పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పలువురు అధికారులు గురువారం మధ్యాహ్నం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్ రెడ్డి, సీఐ శివలింగం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ యాక్ట్ – 1861 నిబంధనలు 1 నుండి 30 వరకు) అమలులో ఉంటాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ తెలియజేశారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు. నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించరాదు. శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టరాదు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న నేపథ్యంలో, ప్రజలు పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
మొగుడంపల్లి మండల పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం గ్రామాలవారీగా కేంద్రాలను ఎంపీడీఓ మహేష్ ఖరారు చేశారు. ధనసిరి, మాడిగి, ఇప్పేపల్లి, గౌసాబాధ్ తండా, అసద్ గంజ్, గోపన్ పల్లి, ఖాజామాల్పూర్, గోడిగార్ పల్లి, మొగుడంపల్లి, మిర్జంపల్లి, జంగర్ బోలి, అర్చనాయక్ తాండ, విట్టు నాయక్ తండ, మన్నాపూర్, జాడి మల్కాపూర్, రాయిపల్లి తండా, సజ్జ రావు పేట తండా, గుడుపల్లి, చున్నం బట్టి తాండ, పడియల్ తండా, ఔరంగ నగర్ గ్రామాలకు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివరాలకు 8309271537 నంబర్ ను సంప్రదించవచ్చు.
గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా నిష్పత్తికి సమానంగా రిజర్వేషన్లు (సీట్లు) కల్పించాలి
ములుగు టౌన్ నేటి దాత్రి
ములుగు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్) ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని, కానీ 2011-2025 ఈ మధ్యకాలంలో వారి జనాభా పెరిగి అనేక వేల మంది యువత కొత్తగా ఓటు హక్కు పొందారని ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తే వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు రాక రాజకీయ రంగంలో కూడా వారి వెనుకబడిపోయి వివక్షతకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వలన విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోల్పోయి బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఈ రిజర్వేషన్ విధానం వల్ల రాజకీయ రంగంలో కూడా అవకాశాలు కోల్పోతారని, భారత రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించి, సీట్లు కేటాయించాలని ఉందని, అలాగే ప్రభుత్వాలు అన్ని కులాల వారిని సమానంగా గౌరవించాలని రాజ్యాంగంలో పొందుపరిచారని అయినా నేటి పాలకులు అవేమీ పట్టించుకోకుండా బీసీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించి, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం అంటే ముమ్మాటికి వారిని అవమానించడమేనని, ఇది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి వ్యతిరేకమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైనదని వెంటనే ఈ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవరించి రాష్ట్రవ్యాప్తంగా మరియు ములుగు జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని లేనిచో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ముత్తారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ ఎం. రమేష్
ముత్తారం :- నేటి ధాత్రి
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ ముత్తారం పోలీస్ స్టేషన్ ను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తనిఖీ చేశారు. తనిఖీ లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించారు, కే డి, డీ సి, సస్పెక్ట్ షీట్ లు పరిశీలించారు వారి ప్రస్తుత చర్యల గురించి తెలుసుకున్నారు, స్టేషన్ వెర్టికల్స్, ఎఫ్ ఐ ఆర్ ఇండెక్స్ మొదలైన రికార్డ్స్ తనిఖీ చేశారు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండ చూసుకోవాలని సూచించారు. నిరంతం పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించాలని పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమం లో మంథని సీఐ బి. రాజు ముత్తారం ఎస్ ఐ రవి కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు
