తాసిల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన అప్పయ్య పల్లి సర్పంచ్….

తాసిల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన అప్పయ్య పల్లి సర్పంచ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం నూతనంగా బాధ్యతలు చేపట్టిన గణపురం తహసిల్దార్
అడ్లూరి రాజేశ్వరరావు ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన అప్పయ్య పల్లి గ్రామ సర్పంచ్ ఎలకపల్లి రమేష్ ఉప సర్పంచ్ వినయ్ కుమార్ అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు రైతుల సమస్యలు సహకరించవలసిందిగా తహసిల్దార్ కి వివరించడం జరిగింది

కారేపల్లి నూతన తహసిల్దార్ ను సన్మానించిన మాణిక్యారం సర్పంచ్ పద్మ.

కారేపల్లి నూతన తహసిల్దార్ ను సన్మానించిన మాణిక్యారం సర్పంచ్ పద్మ.

కారేపల్లి నేటిధాత్రి

సింగరేణి మండల నూతన తహసీల్దారుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఓరుగంటి వెంకటేశ్వర్లు ను మాణిక్యారం సర్పంచ్ భూక్యా పద్మ సోమవారం పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ మాట్లాడుతూ మండలంలోని వివిదగ్రామాల్లో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేంటనే పరిష్కరించి న్యాయంచెయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ఖమ్మం డిసిసి బ్యాంక్ మాజీ డైరెక్టర్ ధారావత్ బద్దులాల్ తదితరులు పాల్గొన్నారు.

ఉపసర్పంచుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఎన్నిక.

ఉపసర్పంచుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఎన్నిక.

చిట్యాల నేటిదాత్రి :

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో భూపాలపల్లి జిల్లా ఉప సర్పంచ్ ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల కార్తీక్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ దేశ అభివృద్ధి కి గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామ అభివృద్ధి లో ఉప సర్పంచ్ లు ముందంజలో ఉండాలని ఈ సందర్బంగా కార్తీక్ కోరారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ప్రత్యేక చొరవ చూపించాలని కార్తీక్ అన్నారు, అనంతరం ఉప సర్పంచ్ ల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ని కార్తీక్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ ను ఉప సర్పంచ్ ల సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అని తెలిపారు , అనంతరం వారు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన ఉప సర్పంచ్ ల అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ
కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపసర్పంచ్ పాల్గొన్నారు.

మల్లాపూర్‌లో పంచాయతీ కార్యదర్శుల జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

*మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శుల క్యాలెండర్ ఆవిష్కరణ*

మల్లాపూర్ జనవరి 20 నేటి దాత్రి

ఎంపిడిఓ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ
మండల కేంద్రంలో చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి వంశీధర్ రెడ్డి, మండల్ అధ్యక్షులు మురళి, మండల్ ప్రధాన కార్యదర్శి రూథ అశోక్, సీనియర్ కార్యదర్శులు నారాయణరెడ్డి, రంజిత్ కుమార్, ముబీన్ మరియు ఇతర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మొగుడంపల్లిలో నామినేషన్ కేంద్రాలు ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కేంద్రాలు ఖరారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండల పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం గ్రామాలవారీగా కేంద్రాలను ఎంపీడీఓ మహేష్ ఖరారు చేశారు. ధనసిరి, మాడిగి, ఇప్పేపల్లి, గౌసాబాధ్ తండా, అసద్ గంజ్, గోపన్ పల్లి, ఖాజామాల్పూర్, గోడిగార్ పల్లి, మొగుడంపల్లి, మిర్జంపల్లి, జంగర్ బోలి, అర్చనాయక్ తాండ, విట్టు నాయక్ తండ, మన్నాపూర్, జాడి మల్కాపూర్, రాయిపల్లి తండా, సజ్జ రావు పేట తండా, గుడుపల్లి, చున్నం బట్టి తాండ, పడియల్ తండా, ఔరంగ నగర్ గ్రామాలకు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివరాలకు 8309271537 నంబర్ ను సంప్రదించవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version