బాంబు బెదిరింపు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్…

బాంబు బెదిరింపు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

 

ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు.

అహ్మదాబాద్: కువైట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో (IndiGo) విమానాన్ని అహ్మదాబాద్ (Ahmedabad) విమానాశ్రంలో శుక్రవారంనాడు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానాన్ని హైజాక్ చేస్తున్నామని, బాంబు పెట్టామంటూ ఒక నోట్ విమానంలో కనిపించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం 6.40 గంటలకు విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరినీ విమానం నుంచి ఖాళీ చేయించి భద్రతా తనిఖీలు చేపట్టారు.
ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే తిరిగి విమానం బయలుదేరేందుకు అనుమతిస్తామని తెలిపారు.

ఇదే తరహా ఘటన

ఈనెల 22వ తేదీన కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ-పుణె ఇండిగో విమానం 6E 2608కు బాంబు బెదిరింపు రావడంతో పుణె విమానాశ్రయానికి రాగానే సురక్షిత ప్రాంతానికి తరలించారు. భద్రతా ఏజెన్సీలు క్షుణ్ణంగా పరిశీలించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు.

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

 

వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మేడారం విచ్ఛేసి.. సమ్మక్క – సారలమ్మలను దర్శించుకోనున్నారు.

ములుగు, జనవరి 30: మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలు గద్దెలనెక్కారు. ఈ నేపథ్యంలో ఆ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం పోటెత్తారు. దీంతో భక్తులను కంట్రోలు చేయడం ఒకానొక దశలో తీవ్రంగా పరిణమించింది. మరో వైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. నేడు మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అందుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ జాతరకు హాజరై.. వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

ఈనె 28న ప్రారంభమైన ఈ జాతర.. 31న ముగియనుంది. ఇంకో వైపు జాతరలో జరుగుతున్న పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అదే సమయంలో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కారు అద్దాలతో పాటు స్థానిక షాపులను భక్తులు ధ్వంసం చేశారు. అలాగే భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని.. వారంతా వీవీఐపీలు, పోలీస్ కుటుంబాల సేవల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మేడారం ఉత్సవాల్లో భాగంగా బుధవారం.. సారలమ్మ, గురువారం.. సమ్మక్కలు గద్దెపైకి చేరుకున్నారు. దీంతో మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైనట్లయింది. గురువారం అర్థరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువెల్ ఓరమ్ మేడారం విచ్ఛేసి.. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు వీఐపీలు, వీవీఐపీలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో 25 మంది ఐపీఎస్‌లు అక్కడి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుకునే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది మేడారం తరలివస్తున్నారు.

పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్..

పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్

 

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ విచారణ చేపట్టారు.

హైదరాబాద్, జనవరి 30: పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) విచారణ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar) విచారణ చేపట్టారు. దానంపై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దానం తరఫున న్యాయవాదులు కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
దానంపై పిటిషన్ ఎందుకు వేశారు?.. పార్టీ మారారని చెప్పేందుకు గల ఆధారాలపై పాడి కౌశిక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అందజేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి దానం పోటీ చేసి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తరువాత కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, దానం ప్రచార ఫొటోలు, వీడియోలు.. దానం కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫొటోలను స్పీకర్‌ ముందు ఉంచారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో స్పీకర్ ఎదుట పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది.

సమయం ఇవ్వండి: మహేశ్వర్ రెడ్డి

ఇక, దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాదులు.. స్పీకర్ ముందు హాజరయ్యారు. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు ఎవిడెన్స్ అఫిడవిట్‌ను పొందుపరిచానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలంటే సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20 తరువాత సమయం ఇస్తే తాను విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అఫిడవిట్‌లో మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో బీజేపీ పిటిషన్‌పై ఫిబ్రవరి 18న స్పీకర్ విచారించనున్నారు.ఇక, పార్టీ ఫిరాయింపుల కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకూ పది మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా.. ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి అయ్యింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ జరగాల్సి ఉండగా… నేడు దానంను స్పీకర్ విచారిస్తున్నారు. దానం చెప్పే విషయాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ సమయంలోనూ ఇదే జరిగింది. విచారణ సమయంలో ఏ పార్టీలో ఉన్నారనే విషయాన్ని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రశ్నించగా.. వారంతా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని సమాధానం ఇచ్చారు.

