అప్పుల బాధతో పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి…

అప్పుల బాధతో పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి

పరకాల,నేటిధాత్రి

 

 

 

 

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన రాసమళ్ళ సురేష్ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పురుగుల మందు సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.బుధవారం ఆర్థిక సమస్యలతో మానసికంగా తీవ్రంగా కలత చెందిన సురేష్ పురుగుల మందు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా,వైద్యులు చికిత్స అందించినప్పటికీ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు.సురేష్ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇదిలా ఉండగా,తన మరణానంతరం కళ్లను దానం చేయాలని సురేష్ ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలిసింది.కుటుంబ సభ్యులు ఆయన చివరి కోరికను గౌరవిస్తూ కంటి దానం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు ధ్వంసమైంది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు ధ్వంసమైంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం పరిధిలోని హుగ్గెల్లి తండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇల్లు ధ్వంసమైన ఘటన జరిగింది. బాధితుడు చెప్పిన దాని ప్రకారం.. గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలిపోయింది. ఇంటి సమీపంలో దానిని గమనించిన వారు వెంటనే గ్రామ పంచాయతీలోని సర్పంచ్‌కు తెలియజేశారు. దీంతో అతను వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ శాఖలకు సమాచారం అందించాడు. అధికారులతో పాటు గ్రామస్థులు కూడా మంటలను అదుపులోకి తీసుకురావడంలో సహాయపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ, నగదు రూ.4,50,000 నిత్యావసర వస్తువులు, భూమి పాస్‌బుక్ పూర్తిగా కాలిపోయాయి. దీంతో కృష్ణుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్పందించిన గ్రామ సర్పంచ్, తాను వెంటనే నిత్యావసర వస్తువులను ఏర్పాటు చేస్తానని చెప్పారు.

గుండె పోటుతో యువ రైతు మృతి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువ రైతు గుండెపోటుతో మృతి…

గుండె పోటుతో యువ రైతు మృతి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువ రైతు గుండెపోటుతో మృతి

జమ్మికుంట ( నేటి ధాత్రి)

జమ్మికుంట మండలం జగ్గయ్య పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్య పల్లి గ్రామానికి చెందిన గుజ్జ గోపాలరావు (45) అనే రైతు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పొలంలో నీటి పరిశీలిస్తున్న క్రమంలో గుండెపోటు కు గురయ్యాడు. పొలంలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version