనుకొని ముందుకు సాగాలి. అంతే తప్ప జనం తోడు రావడం లేదంటే కుదరదు. బిఆరఎస్ మీద పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీకి కూడా ముందు అంతా శూన్యమే. పదేళ్లు కొట్లాడితే జనం ఆదరించారు. బిఆరఎస్ పాలన వద్దనకున్నారు. మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ మాటలు బలంగా నమ్మారు. అలా బిఆరఎస్‌ను మించిన నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కలిగించింది. ఇప్ప్పుడు సరిగ్గా బిఆరఎస్ కూడా అదే చేస్తే సరిపోతుంది. కాని ఏం చేస్తుంది. ఆరు గ్యారెంటీలు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, సిఎం. రేవంత్ రెడ్డి సర్కారు మొదలై రెండున్నరేళ్లు గడుస్తోంది. అయినా బిఆరఎస్ కదలడం లేదు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన వెంటనే ఆవేశపడ్డారు. అడ్డం పడ్డారు. ఇప్ప్పుడు ఎగిరేందుకు ఎదురు చూస్తున్నారు. ఇంకా కాలం కావాలన్నట్లు మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. బిఆరఎస్ వరుస ఓటములను తన ఖాతాలో వేసుకుంటూనే వుంటుంది. పైగా పదే పదే ఎన్నికలకు సై అంటూ సవాళ్ల మీద సవాళ్లు చేస్తూ పోతోంది. అదేంటో పార్టీలో చేరికల మీద వున్న శ్రద్ద బిఆరఎస్‌కు పోరాటాల మీద లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత చెబుతున్న మాట కూడా ఇదే. మాటలు కోటలు దాటిస్తున్నారు. కాళ్లు తంగెళ్లు దాటడం లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులను గడప దాటనీయకుండా ఎన్ని నిర్భందాలకు గురి చేసినా వారు తెగించి పోరాటాలు చేశారు. అబద్దాలు ప్రచారం చేశారో నిజం ప్రచారం చేశారో జనం విశ్వాసం చూరగొన్నారు. వారు చెప్పిన మాటలు జనం చేత నిజమని నమ్మించారు. బిఆరఎస్‌ను ఓడించారు. అబద్దాలు చెప్పి కాంగ్రెస్ గెలిచిందని చెప్పడానికి కూడా దైర్యం లేనట్లు, ఆరు గ్యారెంటీల మీద పోరాటం చేసే శక్తి లేనట్లు బిఆరఎస్‌నేతల వ్యవహారశైలియే జనం నమ్మకాలను చేరడం లేదు. కాని చేరికల సంuరాలు ఏ పార్టీకి లేనంతగా బిఆరఎస్‌లో నిత్య సంతర్పణంలాగా కార్యకర్తలు చేరుతూనే వుంటారు. అటు కేటిఆర్, ఇటు హరీష్‌రావు, ఇతర నాయకుల సమక్షంలో ఈ రెండేళ్ల కాలంలో మొత్తం మీద ýక్షలాది మంది కార్యకర్తలు చేరి వుంటారు. రెండేళ్ల కింద బిఆరఎస్ ఓడిపోయిన తర్వాత కొంత మందగనం కనిపించింది. సరిగ్గా పార్లమెంటు ఎన్నికల ముందు మళ్లీ పెద్దఎత్తున జోష్ కనిపించింది. ఎక్కడిక్కడ నాయకులు,కార్యకర్తలు చేరినట్లు కనిపించింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణ భవన్‌లో చేరికలతోటి నిత్యం సంబరాలే కనిపించాయి. కాని ఏమైంది. పార్లమెంటు ఎన్నికల్లో తుస్సు మంది. ఏకంగా కేసిఆర్ బస్సు యాత్ర పెట్టుకొని మరీ తిరిగారు. కాలు బాగాలేకున్నా ఊరూరు చుట్టివచ్చినంత పని చేశారు. రైతులను చైతన్యం చేశారు. నల్లగొండలో సభ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల వేళ పొలాలు తిరిగారు. ఎండిన పొలాలను చూశారు. పాలకుర్తి కూడా కేసిఆర్ పొలాల పొంటి తిరిగారు. కేసిఆర్‌ను చూడడానికి వచ్చిన జనాన్ని చూసి మళ్లీ బిఆరఎస్ పుంజుకున్నది అనుకున్నారు. కాని ఓట్లు పడలేదు. సీట్లు రాలేదు. కొన్ని చోట్ల కనీసం డిపాజిట్లు రాలేదు. కారణం ఎవరికీ అర్దం కాలేదు. అంటే వచ్చిన వాళ్లంతా ఎవరు? నాయకులు తీసుకొచ్చిన వాళ్లనేది అర్దమైంది. ప్రజలను తెచ్చుకొని