తిరుపతి జిల్లా మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన ఆర్ఎస్ఐ కె.అల్లీభాషా టీమ్ స్థానిక ఎఫ్వీఓ జాన్ శామ్యూల్ తో కలసి బుధవారం రేణిగుంట మండలం మామండూరు నుంచి కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున కాకిరేవులపెంట వద్ద ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని మామండూరు స్థానికులుగా గుర్తించారు. వారిని విచారించి, పరిసరాల్లో వేటుకగా ఆ ప్రాంతంలో దాచి ఉన్న 20ఎర్రచందనం దుంగలు కనుగొన్నారు. అరెస్టయిన వారితో పాటు ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీ వీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ జె శ్రీనివాస్ వీరిని విచారించారు. తరువాత ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
ఏఐఎఫ్డిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల హక్కులు, గౌరవాలను పక్కనపెట్టి వివక్షను అధికారిక విధానంగా మార్చుకుందని అగౌరవపరుస్తున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు.గురువారం రాష్ట్ర సమావేశం నర్సంపేట ఓంకార్ భవన్ లో జరగగా రాగసుధ మాట్లాడుతూ మహిళ శక్తి పథకంకింద వడ్డీలేని రుణాలు,ఇందిరమ్మ చీరల పంపిణీలో ప్రభుత్వం బహిరంగంగా అన్యాయం చేస్తోందని అవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మొత్తం 4,35,364 స్వయం సహాయక సంఘాలు ఉంటే కేవలం3,57,098 స్వయం సహాయక సంఘాలకు మాత్రమే 304 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు ఇచ్చి కపటప్రేమ చూపుతున్నదని ఆరోపించారు.ఇందిరమ్మ చీరల పంపిణీని ఎన్నికల ప్రయోజనాల కోసం కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ ఇందిరమ్మ పేరుతో కేవలం డ్వాక్రా గ్రూపు మహిళలకు మాత్రమే చీరలను అందిస్తుందని రాగసుద ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐనవోలు మండలంలో ఎన్నికల సందడి: కేడర్ కష్టం వర్సెస్ నాయకుల ఆరాటం “ఈసారి టికెట్లు కష్టపడ్డ కేడర్‌కా…? లేక ఖద్దరు చొక్కాలిచ్చే నోట్ల కట్టలకా…?” నాయకుల లక్ష్యం – ఆధిపత్యాన్ని నిలుపుకోవడమే “ఆగమవుతున్నము పట్టించుకోండి” అసంతృప్తి లో కష్టపడ్డ క్యాడర్ మెజారిటీ సర్పంచ్ స్థానాలు జనరల్ కేటగిరివే!! 17 గ్రామాల రాజకీయ సమీకరణలపై విశ్లేషణ
నేటిధాత్రి ఐనవోలు :-
ఐనవోలు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల పతాక వేళ మొదలైంది. హనుమకొండ రెవెన్యూ డివిజన్‌లో భాగంగా 2016లో ఐనవోలు మండలంగా ఏర్పడినప్పటి నుండి ,ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామ పంచాయతీలు ఉండటం ఈసారి ఎన్నికల రేసులో మెజారిటీ స్థానాలు జనరల్ కేటగిరీ కింద ఉండటంతో రాజకీయ నేతల దృష్టిలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. ప్రజలతో కంటే పైస్థాయి అనుచరులతోనే టికెట్ పంపకాలపై చర్చలు ఎక్కువగా సాగుతుండటం, జేబులు బరువైన వాళ్లే ముందంజలో కనిపించడం స్థానిక రాజకీయ విన్యాసాలపై కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
నాయకుల లక్ష్యం – ఆధిపత్యాన్ని నిలుపుకోవడమేనా??
ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే–ఎంపీ–జిల్లా నాయకుల దృష్టి మొత్తం పంచాయతీ స్థాయిలో తమ ఆధిపత్యాన్ని స్థిరపరచడంపైనే నిలిచింది. అనుచరులకు అవకాశాలు ఇవ్వాలనే హామీలు వెలుపల వినిపిస్తున్నా, నిజమైన కష్టపడ్డ కేడర్‌కి మాత్రం పట్టింపులు తగ్గుతున్నాయన్న ఆవేదన పార్టీ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది.
గ్రామాల్లో పార్టీ జెండా మోసి తిరిగిన వాళ్ల కంటే, చివరి నిమిషంలో వచ్చిన “ప్రత్యేక అనుచరులు” లేదా వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయం వైపు చూడని వ్యక్తులకు ఇదివరకే అధికారం అనుభవించిన వారికీ టికెట్లు చుట్టబెడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల నుంచి ఈ ఎన్నికల దాకా పార్టీ కార్యకర్తలు భుజాన పడ్డ పని, తట్టుకున్న ఒత్తిడి, గ్రామాల్లో ఎదుర్కొన్న ప్రతికూలతలన్నింటినీ మరచినట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారని కేడర్ ఆరోపిస్తోంది. “మా చెమట పిండుకొని వచ్చిన అధికార, మద్దతు మీ పాదాలకా? లేక నోట్ల కట్టలకా?” అనే ప్రశ్న గ్రామాల నుంచి నేరుగా నాయకుల కుర్చీల దాకా చేరుతోంది.
