గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే అధ్వాన్న రోడ్డు..!

గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే అధ్వాన్న రోడ్డు..!

ఆరు నెలలుగా పట్టించుకోని మేయర్–అధికారులు?

మేడారం జాతర సందర్భంగా స్పందించాలంటున్న వాహనదారులు

వరంగల్, నేటిధాత్రి:

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రోడ్డు పరిస్థితి నగర పాలన తీరుకు అద్దం పడుతోంది.నగర మేయర్ స్వయంగా ఎన్నికైన 29వ డివిజన్ పరిధిలోకి వచ్చే వరంగల్ పోతన నగర్ నుంచి హంటర్ రోడ్డుకు వెళ్లే మార్గం పూర్తిగా అధ్వాన్నంగా మారి, నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.గత ఆరు నెలలుగా కొన్ని పత్రికల్లో ఈ రోడ్డు సమస్యపై వార్తలు వచ్చినప్పటికీ, నగర మేయర్ గానీ, మున్సిపల్ అధికారులు గానీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.ముఖ్యంగా మేడారం మహాజాతర నేపథ్యంలో ఈ రోడ్డుమీదుగా భక్తులు, వాహనాలు భారీగా ప్రయాణించనున్న నేపథ్యంలో, ప్రమాదాలకు ఆస్కారం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కనీసం తాత్కాలికంగైనా మొరం పోసి రోడ్డు సరిచేసి, భక్తులకు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సజావుగా సాగేటట్లు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.“గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే ఇలాంటి దయనీయ స్థితిలో రోడ్డు ఉంటే, మిగతా డివిజన్ల పరిస్థితి ఏమిటి?” అంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.లక్షల రూపాయలు ఖర్చు చేసి విహారయాత్రలు, పర్యటనలకు వెళ్లే ప్రజాప్రతినిధులు, తమ సొంత డివిజన్‌లో కనీస రోడ్డు సౌకర్యాన్ని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Mayor-officials

నగర మేయర్ హోదాలో ఉండి తన డివిజన్ సమస్యలకే పరిష్కారం చూపలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందనివాహనదారులు నిలదీస్తున్నారు.నగర మేయర్ గానీ, మున్సిపల్ అధికారులు గానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి తక్షణమేరోడ్డుమరమ్మతులులేదానిర్మాణపనులుచేపట్టాలని,లేకపోతేప్రజాగ్రహానికిగురికావాల్సివస్తుందనివాహనదారులుహెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉండగా,ఈ రోడ్డు సమస్యపై పెద్ద పత్రికలు, ఛానెళ్లు అని చెప్పుకునే”కొందరు”మీడియాప్రతినిధులుఒక్కవార్తకూడారాయకపోవడంపలుఅనుమానాలకుతావిస్తోంది.మేయర్‌కుఅనుకూలంగా వ్యవహరిస్తూ వార్తలను పక్కన పెట్టారాఅనేసందేహాలువ్యక్తమవుతున్నాయి.అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానిక యువత రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో వైరల్చేస్తున్నా,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

పరుగు ఆపని బంగారం.. రూ.4 లక్షలకు చేరకున్న వెండి..

పరుగు ఆపని బంగారం.. రూ.4 లక్షలకు చేరకున్న వెండి..

బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి కిలోకు రూ.10 వేల మేర పెరిగింది.

బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి కిలోకు రూ.10 వేల మేర పెరిగింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices).
ఈ రోజు (జనవరి 28న) ఉదయం 11:00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,65,170కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,950 మేర పెరిగి రూ. 1,51,400కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,65,300కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,51,550కి చేరుకుంది.మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలోకు పది వేల రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.4,00,00కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.3.8 లక్షలుగా ఉంది.

అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి…

అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

 

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(66) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అజిత్ పవార్‌(Ajit Pawar) సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం..

‘ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర బాధకు గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు అందులో పేర్కొన్నారు.

అజిత్ పవార్ మృతిపై కేబినెట్ సంతాపం..