ప్రచారం చేసుకుంటే ఓట్లు పడవని అర్దమైంది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాయి. ఆ ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా జంకినంత పని చేశారు. పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. కేసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అంటూ పులి వస్తుందని చెప్పారు. కాని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక తర్వాత చాల కాలం పాటు రాజకీయాలు లేకుండాపోయాయి. అయినా తెలంగాణ భవన్‌లో మాత్రం సందడి తగ్గలేదు. అప్ప్పుడుప్ప్పుడూ చేరికలు నిర్వహిస్తూనే వస్తున్నారు. ఏది ఆగినా చేరికలు ఆగలేదు. ఆ సంబరాలు ఆగలేదు. వేడుకలు చేసుకోకుండా ఊరుకోలేదు. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో బిఆరఎస్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ చనిపోయి మరునాటి నుంచే బిఆరఎస్ రాజకీయాలు మొదలుపెట్టింది. ప్రచారం ఆ సమయంలోనే చుట్టడం ప్రారంభించింది. సిట్టింగ్ సీటు మనదే అనుకున్నారు. బిఆరఎస్ ఊపుకు ఆ ఎన్నిక తోడ్పతుందనుకున్నారు. గోపీనాధ్ సతీమణిని కాలనీలన్నీ తిప్పారు. ఎక్కడికక్కడ సభలు ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున చేరికలు చేశారు. కాస్తో కూస్తో పెద్ద నాయకులైతే తెలంగాణ భవన్‌లో చేరికలు చేపట్టారు. తీరా జూబ్లీ ఉప పోలింగ్ సమయం దగ్గరికొచ్చే సరికి బిఆరఎస్ చేసిన హడావుడి అ ంతా ఇంతా కాదు. ఇక గెలిచినట్లే అనుకున్నారు. కార్నర్ మీటింగ్‌లు అంటూ పెట్టిన సభలు అందర్నీ ఆశ్చర్యపర్చాయి. అంతకు ముందు గణేష్ నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్ మీద యువత చేసిన హంగామా చూసి బిఆరఎస్ నాయకులు మురిసిపోయారు. యువత కూడా బిఆరఎస్ వైపే నిలుస్తుందని సంబరపడ్డారు. దేఖ్‌లేంగే అంటూ పాడే పాటలను చూసి బిఆరఎస్ నాయకులు ఇక పాత రోజులు వచ్చినట్లే అని సంబరాలు చేసుకున్నారు. కాని ఏమైంది. జూబ్లీ కూడా బిఆరఎస్ కోల్పోయింది. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఇటు వరుస ఓటములతో బిఆరఎస్ నానాటికి కుదేలౌతూ వస్తోంది. పంచాయతీ ఎన్నికలు పెట్టండి? పెట్టండి? అంటూ పదే పదే డిమాండ్ చేసిన బిఆరఎస్ నాయకులు ఒక్కసారిగా జూబ్లీ ఫలితంతో చల్లబడిపోయారు. తెలంగాణలో బిఆరఎస్ పుంజుకోలేదన్నది తేలిపోయింది. అంతకు ముందు నిజంగానే కాంగ్రెస్ పార్టీ స్ధానిక సంస్ధల ఎన్నికలకు వెళ్లాలంటే ఒకింత భయపడింది. జూబ్లీ గెలవడంతో బిఆరఎస్ మీద జనంలో ఇంకా కోపం వుందన్న సంగతి సిఎం. రేవంత్‌రెడ్డికి అర్ధమైంది. వెంటనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించారు. మెజార్టీ స్ధానాలు కాంగ్రెస్ గెల్చుకున్నది. దాంతో సిఎం. రేవంత్ రెడ్డికి మరింత నమ్మకం ఏర్పడింది. ఆ వేడిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుందని అనుకున్నారు. పంచాయితీ ఎన్నికలతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. నాయకులకు పదవుల మీద ఆశ పెరిగింది. దాంతో విపరీతంగా పోటీ కూడా పెరిగింది. మున్సిపల్ ఎన్నిÅ£లు కూడా జరిగిపోయాయి. అయితే కాంగ్రెస్‌లో ఎక్కడా పెద్దగాచేరికలు లేవు. బిఆరఎస్‌తో పోల్చితే చేరికలు కాంగ్రెస్‌లోకి చాలా తక్కువ. కాని ఓట్లేమో కాంగ్రెస్‌కు పడుతున్నాయి. చేరికల మీద చేరికలు జరుగుతున్న బిఆరఎస్‌కు వరస ఓటములు పలకరిస్తున్నాయి?