ఇక దానం నాగేందర్ కూడా మొన్నటి వరకు తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని, అవసరమైతే ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే గత రెండ్రోజులుగా దానం యూటర్న్ తీసుకున్న పరిస్థితి. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు. స్పీకర్ తనపై అనర్హత వేటు వేస్తే.. ఉప ఎన్నికకు సిద్ధమని దానం పదేపదే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

దడ పుట్టిస్తున్న పసిడి! చరిత్రలో తొలిసారిగా…

దడ పుట్టిస్తున్న పసిడి! చరిత్రలో తొలిసారిగా 5.5 ట్రిలియన్ డాలర్ల హెచ్చుతగ్గులు

 

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురువారం బంగారం మార్కెట్ విలువ 5.5 ట్రిలియన్ డాలర్ల మేర హెచ్చుతగ్గులకు లోనైంది. ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. కమోడిటీ మార్కెట్స్‌లో నెలకొన్న ఒత్తిడికి ఇది సంకేతమని మార్కెట్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా బంగారం, వెండి ధరలపై చర్చే! సామాన్యుల నుంచి బడా ఇన్వెస్టర్లు, వ్యవస్థాగత మదుపర్ల వరకూ అన్ని వర్గాల వారినీ పసిడి ధరల పరుగు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ రోజు ధర ఎంత పెరుగుతుందో? ఎంత తగ్గుతుందో? అసలు పసిడిపై పెట్టుబడికి ఇది సరైన సమయమో కాదో తెలియక సామాన్యుల తలకిందులవుతున్నారు. అయితే, చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గురువారం బంగారం మార్కెట్ విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైందని స్టాక్ మార్కెట్‌ వ్యవహారాల కామెంటరీ వేదిక ‘ది కొబేసీ లెటర్’ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.ది కొబేసీ లెటర్’ చేసిన ట్వీట్ ప్రకారం, గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 10.25 గంటల మధ్య (అమెరికా కాలమానం ప్రకారం) బంగారం మార్కెట్ విలువ ఒక్కసారిగా 3.2 ట్రిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఆ తరువాత క్రమంగా కోలుకుని మార్కెట్స్ క్లోజ్ అయ్యే సమయానికి కనిష్ఠ స్థితి నుంచి 2.3 ట్రిలియన్ డాలర్ల మేర ఎగబాకింది. అంటే.. ఒక్క సెషన్‌లోనే బంగారం మార్కెట్ క్యాపిటలైజేషన్ హెచ్చుతగ్గుల విలువ 5.5 ట్రిలియన్ డాలర్లను చేరింది. నిత్యం హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌ కాయిన్ మార్కెట్ విలువ 850 బిలియన్ డాలర్లే. కానీ బంగారం మార్కెట్ విలువలో ఇంట్రాడే హెచ్చుతగ్గులే ఇందుకు మూడు రెట్లు ఉండటం కలకలానికి దారితీస్తోంది.

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

 

దేశానికి భద్రత కల్పించే ఒక మహిళా కమాండో, అదీ.. గర్భిణీ. తన ఇంట్లోనే రక్షణ లేక ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లో కమాండో‌గా పనిచేస్తున్న కాజల్ చౌదరి, తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు.

ఢిల్లీ, జనవరి 30: ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ స్వాత్(Special Weapons and Tactics Teams)లో కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27), తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కలిచివేసే వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ హత్యకు సంబంధించి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు అంకుర్ చౌదరి తన భార్యను చంపుతున్న సమయంలో ఆమె(కాజల్) సోదరుడు నిఖిల్ (ఈయన కూడా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్) కు ఫోన్ చేశాడు. ‘ఈ కాల్ రికార్డ్ చేసుకో, ఇది పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుంది.. నేను నీ చెల్లిని చంపేస్తున్నా’ అని చెప్పి, ఆమెపై దాడికి దిగాడు.

