సామాజిక న్యాయ సమర భేరికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు

 

సామాజిక న్యాయ సమర భేరికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు

 రాయికల్. జూలై (4) నేటి ధాత్రి :

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు శుక్రవారం హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,క్రియాశీల కార్యకర్తలతో తలపెట్టిన భారీ బహిరంగ సమర భేరికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తరలిన రాయికల్ పట్టణ,మండల కాంగ్రెస్ శ్రేణులు.బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు పార్టీ నిర్మాణంపై దిశ నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.గ్రామ,మండల,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,క్రియాశీల కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్తున్న బస్సులను రాయికల్ లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,అల్లిపూర్ గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజరెడ్డి జెండా ఊపి కార్యకర్తల బస్సును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్, అత్తినేని గంగారెడ్డి,కొయ్యేడి మహిపాల్ రెడ్డి,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,దాసరి గంగాధర్, వాసం దిలీప్,షాకీర్,శ్రీకాంత్,రవి,కోడిపెల్లి ఆంజనేయులు,కడకుంట్ల నరేష్,అశోక్,మండ రమేష్,రాకేష్ నాయక్,తలారి రాజేష్,భూమా గౌడ్,సింగని రమేష్,కొత్తపెళ్లి గోపాల్,బత్తిని నాగరాజు,శివ,రాంకీ,సంతోష్, రాజేష్,రాజారెడ్డి,పల్లికొండ రమేష్,కాటి పెల్లి రాంరెడ్డి,కట్ల నర్సయ్య,సుధాకర్,ఏంబారి వెంకటేష్ గౌడ్, రాజశేఖర్,పరాచ శంకర్,ప్రసాద్, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,గ్రామ శాఖ అధ్యక్షులు,వార్డు ఇన్చార్జీలు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకుడు

రామకృష్ణాపూర్ నేటిధాత్రి::

జిల్లెల్లగడ్డ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి కనుకయ్య సతీమణి కనుకలక్ష్మి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా…. గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు…
కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కనుక లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రఘాడ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం ప్రసాధించాలని అ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈకార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు ఇటుకాల మొండయ్య,సమ్మయ్య తదితరులు ఉన్నారు.

ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు..

ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు రోశయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, డిబిసిడిఓ పుష్పాలత, కలెక్టరేట్ ఏ.ఓ విశ్వ ప్రసాద్, ఇతర అధికారులు, సంఘ నాయకులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

పెంచిన రైల్వే చార్జీలను తగ్గించాలి…

పెంచిన రైల్వే చార్జీలను తగ్గించాలి…

నేటి ధాత్రి -గార్ల:-

కేంద్ర ప్రభుత్వం పెంచిన రైల్వే ఛార్జిలను తక్షణమే తగ్గించి, సామాన్యులకు రైల్వే ప్రయాణం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ ఎదుట పెంచిన రైల్వే చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మధ్యతరగతి, పేద ప్రజలపై రైల్వే చార్జీల పెంపుదల భారం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ప్రయాణించే రైల్వే ఛార్జిలను పెంచి, ప్రయాణికులను ఆర్థికంగా దెబ్బతీస్తుందన్నారు.పెంచిన రైల్వే ఛార్జిలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వి.పి.వెంకటేశ్వర్లు,యం.నాగమణి,మండల కమిటి సభ్యులు సిహెచ్ ఎల్లయ్య, ఎ.రామకృష్ణ,జి.వీరభధ్రం,ఎస్.నాగరాజు,బి.నరేష్,బి.ఝాన్సీ, ప్రవీణ్,కోటయ్య,రమేష్,సంపత్,నరేష్,ప్రసాద్,రైల్వే ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు..

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ లో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అలాగే జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,ఆర్.ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి,డిబిసిడిఓ పుష్పలత, అధికారులు,సంఘ నాయకులు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

అల్లం పంట పైన అవగాహన సదస్సు.