కళ్ళ ఎదుటే కబ్జా.. అధికారులకు కనిపించడం లేదా…

కళ్ళ ఎదుటే కబ్జా.. అధికారులకు కనిపించడం లేదా?

◆-: జహీరాబాద్లో బడా భూస్వామి ‘పక్కా స్కెచ్’

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: పట్టణ నడిబొడ్డున విలువైన ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. సుమారు రూ. 50 కోట్ల విలువైన పాల శీత లీకరణ కేంద్రం (MCC) స్థలాన్ని హస్తగతం చేసు కునేందుకు ఓ బడా భూస్వామి సాగించిన ఆక్రమణ పర్వం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతోం దని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్ద కాలంగా కబ్జా యత్నాలు

సర్వే నంబర్ 147లో 1973లో ఏర్పాటు చేసిన ఈ పాల శీతలీకరణ కేంద్రానికి మొత్తం 3.20 ఎకరాల భూమి ఉంది. దీనికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 146లోని తన భూమిని సాకుగా చూపిస్తూ, ఒక వ్యక్తి గత పదేళ్లుగా ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిం చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో (2013లో) ప్రజల నిరసనతో, 2018లో మున్సిపల్
అధికారుల జోక్యంతో ఈ కబ్జా ప్రయత్నాలు విఫల మయ్యాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది అధికారులు మౌనం.. ‘దెయిరీ’ స్కామ్ ఆరోపణలు గతంలో సర్వే నిర్వహించి ఇది ప్రభుత్వ భూమేనని తేల్చిన యంత్రాంగం, ఇప్పుడు మాత్రం కళ్లు మూసుకున్నట్లు వ్యవహరిస్తోంది. సదరు కబ్జాదారుడు ఏ కంగా ప్రభుత్వ స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక భారీ ‘డె యిరీ’ స్కామ్ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల ఆగ్రహం: ‘

ఎన్నికల విధుల పేరుతో అధికా
రులు బాధ్యత నుండి తప్పించుకుంటున్నారు. ఎంసీ సీ మేనేజర్ డేవిడ్ మరియు ఇతర ఉన్నతాధికారులు కబ్జాదారులతో కుమ్మక్కయ్యారు. వారి సహకారంతో నే అర్ధరాత్రి పూట ఫెన్సింగ్ పనులు పూర్తయ్యాయి.

మున్సిపల్ చైర్మన్ స్పందించాలి!

కోట్ల విలువైన ప్రజా ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని రైతాంగం హెచ్చరించింది. మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి, కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకో వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూమిని కాపాడకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు స్పష్టం చేశారు

శీర్షిక: జాగ్రత్త మహిళా..!

శీర్షిక: జాగ్రత్త మహిళా..!

గుంట నక్కలు ముసుగేసుకుని మన
చుట్టు తిరుగుతు మాయ మాటలు
చెప్పి నిన్ను  మాయం చేస్తారు జాగ్రత్త
మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!

