రూ. 2 లక్షల 11 వేల కోట్ల మేర ఎఫెక్ట్.. చైనాకు ఝలక్.. ట్రంప్ హ్యాపీస్.!

రూ. 2 లక్షల 11 వేల కోట్ల మేర ఎఫెక్ట్.. చైనాకు ఝలక్.. ట్రంప్ హ్యాపీస్.!

 

పనామా దేశపు సుప్రీం కోర్టు నిన్న రాత్రి ఒక సంచలన తీర్పిచ్చింది. ఈ జడ్జిమెంట్ ఏకంగా భారత రూపాయల్లో రెండు లక్షల 11 వేల కోట్ల మేర ప్రభావితమయ్యే తీర్పుగా చెబుతున్నారు. అంతర్జాతీయ షిప్పింగ్ వాణిజ్య రంగంలో ఇది పెద్ద చర్చకు దారి తీస్తోంది.

 అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన పనామా కాలువ (Panama Canal) సమీపంలోని రెండు ప్రధాన ఓడరేవుల నిర్వహణ ఒప్పందాలను పనామా దేశపు సుప్రీంకోర్టు రద్దు చేసింది. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘సీకే హచిసన్’ (CK Hutchison) గ్రూప్‌నకు చెందిన(సబ్సిడియరీ) ‘పనామా పోర్ట్స్ కంపెనీ’ (PPC) తో కుదుర్చుకున్న ఈ కీలక కాంట్రాక్టులు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన కనిపిస్తోందని, ప్రభుత్వ ఆస్తులను లీజుకు ఇచ్చేటప్పుడు పాటించాల్సిన విధివిధానాలను విస్మరించారని కోర్టు పేర్కొంది.

పనామా కాలువకు రెండు వైపులా ఉన్న బాల్బోవా (Balboa) ఇంకా క్రిస్టోబల్ (Cristobal) ఓడరేవులను నిర్వహించేందుకు 2021లో అప్పటి ప్రభుత్వం పనామా పోర్ట్స్ కంపెనీ ఒప్పందాన్ని మరో 25 ఏళ్ల పాటు పొడిగించింది. అయితే, ఈ ప్రక్రియలో పారదర్శకత లేదని, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్లను విచారించిన పనామా సుప్రీం కోర్టు, ఆ ఒప్పందాలు చెల్లవని తీర్పునిచ్చింది. కాగా, సీకే హచిసన్ ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటి. తాజాగా పనామా కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఆ కంపెనీకి పనామాలో ఉన్న పట్టు సడలే అవకాశం ఉంది. అయితే, వీటి నిర్వహణ ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలుస్తుందా? అనే అంశాలపై సందిగ్ధత నెలకొంది.

బాంబు బెదిరింపు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్…

బాంబు బెదిరింపు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

 

ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు.

అహ్మదాబాద్: కువైట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో (IndiGo) విమానాన్ని అహ్మదాబాద్ (Ahmedabad) విమానాశ్రంలో శుక్రవారంనాడు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానాన్ని హైజాక్ చేస్తున్నామని, బాంబు పెట్టామంటూ ఒక నోట్ విమానంలో కనిపించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం 6.40 గంటలకు విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరినీ విమానం నుంచి ఖాళీ చేయించి భద్రతా తనిఖీలు చేపట్టారు.
ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే తిరిగి విమానం బయలుదేరేందుకు అనుమతిస్తామని తెలిపారు.

ఇదే తరహా ఘటన

ఈనెల 22వ తేదీన కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ-పుణె ఇండిగో విమానం 6E 2608కు బాంబు బెదిరింపు రావడంతో పుణె విమానాశ్రయానికి రాగానే సురక్షిత ప్రాంతానికి తరలించారు. భద్రతా ఏజెన్సీలు క్షుణ్ణంగా పరిశీలించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు.

బస్టాండ్లో బస్సు ఢీకొని ప్రయాణికుడికి తీవ్ర గాయాలు…

బస్టాండ్లో బస్సు ఢీకొని ప్రయాణికుడికి తీవ్ర గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో సీటు కోసం పరుగులు తీస్తున్న ఖదీర్ (35) అనే ప్రయాణికుడిని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో ఖదీర్ రెండు కాళ్లు తీవ్రంగా గాయపడ్డాయి.సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది అతన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు అజాగ్రత్తగా పరుగులు తీయడం ప్రమాదకరమని డిపో మేనేజర్ సూచించారు. కొందరు బస్సు డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

బోల్తా కోటిన ట్రావెల్స్ బస్సు…

బోల్తా కోటిన ట్రావెల్స్ బస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహీర్ మండలం చింతలఘూట శివారులో తెల్లవారుజామున ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు పోగమంచు ఉండటం కారణంగా అదుపుతప్పి లోయలో పడిపోయిన ట్రావెల్స్. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఒక ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికుడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version