టికెట్లు చెమట చుక్కల కష్టానికా? ఖద్దరు చొక్కాలు ఇచ్చే నోట్ల కట్టలకా…?
టికెట్ పంపకాల్లో పారదర్శకత లేకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశం.సంస్థాగత కృషి, పునాది స్థాయి పని, గ్రామ అభివృద్ధి పట్ల నిజమైన కట్టుబాటు లేనట్టి కొత్త నాయకులు లేదా గతంలో అధికారాన్ని అనుభవించి సంపాదన కూడబెట్టుకున్న వాళ్ళకి కేవలం వారి అంగ ఆర్థిక బలాన్ని చూపి పార్టీలు టికెట్ ఇచ్చేలా నాయకులు ప్రజా ప్రతినిధులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నిజాయితీగా పార్టీ కోసం పనిచేయడం అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ సిద్ధాంతాలను జండాలను వదిలిపెట్టకుండా నిలకడగా నిలిచిన వారిని విస్మరించడం అంటే పార్టీలకే దీర్ఘకాలిక నష్టమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
సామాజిక సమీకరణలు – జనరల్ కేటగిరీ స్థానాల ప్రభావం
17 గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలైన ఐనవోలు నందనం కొండపర్తి ముల్కలా గూడెం నర్సింహుల గూడెం ఉడుత గూడెం రెడ్డిపాలెం పంతిని తదితర గ్రామాల్లో జనరల్, జనరల్ మహిళా స్థానాలు కావడం వలన కుల, వర్గ సమీకరణలు కాస్త విభిన్నంగా కదులుతున్నాయి.కొన్ని గ్రామాల్లో వ్యక్తిగత ప్రాభవం మరికొన్ని గ్రామాల్లో ఆర్థిక బలం,ఇంకొన్ని ప్రాంతాల్లో పెద్దలు– మధ్యవర్తుల ప్రభావంఅభ్యర్థుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి.
రాబోయే రోజులు కీలకం
అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే సరికి పెద్దఎత్తున అసంతృప్తి, తిరుగుబాట్లు, మౌన వ్యతిరేకత కనిపించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజులు ఐనవోలు రాజకీయ దిశను మార్చే అవకాశం ఉన్నందున అందరి చూపూ ఇప్పుడు నాయకుల నిర్ణయాలపైనే నిలిచింది.
రైతన్నలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పలమనేర్ అటవీ రేంజ్ పరిధిలోని వీ.కోట, బైరెడ్డిపల్లి గంగవరం, పలమనేరు రూరల్ మండలాలకు చెందిన అటవీ ప్రాంత గ్రామాల రైతులకు పంట నష్ట నివారణ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మొత్తం 92 మంది రైతులకు 9.60 లక్షల రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వం తప్పిదం వల్ల ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రం ఇబ్బందుల్లో కూరుకుపోయింది అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం రైతులకు సంబంధించిన అన్ని అంశాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఆదుకుంటున్నదన్నారు. అందులో భాగంగా ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు మూడు నెలలలోనే పరిహారపు చెక్కులను అందించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదన్నారు తెలియజేస్తుందన్నారు.ఇక ఏనుగుల దాడులను నివారించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు అటవీ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. అటవీ అధికారుల సలహాల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని పేర్కొన్నారు. ఇలా ఉండగా పంట నష్టపరిహారం తక్షణం అందుతుండటంపై పలు రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ పరిహారపు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, టిడిపి నాయకులు సోమశేఖర్ గౌడ్, నాగరాజరెడ్డి,ఆర్బిసి కుట్టిలతో పాటు సబ్ డీఎఫ్వో వేణుగోపాల్, ఎఫ్ ఆర్వో నారాయణ, మరియు సిబ్బందితో పాటు పలువురున్నారు.
