ప్రశాంతంగా ఇంటర్ వార్షిక పరీక్షలు…

ప్రశాంతంగా ఇంటర్ వార్షిక పరీక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్,ఇంటర్ వార్షిక పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా కొనసాగాయి. న్యాల్ కల్, హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. పరీక్షల పర్యవేక్షణాధికారులు వెంకన్న, యాదగిరిల పర్యవేక్షణ, ఎస్సై సుజిత్, పోలీస్ బృందం గట్టి భద్రతల మధ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. తొలిరోజు 586 విద్యార్థునులకు గాను 565 గురు విద్యార్థునులు హాజరవ్వగా 21 గురు విద్యార్థునులు పరీక్షలకు గైర్హాజరయ్యారని

సేవలందించిన కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు

సేవలందించిన కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు
నగదు బహుమతి అందించిన జిల్లా ఎస్పీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని విధి నిర్వహణలో అప్రమత్తతతో అమూల్యమైన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్‌లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించి వారికి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
ఇటీవల వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ (CPR) నిర్వహించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ గంగరాజును, అలాగే సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని ధైర్యసాహసాలతో రక్షించిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్‌లను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రాణాపాయం లెక్కచేయకుండా సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణరక్షణ చేసినందుకు వారికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేసి సత్కరించారు.ప్రజల ప్రాణరక్షణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని, ఇదే సేవాభావంతో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. అంతేకాకుండా జిల్లా పోలీస్ వారు కూడా అభినందించారు.

సూర్య భగవాన సేవ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

సూర్య భగవాన సేవ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

గురువారం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించిన సూర్య భగవాన వాహన సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు నుండి కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
అనంతరం ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన వాసవి ఆర్య వైశ్య నిత్యాన్న సత్రంను ప్రారంభించి భక్తులకు అన్నదానం సేవలు ప్రారంభించారు.
తదుపరి రాయపల్లి గ్రామంలో బత్తిన అనిత కి చెందిన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు మండల అధ్యక్షులు ఈప్పకాయల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ….

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గ్రామ మామిడ్గి స్వయం పాలన దినోత్సవం – ఘనంగా, విజయవంతంగా నిర్వహణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మామిడ్గిలో ఈ రోజు “స్వయం పాలన దినోత్సవం”ను ఎంతో ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను స్వీకరించి తరగతులను నిర్వహిస్తూ తమ నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం మరియు క్రమశిక్షణను ప్రతిభావంతంగా ప్రదర్శించారు.

కార్యక్రమం ఉదయం ప్రార్థనతో ప్రారంభమై, విద్యార్థుల సమన్వయంతో సజావుగా కొనసాగింది. విద్యార్థి-ఉపాధ్యాయులు వివిధ తరగతుల్లో పాఠాలను బోధిస్తూ పాఠశాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలి స్థానాన్ని ఒక విద్యార్థి స్వీకరించి పాఠశాల కార్యకలాపాలను సమర్థవంతంగా సమన్వయం చేయడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు కలెక్టర్, డీఈవో, ఎంఈవో పాత్రలను స్వీకరించి తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి చంద్రకళ గారు మాట్లాడుతూ, “స్వయం పాలన దినోత్సవం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తులో నాయకులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది” అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కృషిని, సమర్పణను అభినందిస్తూ వారి భవిష్యత్తు విజయాల కోసం ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొహమ్మద్ సమియుద్దిన్, గోవిందు, బాలకృష్ణ, దేవరకొండ నాన్సీ, కృష్ణ, రాజేశం, కృష్ణవేణి, రష్మీ తదితరులు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు. విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.స్వయం పాలన దినోత్సవం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన, మరిచిపోలేని అనుభవంగా నిలిచింది.

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ….

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గ్రామ మామిడ్గి స్వయం పాలన దినోత్సవం – ఘనంగా, విజయవంతంగా నిర్వహణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మామిడ్గిలో ఈ రోజు “స్వయం పాలన దినోత్సవం”ను ఎంతో ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను స్వీకరించి తరగతులను నిర్వహిస్తూ తమ నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం మరియు క్రమశిక్షణను ప్రతిభావంతంగా ప్రదర్శించారు.
కార్యక్రమం ఉదయం ప్రార్థనతో ప్రారంభమై, విద్యార్థుల సమన్వయంతో సజావుగా కొనసాగింది. విద్యార్థి-ఉపాధ్యాయులు వివిధ తరగతుల్లో పాఠాలను బోధిస్తూ పాఠశాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలి స్థానాన్ని ఒక విద్యార్థి స్వీకరించి పాఠశాల కార్యకలాపాలను సమర్థవంతంగా సమన్వయం చేయడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు కలెక్టర్, డీఈవో, ఎంఈవో పాత్రలను స్వీకరించి తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి చంద్రకళ గారు మాట్లాడుతూ, “స్వయం పాలన దినోత్సవం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తులో నాయకులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది” అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కృషిని, సమర్పణను అభినందిస్తూ వారి భవిష్యత్తు విజయాల కోసం ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొహమ్మద్ సమియుద్దిన్, గోవిందు, బాలకృష్ణ, దేవరకొండ నాన్సీ, కృష్ణ, రాజేశం, కృష్ణవేణి, రష్మీ తదితరులు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు. విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.స్వయం పాలన దినోత్సవం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన, మరిచిపోలేని అనుభవంగా నిలిచింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అమర వీరుడు సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ 16వ వర్ధంతి ఘన నివాళులు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అమర వీరుడు సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ 16వ వర్ధంతి ఘన నివాళులు.*