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. మంత్రి మండలి సమావేశం ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అజిత్ పవార్‌తో తనకు ఉన్న పరిచయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అజిత్ పవార్ మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ అధ్యక్షుడు, ఎన్‌డీఏ కూటమి నాయకులైన అజిత్ దాదా పవార్ ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారనే విషాద వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన చేసిన అంకితభావంతో కూడిన ప్రజాసేవ, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అందించిన అపారమైన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ప్రజల పట్ల అజిత్ పవార్‌కున్న నిరంతర నిబద్ధతను గౌరవంతో స్మరించుకుంటారని తెలిపారు. ఆయన మరణం పట్ల నేను ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఈ తీవ్ర దు:ఖ సమయంలో అజిత్ పవార్‌ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అజిత్ పవార్ మృతిపై పీవీఎన్ మాధవ్ విచారం..

అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హృదయ విదారక ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు ధైర్యం చేకూర్చాలని ఆకాంక్షించారు.

అజిత్ పవార్ మృతికి రామ్మోహన్ సంతాపం..

అజిత్ పవార్ మృతికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందడం అత్యంత విషాదకరమని తెలిపారు. ఈ ఘటనతో ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అలాగే ఈ నష్టంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలవాలని, ఈ కఠిన సమయంలో శోకతప్తులైన కుటుంబానికి, అభిమానులకు ధైర్యం, బలం కలగాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు.

లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సూచీలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఒప్పందం కారణంగా మంగళవారం లాభపడిన సూచీలు బుధవారం కూడా అదే జోరులో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.

భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సూచీలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఒప్పందం కారణంగా మంగళవారం లాభపడిన సూచీలు బుధవారం కూడా అదే జోరులో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ లాభాల నుంచి దిగి వచ్చాయి. అయితే ఇప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే కదలాడుతున్నాయి.
గత సెషన్ ముగింపు (81,892)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత భారీ లాభాల్లోకి ఎగబాకింది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడి 82,500 మార్క్ దాటింది. అయితే ఆ తర్వాత అమ్మకాల కారణంగా కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో 335 పాయింట్ల లాభంతో 82,199 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 104 పాయింట్ల లాభంతో 25,279 వద్ద కదలాడుతోంది (stock market news today).సెన్సెక్స్‌లో ఆయిల్ ఇండియా, ఎమ్‌సీఎక్స్ ఇండియా, సీజీ పవర్, ఓ‌ఎన్‌జీసీ, వేదాంత మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఏషియన్ పెయింట్స్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఎయిచర్ మోటార్స్, మారికో, బ్రిటానియా మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 293 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.60గా ఉంది.

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్…

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్

 

 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్(Maharashtra Deputy CM Ajit Pawar) బుధవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు పవార్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి..

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

 

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ ఇవాళ పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో మృతి చెందారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్(Ajit Pawar) ఇవాళ(జనవరి 28) పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఆయనతోపాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బారామతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉదయం 8:45 గంటల సమయంలో క్రాష్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ వయసు 66 సంవత్సరాలు.

మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి…

మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 5 6వ వార్డులు కృష్ణా కాలనీలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బస్తీ బాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని కాలనీలో పర్యటించారు

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి 5 6వ వార్డు కృష్ణ కాలనీలో ఇంటింటా తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాలనీలో నెలకొన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
కాలనీలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తున్నా పారిశుధ్య నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాలనీ వాసుల సౌకర్యార్థం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడంతో సింగరేణి పర్యవేక్షణ లేకుండా పోయిందని,ప్రస్తుతం అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు
కృష్ణ కాలనీలోని భూములను సింగరేణి నేరుగా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రత్యేక జీవో ద్వారా భూములు ఇప్పించి,ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించి కాలనీ వాసులకు అందించామని, అలాగే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛమైన గోదావరి జలాలను సరఫరా చేసి కాలనీ వాసుల నీటి కష్టాలను తీర్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న, ప్రజలను మాయ మాటలతో మోసం చేసే నాయకులకు బుద్ది చెప్పాలన్న రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కమ్యూనిస్టు పార్టీలో చేరికలు…

కమ్యూనిస్టు పార్టీలో చేరికలు

* మున్సిపల్ ఎన్నికలలో సీపీఐ అభ్యర్థులు
* చేవెళ్ల 17వ వార్డు నుండి సీపీఐ అభ్యర్థి సాల్రా వెంకటేష్
* సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కే. రామస్వామి
వారికీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

