క్యాతన్ పల్లి నూతన మున్సిపల్ కమిషనర్‌గా మారుతి ప్రసాద్

మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

నూతన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సైతం ప్రాధాన్యత ఇస్తానని క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మారుతి ప్రసాద్ అన్నారు. రామగుండం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన ఏ మారుతీ ప్రసాద్ సాధారణ బదిలీల్లో భాగంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వచ్చి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని, సిబ్బంది సైతం సహకరించాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు సిబ్బంది కమిషనర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ముత్తారం పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ ఎం. రమేష్

ముత్తారం పోలీస్‌ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ ఎం. రమేష్

ముత్తారం :- నేటి ధాత్రి

 

రామగుండం పోలీస్‌ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ ముత్తారం పోలీస్‌ స్టేషన్ ను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తనిఖీ చేశారు. తనిఖీ లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించారు, కే డి, డీ సి, సస్పెక్ట్ షీట్ లు పరిశీలించారు వారి ప్రస్తుత చర్యల గురించి తెలుసుకున్నారు, స్టేషన్ వెర్టికల్స్, ఎఫ్ ఐ ఆర్ ఇండెక్స్ మొదలైన రికార్డ్స్ తనిఖీ చేశారు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండ చూసుకోవాలని సూచించారు. నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని పోలీస్ స్టేషన్‌ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమం లో
మంథని సీఐ బి. రాజు ముత్తారం ఎస్ ఐ రవి కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version