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గము, జహీరాబాద్ మండలం, హోతి (బి) గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జహీరాబాద్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ అమర వీరుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన జహీరాబాద్ ముద్దుబిడ్డ సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ 16వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్. పెద్దగొల్ల నారాయణ హాజరై అమర వీరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధన కోసం సామాజిక న్యాయం దిశగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల హక్కుల పరిరక్షణలో ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. రెండు సార్లు ప్రభుత్వాలు మారినప్పటికీ అమర వీరులు సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ , మరియు న్యాలకల్ మండలం బసంత్‌పూర్ గ్రామానికి చెందిన ఈశాన్ రెడ్డి ల స్ఫూర్తి విగ్రహాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను స్మరించుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. ప్రస్తుతం ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్న అమరుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కొండపురం నర్సిములు అన్నారు. హోతి (బి) గ్రామంలో సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ విగ్రహం, అలాగే బసంత్‌పూర్ గ్రామంలో ఈశాన్ రెడ్డి ల విగ్రహం ఏర్పాటు చేసి, ప్రభుత్వం అధికారికంగా గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షులు కొండపురం నర్సింలు ,ప్రధాన కార్యదర్శి శంకర్ సాగర్, విశ్వనాథ్ యాదవ్,మదినం శివ ప్రసాద్, వడ్డే శేఖర్, బీసీ మైనారిటీ లీడర్ మొహమ్మద్ ఇమ్రాన్, చెన్న బసవ, సంగారెడ్డి , బాలకృష్ణ, దశరథ్ ప్యార్లా, రాజ్ తుముకుంట, రాజీవ్ కుమార్, విజయ్ కుమార్, గొల్ల నర్సింలు ,తదితరులు పాల్గొని అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరానికి ప్రతీక…

ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరానికి ప్రతీక

3వ వార్డ్ కౌన్సిలర్ ఎర్రవెల్లి అరుణ్ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరానికి ప్రతీక అని భూపాలపల్లి మున్సిపాలిటీ 3వ వార్డ్ కౌన్సిలర్ ఎర్రవెల్లి అరుణ్ రావు అన్నారు సి.ఆర్ నగర్ బాంబుల గడ్డ హనుమాన్ నగర్ కాలనీలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునేందుకు బుధవారం12 ఇందిరమ్మా ఇళ్లకు ముగ్గు పోయడం జరిగింది.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎర్రవెల్లి అరుణ్ రావు మాట్లాడుతూ పేదలకు సొంతిల్లు ఉండాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అదేవిదంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎంతో కృషి చేస్తున్నారని వారు అరుణ్ రావు అన్నారు.అదేవిధంగా గతంలో 15 ఇల్లు రాగా 12 ఇల్లు ప్లాస్టింగ్ కంప్లీట్ అయినయ్ కాగా ఇంకా 18 ఇండ్లు ముగ్గు పోయాల్సి ఉంది అని అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంకు ఇందిరమ్మ ఇల్లు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, తుమ్మల నాగేశ్వరావుకి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్,మోటo శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల నైపుణ్యాల మెరుగుదలకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం…

ఉపాధ్యాయుల నైపుణ్యాల మెరుగుదలకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ జెడ్పీహెచ్ఎస్లో మండల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు రాజ్కుమార్ గురువారం మాట్లాడుతూ ఈ సమావేశాలు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఆధునిక బోధనా విధానాలు, విద్యార్థి కేంద్రిత బోధన, ఫలితాలు పెంచే పద్ధతులపై చర్చించారు. ఉపాధ్యాయులు ఇక్కడ నేర్చుకున్న నూతన పద్ధతులను తరగతి గదుల్లో అమలు చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు వార్షిక విద్యా ప్రణాళిక, బోధనలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

శక్తిగల సువార్త స్వస్థత పండుగలు: భక్తితో ఆధ్యాత్మిక ఉత్సాహం…

శక్తిగల సువార్త స్వస్థత పండుగలు: భక్తితో ఆధ్యాత్మిక ఉత్సాహం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో ఎంయుఎం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎం. అనిల్ కుమార్ నిర్వహించిన ‘శక్తిగల సువార్త స్వస్థత పండుగలు’ రెండు రోజుల పాటు భక్తి, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరిగాయి. ఈ ప్రత్యేక సభలకు గ్రామంతో పాటు సమీప ప్రాంతాల నుంచి క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రవచకుడు రెవ. గెరాల్డ్ జెర్రీ రౌస్, యేసు క్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, సేవా తత్వాన్ని వివరించి విశ్వాసులను ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం కీర్తనలు, ఆరాధన గీతాలు, ప్రత్యేక ప్రార్థనలతో భక్తులను ఆకట్టుకుంది. ఫాస్టర్లు ప్రసాద్, వినయ్, సామిల్, కోర్నేల్ తదితరులు ప్రార్థనలు

