బోరు మోటర్ రిపేరు చేయించిన సర్పంచ్….

బోరు మోటర్ రిపేరు చేయించిన సర్పంచ్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో బోరు మోటర్ రిపేర్ చేయడం జరిగింది. సందర్భంగా మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ. వచ్చే వేసవి కాలంలో తాగు నీటి సమస్య రాకుండా ఉండడానికి ఈరోజు మండే పల్లి గ్రామంలోని న్యూ ఎస్సీ కాలనీలో అంగన్వాడి సెంటర్ దగ్గర చేతి బోరు రిపేరు చేయించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విలలో గ్రామపంచాయతీ పాలకవర్గం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తున్నాయి ఏమైనా సమస్యలు ఉంటే గ్రామంలో పాలకవర్గ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచి గాధగోని సాగర్ ఉపసర్పంచ్. యాస మధు. కారోబార్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మార్వో

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న తంగళ్ళపల్లి ఎమ్మార్వో….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో జరుగుతున్న జాతరకు విచ్చేసి న ఎమ్మార్వో అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం జరుగుతున్న సందర్భంగా స్థానిక తంగళ్ళపల్లి ఎమ్మార్వో విజయ ప్రకాష్ రావు గారిని సమ్మక్క సారాలమ్మ జాతరకు రావాలని ప్రత్యేకంగాఆలయ కమిటీ సభ్యుల గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో గారిని ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు స్థానిక తంగళ్ళపల్లి ఎమ్మార్వో సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మండపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు మాజీ జెడ్పిటిసి కుటుంబానికి ఆహ్వానం

మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించిన ఆలయ కమిటీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాద స్వీకరించి అమ్మ వార్లను దర్శించుకోవాల్సిందిగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ .కడారిరామ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆహ్వానించారు. ఇ o దుకుగాను మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి తప్పకుండా కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని. అది మా అదృష్టంగా భావించి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లను. పాలకవర్గాన్ని అలాగే ఆలయ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ .కడారి రామ్ రెడ్డి. స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్. జిల్లా .కాంగ్రెస్ ఫిషరీఫ్.ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. మాజీ జెడ్పిటిసి పూర్మాని .మంజుల లింగారెడ్డి. తదితరులు పాల్గొన్నారు

మండపల్లిలో ఘనంగా కాట్రేగుల సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కాట్రేగుల పలు కార్యక్రమాల సంబరాలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామంలో రాముల వారి గుట్ట వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మండేపల్లి సర్పంచ్ గాధగోని సాగర్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా కాట్రేగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గ్రామంలోని రాములవారి గుట్ట వద్ద రైతులు పశువులను దైవంగా భావించి పూజించి అంతరించిపోతున్న సాంస్కృతిక సంప్రదాయాలను పునరుద్ధరించే సందర్భంలో పశువులకు .జాజు.నూనె రాసి కాట్రేగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ శీతాకాలంలో పశువులకు వచ్చే గాలి కుట్టు వంటి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని మంటల వేడి మరియు పొగ పశువుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని రైతులు నమ్ముతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో రాముల వారి గుట్ట వద్ద పెద్ద ఎత్తున సంక్రాంతి పురస్కరించుకొని సంబరాలు జరుపుకున్నారని అలాగే గ్రామంలో మకర సంక్రాంతి పురస్కరించుకొని. M.P.L. క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్న సందర్భంగా క్రికెట్ టీం లకు లక్కీ ఈవెంట్స్.. టాటా. AIG. హెల్త్ ఇన్సూరెన్స్ వారు క్రికెట్ టీం సభ్యులకు .టీషర్ట్లు అందించడం జరిగింది. దీనికి సూపర్ అసిస్టెంట్ గుర్రం నవీన్ టీ షర్ట్లు అందించడం జరిగింది ఇట్టి.సంక్రాత్రి సంబరాలకు గ్రామంలోని యువత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఉప సర్పంచ్ యాస సందీప్. వార్డు మెంబర్లు. అమర గోoడప్రభుదాస్. మూర్తి .మైపాల్రెడ్డి. రాయి పెళ్లి కృష్ణారెడ్డి. ఆసాని మహిపాల్ రెడ్డి..కరోబార్ దుర్మట్లలచ్చిరెడ్డి. హరికృష్ణ. కోమ్మటదేవయ్య. దాసరి దేవయ్య. కుల మల్లేశం. రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మండపల్లిలో సంక్రాంతి క్రికెట్ పోటీలు

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని.మండేపల్లిలో క్రికెట్ పోటీలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్ ముఖ్య అతిథిగా హాజరై సంక్రాంతి పండుగ పురస్కరించుకుని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలువురు యువత నాయకులు మాట్లాడుతూ. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నా ఎందరో వచ్చి పోతున్న కూడా గ్రామంలో యువతకు క్రీడా ప్రాగణం లేకపోవడంతో యువత గ్రామంలో క్రీడలు ఆడుకోవడానికి స్థలం లేకపోవడంతో ఈ పాలకవర్గమైన గ్రామ పరిసరాల్లో యువతకు అనుకూలంగా క్రీడలకు స్థలం కేటాయించవలసిందిగా దాని ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి ఒక మినీ స్టేడియం నిర్మించాలని గ్రామంలోని ప్రతి ఒక్కరు యువత ప్రజలు నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గాన్ని కోరడం జరిగిందని దీనిపై స్పందించిన సర్పంచ్ సాగర్ సాధ్యమైనంత త్వరలో క్రీడా ప్రాగానం నిర్మాణం చేపట్టే విధంగా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి యువతకు ఆటలు ఆడుకునే విధంగా ప్రాగణం ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా యువతకు గ్రామ ప్రజలకు యువకులకు నాయకులకు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని తదనంతరం క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగిందని ఇట్టి పోటీలలో గెలుపొందిన జట్లకు తగిన పారితోషకం బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ యువత క్రీడాకారులు క్రికెట్ కు సంబంధించిన పలు గ్రామాల జట్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నట్టల నివారణ మందుల పంపిణీ…

నట్టల నివారణ మందుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గాధగోనిసాగర్ ఆధ్వర్యంలో నట్లల మందుల నివారణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామం మేకలకు గొర్లకఎలాంటి అనారోగ్యలకుగురికాకుండా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మందుల పంపిణీ వలన కురుమ సభ్యులు రైతులు. వారు గొర్లకుమేకలకు గ్రామంలో మందులు పంపిణీ చేయడంతో గ్రామంలోని రైతులు గొల్ల కురుమ సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇట్టి నివారణకు మందులు పంపిణీ చేయు కార్యక్రమంచేపట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ వెటర్నరీ అధికారులకు వైద్య సిబ్బందికిరైతులుగొల్లకురుమ సంఘాల వారు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వెటర్నరీ ఆఫీసర్ మౌనిక. సిబ్బంది. రాజు. మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోనిసాగర్. కాంగ్రెస్ పార్టీగ్రామశాఖ అధ్యక్షుడు ఆసాని మహిపాల్ రెడ్డి. వ్యాసరాజేషoకడారి ప్రతాపరెడ్డి. సింగం శశికుమార్. గొల్ల కురుమ సంఘం ప్రెసిడెంట్అమరగుండయ్య. ప్రధాన కార్యదర్శి ఒగ్గు దేవయ్య. బండిబీరయ్య. మేకల కుంటయ్య.అమర గో o డా ప్రభుదాస్.బోడపట్ల బాలయ్య.జగ్గాని మల్లేశం. పరశురాం. రాము. రాజయ్య ప్రశాంత్. శ్రీకాంత్. కృష్ణ బాబు. కృష్ణ పరశురాం తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version