బడికి వెళ్లే ఆడ పిల్లపై నీ వెయ్యి
కన్నులు వేసి ఉంచు మహిళా..!
రెప్పపాటు ఆదమరచినావో
డేగ లాగా తన్నుకొని పోతారు జాగ్రత్త
మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!

పొలం పనుల కోసం పొయ్యేటప్పుడు
బుడ్డదాన్ని వెంట తీసుకునిపో…
మరచి పోయినావో కామాంధుల
కాటుకు బలై పోతుంది జాగ్రత్త
మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!

కూలి నాలికి పొయ్యేటప్పుడు చీడ
పురుగుల బారిన పడకుండా
నిండు వస్త్రధారణతో వెళ్లు…
మరచి పోయినావో  చుట్టు ముట్టి
చిత్రవధ  చేస్తారు జాగ్రత్త మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు…!

అంతా నావాళ్ళే అని గుడ్డిగా నమ్మకు
మహిళా..!
నీ వెనక గోతులు తీసేది నీ వాళ్ళే అని
తెలుసుకో మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు…!

సమాజంలో ఉన్న కొంత మంది
గురించి మాత్రమే వారు మంచిగా
మారుతారు  అని  ఆశిస్తు…
తరలిపో తరలిపో.. చీకటి నుంచి వెలుగుకు తరలిపో.. కుందేలువి కావు.. పులిలా మారిపో.. వెంటాడే ఒడిదుడుకుల మృగాలతో యుద్ధానికి తరలిపో…’’ ఓ మహిళా మీకివే మా వందనాలు. కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’కి వందనాలు

శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218.

వేసవిలో తాగునీటి సమస్యపై బోర్ మరమ్మత్తుల చర్యలు…

వేసవిలో తాగునీటి సమస్యపై బోర్ మరమ్మత్తుల చర్యలు

సర్పంచ్ ఎలకపల్లి రమేష్

 

గణపురం మండలం అప్పయ్య పల్లి లో వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలోని ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ప్రత్యేక దృష్టి వహించి చర్యలు చేపట్టామని సర్పంచ్ అన్నారు. మంచినీటి బోర్ మరమ్మత్తులు చేసి గ్రామస్తులకుతాగునీటి కోసం ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఎండాకాలం మంచినీటి సమస్యతో ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మంచినీటి బోరును మరమ్మత్తులు చేపట్టామని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, శనిగరపు భద్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

గుడిలో గోమాత పూజలు, బయట చెత్త తింటున్న ఆవులు: భక్తిపై ప్రశ్నలు

గుడిలో గోమాత పూజలు, బయట చెత్త తింటున్న ఆవులు: భక్తిపై ప్రశ్నలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలో గోమాత పట్ల భక్తి, నిర్లక్ష్యం విరుద్ధంగా కనిపిస్తున్నాయి. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో గుడుల్లో గోమాతకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతుండగా, అదే సమయంలో వీధుల్లో ఆవులు చెత్త కుప్పల వద్ద ప్లాస్టిక్ కవర్లు తింటూ దర్శనమిస్తున్నాయి. గుడిలో రాయిని పూజించే భక్తి బయట జీవుల పట్ల కరుణగా మారడం లేదని, భక్తి కేవలం గుడి గడపకే పరిమితం కాకుండా, బయట జీవుల పట్ల కరుణ, బాధ్యతగా మారాలని, పరిశుభ్రత, కరుణ, బాధ్యతలే నిజమైన ఆచరణాత్మక భక్తి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చనిపోయిన పాప కోసం కొవ్వొత్తులతో ర్యాలీ…