బలవుతున్న బాల్యం……

బలవుతున్న బాల్యం……

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి. 21వ శతాబ్దంలోనూ ఈ సమస్య ఇంకా అంతం కావడం లేదు. ఎందరో బాలల భవిష్యత్ను చిదిమేస్తున్న కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేస్తూనే ఉంది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా నేటి తరంలో బాలకార్మిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం..

21 కోట్ల మంది..

కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు. కొన్నిదేశాల్లో 17 ఏళ్లలోపు బాలల్ని కూడా కార్మికులుగానే భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్ల మంది బాల కార్మికులుగా కొనసాగుతున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా. పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారు.

కారణాలు..

పిల్లల తల్లిదండ్రుల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యతల కారణంగానే బాలకార్మికులు పెరిగిపోతున్నారు. కనీస అవసరాలకు సరిపడా ఆదాయం దొరకని అనేక కుటుంబాలు తమ పిల్లల్ని పనుల్లో చేర్పిస్తున్నాయి. ప్రపంచంలో పావుశాతం జనాభా కఠిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఆఫ్రికా, అసియా, లాటిన్ అమెరికాల్లో పేదరికం కారణంగా పిల్లలు కార్మికులుగా మారాల్సి వస్తోంది. కొన్ని దేశాల్లో పిల్లలు విద్యనభ్యసించేందుకు అనువైన వసతులు లేకపోవడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు ఉచిత విద్య అందించకపోవడం, ప్రైవేటు విద్య ఖరీదు కావడంతో బాలలు చదువుకు దూరమై కార్మికులుగా పని చేస్తున్నారు. వెట్టిచాకిరి, సామాజిక అంశాలు సైతం ఇంద 个 కారణమవుతున్నాయి. ఇక కొందరు పిల్లలు వంశపారంపర్యంగా వస్తున్న పనుల్లోనే కొనసాగుతున్నారు.

బాల్యం ఛిద్రం..

బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వీరిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్ధ్యానికి మించిన పనుల్ని చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్థితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి.

భవిష్యత్ అంధకారం..

బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్లో ఉన్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీరికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం సమాజంలో అన్నిరకాలుగా నిండిన వెనుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యలేమి వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారు. ఇందుకు వ్యవస్థనే తప్పుబట్టాల్సి ఉంటుంది.

నిర్మూలనకు మార్గం..

బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలి. దీనికి అనుగుణమైన చట్టాలు రూపొందించాలి. బాలలతో పని చేయించుకునే యజమానులకు కఠిన శిక్షలు విధించాలి. బాలలందరికీ విద్య, పోషకాహారం అందేందుకు కృషి చేయాలి. ఈ పరిస్థితికి కారణమైన వ్యవస్థల్లో మార్పు తీసుకురావడం ద్వారానే ఇది సాధ్యం. పిల్లల్ని పనులు మాన్పించి, బడులలో చేర్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. వారి తల్లిదండ్రులు ఆర్థికంగా ఎదిగేందుకు సరైన అవకాశాల్ని కల్పించడం ద్వారా బాల కార్మికులు లేకుండా చూడొచ్చు. ఇలాంటి పిల్లలు చదువుకునేందుకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉచిత విద్య, భోజనం అందిచాలి. తల్లిదండ్రుల సంరక్షణ లేని వారికి ప్రత్యేక రక్షణ, వసతులు కల్పించాలి.

మన దేశంలో..

ప్రపంచంలో ఎక్కువ మంది బాలకార్మికులు ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. మన దేశంలో దాదాపు కోటి వరకు బాల కార్మికులు ఉన్నట్లు అంచనా. ఈ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం కఠినమైన చట్టాల్ని అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించలేకపోతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు అమలవుతోంది. దీనిలో భాగంగా పనుల్లో మగ్గుతున్న బాలల్ని గుర్తించి, వారికి సరైన ఆవాసం కల్పించి, విద్య అందిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యాహక్కు చట్టం సత్ఫలితాల్నిస్తోంది. ఏ కారణం చేతనైనా బాలలు బడి బయట ఉండరాదని, ప్రతి ఒక్కరికి నిర్బంధ ప్రాథమిక విద్య అందాలని ఈ చట్టం చెబుతోంది. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లల్ని పనుల్లో పెట్టుకోకూడదు. దీన్ని అతిక్రమించిన వారికి జైలు శిక్షలతోపాటు జరిమానాలు విధిస్తారు.

యునిసెఫ్ కృషి..