ఫోన్ లైన్‌లో ఉండగానే కాజల్ ఆర్తనాదాలు విన్న నిఖిల్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ‘తను చనిపోయింది, వచ్చి తీసుకెళ్లు’ అని చెప్పడం గమనార్హం.

ఘటన నేపథ్యం..

జనవరి 22న ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో కాజల్-అంకుర్ నివాసంలో ఈ ఘటన జరిగింది. భర్త.. నిందితుడైన అంకుర్ తన భార్య కాజల్ తలని తలుపు ఫ్రేమ్‌కు బలంగా కొట్టి, ఆపై బరువైన డంబెల్ (Dumbbell)తో ఆమె తలపై దాడి చేశాడు.

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి…

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి

 

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. 1948 జనవరి 30న ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ.. ఆయన చూపిన బాట నేటికీ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది.

అమరావతి, జనవరి 30: ఈ రోజు జనవరి 30 భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా.. బాపు దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

‘జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింసా విధానంతో కోట్ల మంది దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలి. స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దాం’ అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా సందేశంలో పేర్కొన్నారు.

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మందమర్రి, నేటిధాత్రి:

– గుడికందుల రమేష్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుడికందుల రమేష్ డిమాండ్ చేశారు. మందమర్రిలో ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది మంది భక్తులు, గిరిజనులు పాల్గొనే ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన, సమానత్వ భావన, త్యాగ గాథలతో ముడిపడి ఉన్న మేడారం జాతరను జాతీయ స్థాయిలో గుర్తించడం ద్వారా గిరిజన సంస్కృతికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వైవిధ్యానికి ప్రతిబింబమైన ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే, గిరిజనుల చరిత్రను దేశమంతా తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అలాగే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని గుడికందుల రమేష్ విజ్ఞప్తి చేశారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ మేజర్ గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా అవతరించిన అనంతరం రెండో సారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి మిత్ర పక్షంగా మెలిగి గెలుపుకు సహకరించామని,సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో స్నేహబంధమే కోరుకుంటుందని అన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ తో పాటు కలిసి పనిచేసేందుకు ఇష్టపడని నేపథ్యంలో సిపిఐ పార్టీ మునిసిపాలిటీలోని 22 వార్డులలో కౌన్సిలర్లు గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యామని అన్నారు..

CPI Fields Candidates in 22 Wards of Kattanpalli Municipality.

మిత్ర ధర్మాన్ని విస్మరిస్తే కలిసివచ్చే సెక్యులర్ పార్టీలతో సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని వార్డులలో నామినేషన్ వేస్తామని తెలిపారు. సిపిఐ కార్యకర్తలు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, ఈరవేన రవీందర్, రాజేశం ,మనమ్మ, లక్ష్మణ్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బహుభాష సదస్సుకు ఆహ్వానం….

బహుభాష సదస్సుకు ఆహ్వానం

జహీరాబాద్, నేటిధాత్రి:

 

శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ అక్క మహాదేవి బహుభాష జాతీయ సదస్సు సంస్కృతిక భవన్ ప్రారంభోత్సవ గ్రంథవిష్కరణ కార్యక్రమానికి న్యాల్కల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మారుతీ, మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి, సిద్దారెడ్డిలు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను మంగళవారం నాడు ఆలయ కమిటీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ అక్క మహాదేవి జాతీయ పురస్కర పురస్కారానికి తప్పని సరిగా హాజరు కావాలని డాక్టర్ రాజశేఖర్ శివ చారి కోరారు.

ఉపాధి హామీ నర్సరీ పనుల ప్రారంభం..

ఉపాధి హామీ నర్సరీ పనుల ప్రారంభం

జహీరాబాద్, నేటిధాత్రి:

 

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు, నర్సరీ పనులను ఎంపీడీవో మంజుల ఏపీవో రాజ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడాతు. గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు  చెప్పారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో అర్హులైన వారికి పని కల్పించడంతో పాటు గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతామని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో అవసరమైన మొక్కలను స్థానికంగానే పెంచే ఉద్దేశంతో నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల హరితాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఆనంద్
ఫీల్డ్ అసిస్టెంట్ శశి కుమార్ గ్రామ పెద్దలు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం… మమత సంచలన వ్యాఖ్యలు..

అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం… మమత సంచలన వ్యాఖ్యలు

 

అజిత్ పవార్ మృతి చెందిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని వీడాలని పవార్ ఆలోచిస్తున్నారని ఇటీవల జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులకు సైతం భద్రత లేకుండా పోతోందన్నారు.

కోల్‌కతా: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ మృతిలో కుట్రకోణం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దేశంలో రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
అజిత్ మృతి చెందిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని వీడాలని ఆయన ఆలోచిస్తున్నారని ఇటీవల జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులకు సైతం భద్రత లేకుండా పోతోందన్నారు. ఈ ఘటన అనేక ప్రశ్నలకు తావిస్తోందన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మాత్రమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం మీద మాత్రమే తమకు నమ్మకం ఉందని, మరో ఇతర దర్యాప్తు సంస్థలపైన విశ్వాసం లేదని, దర్యాప్తు సంస్థలు తమ స్వేచ్ఛ కోల్పోయాయని ఆరోపించారు.

కాగా, బారామతి విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని పలువురు రాజకీయ నేతలు సైతం డిమాండ్ చేశారు. అజిత్ పవార్ మృతికి సంతాపం తెలుపుతూ ఇందుకు దారితీసిన ప్రమాద ఘనటపై పారదర్శకమైన దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, వంచిత్ బహుజన్ అఘాడి నేత ప్రకాష్ అంబేద్కర్ తదితరులు కోరారు.

విమాన ప్రమాదం.. ఎక్స్‌క్లూజివ్ వీడియో..

విమాన ప్రమాదం.. ఎక్స్‌క్లూజివ్ వీడియో..

 

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో కనిపించాయి. ఆ భయానక క్షణాలు ప్రమాద సమయంలోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన భయంకర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, NCP (అజిత్ పవార్ వర్గం) అధ్యక్షుడు అజిత్ అనంతరావు పవార్ (66) మృతి చెందారు. ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో ఉన్న మొత్తం 5 మంది (అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, సిబ్బంది, సెక్యూరిటీ పర్సనల్) స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.అజిత్ పవార్ ముంబై నుండి బారామతికి వెళ్తున్న Learjet 45 (రిజిస్ట్రేషన్ VT-SSK) చార్టర్డ్ విమానం ఉదయం 8:10 గంటల సమయంలో టేకాఫ్ అయింది. ల్యాండింగ్ సమయంలో (సుమారు 8:40 గంటల సమయంలో) రన్‌వేకు 100 మీటర్ల దూరంలో విమానం నియంత్రణ తప్పి క్రాష్ అయింది. రెండవసారి ల్యాండింగ్ ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగినట్లు ఫ్లైట్ రాడార్ డేటా చూపిస్తోంది. క్రాష్ అయిన వెంటనే విమానం ముక్కలై, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు రక్షణ ప్రయత్నాలు చేసినా మంటల తీవ్రత వల్ల సాధ్యం కాలేదు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో కనిపించాయి. ఆ భయానక క్షణాలు ప్రమాద సమయంలోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

బీఆర్ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలి..

బీఆర్ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

భూపాలపల్లి, నేటిధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ 11 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు అనంతరం తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినారు పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను నూతన మండలాలను గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి అలాగే జయశంకర్ సార్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు భూపాలపల్లి జిల్లాను తీసేస్తామని అంటున్నారు ఇప్పటికైనా పట్టణ ప్రజలు ఆలోచించాలి భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయింది భూపాలపల్లి మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదు ఎన్నికలు వచ్చిన సమయాన మంత్రులను తీసుకువచ్చి చిలాపాలకాలు వేసి హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావున పట్టణ ప్రజలు ఆలోచించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మేకల సంపత్ బుర్ర రమేష్ రజిత తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు

అజిత్ పవార్.. మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు: సీఎం ఫడ్నవీస్…

అజిత్ పవార్.. మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు: సీఎం ఫడ్నవీస్

 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.

 మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. పవార్ లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం తీరని లోటని చెప్పుకొచ్చారు.