ఎమ్మెల్యే మెగా రెడ్డి నూతన గృహప్రవేశానికి హాజరైన వ్యాపారులు వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నూతన గృహప్రవేశానికి వనపర్తి కాంగ్రెస్ నేత నరహరి నరేష్ వ్యాపారులు లగిశెట్టి చంద్రశేఖర్ సాకల్ పల్లి బొడ్డు శంకర్ తదితరులు హాజరయ్యా ఈ మేరకు ఎమ్మెల్యే మెగా రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు
గత రెండు సంవత్సరాల క్రితం జర్నలిస్టులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా, ఇప్పటివరకు వారికి అసలు స్థలం చూపించకపోవడం చాలా బాధాకరం. ఈ న్యాయమైన డిమాండ్ కోసం జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి డ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం సమాజంలో నిజాన్ని లేవనెత్తి ప్రజల ముందు ఉంచేవారు మీరు. ఎవరూ మాట్లాడలేని నిజాన్ని మీరు వెలుగులోకి తీసుకువస్తారు. రాత్రింబవళ్లు కష్టపడేది వార్త కోసం కాదు — సమాజంలో మార్పు కోసం. మీలాంటి గొప్ప వృత్తి ప్రతినిధులు ఇలాంటి సమస్యలతో నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. మా డాన్స్ యూనియన్ మేమంతా మీ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాము. మీ డిమాండ్ న్యాయమైనది, ప్రభుత్వం అధికారులు వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని స్పష్టంగా చూపించాలని మా యూనియన్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జయశంకర్ జిల్లా డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ తోటకూరి గణేష్ దుర్గం రమేష్ గౌరవ అధ్యక్షులుడాన్స్ మాస్టర్ దుట తిరుపతి జాయింట్ సెక్రెటరీ చాగర్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు
అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్య దర్శి బాసాని బాలకృష్ణ
శాయంపేట నేటిధాత్రి:
ఎన్నికలతో చేనేత సహకార సంఘాలకు పూర్వ వైభవం వస్తుందోనని నేతన్నలో ఏండ్లు ఎదురుచూస్తున్న వారి కోరిక అందని ద్రాక్షలా మారుతుంది ఇప్పుడు అప్పుడు అంటూ 8 ఏళ్లుగా ఎన్నికలు ఊరిస్తూనే ఉన్నారు తాజాగా ప్రభుత్వం చేనేత జౌళి శాఖ సహకార సంఘాల గడువును పొడిగి స్తూనే కాలయాపన చేస్తుంటే దీంతో అసలు ఎన్నికలు జరు గుతాయో అనే అనుమానాలు కార్మికుల్లో వ్యక్తమౌతుంది. నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వాయిదా వేస్తూ వస్తుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి గతంలో ఉన్న పాలకవర్గాలకే అధికారం అప్పగిస్తుంది ఇలా ఇప్పటివరకు 18 దఫాలుగా జరుగుతుంది. ఎన్నికలు జరగకపోవడం ప్రత్యేకంగా సంఘాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో వాటి పరిస్థితి దుర్భరంగా మారి మనుగడకు ప్రశ్నార్ధకం అవుతోందని చేనేత కార్మికులు పేర్కొంటున్నారు.
చేనేత సంఘాలకు ఎన్నికల నిర్వహించాలి
స్థానిక సంస్థల ఎన్నికలతో పా టు చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి బాసాని బాలకృష్ణ అన్నారు.మాట్లాడుతూ 8 సంవత్సరాల నుండి చేనేత సంఘానికి పర్సన్ ఇన్చార్జిగా పాలక వర్గాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు పెట్టకుండా నిర్లక్ష్యా నికి గుర్తు చేస్తున్నారని తెలిపా రు. ఇప్పటికీ ఎన్నికలు జరగక చాలా కాలం అవుతుంది ఎన్నికల నిర్వహించడం వల్ల చేనేత కార్మికుల సంక్షేమం మెరుగు పడుతుంది అయిన ప్పటికీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని దానిపై స్పష్టత లేదు.చేనేత సంఘాలకు ప్రభు త్వం నుండి వచ్చిన నిధులపై విచారణ చేయాలని అధికారు లకు విన్నవించుకుంటే సంఘం పాలకవర్గం రాజీనామాను ఆమోదించి స్పెషల్ ఆఫీసర్ ను నియమించడం అన్నారు. ఇప్పటికైనా చేనేత సొసైటీ నిధులకు సంబంధించి విచా రణ చేసి స్థానిక సంస్థల ఎన్నిక లతో పాటు చేనేత సంఘానికి కూడా ఎన్నికలు నిర్వహిం చాలని కోరారు
దీక్షా దివాస్ సమావేశంలో మాజి మున్సిపల్ చైర్మన్ పలస
వనపర్తి నేటిదాత్రి .
