40 కోట్ల కార్మికులకు నూతన కార్మిక చట్టాల లాభం

నూతన కార్మిక చట్టాలు 40 కోట్ల కార్మికులకు ఆదర్శవంతమైనవి

బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు 40 కోట్ల మంది కార్మికులకు ఆదర్శవంతం, చారిత్రాత్మకమైన చట్టాలు అని బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడించారు.బుధవారం శ్రీరాంపూర్-నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాజకీయ ప్రేరేపిత సంఘాలు రాజకీయ ప్రయోజనాల కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.భారత ప్రభుత్వం 49 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా సవరించడం కార్మిక హక్కుల, సంస్థల సంరక్షణ,పరిశ్రమల ప్రగతి,దేశ అభివృద్ధి, నిర్మాణాత్మకమైన పారదర్శకత కలిగిన ఆదర్శవంతమైన చారిత్రాత్మకమైన చట్టాలను సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ స్వాగతిస్తున్నామని తెలిపారు.వలస పాలన కాలంలోని పాత చట్టాలను మార్పు చేసిన చట్టాలను పూర్తిగా ఆధునిక,పారదర్శక, ఏకీకృత,కార్మిక-కేంద్ర వ్యవస్థను తీసుకువస్తున్నాయని తెలిపారు.14 జాతీయ కార్మిక సంస్థల వేదిక కన్సెంట్ ఈ సంస్కరణలను వికసిత భారత్ 2047 లక్ష్యానికి దారితీసే చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తోందని వివరించారు.అసంఘటిత, వలస,గిగ్, ప్లాట్‌ఫారమ్,అనధికా రంగాల దాదాపు 40 కోట్ల మంది కార్మికులు తొలిసారిగా చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థలోకి రావడం ఈ కోడ్ల అత్యంత కీలకమైన ప్రయోజనమని చెప్పారు.ఇఎస్ఐసి తరహా ఆరోగ్య సేవలు,పింఛన్-లింక్డ్ ప్రయోజనాలు,ప్రసూతి రక్షణ, వికలాంగుల సహాయం, సంక్షేమ పథకాల పోర్టబిలిటీ వంటి సేవలు ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి.ప్రతి కార్మికుడికి ఫార్మల్ అపాయింట్ లెటర్ తప్పనిసరి కావడం,అలాగే జాతీయ కనీస వేతనం కంటే తక్కువ వేతనం దేశంలో ఎక్కడ అమలు చేయకూడదనే నిబంధన వల్ల అనౌపచారిక ఒప్పందాలు,అన్యాయ కత్తిరింపులు,సేవా రికార్డు లేమి వంటి దోపిడీలు తగ్గిపోతాయని తెలిపారు.డిజిటల్ వేతన వ్యవస్థలు పారదర్శకత బాధ్యతను పెంచుతాయని చెప్పారు.కార్మిక భద్రత, వ్యవసాయక ఆరోగ్యం,భద్రత కమిటీలు,సాంకేతికత ఆధారిత తనిఖీలు,మహిళల కార్మికుల భద్రత వంటి అంశాలపై కోడ్లు తీసుకొచ్చిన మెరుగుదలలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినవని పేర్కొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,యాజమాన్య సంస్థలు,కార్మిక సంఘాలు, నిపుణులతో జరిగిన విస్తృత సంప్రదింపుల ఫలితమని అన్నారు.కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే కార్మిక సంఘాలు కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి,ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, బోయిన మల్లేష్,జిల్లా తిరుపతి,రాజా రామ్ కిరణ్, శ్రీధర్,రామకృష్ణ,బాపు, మొగిలి,తిరుపతి,శేఖర్, సురేష్,మహేందర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version