అల్లం పంట పైన అవగాహన సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ,కోహిర్ మండలం,పిచేర్యాగడి గ్రామంలోనీ రైతు వేదికలో ఉద్యాన శాఖ,కొహీర్ మండల్ ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో, రైతులకు అల్లం పంట సాగు పై అవగాహన కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పంటల మీద ,ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ,అవగాహన కలిపించడం జరిగింది.
మామిడి, జామ, బొప్పాయ, అరటి, అల్లం, వెదురు, తదితర పంటల మీద ఉద్యాన శాఖ సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని , ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ,కోహిర్ ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సునీత అన్నారు.ఈ సందర్భంగా ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులకు మొక్కలను 90 శాతం రాయితీ, డ్రీప్ ఏర్పాటుకు 80 శాతం నుంచి వంద శాతం రాయితీ వస్తుందన్నారు. పంటను కంపెనీయే కొంటుందని, దీని కోసం కోహిర్ మండల్ లోనే ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదేవిధంగా సీనియర్ సైంటిస్టులు మాట్లాడుతూ , కోహిర్ ప్రాంతం ముఖ్యంగా అల్లం మరియు ఆలుగడ్డ జామ సాగులో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.అల్లం సాగులో ఎక్కువగా వచ్చే వ్యాధులకు సంబంధించిన నివారణను మరియు ఆ తెగుళ్లను ఎలా ఎదుర్కోవాలో వారు చాలా చక్కగా రైతులకు వివరించడం జరిగిందని రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సవిత, సంగారెడ్డి డిహెచ్ఎస్ఓ సోమేశ్వరరావు, డిడిఎస్, కెవికె సీనియర్ సైంటిస్ట్ వరప్రసాద్, శైలజ, నేటాఫిన్ సౌత్ ఇండియా హెడ్ సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి సునీత, మండల వ్యవసాయ అధికారి వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారి సవిత, ఆయిల్ ఫామ్ ఆఫీసర్ రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ అమృత వీరారెడ్డి, అనంతరం, చంద్రశేఖర్, గ్రామ మైనార్టీ చైర్మన్ జహీరుద్దీన్, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ కాంట్రాక్టర్ జవీద్ గారి మాతృమూర్తి కుటుంబ సభ్యులను.

ప్రముఖ కాంట్రాక్టర్ జవీద్ గారి మాతృమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

మరియు రాయల్ ట్రాన్స్పోర్ట్ ఇస్సాం సెట్ ఇటీవల మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ వారి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు .ఎమ్మెల్యే గారితో పాటు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజీం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,యువ నాయకులు ముర్తుజా తదితరులు ఉన్నారు.

ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాల కోసం దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు జులై 5 వరకు పొడిగించినట్లు తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తెలిపారు. దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు, వ్యాపార వాహనాలు, వినికిడి పరికరాలు, వాకింగ్‌ స్టిక్స్, వీల్‌ఛైర్లు తదితర ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జులై 5 వరకు దరఖాస్తు గడువు ను ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. అర్హులైనవారు టీజీఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.

అద్వాన్నపుస్థితిలో మార్కండేయ నగర్ కాలనీ..

అద్వాన్నపుస్థితిలో మార్కండేయ నగర్ కాలనీ*

మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీలో గల 2వార్డు పరిధిలోని మార్కండేయ కాలనీ వాసులు వర్షం పడితే చాలు బురద గుంటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్ తెలిపారు.ఈ సందర్భంగా పెండెం శివానంద్ మాట్లాడుతూ 200 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్న మార్కండేయ కాలనీలో డ్రైనేజీ ,రోడ్ల వ్యవస్థ లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో కాలనీ గురించి అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని ఆరోపించారు.వర్షాకాలం వస్తే చాలు గుంతలలో నీరుచేరి డెంగ్యూ, మలేరియా లాంటి రోగాల బారిన పడుతున్నారు. వాహనదారులు కాలనీలో వాహనాలు నడపాలంటే తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అన్నారు.

Pendem Sivanand.

గతంలో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మరమ్మతులు చేస్తామంటూ దాటవేస్తున్నారని అన్నారు. ఇకనైనా మున్సిపాలిటీ కమిషనర్ ర్,సిబ్బంది పట్టించుకోని కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని మార్కండేయ కాలనీ వాసుల తరఫున కోరుతున్నట్లు శివానంద్ తెలిపారు.