కె సిఆ ర్ దీక్ష చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించామని వనపర్తి పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ పలస రమేష్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా.రమేష్ గౌడ్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా దీక్షా దివాస్ నిర్వహించాలని నాయకులు కార్యకర్తలు దీక్షా దివాస్ గురించి ప్రజలకు తెలుప లని కార్యకర్తలను కోరారు 14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమం,10.సంవత్సరాల కె.సి.ఆర్ పరిపాలన యువతకు అవగాహన కలి పి చెందిoదుకు బీ ఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మీడియా ఇంఛార్జి నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,ఆవుల.రమేష్,విజయ్ కుమార్,ఉంగ్లం. తిరుమల్,బండారు.కృష్ణ, కంచ.రవి,సమద్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,గులాం ఖాదర్ ఖాన్, రమేష్ నాయక్,షేక్.జహంగీర్,జోహెబ్ హుస్సేన్,సునీల్ వాల్మీకి,ఎం.బాలరాజు,సుధాకర్,పెద్దముక్కుల.రవి,మంద.రాము,ముద్దసార్,నందిమల్ల.సుబ్బు వజ్రాల.సాయిబాబా తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం: బీజేపీ నేత శుభాకాంక్షలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటన రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.
ఉద్యానవన రంగంలో విశేష ప్రతిభ కనబరచి అతిచిన్న వయసులో డాక్టరేట్ పట్టా సాధించి అందరిమన్ననలు పొందాడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామవాసి.వివరాల్లోకి వెళితే..దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన,మహమ్మదపురం వ్యవసాయ సహకార సొసైటి చైర్మన్ ఊరటి సునీత మైపాల్ రెడ్డిల కుమారుడు డాక్టర్ ఊరటీ మహేష్ ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో వారికష్టంతో చదువుపై మక్కువ పెంచుకున్నాడు.చిన్ననాటి నుండే ఉన్నత చదువుల వైపుకు అడుగువేసి వ్యవసాయ ఉద్యానవన రంగం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.అనంతరం పిహెచ్ డి చేసేందుకు గాను మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించిన యువ విద్యావేత్త పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు.ఈ యువ విద్యావేత్త 27 ఏళ్లకే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుండి హార్టికల్చర్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) లో పట్టా పొందేందుకు గాను పరిశోధన మార్గదర్శకులు డాక్టర్ కె.ఎం. యువరాజ్ ఆధ్వర్యంలో స్వాలో రూట్ (డికాల్పిస్ హామిల్టోనీ) పరిశోధన అంశంతో జన్యు వైవిధ్యం మరియు విలువ పెంపుపై అధ్యయనాలు పూర్తి చేశాడు. ఈ యువ విద్యావేత్త. 2016–2020 విద్యా సంవత్సరంలో కొండాలక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీలో బి.ఎస్.సి హార్టికల్చర్ లో తన ప్రతిభ తో 7.98 ఓ.జీ.పి.ఏ సాధించాడు. అనంతరం 2020–2022 కాలంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి హార్టికల్చర్ పూర్తి చేసి ఓ జీ పి ఏ 8.95 సాధించాడు. 2022–2025 లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీహెచ్.డి పూర్తి చేసి ఓ జీ పి ఏ 9.37 సాధించాడు.తన పరిశోధనలో స్వాలో రూట్ ఒక ఔషధ మొక్కగా ఉండడంతో జన్యు వైవిధ్యం, విలువ పెంపు అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి శభాష్ అనిపించాడు. ఈ పరిశోధన ఉద్యాన ఉత్పత్తుల వినియోగం మరియు మార్కెట్ విలువ పెంపులో కొత్త మార్గాలను చూపనుందని విశ్వవిద్యాలయ అధ్యాపకులు మహేష్ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు.