అంతర్జాతీయంగా బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న యునిసెఫ్ సంస్థ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు యత్నిస్తోంది. వివిధ దేశాలతో కలిసి ఈ సమస్య నివారణ కోసం చట్టాలు రూపొందించింది. 15 ఏళ్లలోపు పిల్లల్ని ఎక్కడా పనుల్లో చేర్చుకోకూడదని, 18 ఏళ్లలోపు 个 వారిని కఠినమైన పనులకు వినియోగించకూడదని యు నిబంధనలు చెబుతున్నాయి. పిల్లలందరికీ కచ్చితంగా విద్య అందేలా చూస్తోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అవసరమైన చట్టాలను రూపొందించడంలో, ప్రాథమిక విద్య అందించడంలో యునిసెఫ్ కీలకపాత్ర పోషిస్తోంది.

మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంతో డివైడర్ను ఢీకొట్టాడు, గాయాలు…

మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంతో డివైడర్ను ఢీకొట్టాడు, గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల కేంద్రంలో రాత్రి 9:40 గంటలకు సిద్ధి హోటల్ ఎదురుగా 15 ఏళ్ల బాలుడు ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బాలుడికి కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ….

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గ్రామ మామిడ్గి స్వయం పాలన దినోత్సవం – ఘనంగా, విజయవంతంగా నిర్వహణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మామిడ్గిలో ఈ రోజు “స్వయం పాలన దినోత్సవం”ను ఎంతో ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను స్వీకరించి తరగతులను నిర్వహిస్తూ తమ నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం మరియు క్రమశిక్షణను ప్రతిభావంతంగా ప్రదర్శించారు.
కార్యక్రమం ఉదయం ప్రార్థనతో ప్రారంభమై, విద్యార్థుల సమన్వయంతో సజావుగా కొనసాగింది. విద్యార్థి-ఉపాధ్యాయులు వివిధ తరగతుల్లో పాఠాలను బోధిస్తూ పాఠశాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలి స్థానాన్ని ఒక విద్యార్థి స్వీకరించి పాఠశాల కార్యకలాపాలను సమర్థవంతంగా సమన్వయం చేయడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు కలెక్టర్, డీఈవో, ఎంఈవో పాత్రలను స్వీకరించి తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి చంద్రకళ గారు మాట్లాడుతూ, “స్వయం పాలన దినోత్సవం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తులో నాయకులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది” అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కృషిని, సమర్పణను అభినందిస్తూ వారి భవిష్యత్తు విజయాల కోసం ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొహమ్మద్ సమియుద్దిన్, గోవిందు, బాలకృష్ణ, దేవరకొండ నాన్సీ, కృష్ణ, రాజేశం, కృష్ణవేణి, రష్మీ తదితరులు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు. విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.స్వయం పాలన దినోత్సవం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన, మరిచిపోలేని అనుభవంగా నిలిచింది.

పోతన నగర్ కల్వర్టు వివాదం..

పోతన నగర్ కల్వర్టు వివాదం

స్పందించిన పోలీసులు – రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ నగర పరిధిలోని పోతన నగర్‌లో కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ వివాదంపై పోలీస్ శాఖ స్పందించింది. భూ బాధితులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.

మునుపటి రోజున భూ బాధితులు కల్వర్టు విస్తరణ పేరుతో తమ ప్రైవేటు భూమిని అసమానంగా స్వాధీనం చేసుకుంటున్నారని, దళితుల వైపు ఎక్కువగా భూమి తీసుకుని, ఇతరుల వైపు తక్కువగా తీసుకున్నారని ఆరోపిస్తూ టెంటు వేసి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పోలీసులు నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసి, సంబంధిత పత్రాలు పరిశీలించినట్లు సమాచారం. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఇక విజిలెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగి నిర్మాణ పనులపై విచారణ ప్రారంభించారు. కల్వర్టు నిర్మాణం అనుమతులు, ప్రణాళికలు, భూస్వాధీనం విధానం తదితర అంశాలపై పరిశీలన చేపట్టినట్లు తెలిసింది. రెండు వైపులా భూమి తీసుకున్న పరిమాణంపై స్పష్టతకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.

నిర్మాణం జరిగిన ప్రదేశంలోనే ప్రత్యక్షంగా కొలతలు తీసి, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. సంబంధిత శాఖల అధికారులను కూడా వివరణ కోరినట్లు సమాచారం.

భూ బాధితులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇరువైపులా సమానంగా భూమి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికారుల విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.

నైతిక రాజనీతికి ప్రతినిధి తలసాని!

`పార్టీ సిద్ధాంతాలకు పెన్నిధి తలసాని!

`నమ్మిన నాయకుడి కోసం ఎంత దూరమైన వెళ్ళగలిగే సాహసి!

`ఈ తరం రాజకీయాలలో ఆదర్శ వాది తలసాని.

`బీఆరఎస్ లోకి తర్వాత వచ్చినా తలసాని ఒక్కడు ఎంతో నమ్మకస్తుడు!