చనిపోయిన పాప కోసం కొవ్వొత్తులతో ర్యాలీ

గణపురం రజక కుల సంఘం నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కులస్తురాలు చంద్రకళ కుటుంబం పై దాడి చేసి రెండు నెలల చంద్రకళ కుమార్తెను కాలుతో తన్ని పాప చనిపోవడానికి కారణమైన రెడ్డి కులానికి చెందిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేస్తూ చనిపోయిన పాపకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన రజక కుల సంఘం నాయకులు.ఇలాంటి దాడులు మరి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని కుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గణపురం రజక సహకార సంఘం నాయకులు వైనాల వెంకటేశ్వర్లు, పసునూటి వెంకన్న, ఎన్నిండ్ల సమ్మయ్య, వైనాల భాస్కర్, పసునూటి రాజు, నేరెళ్ల సారయ్య, సభ్యులు పసునూటి శంకర్, నేరెళ్ల శంకర్, ఎన్నిండ్ల శంకర్, పసునూటి రాజు,ఎన్నిండ్ల శ్రీకాంత్, వైనాల లింగయ్య, పసునూటి మొగిలి, పసునూటి సాయి తేజ, మామిడి అజయ్, కాశీ మల్లు, రాచర్ల శంకర్ పాల్గొన్నారు.

ప్రజల భూమూల సమస్యలు పరిష్కారంలో లైసెన్సడు సర్వేయర్ల పాత్ర కీలకము…

ప్రజల భూమూల సమస్యలు పరిష్కారంలో లైసెన్సడు సర్వేయర్ల పాత్ర కీలకము

కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిధాత్రి .

నూతన లైసెన్సు సర్వేయర్లు నిష్పాక్షికంగాపారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు
మంగళవారం నాడు జజిల్సర్వే శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ రెవెన్యూ తో కలిసి సర్వేయర్ లకు లైసెన్సులను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ భూ సర్వే వ్యవహారాలలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని అన్నారు ప్రజల భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్లు నిష్పాక్షికంగా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు భూ వివాదాల పరిష్కారంలో ప్రభుత్వ రూల్స్ పాటిం చి పనిచేయాలని ఆదేశించారు
మండల స్థాయిలో సర్వేయర్లకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు భూ సర్వే ప్రక్రియల్లో ఎటువంటి అక్రమాలు నిర్లక్ష్యాలకు తావులేదని అలాంటివి చోటు చేసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లైసెన్స్డ్ సర్వేయర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ భూ సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు
ఈ సమావేశంలో సర్వే శాఖ ఏ డి శ్రీనివాస్, ఇతర సర్వే శాఖ అధికారులురెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు…

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల 144 సెక్షన్ అమలు భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని భూపాలపల్లి ఎస్పీ తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు తెలిపారు.

భూపాలపల్లి జిల్లా పరిధిలోని మొత్తం 08 పరీక్ష కేంద్రాల్లో(భూపాలపల్లి 02, కాటారం 02, చిట్యాల 02, మహాదేవపూర్ 01, తాడిచర్ల 01) తేది 25-02-2026 నుండి 18-03-2026 వరకు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎస్పీ తెలిపారు.

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.

సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు నిషేధం.

పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు తేది 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని ఎస్పీ ఆదేశించారు.
ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని ఎస్పీ హెచ్చరించారు.

ఉద్యమకారులకు హైకోర్టు తీపి కబురు…

ఉద్యమకారులకు హైకోర్టు తీపి కబురు

తెలంగాణ ఉద్యమకారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉద్యమకారులు:

కేసముద్రం/ నేటి దాత్రి

 

తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ 8 వారాల్లో ఇవ్వాలని హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం కేసముద్రం పట్టణంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశమై హైకోర్టు తీర్పు ఉద్యమకారులకు అనుకూలంగా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చాగంటి కిషన్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ 8 వారాల్లో ఇవ్వాలని హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విధివిధానాలు ప్రకటించి, సంబంధిత జి.వో. విడుదల చేయాలని, వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, అర్హత ఉన్న ఉద్యమకారులకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పిసిసి సభ్యులు గుగులోత్ దస్రూనాయక్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల ఉద్యమకారుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మాంకాల కట్టమల్లు, ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, విద్యార్థి, యువజన జెఎసి పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్, భట్టు శ్రీనివాస్, శివారపు శ్రీధర్, గంధసిరి సోమన్న, వంగాల అశోక్, పింగిళి శ్రీనివాస్, జనిగల కొమురెల్లి, బాలు మోహన్, వేం నరసింహారెడ్డి, సోమారపు వెంకటయ్య, జనిగల పరమేశ్వర్, చుంచు సూరయ్య, కీర్తి సమ్మయ్య, మాందాటి ఆంజనేయులు, గాండ్ల మలేంద్రం పాల్గొన్నారు.

