మహిళల అగౌరవపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఏఐఎఫ్డిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల హక్కులు, గౌరవాలను పక్కనపెట్టి వివక్షను అధికారిక విధానంగా మార్చుకుందని అగౌరవపరుస్తున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు.గురువారం రాష్ట్ర సమావేశం నర్సంపేట ఓంకార్ భవన్ లో జరగగా రాగసుధ మాట్లాడుతూ మహిళ శక్తి పథకంకింద వడ్డీలేని రుణాలు,ఇందిరమ్మ చీరల పంపిణీలో ప్రభుత్వం బహిరంగంగా అన్యాయం చేస్తోందని అవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మొత్తం 4,35,364 స్వయం సహాయక సంఘాలు ఉంటే కేవలం3,57,098 స్వయం సహాయక సంఘాలకు మాత్రమే 304 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు ఇచ్చి కపటప్రేమ చూపుతున్నదని ఆరోపించారు.ఇందిరమ్మ చీరల పంపిణీని ఎన్నికల ప్రయోజనాల కోసం
కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ ఇందిరమ్మ పేరుతో కేవలం డ్వాక్రా గ్రూపు మహిళలకు మాత్రమే చీరలను అందిస్తుందని రాగసుద ఆగ్రహం వ్యక్తం చేశారు.
