అమ్మవార్లను దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ కుటుంబం

అమ్మవార్లను దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు
మొగులపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్ళపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరను బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన జనసందోహం మధ్య మహేందర్ గౌడ్ అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులను సమర్పించారు. అనంతరం తన పెద్ద కుమార్తె వేముల అనుప్రియ అమ్మవార్లకు ఇష్టమైన నిలువెత్తు బంగారంను దేవతలకు సమర్పించారు. ఈ క్రమంలో ఆయన జాతరలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మ తల్లులు వారిని నమ్ముకున్న భక్తులకు కష్టాల చీకట్లను తరిమి కొట్టి, వారిని చల్లగా చూసేందుకు చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ మినీ మేడారం గద్దెలపై ఆసీనులైనారన్నారు. ఆ తల్లుల దీవెనలతో ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ దేవతలను వేడుకున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు.

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

 

వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మేడారం విచ్ఛేసి.. సమ్మక్క – సారలమ్మలను దర్శించుకోనున్నారు.

ములుగు, జనవరి 30: మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలు గద్దెలనెక్కారు. ఈ నేపథ్యంలో ఆ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం పోటెత్తారు. దీంతో భక్తులను కంట్రోలు చేయడం ఒకానొక దశలో తీవ్రంగా పరిణమించింది. మరో వైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. నేడు మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అందుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ జాతరకు హాజరై.. వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

ఈనె 28న ప్రారంభమైన ఈ జాతర.. 31న ముగియనుంది. ఇంకో వైపు జాతరలో జరుగుతున్న పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అదే సమయంలో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కారు అద్దాలతో పాటు స్థానిక షాపులను భక్తులు ధ్వంసం చేశారు. అలాగే భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని.. వారంతా వీవీఐపీలు, పోలీస్ కుటుంబాల సేవల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మేడారం ఉత్సవాల్లో భాగంగా బుధవారం.. సారలమ్మ, గురువారం.. సమ్మక్కలు గద్దెపైకి చేరుకున్నారు. దీంతో మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైనట్లయింది. గురువారం అర్థరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువెల్ ఓరమ్ మేడారం విచ్ఛేసి.. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు వీఐపీలు, వీవీఐపీలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో 25 మంది ఐపీఎస్‌లు అక్కడి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుకునే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది మేడారం తరలివస్తున్నారు.

మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం…

మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం

28 నుంచి 31 వరకు వనదేవతల మహాజాతర

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామ శివారులో గల శ్రీ సమ్మక్క -సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసాం,ఈ నెల 28 నుంచి 31 వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు,మేడారం తరువాత అత్యంత వైభవంగా జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో అతిపెద్ద జాతర కంఠాత్మకూర్ మినీ మేడారం జాతరకు లక్షల్లో భక్తులు వచ్చి వనదేవతలు అమ్మవార్లను దర్శించుకోవడం అనవాయితీ,జాతర ఆధునికరణ కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, సర్పంచ్ కొంగంటి తిరుపతి కృషి,పట్టుదలతో జాతర ఏర్పాట్లకు కొన్ని మార్పులు చేర్పులు చేసాం గద్దేల చుట్టూ ఐరన్ పైపులు గ్రిల్స్, నూతన బోర్ లు ఏర్పాటు చేసాము,అంతే కాకుండా జాతర కమాన్ నుంచి గద్దేల వరకు మొరం పోయించి భక్తులకు రోడ్డు సౌకార్యం కల్పించాము,అంతే కాకుండా నిరంతరం విద్యుత్,త్రాగునిటీ సౌకార్యం,స్థానాల గట్టాలు, మరుగుదోడ్లు,సౌండ్ సిస్టం, లైటింగ్,క్యూలైన్లు,మెడికల్ ఎమర్జెన్సీ,పోలీస్ బందోబస్తు, వాహనాల పార్కింగ్, జాతరకు మూడు కిలోమీటర్ల లోపు అన్ని వైపుల నుంచి ఆర్టీసీ బస్సు ఏర్పాట్లు,ఆటో రవాణా సౌకర్యం,అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. భక్తులు ఉమ్మడి పరకాల మండలం వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి వనదేవతలు అమ్మవార్లను దర్శించుకుని మీ యొక్క కోరికలు నెరవేరాలని అమ్మవార్ల ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని జాతర కమిటీ వైస్ చైర్మన్లు భాషిక శ్రీనివాస్,కుమ్మరి నరేష్ తెలిపారు.

ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించిన వేముల మహేందర్ గౌడ్ దంపతులు

*ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ దంపతులు*

మొగులపల్లి నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆ దంపతులు స్వామివారికి మొక్కులను సమర్పించారు. అనంతరం స్వామివారి సేవలో పరితపించారు. అనంతరం వేముల మహేందర్ గౌడ్ దంపతులు మాట్లాడారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ..భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ రాష్ట్రంలోని దేవాలయాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం..ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించడం, రాష్ట్రంలో ప్రజలంతా భక్తి మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ మల్లికార్జున స్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ, సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో కలకాలం వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.

రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో అంగారక చతుర్థి సందడి…

రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో అంగారక చతుర్థి సందడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జనవరి 6, 2026న సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రేజింతల్ గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు స్వామివారికి అభిషేకం, అలంకరణ, పుష్పార్చన, కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు.

శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి గ్రామ స్వాములు…

శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి గ్రామ స్వాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి స్వాములు ఝరా సంఘం మండలంలోని చిలేపల్లి గ్రామ యువకులు సోమవారం ఉదయం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకొని ఆలయ అర్చకుల సమక్షంలో నియమనిష్టాలతో మాలధారణ వేశారు 41 రోజులు పాటు కొనసాగే మండల శివ దీక్షను శివ స్వాములు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. శివదీక్ష ప్రారంభించిన చీలపల్లి స్వాములు చిలపల్లి గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర దేవాలయంలో 41 రోజు పాటు మండల దీక్షను కొనసాగిస్తారు. అక్కడ నాగిరెడ్డి గురుస్వామి గారి ఆధ్వర్యం అనిల్ శివ స్వామి నర్సింలు శివ స్వామి నరేందర్ రెడ్డి శివ స్వామి భాస్కర్ రెడ్డి శివ స్వామి సిద్దు స్వామి సంగమేశ్వ రెడ్డి స్వామి కార్తిక్ స్వామి తదితర స్వాములు ఉంటున్నారు,

శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు బంగారు కవచాల సమర్పణ..

శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు బంగారు కవచాల సమర్పణ..

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూరు నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.
స్వామివారి ఉత్సవ మూర్తులకు భక్తులు భవానంద రెడ్డి – జ్యోతి దంపతులు బంగారు కవచాలను విరాళంగా ఆలయ ధర్మకర్తలు గండ్ర జ్యోతి వెంకట రమణా రెడ్డి కి అందచేశారు.
స్వామివారి సేవలో భాగంగా ఈ విరాళం అందజేసిన దాతలను ఆలయ కమిటీ వారు అభినందించారు. స్వామివారి సేవలో భక్తులు భాగస్వాములు కావడం సంతోషకరమని,దాతల కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు స్థానిక భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version