మొగుడంపల్లిలో నామినేషన్ కేంద్రాలు ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కేంద్రాలు ఖరారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండల పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం గ్రామాలవారీగా కేంద్రాలను ఎంపీడీఓ మహేష్ ఖరారు చేశారు. ధనసిరి, మాడిగి, ఇప్పేపల్లి, గౌసాబాధ్ తండా, అసద్ గంజ్, గోపన్ పల్లి, ఖాజామాల్పూర్, గోడిగార్ పల్లి, మొగుడంపల్లి, మిర్జంపల్లి, జంగర్ బోలి, అర్చనాయక్ తాండ, విట్టు నాయక్ తండ, మన్నాపూర్, జాడి మల్కాపూర్, రాయిపల్లి తండా, సజ్జ రావు పేట తండా, గుడుపల్లి, చున్నం బట్టి తాండ, పడియల్ తండా, ఔరంగ నగర్ గ్రామాలకు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివరాలకు 8309271537 నంబర్ ను సంప్రదించవచ్చు.

“పంచాయతీ ఎన్నికలకు రెడీ ఏర్పాట్లు”

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు

నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు

మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలి

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి ):

 

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు వెంటనే టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని అన్నారు. టి-పోల్ వెబ్ సైట్ , యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని సూచించారు.

ఫైనల్ చేసిన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని , పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు .

నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అన్నారు. అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు .

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలన్నారు.

జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు ఎన్నికల కమిషనర్ సూచించారు.

ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.

ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు.

ఇంచార్ట్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టి-పోల్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ శర్ఫుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

ఈసారి ఛాన్స్ రాలే……తమ్ముళ్ల అసంతృప్తి…

ఈసారి ఛాన్స్ రాలే……తమ్ముళ్ల అసంతృప్తి…!

◆:- తమ్ముళ్ల తలరాతలు మార్చిన రిజర్వేషన్లు

◆:- పదవులపై ఆశలు వదులుకున్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే చాన్స్ రాలే.. ఏం చేద్దాం ఉన్నదాంట్లో సర్దుకు పోదాం.. అంటూ వివిధ పార్టీల తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారు. రిజర్వేషన్లు ఒక్కసారిగా తమ్ముళ్ల తలరాతలను మార్చేశా యి. ఇక ఆశలన్నీ నామినేటెడ్ పదవుల పైనే.. అంటూ గల్లి నుంచి జిల్లా దాకా తమ్ముళ్ల చర్చ జోరుగా సాగుతుంది. వివరాల్లోకి వెళితే..
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేయడంతో కొన్ని సామాజిక వర్గాల తమ్ముళ్ల తలరాతలు ఒక్కసారిగా మారిపోయాయి. గల్లి నుంచి జిల్లా దాకా కొన్ని సామాజిక వర్గాల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జిల్లా మండల స్థాయిలో పదవులు దక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేశారు. ఆయా పార్టీలో పని చేస్తున్న చోట నాయకులంతా తమ ఉనికిని చాటుకోవడానికి వివిధ గ్రామాల్లో అనేక సామాజిక కార్యక్రమా లను చేపడుతూ ప్రజల మధ్య ఉండి సేవలందించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీచేసి పదవులు దక్కించుకోవాలని ఆశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో ఇతర సామాజిక వర్గాలకు వాళ్ల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు జరిగింది.

‘బీసీ ఓట్ల శాతం గల్లి నుంచి జిల్లా దాకా. అధికంగా ఉండడంతో ఎంపీటీసీ జెడ్పిటిసి గ్రామ సర్పంచ్ పదవుల

అధికంగా జనాభా ప్రతిపాదికన బీసీ సామాజిక వర్గాలకు అధిక రిజర్వేషన్లు దక్కాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ వికారాబాద్ పరిగి కొడంగల్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు అధిక పదవులు దక్కే అవకాశం ఉంది.

రిజర్వేషన్లలో భారీగా మార్పు జరిగింది. దీంతో గ్రామపంచాయతీ నుంచి మండల జిల్లా స్థాయి వరకు ముఖ్యమైన కీలక పదవుల్లో రిజర్వేషన్లు ఒక్కసారిగా మారిపోయాయి. రెండువేల జనాభా. ప్రకారం అప్పట్లో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు ఒక సామాజిక వర్గానికి అందే విధంగా ఉండేది. కానీ 2025 బీసీ జనాభా ఓటర్ల ప్రతిపాదికన అన్ని సామాజిక వర్గాల్లో రిజర్వేషన్ల మార్పు జరిగింది. దీంతో తాము పోటీ చేయాలనుకుంటున్నా పదవి రిజర్వేష స్ ఇతర సామాజిక వర్గాలకు కేటాయించడంతో వాళ్ల ఆశలు నీరు కారిపోయాయి. అధికంగా జనాభా ప్రతిపాది కన బీసీ సామాజిక వర్గాలకు అధిక రిజర్వేషన్లు దక్కాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ వికారాబాద్ పరిగి కొడంగల్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు అధిక పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ సామాజిక వర్గాలు సర్పంచు లుగా జెడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులుగా గెలుపొంది మండల స్థాయిలో ఎంపీపీ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న కొన్ని సామాజిక వర్గాల నాయకులు నామినేటెడ్ పదవులు లేదా వివిధ రాజకీయ పార్టీల కీలక పదవులను ఆశించే పనిలో పడ్డారు. రిజర్వేషన్ ఈ వర్గానికి వచ్చిన పార్టీ పరంగా మద్దతు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకొని అత్యధికంగా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకోవడానికి తీవ్రంగా కృషి చేయాలని ఆయా పార్టీల నాయకులకు అధిష్టాన వర్గం దశ దశ నిర్దేశం చేసింది. ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలై ‘ కారణంగా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల అభ్యర్థుల కోసం ఆయా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.. అక్టోబర్ 9న అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కోసం రాష్ట్ర ఎన్నికలు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అప్పటిలోగా తమ అభ్యర్థులను ఖరారు చేసుకోవడానికి గ్రామాల వారీగా నాయకుల జాబితా కోసం పార్టీల కసరత్తు జరుగుతుంది. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఆయా పార్టీలో బలం ఎంతో ఎన్నికలు తర్వాత ఓటింగ్ లో భవతం తేలనుంది అప్పటివరకు వేది రూద్దాం…

వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ.

నేడు వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేసే అభ్యర్థులు నేడు వనపర్తి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు నామినేషన్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు నామినేషన్ వేసే అభ్యర్థులు 5000 రూపాయలు డిపాజిట్ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఆర్యవైశ్య మహా సభ ఆదేశాలు నియమ నిబంధనలు పాటిస్తామని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు వనపర్తి లో ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు ఆర్యవైశ్య యువకులు న్యాయవాదులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని పూరి బాలరాజ్ పేర్కొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version