భారత కమ్యూనిస్టు పార్టీ నిరుపేదల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పేదల పక్షాన చేస్తున్న పోరాటాలు ఆకర్శించి పలువురు సిపిఐ పార్టీలో చేరుతున్నారని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కే. రామస్వామి అన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం చేవెళ్ల ప్రాంతానికి చెందిన సాల్రా వెంకటేష్ పరివేద సత్యం కుక్కుడాల వెంకటేష్ తదితరులు భారత కమ్యూనిస్టు పార్టీలో చేరినారు వీరికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గం ఇన్చార్జి కె.రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ కలిసి వారికి సిపిఐ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ పార్టీ నుండి 17వ వార్డు నుండి సాల్రా వెంకటేష్ పోటీలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ కార్యదర్శి ఎం. సత్తిరెడ్డి ఎన్ఎఫ్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల.మంజుల, ఒగ్గు సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డు…

ఉత్తమ ఉద్యోగులకు అవార్డు

మంచిర్యాల, నేటి ధాత్రి:

 

నస్పూర్ మండలంలోని శ్రీరాంపూర్ ప్రాంతం ఆర్కే-8 డిస్పెన్సరీ లోని ఉద్యోగులు విధి నిర్వహణలో అందించిన సేవలు,వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేస్తారు.అందులో భాగంగా ఉత్తమ ఉద్యోగులుగా జి. విజయలక్ష్మి,సురేష్,రాజేశ్వరి ఎంపికయ్యారు.రిపబ్లిక్ డే సందర్భంగా డిస్పెన్సరీలో డివై సీఎంఓ డాక్టర్ పి.రమేష్ చేతుల మీదుగా వారికి జ్ఞాపకలు అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ విధుల పట్ల మరింత క్రమశిక్షణతో వ్యవహరిస్తూ,సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు.

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి…

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పోలీస్ స్టేషన్, రామగుండం కమిషనరేట్
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి: ట్రాక్టర్ స్వాధీనం, డ్రైవర్ అరెస్ట్
మందమర్రి పట్టణ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసులు కోరాడ జులిపించారు. ఉదయం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా, అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు.
కేసు వివరాలు:
మందమర్రి మందమరి ఎస్సై నరేష్ గారి ఆదేశాల మేరకు ఏఎస్ఐ కె. మిలింద్ కుమార్ తన బృందంతో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పాలవాగు (సండ్రన్‌పల్లి) నుండి పట్టణం వైపు వస్తున్న ట్రాక్టర్‌ను అనుమానంతో ఆపారు. వాహనాన్ని తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు.
నిందితుడి ఒప్పుకోలు:
పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్ గట్టు మారుతి (సండ్రన్‌పల్లి నివాసి) ని విచారించగా.. యజమాని కుమారుడు మ. రాజు ప్రోద్బలంతో, తక్కువ సమయంలో ఎక్కువ లాభం గడించడం కోసం దొంగ తనంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు.

మున్సిపల్ కోడ్ కూసింది.. ఆరేళ్ళ సందిగ్ధతకు తెరపడింది..

మున్సిపల్ కోడ్ కూసింది.. ఆరేళ్ళ సందిగ్ధతకు తెరపడింది..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల
నగారా మోగింది. దీంతో ఎన్నికలపై జహీరాబాద్ ప్రజల్లో నెలకొన్న సందిగ్ధత తొలిగిపోయింది. మున్సిపాలిటీతో పాటు విలీన గ్రామాలతో కలిపి 37 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొంటున్న గ్రామ నేతలు, ప్రజలతో పాటు మున్సిపల్ వాసుల్లో కూడా ఆనందోత్సవం కనిపిస్తుంది.

అధిక పోటీ

కౌన్సలర్ పదవికి పోటీ ఎక్కువ ఉండడంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు తలనొప్పిగా మారింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. మున్సిపాలిటీలోని 37 వార్డులకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి సుమారు 200 పైగా అభ్యర్థులు పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 37 మందిని ఎంపిక చేసి బరిలో దింపాల్సి ఉంది. అయితే మిగతావారు రెబల్స్ గా బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే ప్రధాన పార్టీల గెలుపోటములు రెబల్స్ పైన ఆధారపడి ఉంటుందన్న భయం పార్టీలను వెంటాడుతుంది.

