గ్రామాభివృద్ధిలో సర్పంచుల కీలక పాత్ర: కలెక్టరు సందేశం

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

◆-: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.

జహీరాబాద్ నేటి ధాత్రి: 

గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.గురువారం సంగారెడ్డి పట్టణంలోని దుర్గాబాయి దేశముఖి మహిళా శిశు వికాస కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల మొదటి బ్యాచ్ ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలకు మంచి జరగాలంటే సర్పంచులు పంచాయతీ రాజ్ చట్టం–2018పై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆరు బ్యాచులుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణలో గ్రామ పంచాయతీల పనుల నిర్వహణ, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను సర్పంచులు సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డి పి ఓ జానకి రెడ్డి , డీఎల్పీఓలు అనిత, అమృత, సంజీవరావు, పంచాయతీరాజ్ అధికారులు, సర్పంచులు, సిబ్బంది ఝరాసంగం మండలం నుండి బొరేగౌ సర్పంచ్ నాగేందర్ పాటిల్, జీర్లపల్లి సర్పంచ్ అమరేశ్వరి, బర్థిపూర్ సర్పంచ్ రాజు, బిడకన్నే సర్పంచ్ రవి, పలు గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు..

సమాజానికి మంచి సందేశాన్ని అందించిన లఘు చిత్రం…

* సమాజానికి మంచి సందేశాన్ని అందించిన లఘు చిత్రం

-అద్భుతంగా నటించి.. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చిన రమేష్ ను శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న మిట్టపల్లి బృందం

-నేనే సర్పంచ్ లఘు చిత్రం డైరెక్టర్ ను అభినందిస్తున్న పాటల రచయితలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

సమాజంలో ప్రస్తుతం సర్పంచ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది..ఏ విధంగా ఉండాలనేది ప్రజలకు చూపించాలనే లఘు చిత్రమే నేనే సర్పంచ్ ఈ చిత్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన క్యాతరాజు రమేష్ నటించి..సమాజానికి మంచి సందేశాన్ని అందించడంతో..మిట్టపల్లి మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు పుల్ల సతీష్ కుమార్ మంగళవారం మొగుళ్లపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన గల శ్రీ సమ్మక్క-సారలమ్మ దేవాలయ ప్రాంగణంలో క్యాతరాజు రమేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ప్రజల ఓటు విలువను ప్రజలకు తెలియజేస్తూ..ప్రజలకు సర్పంచ్ ఏ విధంగా పనులు చేయాలి..ప్రజలు ఏ విధంగా సర్పంచ్ తో పనులు చేయించుకోవాలి. ప్రజలకు అధికారులు ఏ విధంగా జవాబుదారితనంగా ఉండాలో పూసగుచ్చినట్లు ఈ లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మంగళపల్లి సుదర్శన్ ను అభినందిస్తూ..ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. పలువురి ప్రశంసలు పొందిన నేనే సర్పంచ్ అనే లఘు చిత్రంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా లఘు చిత్రాలు మరెన్నో తీయాలని మంగళపల్లి సుదర్శన్ ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటల రచయితలు కల్లపెల్లి సతీష్, శ్రీపతి రాము, గాయకులు కాసర్ల రాజేష్, డప్పు సత్తి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version