`అవకాశ వాదులు వచ్చారు.. వెళ్లారు!

`తలసాని ఒక్కడే నిటారుగా నిలబడ్డాడు!

`పార్టీ కష్టకాలంలో నిలబడిన తలసాని అసలైన సైనికుడు.

`ఆ పాత్ర పోషిస్తున్న తలసాని గొప్ప నాయకుడు.

`రాజకీయాలలో అంకిత బావం వున్న నాయకుడు.

`గిట్టని వారు ఎన్ని ఆరోపణలు చేసినా తొనకని నాయకుడు తలసాని.

`ఎలాంటి సమస్యనైనా ఎదుర్కునే దీరుడు.

`పార్టీలో, పాలనలో కెసిఆర్ కు తోడుగా నిలిచిన పాలకుడు.

`పదవుల కోసం వచ్చి పార్టీ ఓడిపోయాక పారిపోయిన వారున్నారు?

`పదవులే పరమార్థంగా స్వార్ధ పరులు వెళ్లి పోయారు.

`కేసీఆర్ ఎంతగానో నమ్మిన వాళ్ళలో కొంత మంది మోసం చేశారు.

`పెద్ద పెద్ద పదవులు పొంది కృతజ్ఞతలు లేకుండా జారుకున్నారు.

`పదవులకన్నా నైతికత నిండిన నాయకుడు తలసాని.

`పెత్తనం లేదని కవిత కూడా తండ్రిని కాదని వెళ్లిపోయారు.

`సామాన్య కార్యకర్తగానే తలసాని పార్టీకి సేవ చేస్తున్నారు.

`కేసీఆర్ పక్కన తలసాని లాంటి నికార్సైన నలుగురు నాయకులుంటే చాలు!

`వచ్చే ఎన్నికలలో బీఆరఎస్ కు తిరుగుండదు!

`బీఆరఎస్ కు ఎదురు నిలిచే దమ్ము ఏ పార్టీకి వుండదు.

 

హైదరాబాద్, నేటిధాత్రి:    