గుండాల విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ నజీర్ కు ప్రశంషాపత్రం…

గుండాల విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ నజీర్ కు ప్రశంషాపత్రం

గుండాల,నేటిధాత్రి:

గుండాల సెక్షన్ విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ నజీర్ గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో గత 3 సంవత్సరాల నుండి ప్రజలందరి మరియు అధికారుల ఆదరాభిమానాలు పొందుతూ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వరంగల్ లో TGNPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి గా ప్రశంస పత్రం అందుకున్నారు. సిఎండి చేతుల మీదుగా ప్రశంస పత్రం తీసుకున్నందుకు గాను అధికారులు కొత్తగూడెం సూపరిండెంట్ ఇంజినీర్ మహేందర్ ,కొత్తగూడెం డివిషనల్ ఇంజినీర్ రంగస్వామి,ఎల్లందు ఏడిఈ రామారావు మరియు రెండు మండలాల విద్యుత్ వినియోగదారులు శుభాకాంక్షలు తెలియజేశారు.

గుండి గ్రామాన్ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి వనం జగదీశ్వర్…

గుండి గ్రామాన్ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి వనం జగదీశ్వర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో బుధవారం నుండి ప్రారంభం కానున్న సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించి రామడుగు మండలంలో ప్రసిద్ధి చెందిన గుండి గ్రామంలోని సమ్మక్క జాతర విశేషాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్న అనంతరం గుడి ప్రాంగణంలో సమ్మక్క గద్దే వద్ద కొబ్బరికాయ కొట్టి పారిశుధ్య పనులను, జంపన్న వాగును పరిశీలించి లైటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీటి సదుపాయం ఏర్పాటు గురించి అడిగి తెలుసుకుని జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇటీవలే మరణించిన గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు పోచయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబంలో ఒకరిని గ్రామ పంచాయతీ ఉద్యోగం వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటాం అని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రావణ్ కుమార్, గ్రామ సర్పంచ్ గుమ్మడి మల్లేశం, పంచాయతి కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామస్థులు, రామస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లోమునిసిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ బైక్ ర్యాలి..

వనపర్తి లోమునిసిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ బైక్ ర్యాలి

మాజీ మంత్రి శాశన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్
వనపర్తి నేటిధాత్రి .

 

 

మాజీ సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శా స న మండలి మాజీ ఛైర్మెన్ కలిసి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా వనపర్తి లో అంబేద్కర్ చౌరస్తా నుండి బీ ఆర్ ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ ప్రారంభించారు వార్డులో పర్యటించారు బైక్ ర్యాలీలో బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని జిల్లా మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ పలకరించారని అశోక తెలిపారు వనపర్తి పట్టణ మహిళలు,యువకులు,కార్మికులు,రైతులు ర్యాలీ ని చూసిన వారు వనపర్తి పట్టణ అభివృద్ధి రోడ్ల విస్తరణ సి సీ రోడ్లు డ్రై నేజ్ లు చెరువుల సుందరి కరణ మిషన్ భగీరథ పైపు లై ను బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాములో జెరిగినాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అశోక్ తెలిపారు

ఓట్లు సీట్లపై ఉన్నయావ ప్రజా సమస్యలపై లేదు…

ఓట్లు సీట్లపై ఉన్నయావ ప్రజా సమస్యలపై లేదు

ఎన్నికల హామీలను విస్మరించిన పార్టీలను మట్టి కరిపించాలి

ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఓట్లు, సీట్లు అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టడం తప్ప పట్టణ సమస్యలపై పాలకపార్టీకి కనీస చిత్తశుద్ధిలేదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ డివిజన్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన పాలక పార్టీలను ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంసీపీఐ(యు) పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కేశెట్టి సదానందం అధ్యక్షతన నర్సంపేట ఓంకార్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాపరంగా పట్టణ విస్తృతి పెరిగిన అభివృద్ధి పరంగా అందుకు తగిన విధంగా లేదని ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. నర్సంపేట పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నామని ప్రచారఆర్భాటం చేస్తున్నప్పటికి ఆచరణలో పట్టణ అవసరాలకనుగుణంగా ప్రణాళిక రూపొందించడంలో వైఫల్యం చెందారని ఎద్దేవా చేశారు.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చిత్తశుద్ధితో అభివృద్ధికి బాటలు వేసే విధంగా నీతిగా నిజాయితీగా పట్టుదలతో పనిచేసే అభ్యర్థులను ఆదరించాలని, డబ్బులు మద్యం ఇతర ప్రలోభాలతో ఓట్లను కొనుగోలు చేసి గెలిచి దోచుకోవాలనే అభ్యర్థులను మట్టికరిపించాలని కోరారు.నీతిగా నిజాయితీగా సమస్యల పరిష్కారానికి పట్టణాభివృద్ధికి తోడ్పడే ఎంసిపిఐ(యు) అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపించాలని కార్యకర్తలు అందుకు అనుగుణంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ మాషుక్, పార్టీ పట్టణ నాయకులు మోటం సురేష్, అనుమల రమేష్, బండారి మల్లేష్, సాంబన్న,రవి,రథం తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ని పరంమర్శించిన అంబాల చంద్రమౌళి మాదిగ..