వ్యక్తిగత జీవితంలో అజిత్ పవార్‌ తనకు మంచి స్నేహితుడని ప్రస్తావించారు. మహారాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్ కృషి చేస్తున్న తరుణంలో ఆయన అకాల మరణం తీరని లోటని తెలిపారు. పవార్ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. మరికాసేపట్లో బారామతికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే వెళ్లనున్నారు. వారి కుటుంబ సభ్యులను సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. అనంతరం అజిత్ పవార్‌కు నివాళులు అర్పించనున్నారు.

అజిత్ పవర్ గొప్ప వ్యక్తి: ఆశిష్ షెలార్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ మృతిపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ ఆశిష్ షెలార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌ సేవలను కొనియాడారు. అనంతరం మీడియాతో ఆశిష్ షెలార్ మాట్లాడారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా హఠాన్మరణం చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.అజిత్ పవార్ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని కీర్తించారు. కరోనా సంమయంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రశంసించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ప్రత్యేకమైన ముద్ర వేశారని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచే ఆయన ప్రజల కోసం అందుబాటులో ఉండే వారని కీర్తించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా అజిత్ పవార్ ఉన్నారని తెలిపారు. అజిత్ పవర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఆ పరమేశ్వరుడు ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉండి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆశిష్ షెలార్ పేర్కొన్నారు.

ఒలిమా డిన్నర్ పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు….

ఒలిమా డిన్నర్ పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్, నేటిధాత్రి:

ఝరాసంగం గ్రామానికి చెందిన సొసైటీ కార్యదర్శి నిస్సర్ అహ్మద్ గారి సోదరుని ఒలిమా డిన్నర్ కార్యక్రమంలో పాల్గొని పెళ్లి కుమారుని పూలమాలలతో సన్మానించారు తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్.ఈ సందర్బంగా నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు.బొగ్గుల జగదీశ్వర్. తో పాటు మండల మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ మాజీ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఏజాస్ బాబా సర్పంచ్ లు వార్డ్ మెంబర్లు నాయకులు పాల్గొన్నారు …

విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి…

విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి

​- బీజేవైఎం కళాశాలల రాష్ట్ర కన్వీనర్‌ మంద మహేష్ డిమాండ్

​గణపురం, నేటిధాత్రి:

 

గణపురం మండలం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని, గణపురం మండలంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పాఠశాలలకు తక్షణమే సెలవులు ప్రకటించాలని బీజేవైఎం కళాశాలల రాష్ట్ర కన్వీనర్‌ మంద మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ​​ఈ నెల 28 నుండి 31 వరకు జరిగే జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారని, దీనివల్ల గణపురం మండలంలోని ప్రధాన రహదారులన్నీ బస్సులు, భారీ వాహనాలతో నిండిపోయాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారి విద్యార్థులు సైకిళ్లపై వెళ్తూ ఈ రద్దీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రహదారులు దాటే సమయంలో ప్రాణాపాయం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జాతర సందర్భంగా మూడు, నాలుగు రోజులు సెలవులు ఇచ్చే ఆనవాయితీ ఉందని, కానీ ఈసారి ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని విమర్శించారు. విద్యార్థుల భద్రత కంటే ముఖ్యం ఏదీ కాదు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి బాధ్యులు ఎవరని మంద మహేష్ ప్రశ్నించారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నాలుగు రోజులు మండలంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేవైఎం నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్..

ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్

సర్పంచ్ భానోత్ రమ భగవాన్ ఆధ్వర్యంలో

సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరం

నిరుపేదలకు కంటి చూపును ఇవ్వడమే మా స్వచ్ఛంద సేవ సంస్థ ఉద్దేశం… డాక్టర్ మాధవరావు.