రాజకీయాల్లో నైతికత అనే పదం ఇంకా బతికి వుందంటే అందుకు కొందరు నాయకులు కారణం. అందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నాయకుడు వుండడం తెలంగాణకు గర్వకారణమనే చెప్పాలి. ఎందుకంటే పార్టీకి కష్ట కాలం వున్నప్ప్పుడు అండగా నిలిచిన నాయకులే అసలైన నాయకులు. అసలైన రాజనీతిజ్ఞులు. పార్టీ కోసం ప్రాణం పెట్టేవారు. అంతే కాని అవకాశ వాద రాజకీయాలు చేసేవారు ఇలాంటి నాయకుల కాలి గోరుకు కూడ సరిపోరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆరఎస్‌లో చేరినప్ప్పుడు అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయనను చేర్చుకునే ముందు బీఆరఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేతను కేసీఆర్‌ను కూడా ఎంతో తిట్టిపోశారు. కాని తలసాని రాజకీయం ఏమిటో? ఆయన గుణం ఏమిటో, తలసాని ఎంత నిబద్దత కలిగిన నాయకుడో కేసిఆర్‌కు మాత్రమే తెలుసు. అందుకే ఎన్ని రకాల విమర్శలు ఆనాడు తెలంగాణ వాదుల ముసుగులో వున్న వారు చేశారో తెలుసు. అసలు తెలంగాణ వాది కాని తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను క్యాబినేట్‌లోకి ఎలా తీసుకుంటారు? అంటూ ఫ్రశ్నించారు. కాని అసలు తెలంగాణ ఉద్యమ కారులను అణచి వేయాలని చూసిన వారిని ముఖ్యమంత్రి స్దానంలో కూర్చోబెట్టిన అవకాశవాదులు తెలంగాణ ఉద్యమంలో కూడా వున్నారని నిరూపించుకున్నారు. నిజానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏనాడు తెలంగాణకు వ్యతిరేకం కాదు. తెలంగాణ వద్దని ఆయన ఏనాడు చెప్పలేదు. కాని ఆయన తెలుగుదేశం పార్టీలో వున్నా తెలంగాణ కోసం అంతర్గతంగా ఆయన చేసిన కషి కేసిఆర్‌కు తెలుసు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆహ్వానించారు. మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ ఉత్తరం ఇవ్వడంలో ఆయన చేసిన కషి కూడా వుంది. అయితే నమ్మిన సిద్దాంతం కోసం, నమ్మిన నాయకుడి కోసం ఎంత దూరమైనా తలసాని వెళ్తారు. అందుకే తెలుగుదేశం పార్టీలో వున్నంత కాలం ఆయన ఆ పార్టీ సిద్దాంతాలనే మాట్లాడారు. పార్టీలైన్‌లోనే మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు వ్యతిరేక తెలుగుదేశం నుంచి వచ్చేశారు. ఎందుకంటే తెలంగాణలో ఇక తెలుగుదేశం పార్టీ మనుగడ సాధ్యం కాదన్న సంగతి తలపండిన రాజకీయం చూసిన తలసాని ఆ పార్టీని వదులుకున్నారు. తెలంగాణకు సేవ చేయాలనుకున్నారు. అయినా పార్టీ మారినా ఆయన ఏనాడు పాత నాయకుల మీద కూడా ఏనాడు మాట్లాడలేదు. అవకాశ వాద రాజకీయలు ఏనాడు చేయలేదు. తెలుగుదేశం పార్టీ కష్టకాలం వున్నప్ప్పుడు అండగా నిలిచారు. పదేళ్లపాటు తెలుగుదేశం ప్రతిపక్షంలో వున్నా ఆనాడు తలసాని ఆ పార్టీని వదిలిపెట్టలేదు. అప్ప్పుడే తలసాని తెలుగుదేశం పార్టీని వదిలిపెడితే కాంగ్రెస్‌లో కూడా మంత్రి అయ్యేవారు. కాని అలాంటి రాజకీయాలు ఏనాడు తలసాని చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తప్పని పరిస్దితిల్లో మాత్రమే వచ్చారు. అయితే వచ్చిన నాటి నుంచి ఏనాడు పదవుల కోసం ఆలోచించలేదు. పరపతి కోసం ఆలోచించలేదు. హైదరాబాద్ మీద తనదే పెత్తనం కావాలని కోరుకోలేదు. ఎంత ఎదిగినా ఒదిగి వుండే నాయకుడు తలసాని. తన పరిది ఏమిటో తనకు తెలుసు. తనను నమ్ముకున్నవారికి ఎలా న్యాయం చేయాలో తలసానినికి తెలుసు. రాజకీయ చికాకులు ఏనాడు సష్టించని నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎందుకంటే అవకాశ వాద రాజకీయాల కోసం ఇతర పార్టీ నుంచి వచ్చిన పదవులు పొందిన వారి కన్నా వెయ్యి రెట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ బెస్టు అని చెప్పకతప్పదు. ఎందుకంటే కప్పదాటు రాజకీయాలు చేసిన వారు బీఆరఎస్‌లో చాలా మంది వున్నారు. కేసీఆర్ ఎంత నమ్మకం పెట్టుకున్న నాయకులు కూడా ఆయనను విడిచి వెళ్లారు. బీఆరఎస్ అదికారంలో వున్నప్ప్పుడు కేసీఆర్‌ను వెతుక్కుంటూ వచ్చారు. బీఆరఎస్ అదికారం కోల్పోగానే పార్టీ మారిపోయారు. అవకాశ వాద రాజకీయాలకు తాము ఐకాన్ అనే ముద్ర పడుతుందని తెలిసినా పదవులే ముఖ్యమనుకొని వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక భవిష్యత్తులో బిఆరఎస్‌కు ఎదురలేదు. తిరుగులేదు. అనుకున్నప్ప్పుడు బీఆరఎస్ గూటికి చేరిన అత్యంత సీనియర్ నాయకుల్లో కే. కేశవరావు ఒకరు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తన ప్రాదాన్యం తగ్గుతుందని తెలిసిన తర్వాత బీఆరఎస్‌లో చేరితే రాజ్యసభ ఖాయమని తెలుసుకొని బీఆరఎస్ గూటికి చేరుకున్నారు. వేసుకున్న డ్రెస్సు మడత కూడ చెదరకుండా వున్న నాయకుడు బీఆరఎస్‌లో ఎవరైనా వున్నారంటే అది కే.