డాక్టరేట్ ప్రదానం చేస్తున్న డాక్టర్ వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ
విద్యాభ్యాసం చేస్తూనే డాక్టర్ మహేష్ విద్యా ప్రయాణంలో దేశీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పేపర్లను ప్రజెంట్ చేసి అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.పరిశోధన మరియు శాస్త్రీయ ప్రజెంటేషన్లలో తమ ప్రతిభను నిరూపించాడు. అచ్చిన వయసులోనే డాక్టర్ సాధించడంతో దుగ్గొండి మండల వివిధ శాఖల అధికారులు మండల ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు వర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ ఊరటీ మహేష్ ప్రస్తుత యువతకు సందేశం పంపారు.భవిష్యత్తులో పరిశోధన, బోధన,మరియు ఉద్యాన రంగ అభివృద్ధిలో సేవలను కొనసాగించాలనే ఆలోచనతో మహేష్ ముందుకెళ్తానన్నారు.చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
డాక్టర్ ఊరటి మహేష్ ఫైల్ ఫోటో
డాక్టరేట్ పొందడం గర్వంగా ఉన్నది..తల్లిదండ్రులు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా కుమారుడు డాక్టర్ మహేష్ తన కష్టాన్ని చూస్తూ ఉన్నత చదువులు చదివి నేడు ఉద్యానవన రంగంలో డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఊరటి సునీత మైపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
ఫలించిన బిజెపి పోరాటం ఇసుక క్వారీల్లో తగ్గిన లోడింగ్ చార్జీలు హర్షం వ్యక్తం చేస్తున్న ఇసుక లారీ ఓనర్స్
మహాదేవపూర్ నవంబర్ 27 నేటి ధాత్రి *
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రంలో నడుస్తున్న ఇసుక క్వారీలలో అధిక లోడింగ్ చార్జీలు వాసులు చేస్తున్నారనే లారీ డ్రైవర్ల సమాచారం మేరకు గత వారం రోజుల క్రితం ఇసుక క్వారీలను సందర్శించి,ఇసుక అధిక లోడింగ్ చార్జీలపై క్వారీ యాజమాన్యన్ని ప్రశ్నించడం జరిగింది వారు దొర్జన్యంగా మేము ఇలాగే వసూల్ చేస్తాం అని వారు మమ్మల్ని బెదిరియ్యడం జరిగింది, వారిపై మొదటగా ప్రాజెక్ట్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలని తెలుపగా వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికే వత్తస్ పలికేలా మాట్లాడరు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాళేశ్వరం పర్యటన కి వచ్చిన్నపుడు వారికీ సరి అయినా ఆధారాలతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వెంటనే స్పందించిన అధికర యంత్రాంగం ఇసుక లోడింగ్ ఛార్జిలను తగ్గించడం జరిగింది,4100 ఉన్న ఇసుక లోడింగ్ ఛార్జ్ ని 2500 తగ్గించడం జరిగింది,గవర్నమెంట్ అడర్స్ ప్రకారం అసలు లోడింగ్ ఛార్జ్ కి డబ్బులు చెల్లించవాల్సిన అవసరం లేదు కానీ క్వారీ కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులు కుమ్మకై మీకు ఇంత మాకు ఇంత అని పంచుకుంటున్నారు, గవర్నమెంట్ అడర్స్ కంటే ఒక రూపాయి ఎక్కో తీసుకున్న కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమలు చేసి మా ప్రాంత లో అక్రమాలకు తావు లేకుండా చేస్తామని అన్నారు, అలాగే అవినీతి గురించి తెలుపుగనే స్పందించి చర్యలు తీసుకున్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు వారు ధన్యవాదములు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది
లక్ష్మీ దేవి అమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు లక్ష్మీ దేవి అమ్మ వారి ఆలయ 5వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమలలో పాల్గొని , తీర్థ ప్రసాదాలు స్వీకరించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ అమ్మ వారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి ,నారాయణ, ఉద్యమకారుడు సీనియర్ నాయకులు షకీల్, వార్డ్ మెంబర్ రాజు, మచేందర్,పార్టీ ప్రెసిడెంట్ రాజు ,నాయకులు ఏ.నారాయణ, సుభాష్,విశ్వనాథ్,గోపాల్ , భద్రనాథ్,హరికాంత్ రెడ్డి,రవి, శరణప్ప , గ్రామ పెద్దలు ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
ఉమ్రా యాత్ర కోసం వెళ్తున్న సోదరుడు అమీర్ అలీ సాహెబ్
◆:- శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు….,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్రా యాత్రకు వెళ్తున్న.ముస్లిం సోదరులందరి తరపున దర్శనం చేసుకొని.అల్లహ దయతో జహీరాబాద్ ప్రాంత ప్రజలు శాంతిగా ఉండాలని కాంక్షించాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకోవాలిని అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,గ్రామ మాజి సర్పంచ్ హబ్సీ రాజు,మాజి ఎంపీటీసీ లు విజయ్ రెడ్డి,రామన్న,మాజి ఉప సర్పంచ్ రాజు,పార్టీ ప్రెసిడెంట్ మాణిక్,ఉద్యమకారుడు షకీల్,నాయకులు ఓంకార్ రెడ్డి,సిదన్న,మాల్ రెడ్డి,బసవ,దశరథ్, గాలెప్ప, రేశాంత్ రెడ్డి, శేఖామత్,రఫీ, అఫ్రోజ్, ఫిరోజ్ , ఇస్మాయిల్, టీపు, అజ్జు, కైఫ్, సాంబి హాజీ, జుబేర్, సోహైల్, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.
మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలి
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల(నేటి ధాత్రి ):
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు వెంటనే టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని అన్నారు. టి-పోల్ వెబ్ సైట్ , యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని సూచించారు.
ఫైనల్ చేసిన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని , పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు .
నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అన్నారు. అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు .
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలన్నారు.
జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు ఎన్నికల కమిషనర్ సూచించారు.
ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.
ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు.
ఇంచార్ట్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టి-పోల్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ శర్ఫుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్మిక చట్టాలు 40 కోట్ల కార్మికులకు ఆదర్శవంతమైనవి
బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య
శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు 40 కోట్ల మంది కార్మికులకు ఆదర్శవంతం, చారిత్రాత్మకమైన చట్టాలు అని బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడించారు.బుధవారం శ్రీరాంపూర్-నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాజకీయ ప్రేరేపిత సంఘాలు రాజకీయ ప్రయోజనాల కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.భారత ప్రభుత్వం 49 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా సవరించడం కార్మిక హక్కుల, సంస్థల సంరక్షణ,పరిశ్రమల ప్రగతి,దేశ అభివృద్ధి, నిర్మాణాత్మకమైన పారదర్శకత కలిగిన ఆదర్శవంతమైన చారిత్రాత్మకమైన చట్టాలను సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ స్వాగతిస్తున్నామని తెలిపారు.వలస పాలన కాలంలోని పాత చట్టాలను మార్పు చేసిన చట్టాలను పూర్తిగా ఆధునిక,పారదర్శక, ఏకీకృత,కార్మిక-కేంద్ర వ్యవస్థను తీసుకువస్తున్నాయని తెలిపారు.14 జాతీయ కార్మిక సంస్థల వేదిక కన్సెంట్ ఈ సంస్కరణలను వికసిత భారత్ 2047 లక్ష్యానికి దారితీసే చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తోందని వివరించారు.అసంఘటిత, వలస,గిగ్, ప్లాట్‌ఫారమ్,అనధికా రంగాల దాదాపు 40 కోట్ల మంది కార్మికులు తొలిసారిగా చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థలోకి రావడం ఈ కోడ్ల అత్యంత కీలకమైన ప్రయోజనమని చెప్పారు.ఇఎస్ఐసి తరహా ఆరోగ్య సేవలు,పింఛన్-లింక్డ్ ప్రయోజనాలు,ప్రసూతి రక్షణ, వికలాంగుల సహాయం, సంక్షేమ పథకాల పోర్టబిలిటీ వంటి సేవలు ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి.ప్రతి కార్మికుడికి ఫార్మల్ అపాయింట్ లెటర్ తప్పనిసరి కావడం,అలాగే జాతీయ కనీస వేతనం కంటే తక్కువ వేతనం దేశంలో ఎక్కడ అమలు చేయకూడదనే నిబంధన వల్ల అనౌపచారిక ఒప్పందాలు,అన్యాయ కత్తిరింపులు,సేవా రికార్డు లేమి వంటి దోపిడీలు తగ్గిపోతాయని తెలిపారు.డిజిటల్ వేతన వ్యవస్థలు పారదర్శకత బాధ్యతను పెంచుతాయని చెప్పారు.కార్మిక భద్రత, వ్యవసాయక ఆరోగ్యం,భద్రత కమిటీలు,సాంకేతికత ఆధారిత తనిఖీలు,మహిళల కార్మికుల భద్రత వంటి అంశాలపై కోడ్లు తీసుకొచ్చిన మెరుగుదలలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినవని పేర్కొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,యాజమాన్య సంస్థలు,కార్మిక సంఘాలు, నిపుణులతో జరిగిన విస్తృత సంప్రదింపుల ఫలితమని అన్నారు.కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే కార్మిక సంఘాలు కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి,ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, బోయిన మల్లేష్,జిల్లా తిరుపతి,రాజా రామ్ కిరణ్, శ్రీధర్,రామకృష్ణ,బాపు, మొగిలి,తిరుపతి,శేఖర్, సురేష్,మహేందర్ పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.