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి.

 

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు.

నర్సంపేట,నేటిధాత్రి:

భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి
విముక్తి కోసం సంఘం కట్టి బడిసెలు పట్టి బాంచన్ నీ కాళ్లు మొక్కుతా అన్న చేతులతో బందుకులు ఎక్కుపెట్టి మట్టి మనుషులు చేసిన చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన
స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య 59వ వర్ధంతిని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య బలిదానం కొలిమోలే రాజుకుంది.భూస్వాముల ఆగడాల్నీ కాల్చి బూడిద చేసింది. దొడ్డి కొమురయ్య అక్షరాస్యడు కాదు. మార్క్స్ ను చదవలేదు, మావోను అధ్యయనం చేయలేదు. కానీ వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అగ్గి రాజేశాడని వర్ణించారు. అప్పటికే జాగీర్దార్ల, జమీందార్ల, దేశముఖ్ ల ఆగడాలతో విసిగి వేసారిన తెలంగాణ పల్లెలు ఆవేదన, ఆగ్రహంతో లావాలా కుతకుత ఉడికి పోతున్నాయి. ముఖ్యంగా విస్నూర్ దేశముఖ్, రాపాక రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు బాబు దొర అరాచకాలు పల్లెలను నిద్ర లేకుండా చేసాయి.దొరల అణిచివేతకు,అరాచకాలకు వ్యతిరేకంగా,కౌలు,లెవీ రద్దు చేయాలని,కూలిరేట్లు పెంచాలని, పేదలకు భూములు పంచాలని, వెట్టిచాకిరి నిర్మూలించాలని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజా పోరాటాలు పెరిగాయని పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనలు, సభలు, వినతులు వంటి ప్రజాస్వామిక పద్ధతులలో పోరాటాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రజా నిరసన ప్రదర్శన 1946, జూలై 4న విస్నూర్ దేశముఖ్ ఇలాకాలోని కడవెండి గ్రామంలో ప్రారంభిమైంది. విస్నూర్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ గడి ముందుకు ప్రదర్శన చేరగానే, ఆయన గూండాలు ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ప్రదర్శనలో ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమురయ్య తుపాకీ గుళ్ళకు బలయ్యాడని బాబు తెలిపారు.ఈ వార్త దావానలంలా తెలంగాణ పల్లెలన్నీ ఆవహించింది.ప్రజల్లో అప్పటికే రగులుకొంటున్న అసంతృప్తి ఒక్క ఉదుటున పెల్లుబికింది. ఆగ్రహంతో కుతకుత ఉడుకుతున్న అగ్ని పర్వతం కడవెండిలో బద్దలైందన్నారు.ఈ నేపథ్యంలో కొమురయ్య బలిదానం తెలంగాణను కొలిమోలే రాజేసింది.ఊరూరా ప్రతిఘటన పోరాటాలు ఉవ్వెత్తునలేచాయి. భూస్వాముల గూండాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు గొడ్డలి, పార, పలుగు, గుతుపకర్ర, వడిశెల వంటి వ్యవసాయ పనిముట్లను ఆత్మరక్షణ ఆయుధాలుగా మలుచుకున్న క్రమంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటరూపం తీసుకున్నదని పేర్కొన్నారు.కాగా ఈ పోరాటంలో భూస్వాముల గడీలు నేలమట్టమయ్యాయి. దొరలు పల్లెలిడిచి పట్నంకు పరుగు తీసిండ్లు. వేలాది గ్రామాలు భూస్వాముల పాలన నుండి విముక్తి చెందాయన్నారు.ఆ పోరాటం ముందుకుతెచ్చిన ఎంజెడా ఇంకా మిగిలే ఉందన్నారు. మరోవైపు దేశంలో కార్పొరేట్ శక్తుల, మతోన్మాదుల కూటమి దేశాన్ని పట్టిపీడిస్తున్నదని,ప్రజా వనరులన్నిటిని దోచి బడా పెట్టుబడిదారుల ఖజానా నింపుతున్నదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, పరికి మధుకర్ పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మండల, పట్టణ నాయకులు బుర్రి ఆంజనేయులు, పుచ్చాకాయల నర్సింహా రెడ్డి, నాయకులు లక్క రాజు, తోటకూరి రాజేష్, కందికొండ సంతోష్, వీరన్న, ప్రశాంత్, నర్సింహారాములు తదితరులు పాల్గొన్నారు.

పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 

పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం చాలా దురదృష్టకరం

మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

ఎన్ హెచ్ ఆర్ సి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ

“నేటిధాత్రి”,పటాన్ చెరు / సంగారెడ్డి జిల్లా:

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ అన్నారు. మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏమిటనే అంశంపై పూర్తి విచారణ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయని, ఇంకా 13 మంది మృతదేహాల అచూకీ వెంటనే కనుగొనడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి ఇండస్ట్రియల్స్ ను రద్దు చేయాలని, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం మరియు సిగాచి రసాయనిక పరిశ్రమ యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు..

 

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”

● – ఎస్సై వినయ్ కుమార్….

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. గురువారం జహీరాబాద్ పట్టణ పరిధిలోని భవాని మందిర్ చౌరస్తా, బీదర్ చౌరస్తా లలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని అన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ వైలేషన్, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ సరిగా లేని, పత్రాలు లేని, సెల్ ఫోన్ డ్రైవింగ్ తదితర నిబంధనలు ఉల్లంగించిన వాహనాలకు రూపాయలు 17100 జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

◆: ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దాం

◆: జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు మహమ్మద్ షౌకత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం తేద్దామని జహీరాబాద్ యువనాయకులు రాంజోల్ మండలం మహమ్మద్ షౌకత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ శ్రేణులు, నాయకులు సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బిఆర్ఎస్, బీజేపీల చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దామని, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీలను ఎదుర్కొనేందుకు నావంతు కృషి చేస్తానాని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూభారతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద వర్గాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ 500 లకే వంట గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డుల మంజూరి, ఖాళీ పోస్టుల భర్తీ తదితర పథకాలు అమలుతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని, వారికి స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పిస్తునదని స్పష్టం చేశారు. త్వరలో సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించి పార్టీ శ్రేణుల కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిగా మంత్రి గారి మద్దతు ఉంటుందని తెలిపారు.

హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో..

 

హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో వ్యాధులను నిర్మూలించాలి

రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాలను అధిగమించాలి.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి,తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తుందని,టీబీ రహిత జిల్లాగా మార్చుటకు తగిన చర్యలు తీసుకుంటామన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలుపుతూ భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అదనపు కార్యదర్శి – అరుంధతి పట్నాయక్ ఎం.డీ (ఎన్ హెచ్ ఎం) ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టి.బి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ పై సమీక్షించారు.వరంగల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,అదనపు కలెక్టర్ జి.సంధ్యరాణితో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు.జిల్లాలో 8 రకాల వ్యాధి కారకాల బారిన పడే వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,04,979 మంది ఉన్నారని వారికి 3,794 మందికి జూన్ 3 నుండి రెండో విడత టిబి,మరియు 8 రకాల వ్యాధి గ్రాస్తులకి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

Warangal District Collector Dr. Satya Sarada

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి, తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తున్న నేపథ్యంలో టీబీ రహిత జిల్లాగా మార్చుటకు మరింత తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు సంబంధిత వైద్య అధికారులు ,సిబ్బంది  పాల్గొన్నారు.

పేదలకు అందని ఇందిరమ్మ ఇండ్లు..