కేశవరావు. ఆయనను వరుసగా మూడుసార్లు కేసీఆర్ రాజ్యసభకు పంపించారు. ఆయన వుండగా ఎవరికీ అవకాశమివ్వకుండా చూసుకున్నారు. అలాంటి నాయకుడు బీఆరఎస్ ఓడిపోగానే పార్టీ మారిపోయారు. బీఆరఎస్‌లో వున్నప్ప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారుడు, తన కుమార్తె జిహెచఎంసి. చైర్‌పర్సన్, కుమారుడు ఓ కార్పోరేషన్‌కు చైర్మన్ ఇన్ని పోస్టులు తీసుకున్నారు. ఆఖరుకు కేసీఆర్ నమ్మకాన్నే మోసం చేసిపోయారు. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా అదే పనిచేసి వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమ కారుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పక్కన పెట్టి ప్రాదాన్యత కల్పిస్తే ఆయన కూడా ఆఖరుకు పార్టీకష్టకాలంలో వున్నప్ప్పుడు కేసీఆర్‌ను వదిలి వెళ్లిపోయాడు. అవకావ వాద రాజకీయాలకు తానేమీ అతీతుడిని కాదని నిరూపించుకున్నారు. ఇంకా దౌర్భాగ్యమేమిటంటే తన కూతురు కావ్యకు అందర్నీ కాదని కేసీఆర్ లోక్‌సభ టికెట్, బీఫామ్ అందజేసిన తర్వాత పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఎంతో నమ్మకస్తుడిగా సీఎం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిండు అసెంబ్లీలో ఆరోపణలు చేసినట్లే చేసి మరీ అదే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. రాత్రికి రాత్రి కండువా మార్చుకున్నారు. ఇప్ప్పుడు కేసీఆర్‌ను, ఆయన పాలనను తిట్టిపోస్తున్నారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు చేసిన వారు మరెవరూ లేరన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే మాజీ స్పీకర్, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. తెలుగుదేశం పార్టీని వీడి కేవలం పదవులకోసం బీఆరఎస్‌లోచేరి 2014లో బీఆరఎస్ ప్రభుత్వంలో తొలి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు. కేసీఆర్‌ను అపరభగీరదుడు అని పొగిడుతూ పదవులు అనుభవించారు. రండోసారి స్పీకర్‌గా అవకాశం పొందారు. కాని బీఆరఎస్ ఓటమి పాలైన కొద్ది రోజులకే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పుట్టింటికి వచ్చినంత సంబరంగా వుందన్నారు. కేవలం తన కుమారుడు రాజకీయ పదవి కోసం పార్టీ మారారు. ఇక కాంగ్రెస్‌లో ఉన్నత పదవులు పొంది, తెలంగాణ రాగానే కాంగ్రెస్‌ను వీడి బీఆరఎస్‌లో చేరి, రాజ్యసభ సభ్యుడైన నాయకుడు దివంగత డి. శ్రీనివాస్. ఆయన కాంగ్రెస్‌పార్టీ అదికారంలోకి రాగానే కండువా మార్చుకున్నారు. రాజకీయాల్లో ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు అవకాశ వాద రాజకీయాలను వెతుక్కుంటూ వెళ్లారు. ప్రస్తుతం మండలి చైర్మన్‌గా వున్న గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వారు కూడా తన వారసుల కోసం పార్టీ మారిపోయారు. బీఆరఎస్‌లో చేరి పదవులు పొందారు. మండలి చైర్మన్‌గా అవకాశం అందిపుచ్చుకున్నారు. ఒక వేళ మళ్లీ బీఆరఎస్ అదికారంలోకి వచ్చి వుంటే మంత్రి కావాలని కలలు కన్న నాయకుడు. కాని ఇప్ప్పుడు తన కుమారుడి తాత్కాలిక రాజకీయం కోసం పార్టీ మారారు. ఆఖరుకు కేసిఆర్ కన్న కూతురు కూడా బీఆరఎస్‌ను వీడివెళ్లిపోయింది. పార్టీలో వుంటూనే పార్టీని బజారున పడేయాలని చూసింది. దాంతో పార్టీ సస్పెండ్ చేసేలా రాజకీయం చేసి, తనను పార్టీ నుంచి పంపించారని ప్రచారం చేస్తోంది. పైగా బీఆరఎస్ అగ్రనేత కేసీఆర్ పదేళ్ల పాలననే ఆమె తూర్పార పడుతోంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివద్ది కాలేదని చెబుతోంది. ఇలాంటి నాయకులు వున్న ఈ తరుణంలో ఆణిముత్యం లాంటి నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చెప్పక తప్పదు. పదేళ్ల కాలమే, కాదు పార్టీ ఓడిపోయినా బీఆరఎస్‌ను కాదనుకోలేదు. ఆయన పార్టీ మారితే పదవులు అందుకునే అవకాశం వుంది. కాని ఆ పని చేయలేదు. నైతిక రాజకీయాలకు తిలోదకాలు ఇవ్వలేదు. తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఇలాంటి అతి కొద్ది మంది నాయకులు ఇంకా వుండడం వల్లనే ప్రజలు రాజకీయాలను నమ్ముతున్నారు. నాయకులను నమ్మి గెలిపిస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నాయకులే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నారు.