డీఫ్లోరైడ్ ప్రాజెక్టుతో పట్టణానికి మంచినీరు అందిస్తాం…

డీఫ్లోరైడ్ ప్రాజెక్టుతో పట్టణానికి మంచినీరు అందిస్తాం

మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని డీఫ్లోరైడ్ ప్రాజెక్టు ద్వారా నర్సంపేట పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మంచినీటిని అందిస్తానని మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.
నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని డీఫ్లోరైడ్ ప్రాజెక్టును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా సందర్శించారు.ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ గతంలో అనేక సంవత్సరాలు నర్సంపేట పట్టణంతో పాటు వివిధ మండలాలకు నిత్యం త్రాగునీటిని అందించిన డీఫ్లోరైడ్ ప్రాజెక్టు, గత బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పూర్తిగా ఆ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట పట్టణానికి తాగునీటి సమస్య తీర్చాలన్న సంకల్పంతో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశంలో డీఫ్లోరైడ్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించి ప్రాజెక్టును పునరుద్ధిస్తే నర్సంపేటకు తాగునీటి సమస్య తీరుతుందనే ఉద్దేశంతో అసెంబ్లీలో ప్రస్తావించి రూ.12కోట్ల నుండి 25 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని త్వరలోనే నిధులను మంజూరు తీసుకొచ్చి ప్రాజెక్టును పునరుద్దించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అందుకు ఉదాహరణ నేడు పబ్లిక్ హెల్త్ వాటర్ డిపార్ట్మెంట్, మిషన్ భగీరథ అధికారులతో డీఫ్లోరైడ్ ప్రాజెక్టును సందర్శించడం జరిగిందన్న విషయాన్ని గుర్తుకు చేశారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు 24 X 7 తాగు నీటిని అందిస్తామని పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేందర్, మిషన్ భగీరథ డిఈ ఎస్డీ అజార్,మిషన్ భగీరథ డిటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవేందర్ రెడ్డి, ఏ ఈఈ వంశీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ నాధ్, అసిస్టెంట్ ఇంజనీర్ కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి, 5వ వార్డు పొన్నాల మనీషా-ప్రకాష్, 13వ వార్డు కౌన్సిలర్ భూక్య మాతృ రాథోడ్, 17వ వార్డు కౌన్సిలర్ సలవుదిన్ అయూబ్ ఖాన్, 22వ వార్డు కౌన్సిలర్ భాణాల ప్రసన్న-శ్రీనివాస్, 23వ వార్డు కౌన్సిలర్ వేల్పుల శ్రీలత, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, మాజీ వార్డు సభ్యులు గండి గిరి, యూత్ కాంగ్రెస్ నాయకులు కొర్ర రాహుల్, భూక్య గణేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో.. పసిపిల్లల ప్రాణాలు తీయడమేనా…

ఇందిరమ్మ రాజ్యంలో.. పసిపిల్లల ప్రాణాలు తీయడమేనా?

నిందితులను కఠినంగా శిక్షించాలి

బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షులు గోపాల్ నాయక్.

బాలానగర్ నేటి దాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో రెండు నెలల పసికందు మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ మంగళవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కులం పేరుతో దాడి చేసి, పసిపాప ప్రాణం పోవడానికి కారణమైన వారిని కాపాడటం సిగ్గుచేటు
ఢిల్లీలో రాహుల్ గాంధీ, సామాజిక న్యాయం’ అని క్లాసులు చెప్తారు. కానీ.. తెలంగాణలో ఆయన పార్టీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే వెనుకబడిన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. గుడికి వెళ్తే దాడులా? ఇదేనా మీ ప్రజా పాలన.. రేవంత్ రెడ్డి నిందితులను వదిలేస్తారు… ప్రశ్నించే నాయకులను అరెస్ట్ చేస్తారు! నాగర్ కర్నూల్ ఘటనపై గళం ఎత్తినందుకు నాయకులపై ఆంక్షలు విధించడం సబబు కాదన్నారు. పాప మృతికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