మాజీ సర్పంచ్ని పరంమర్శించిన అంబాల చంద్రమౌళి మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

టేకుమట్ల మాజీ సర్పంచ్ పొలాల సరోత్తం రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ హనుమకొండలో సరోత్తం రెడ్డి సాహూ గృహంలో పరమశించడం జరిగింది ఈ కార్యక్రమంలో టేకుమట్ల మాజీ ఎంపిటిసి ఆదిరాజు నియోజకవర్గ ఇన్చార్జి గాజుల బిక్షపతి మాదిగ రేణిగుంట్ల సంపత్ ఎర్రం భద్రయ్య సిరుపంగ చంటి తదితరులు పాల్గొన్నారు

టీఎన్జీఓ డైరీ 2026 ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్…

టీఎన్జీఓ డైరీ 2026 ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ & టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు బూరుగు రవి కుమార్ ఆధ్వర్యములో మంగళవారం జిల్లా ఐడిఓసి కార్యాలయములో టీఎన్జీవో డైరీ 2026 ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించినారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమనికి పాటుపడుతానని టిఎన్జీవో మీటింగ్ హాల్ నిర్మాణానికి ఆర్ధిక సహాయము చేస్తానని హామీ ఇవ్వడము జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు సీఎంటీ విజయలక్ష్మి అశోక్ కుమార్ పాల్గొన్నారు ఈ సమావేశం నకు జిల్లా కార్యదర్శి ఏ. దశరథ రామ రావు, కేంద్ర సంగం ఉపాధ్యక్ష-కార్యదర్శి షఫీ అహ్మద్,గ్యానేశ్వర్ సింగ్, అసోసియేట్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కోశాధికారి అన్వార్ భైగ్ జిల్లా భాద్యులు వంశీ కృష్ణ, మురళీధర్ రెడ్డి,సత్యనారాయణ, శ్రీదేవి, జామలుద్దీన్, స్వప్న, సాంబాశివా రావు, అరుణ్, రేణుక, రెవిన్యూ పక్షాన అసిఫ్, అబ్బాస్, అప్రూస్, అనురాధ, నర్సింగ్ ఆఫీసర్స్ పక్షాన జన్ను కుమార్, రాణి, రాజు, సురేష్, శ్యామల, స్వర్ణ, అనురాధ, మెడికల్ పక్షాన దినేష్, రవీందర్ రెడ్డి, విజయ, సమిత, శ్రీధర్ రెడ్డి, పద్మ మొదలగు వారు పాల్గొన్నారు.

ధాన్యపు సిరి.. పువ్వుల మడి..

ధాన్యపు సిరి.. పువ్వుల మడి..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: అన్నం పెట్టే రైతన్న కష్టానికి ఫలితం
దక్కుతుంది. గత సీజన్లో నష్టపోయిన రైతులకు రబీ సీజన్లో లో వేసిన పంటలు ఆశలు చిగురింపజేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బోరేగావ్, జీర్లపల్లి, బోపన్పల్లి, ప్యాలారం, ఈ ద్దులపల్లి, దేవరంపల్లి, ఏడాకులపల్లి, మేదపల్లి తదితర ప్రాంతాల్లో రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరిగిన పచ్చని పైర్లు కనువిందు చేస్తున్నాయి. ధనియాల పంట పువ్వులు, వాటి నుంచి వెదజల్లుతున్న సుగంధ పరిమళం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెల్ల కుసుమ పువ్వులు కన్నుల పండుగగా నిలుస్తున్నాయి. మొక్కజొన్న, జొన్న, శనగ, గోధుమ, వామ వంటి పంటలు ఈ ప్రాంతాల్లో విస్తారంగా సాగులో ఉన్నాయి. ఊతకొచ్చిన పంటలను చూసి రైతన్న ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా వివిధ గ్రామాల్లో మామిడి తోటల్లో పూసిన పూత వాహనదారులను, రైతులను మరింత ఆనందం పరుస్తోంది.

మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం…

మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం

28 నుంచి 31 వరకు వనదేవతల మహాజాతర

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామ శివారులో గల శ్రీ సమ్మక్క -సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసాం,ఈ నెల 28 నుంచి 31 వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు,మేడారం తరువాత అత్యంత వైభవంగా జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో అతిపెద్ద జాతర కంఠాత్మకూర్ మినీ మేడారం జాతరకు లక్షల్లో భక్తులు వచ్చి వనదేవతలు అమ్మవార్లను దర్శించుకోవడం అనవాయితీ,జాతర ఆధునికరణ కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, సర్పంచ్ కొంగంటి తిరుపతి కృషి,పట్టుదలతో జాతర ఏర్పాట్లకు కొన్ని మార్పులు చేర్పులు చేసాం గద్దేల చుట్టూ ఐరన్ పైపులు గ్రిల్స్, నూతన బోర్ లు ఏర్పాటు చేసాము,అంతే కాకుండా జాతర కమాన్ నుంచి గద్దేల వరకు మొరం పోయించి భక్తులకు రోడ్డు సౌకార్యం కల్పించాము,అంతే కాకుండా నిరంతరం విద్యుత్,త్రాగునిటీ సౌకార్యం,స్థానాల గట్టాలు, మరుగుదోడ్లు,సౌండ్ సిస్టం, లైటింగ్,క్యూలైన్లు,మెడికల్ ఎమర్జెన్సీ,పోలీస్ బందోబస్తు, వాహనాల పార్కింగ్, జాతరకు మూడు కిలోమీటర్ల లోపు అన్ని వైపుల నుంచి ఆర్టీసీ బస్సు ఏర్పాట్లు,ఆటో రవాణా సౌకర్యం,అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. భక్తులు ఉమ్మడి పరకాల మండలం వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి వనదేవతలు అమ్మవార్లను దర్శించుకుని మీ యొక్క కోరికలు నెరవేరాలని అమ్మవార్ల ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని జాతర కమిటీ వైస్ చైర్మన్లు భాషిక శ్రీనివాస్,కుమ్మరి నరేష్ తెలిపారు.

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చేది ఎప్పుడు…

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చేది ఎప్పుడు

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సింగరేణి కార్మిక సమస్యలపై అనేకసార్లు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా పలు మార్లు స్ట్రక్చర్ మీటింగ్ లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు పరిష్కరించడంలో యాజమా న్యం విఫల మైందని, కార్మిక సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె కైనా సిద్ధమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కార్మిక సమస్యలపై అనేకసార్లు ఇన్కమ్ టాక్స్, మెడికల్ బోర్డు, సొంతింటి పథకం మారుపేర్ల, డిస్మిస్ కార్మికుల, మైనింగ్ స్టాప్ సమస్యలను పరిష్కరించాలని అనేక అంశాలపై స్ట్రక్చర్ మీటింగ్లలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు యాజమాన్యం స్ట్రక్చర్ మీటింగ్ అంగీకరించిన ఏ సమస్యను పరిష్కరించలేదని దాటవేసే ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. మెడికల్ బోర్డు నిర్వహణలో యాజమాన్యం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందన్నారు. అట్లాగే ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా అనేక అంశాలపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన కార్మికుల సొంతింటి పథకం అమలు చేయడంలో విఫలమైందన్నారు. అట్లాగే పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ తగ్గించాలని, మైనింగ్ స్టాప్ సమస్యలు తోపాటు ఎన్నికల డ్యూటీలో విధులు నిర్వహించిన కార్మికుల ఆన్ డ్యూటీ గా పరిగణించాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని,వాటిని పెడచెవిన పెట్టిన యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి రెండో వారంలోపు సమస్యలు పరిష్కరించకుంటే సింగరేణిలో సమ్మె చేయడం తప్పదని రాజ్ మార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి గురిచేపల్లి సుధాకర్ రెడ్డి, జి శ్రీనివాస్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version