వాలీబాల్ పోటీలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శేఖర్ రెడ్డి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో. వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఇట్టి వాలీబాల్ పోటీల కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ పురస్కరించుకొని. తన తాత అయిన పూర్మాని ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని. ఇట్టి పోటీలను స్థానిక గ్రామ సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలలో 8 జట్లు పాల్గొన్నట్లు పోటీలలో గెలుపొందిన జట్లకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేసినట్లు పేర్కొంటూ గ్రామ క్రీడల శరీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని. క్రీడలు ఆడటం వల్ల యువకులు మంచి ఫిట్నెస్ సాధిస్తారని స్నేహపూరిత వాతావరణంలో క్రీడలు ఆడుకోవాలని గెలుపోటములు సహజమని. గ్రామస్థాయి క్రీడాకారులు ప్రోత్సహించడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని. ఇట్టి కార్యక్రమానికి హాజరై యువతకు క్రీడాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా స్థానిక బస్వాపూర్ సర్పంచి. సర్పంచులఫోరం మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామ యువకులు ప్రజలు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