అనాధ అమ్మాయి పెండ్లికి ఆర్థిక సహాయం చేసిన జేకో ఉద్యోగులు..

అనాధ అమ్మాయి పెండ్లికి ఆర్థిక సహాయం చేసిన జేకో ఉద్యోగులు

భూపాలపల్లి నేటిధాత్రి

చెల్పూర్ పాపయ్య పల్లెలోని అనాధ అమ్మాయి
శీలం సంధ్య పెండ్లికి జేకో కెటిపిపి మహిళ ఉద్యోగుల సహకారంతో పెండ్లికి సరిపోయే వంటసామాగ్రి దుప్పట్లు కొంత నగదు చీర సారెలు మేనమామలు పెట్టే విధంగా పెట్టుబోతలు పెట్టడం జరిగింది, నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వాదించారు సహాయం చేసిన జేకో కెటిపిపి మహిళ ఉద్యోగుల ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి తన ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు, మహిళలు ఇలా ఒకటిగా కలిసి సహాయం చేయడం చాల గొప్ప విషయం ఇలాంటి ఆడపడుచులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టండి

గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టండి

పంచాయతీ భవనాలపై పట్టింపేది!

 

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ భవనం పై పట్టిం పు ఏది! కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది అధికా రంలో వచ్చి రెండేళ్లయిన నిర్మాణాలపై అలసత్వం ప్రదర్శిస్తుంది ప్రతి చిన్న గ్రామపంచాయతీ సొంత భవనం ఉండాలని లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధి హామీ నుంచి నిధులు కేటాయించి అనేక భవనాలు నిర్మించింది ఇంకా కొన్ని చోట్ల నిర్మించాలి ఉండగా ప్రభుత్వం మారిన తర్వాత నిధుల పట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది.

ఏండ్లు గడుస్తున్న భవనని ర్మాణం కలగానే!

శాయంపేట మండలంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి మోక్షం ఎప్పుడో అనేది మండల ప్రజలు ఆలోచనలో పడ్డారు గత ప్రభుత్వం నూతన భవనానికి శంకుస్థాపన చేసిన పనులు మొదలు పెట్టకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు అధికారుల మీద ప్రజలు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. మెరుగైన పాలన అందించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభు త్వం ముందుకు వచ్చి భవ నాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలి గత ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నూతన భవన నిర్మాణానికి అవకాశం కల్పించి త్వరగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

నూతన గ్రామపంచా యతీ భవనం నిర్మించండి

శాయంపేట మండల నివాసి కందగట్ల సంతోష్

శాయంపేట మండల కేంద్రంలో నివసిస్తున్న కందగట్ల సంతోష్ మాట్లా డుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గదులు లేక ఆరు బయట సమావేశాలు వస్తువులు భద్రపరచడం, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ,వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం సాధ్యం కావట్లేదు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి నూతన భవనాన్ని ప్రత్యేక హంగులతో ప్రభుత్వం భవన నిర్మాణం చేపట్టాలి నూతన భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందుతుందని అన్నారు కాబట్టి భవన నిర్మాణ పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు

జమ్మికుంట మున్సిపాలిటీ 3, 4,వ వార్డుల్లో సమస్యల పరిశీలన అభివృద్ధి పనుల ప్రారంభం

జమ్మికుంట మున్సిపాలిటీ 3, 4,వ వార్డుల్లో సమస్యల పరిశీలన అభివృద్ధి పనుల ప్రారంభం

జమ్మికుంట,( నేటి ధాత్రి )

బుధవారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్ , వైస్ చైర్మన్ జావీద్, లు 3వ మరియు 4వ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు, ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి, రోడ్లు మరియు మురుగు కాలువల (మోరీ)ల సమస్యలను పరిశీలించి, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.దాదాపు 30 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను బుధవారం నాడు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అజయ్, 3వ వార్డు కౌన్సిలర్ రాజు, 20వ వార్డు పరశురాంలతోపాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని నాయకులు తెలిపారు.

వివాహ వేడుక లో పాల్గొన్న TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్..

వివాహ వేడుక లో పాల్గొన్న TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఎస్వి కన్వెన్షన్ హాల్లో హద్దునూర్ మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ గారి అన్న కూతురి వివాహ శుభకార్యంలో పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి వివాహ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ వారితోపాటు ఈ కార్యక్రమంలో హద్నూర్ సర్పంచ్ ప్రవీణ్ బిజీ సందీప్ బాల్ రెడ్డి రామ్ రెడ్డి రమేష్ రావు విక్కీ యాదవ్ తదితరులు ఉన్నారు,

ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు..

ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు

◆-: బిజెపి నాయకుడు పాలెంకార్ సంతోష్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు బిజెపి నాయకుడు పాలెంకార్ సంతోష్ “ఆల్ ది బెస్ట్ చెప్పారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరు కుంటున్నాను అని మీ మంచి భవిష్యత్తుకి ఇది పునాది లాంటిదని పరీక్షలు బాగా రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చివారి యొక్క కలలను నిజం చేయాలని వారు ఆకాంక్షించారు. అదే విధంగా మంచి ఉత్తీర్ణత సాధించి తల్లి తండ్రులకు, మీ అధ్యాపకులకు మంచి పేరు తీసుకరావాలన్నారు.

ఆల్ ది బెస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు ..

ఆల్ ది బెస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు ..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ఈరోజు నుండి 25/2/2026 ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని విద్యార్థినీ, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సిద్దం ఉజ్వల్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో ఒక కీలకమైన మలుపు అని పేర్కొన్నారు. మీరు ఏడాది కష్టపడి చదివిన పాఠాలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆందోళనకు లోనుకాకుండా ప్రశాంతంగా ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని కోరారు.
మీ శ్రమే మీ విజయానికి బాటవేస్తుంది. మంచి ఫలితాలు సాధించి మీ తల్లిదండ్రులకు, గురువులకు గర్వకారణం కావాలి. ఈ పరీక్షలు మీ భవిష్యత్తు లక్ష్యాలకు పునాది రాయిలాంటివి. పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది అని తెలిపారు.జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!
Exit mobile version