హైకోర్టు కు కృతజ్ఞతలు టీయూజేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు పెండ్యాల సుమన్…

హైకోర్టు కు కృతజ్ఞతలు టీయూజేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు పెండ్యాల సుమన్

పరకాల,నేటిధాత్రి

 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అర్హుడైన ప్రతి ఉద్యమ కారునికి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ప్రకటించిన ఇంటి స్థలాలను ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (టియూజేఏసీ) ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పెండ్యాల సుమన్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై కేసులుఉండి జైలు పాలైన ఉద్యమకారులకి మొదటి ప్రాధాన్యత గా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారికి రెండవ ప్రాధాన్యత గా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సోమవారం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు,పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా హామీల అమలుకు 8 వారాలు సమయమిచ్చిన హైకోర్టు అందుకు ఉద్యమకారులు హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు,పెన్షన్లు మంజూరు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫ్రీడం ఫైటర్ శాఖ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఉద్యమ జేఏసీ నాయకులు దీనిపై విచారణ జరిపి అర్హులైన ఉద్యమకారులకు 8 వారాల్లోగా హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు
ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా టీయూజేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలలో అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని సుమన్ కోరారు.

కౌన్సిలర్ ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…

కౌన్సిలర్ ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 26వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థి మండల శ్రీదేవి శ్రీనివాస్ గెలుపొందారు.కాగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలవగా కౌన్సిలర్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డు ప్రజలు చూపించిన అభిమానం బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సహకరించిన పార్టీ ఇంచార్జ్ గటిగా అజయ్ కుమార్, స్థానిక నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయుడి రవీందర్ రెడ్డి,మునిగాల వెంకట్ రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్ రావు, పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి వేనుముద్దుల శ్రీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి ప్రసాద్,కడారి కుమారస్వామి,పులిగిల్ల యాదగిరి,సంపంగి సాలయ్య, శ్రీను నాయకులు పాల్గొన్నారు.

డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్దించి తాగునీటి సమస్య తీరుస్తా…

డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్దించి తాగునీటి సమస్య తీరుస్తా

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్ధరణ చేపట్టి ప్రజల తాగునీటి సమస్య తీరుస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్థానిక క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇటీవలే డీఫ్లోరేడ్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రస్తావించడం ప్రాజెక్టును పునరుద్దించేందుకు కావాల్సిన నిధులు సుమారు రూ. 12 కోట్ల నుండి 25 కోట్ల వరకు నిధులు అవసరం కాగా నిధులు మంజూరు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని అవి త్వరలోనే నిధులను మంజూరు చేయించి ప్రాజెక్టును పునరుద్దించి నర్సంపేట తాగునీటి సమస్య తీరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రాజెక్టు కేటాయించిన భూమి అక్రమానికి గురికాకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు.ప్రాజెక్ట్ నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు దూ సముద్రం చెరువు నుండి, అదే విధంగా ఎగువన ఫారెస్ట్ లో కురిసే వర్షపు నీటిని కాలువల ద్వారా నీటిని ప్రాజెక్టు చేర్చి నీటి సామర్థ్యం పెంచి నిత్యం నర్సంపేట ప్రజలకు నీరు అందించేందుకు త్వరలోనే చర్యలు చేపడతానని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం చేస్తాం అంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు…