మహబూబాబాద్, నేటిధాత్రి:

మండలంలోని గోవిందపురం గ్రామంలో సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ డాక్టర్ మాధవరావు నిరుపేదలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు మరియు కంటి ఆపరేషన్లు గోవిందాపురం గ్రామ సర్పంచ్ భానోత్ రమ భగవాన్ల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి పరీక్షల శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ భానోత్ రమ పాల్గొన్నారు. గ్రామంలోని నిరుపేదలకు కంటి పరీక్ష చేయించుకోలేనటువంటి వారికి సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్టు వారిచే ఉచితంగా కంటి ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి కంటి అద్దాలు ఆపరేషన్ చేయాలన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గోవిందపురం గ్రామ ప్రజలు 111 మంది ఉచిత వైద్య శిబిరంలో పరీక్షల నిర్వహించుకున్నారని వారిలో 40 మందికి ఉచితంగా కంటి అద్దాలు అందించడం జరిగిందని, అలాగే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నటువంటి 9 మందికి ఆపరేషన్ నిర్వహించుటకు జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి సూర్య స్వచ్ఛత సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మాధవరావు కంటి దావకానలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. మనిషి మనుగడ సజావుగా సాగాలంటే నయనాలు ప్రధానం అలాంటి నాయాలు నేత్రాలు నేడు మనం తింటున్నటువంటి కలుషిత ఆహారం వల్ల రెండవ అనారోగ్య సమస్యలు ఏర్పడడంతో నిరుపేదలైన వారు వైద్యం చేయించుకోలేక స్తోమత లేక నిర్లక్ష్యం వహిస్తున్నారని అంతత్వంతో కాలం గడుపుతున్నారని ఇలాంటి వారి పట్ల దాతృత్వం చాటుకొని ముందుకు పోతున్న సంస్థ సూర్య స్వచ్ఛంద సేవ ట్రస్ట్ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతుందని నిరుపేదలైన వారికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు చేసి మరి కంటి అద్దాలను ఇస్తుందని ఎవరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేర్చుకునే మా గొప్ప అవకాశం కల్పిస్తున్నారని గ్రామ ప్రజల తరఫున సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గ్రామ సర్పంచ్ భానోత్ రమా భగవాన్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి వారు గ్రామ వార్డు సభ్యులు కాంపాటి వెంకన్న, యాకయ్య, ప్రభాకర్, దేవేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం భజన మండలి అనుమతికి వినతిపత్రం…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం భజన మండలి అనుమతికి వినతిపత్రం

జహీరాబాద్, నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భజన మండలి ప్రత్యేక కార్యక్రమాల కోసం అనుమతి కోరుతూ ఒక వినతిపత్రాన్ని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు అందజేశారు.తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన మల్లిపటిల్ సిద్ధారెడ్డి ఈ వినతిపత్రం ద్వారా తమ గ్రామంలోని “శివ శరన్నే – హేమరెడ్డి మల్లమ్మ” భజన బృందం ద్వారా శైవతత్వాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక–సాంప్రదాయ కళాప్రదర్శన నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో సమయాన్ని కేటాయించాలని కోరారు.భక్తులకు శైవభక్తి, సాంప్రదాయ కళలను చేరవేయాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపింది భజన మండలి. వినతిపత్రాన్ని స్వీకరించిన ఆలయ అధికారులు త్వరలో నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించారు.

మీ మెదడుకు మేత.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 50 సెకెన్లలో కనిపెట్టండి..

మీ మెదడుకు మేత.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 50 సెకెన్లలో కనిపెట్టండి

 

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక బాలిక కేక్ తయారు చేయడానికి మిక్స్ చేస్తోంది. పక్క పక్కనే ఉన్న రెండు ఫొటోల్లోనూ అదే దృశ్యం ఉంది. అయితే ఆ రెండు ఫొటోల్లో మూడు చిన్న తేడాలున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలు కనబడతాయి. 50 సెకెన్ల వ్యవధిలో ఆ తేడాలను కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలేంటో తెలుస్తుంది.

ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు….

ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని 25వ వార్డు నుండి పలువురు ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీపీసీసీ సభ్యులు,మాజీ కౌన్సిలర్ పెండెం లక్ష్మిరామానంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారిలో నల్గొండ సంతోష్,నల్గొండ వంశీ,చీకటి శివమణి,ముద్రబోయిన రాజు,పుట్ట జగదీష్,పుట్ట రామస్వామి,జాటోతు వీరన్న,మురారి వినయ్,స్వామిశెట్టి రాజశేఖర్,చీకటి విజయ్,శ్రీనివాస్ ఉన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ ఎంపిటిసి కాట ప్రభాకర్,కాట రఘు,మెరుగు కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version