 

పేదలకు అందని ఇందిరమ్మ ఇండ్లు

బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్

ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులతో

కట్టేవి ఇందిరమ్మ ఇండ్లు పేరుతో

కాంగ్రెస్ కార్యకర్తల కేనా ఇందిరమ్మ ఇండ్లు

చేర్యాల రెవెన్యూ డివిజన్ పై కాలయాపన

చేర్యాల నేటిదాత్రి

జనగామ నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇండ్లలో నిరుపేదలకు అందని ద్రాక్ష ల ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నదని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ విమర్శించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను సమకూర్చి ప్రభుత్వానికి ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు పేరుతో కట్టిస్తున్నారని విమర్శించారు మరియు నిరుపేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందడం లేదని జనగామ నియోజకవర్గంలో చాలా తక్కువ మందికి ఇచ్చారని చేర్యాల మున్సిపల్ పరిధిలో కేవలం 34 మందికే ఇవ్వడం వీరి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది అని విమర్శించారు దానిలో కాంగ్రెస్ కార్యకర్తలు కు ఇందిరమ్మ ఇండ్లు అధికం వెనుకబడిన చేర్యాల ప్రాంతం పై మీరు చూపిస్తున్న ప్రేమ ఇదేనా అని విమర్శించారు మరియు చేర్యాల రెవెన్యూ డివిజన్ 100 రోజుల్లో తీసుకువస్తానని వెళ్లిన ముఖ్యమంత్రి ఇక్కడి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎటు పోయిందని విమర్శించారు చేర్యాల రెవెన్యూ డివిజన్ తీసుకొని తప్పక వస్తానని రెండోసారి ఎంపీ ఎలక్షన్లో మాట ఇచ్చిన చామల కిరణ్ కుమార్ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడి ప్రజలకు చూపిస్తున్నాడని విమర్శించారు ఇప్పటికైనా వెనుకబడిన చేర్యాల ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలు అందరికీ ఇవ్వాలని అన్నారు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇంకా కాలయాపన చేయవద్దని అన్నారు

సామాజిక విలువలు దిగజారుతున్నాయి….!!!!

సామాజిక విలువలు దిగజారుతున్నాయి….!!!!

◆ :- దోపిడీ వ్యవస్థకు ప్రజలు అలవాటవుతున్నారు…….!!!!!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

అవినీతి సమాజంలో ఎంత లోతు గా వేళ్లూనుకుని రాజ్యామెలుతుందో.ఈ మధ్య కాలం లో అవినీతి నిరోధక శాఖకు దొరికిన కొన్ని అణిముత్యాల ఆస్తుల వివరాలే ప్రత్యక్ష సాక్ష్యామిస్తున్నాయి.చిరు ఉద్యోగులు సైతం వందల కోట్లకు అధిపతులు గా ఎదగడం వ్యవస్థలోని లొసుగులను చూపిస్తున్నాయి.స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రతి చెడు పనిలో మంచి ఉందనే నమ్మకం సమాజం లోకి మెల్లి మెల్లి గా చొప్పించ బడుతుంది.ఫలితంగా ప్రజలు దోపిడికు అలవాటై పోయారు.పైసా లేనిది పని కాదనే సత్యాన్ని జీవితం లో ఓ భాగంగా చేసుకున్నారు. ఏ చిన్న పనైనా, పెద్ద పనైనా అధికారులైన, నాయకులైన సమర్పణ సమర్పించుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయారు.అలవాటయ్యేలా వాస్తవానికి పరిస్తితులు స్టించబడ్డాయి.సమాజం లో పరపతి, పదవి లేకపోతే పచ్చి నిజం కూడా వచ్చి అబద్దంగా చిత్రీకరించ బడుతుందనే విధంగా వ్యవస్థల పని తీరు.దీనికి తోడు ఈ వ్యవస్థలకు రాజకీయ అంద ఉండడంతో నిజం న్యాయం అనే పదాల పై నమ్మకం మెల్లి మెల్లిగా తగ్గుతుంది.మెజారిటీ ప్రజలకు ధర్మ బద్దమైన పరిష్కార విధానం అనే వాక్యాల పై నమ్మకం సన్నగిల్లితుంది.సంస్థల్లో అవినీతిమయం.ఏ కార్యాలమైన లంచాల విధానం లేకుండా సాగే పరిస్థితులు లేవు.