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం చేస్తాం అంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసుకున్న ఏ హోటల్లో మాట్లాడుకునే మాట రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవడం లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు భూములు అమ్మకాలు గానీ కొనుగోలు కానీ జరగడంలేదని తెలంగాణ రాష్ట్రంలోనే ఏ మూలాన అడిగినా చెప్పే మొదటి మాట రియల్ ఎస్టేట్ శూన్యమైందని ప్రతి గ్రామలో ఏ చాయి హోటల్లో అడిగిన ఇదేచర్చ మొదలైంది రాబోయే రోజుల్లో తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఉద్యమాన్ని తెరలేపి రాష్ట్ర నలుమూలల వాడి వేడి చర్చను ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని తెలంగాణ రియల్ ఎస్టేట్ సంగం ప్రవీణ్ గౌడ్ గారు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో దువ్వడలు పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారని ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తుందని రియల్ ఎస్టేట్ నడిస్తేనే ప్రతి ఒక్క వ్యాపారం నడుస్తుంది బంగారం కొనాలన్నా రియల్ ఎస్టేట్ నడవాలి షాపింగ్ మాల్స్ ట్రావెల్ ఏజెన్సీస్ రెస్టారెంట్స్ జర్నలిస్ట్ స్టోర్స్ ప్రైవేట్ స్కూల్స్ ఫర్టిలైజర్స్ ఇలా అనేక వ్యాపారస్తులు జీవితాలు రియల్ ఎస్టేట్ మీద నడుస్తున్నాయి అలాంటి రియల్ ఎస్టేట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఈ ప్రభుత్వం పైన లక్షలాది వ్యాపారస్తులు తిరగబడే సమయం దగ్గర్లోనే ఉందని హెచ్చరిస్తున్న తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంగం ప్రవీణ్ గౌడ్ అనేక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు

నూతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లును సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు…

నూతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లును సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు

◆-: డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఫిబ్రవరి23:పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి నివాసంలో సోమవారం నూతనంగా ఎన్నికైన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లుకు శాలువాతో సన్మానించి వారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.వారు మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యునూస్,వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,జాఫర్,అరుణ్ కుమార్, జమిలుద్దిన్,జావిద్,జహంగీర్,అక్రం,నిజాం,అక్కాన్,ఖదీర్ మరియు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,నర్సింహా యాదవ్,బర్కత్,ముస్తఫా మరియు తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన మాజీ చైర్మన్…

ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

స్వర్గీయ మాజీ మంత్రివర్యులు మొహమ్మద్ ఫరీదోద్దీన్ గారి నివాసంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జహీరాబాద్ మునిసిపల్ చైర్మన్ మొహమ్మద్ యూనుస్ మాజీ మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాష్ కౌన్సిలర్లు జహంగీర్ అక్రమ్ అతిక్ అక్కని రంగ అరుణ్ కుమార్ మొహమ్మద్ జమీల్ మొహమ్మద్ నిజాం నాయకులు మొహమ్మద్ కుతుబుద్దీన్ మొహమ్మద్ తాజుద్దీన్ శ్రీకాంత్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సతీష్ సెట్ డాక్టర్ నసీర్ బిజీ సందీప్ బాల్రెడ్డి మొహమ్మద్ షాహిబ్ మొహమ్మద్ మోయిన్ ముదస్సిర్ తదితరులు ఉన్నారు,

న్యాల్ కల్ మండల అభివృద్ధికి ఎంపి పెద్దపీట….

న్యాల్ కల్ మండల అభివృద్ధికి ఎంపి పెద్దపీట….

◆-: రూ:50 లక్షలను మంజూరు చేసిన షెట్కార్

◆-: మంత్రి చొరవతో న్యాల్ కల్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి రూ;15 లక్షలు

◆-: కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ న్యాల్ కల్ మండల అభ్యున్నతికి మరో మారు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, మండలానికి తాజాగా రూ:50 లక్షలను మంజూరు చేయడం జరిగిందని, న్యాల్ కల్ లోని ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ కృషితో రూ:15 లక్షలు మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి భాస్కర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలు తెలిపారు. 2025 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరైన నిధులతో.. మండలంలోని ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు, వీధి దీపాల ఏర్పాట్లు, బోరు బావులు, తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు త్వరలోనే పనులను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. మండల పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే పనులను ప్రారంభించినట్లు తెలిపారు. మండలానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రూ:65 లక్షలను మంజూరు చేయడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్, మండల సహకార సంఘాల తాజా మాజీ చైర్మన్లు సిద్ది లింగయ్య స్వామి, జగన్నాథ్ రెడ్డి, మండలంలోని పలువురు తాజా సర్పంచులు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

error: Content is protected !!
Exit mobile version