రోడ్ల దుస్థితిపై ప్రజల ఆవేదన: పాలకులపై నిప్పులు…

రోడ్ల దుస్థితిపై ప్రజల ఆవేదన: పాలకులపై నిప్పులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గత 5 సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి మారలేదని, సర్పంచ్లు మారుతున్నా రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి 26 నెలలు పాలించినా పరిస్థితి మారలేదని, జహీరాబాద్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, పనికి వెళ్లే కూలీలు రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, బడంపేట్ సర్పంచ్లు కూడా రోడ్ల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రింగ్ రోడ్లు ఉన్న చోట్ల, లేని చోట్ల కూడా ఇదే పరిస్థితి అని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఓట్లు మాత్రమే కావాలని పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఒకసారి వచ్చి ప్రజల ఇబ్బందులను చూడాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కోహిర్ మండలంలో రోడ్లు బాగుచేయాలని లేదా కొత్త రోడ్లు వేయాలని కోరుతున్నారు.

ఎమ్మెల్యే మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు…

ఎమ్మెల్యే మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని బడంపేట గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో స్థానిక శాసనసభ్యులు కె.మానిక్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ రాజ, జహీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కోహీర్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోవూరి నర్సింలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version