Social values

మినుకు మినుకు మనే వెలుతురు లా అక్కడక్కడ అరా కోరా అధికారులు అవినీతి రహిత కార్యాలయాల కోసం ప్రయత్నాలు చేసినా అంతగా సఫలం కాలేక పోతున్నారు.రాజకీయ ప్రోద్భలం ఉపయోగించి అలాంటి అధికారులను బదిలీ చేయిస్తున్నా విషయాలు వెలుగు లోకి వచ్చాయి కూడా, అధికారం తోముడిపడి పదాధికారులు చెప్పు చేతుల్లో వ్యవస్థలు కీలు బొమ్మలై చంప బడుతున్నాయి.రాజకీయ దోపిడీ ట్రెండ్ మారి విధానం లో మార్పులు వచ్చాయి.ప్రజలను దోపిడీలో భాగస్వాములను చేసి, దోచుకోవడం లాంటి కొత్త ఆవిష్కరణ తో, అవినీతి హుందాగా దరాగా వర్ధిల్లుతుంది, చేసే ఆవినీతి ను అభివృద్ధి గా, చూపించుకోవాడానికి సవాలక్ష దారులున్నాయి.ముఖ్యంగా నమ్మే జనాలున్నారు.రాజకీయం పేరిట దోచుకోవడం అంటే ఎవరికి కూడా ఆశ్చర్యం వెయ్యడు.ఎందుకంటే ప్రజలు ఈ పద్ధతికి అలవాటు పడి పోయారు.జనాల్ని తమ తో కట్టి పెట్టుకునేందుకు కొన్ని పద్ధతులు అవలంబిస్తున్నారు.అందులో ముఖ్యమైనవి పధకాలు, వాస్తవంగా కొంత వరకు ఈ పధకాలు జనాలకు మేలు చేసేవి ఉన్నా అంతా కంటే ఎక్కువ ఓటు బ్యాంక్ రూపం పనికొస్తున్నాయి.రక రకాల పధకాలతో, ప్రతి పది మంది లో ఏడుగురు లబ్ది దారులైన తర్వాత జనల్లో ఏది నిజం, ఏది అబద్ధం అనే ఆలోచన నే రాధు.ఇంకా జనం లో పట్టు కోసం కుల పరంగా లెక్కలు చూసుకుని ఆయా కుల సంఘ నాయకులకో పదవి, కాస్త పరపతి కల్పిస్తే వారందరూ గుప్పిట్లో ఉంటారు.తద్వారా గ్రామ గ్రామం వరకు రాజకీయ పట్టు నిలుపుకోవచ్చు.మన సమాజం లో జరుగుతుంది ఇదే.ఈ మధ్య కొన్ని మద్యమాలు కూడా వీటికి తొడయ్యాయి.ఏదో ఓ విషయం పై చర్చ, ఆ చర్చ తో ఓ కొత్త వివాదని తెర లేపి, జనాల్ని రెండు మూడు భాగాలుగా విడదీసి, పాలకుల పని తీరును ప్రశ్నించే సమయం లేకుండా జనాల్ని మరో వైపు మళ్లించడం లో టి. వి. చానెళ్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.బదులుగా ప్రకటన లతో చానెళ్లు లబ్ది పొందడం, ఇలా ఒకదానితో మరొకటి ముడిపడి అవినీతి రాజ్య మేలుతుంది.సమాజంలో మార్పు కోరుకునేవారు లక్షల్లో వున్నారు కానీ వర్తమాన సమాజానికి అన్వయించ దగిన సరికొత్త రాజకీయ సిద్ధాంతం వారి వద్ద లేదు.అబద్దపు హామీ లు ఇస్తున్న కిక్కు వాస్తవ చేదు నిజల్లో దొరకదు, అందుకే జనం ఎవరెక్కువ పధకాలు ప్రకటిస్తే వారి వెంట వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు.జరుగుతున్నది తప్పని అక్కడక్కడ కొంతమంది.గొంతు చించుకుని అరుస్తున్నా వినేందుకు జనం సిద్ధంగా లేరు.సంస్కరణల కోసం సంఘర్షణ చేసిన వారెవరూ అంత సునాయాసంగా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు.స్వయంగా మహాత్మా గాంధీ చేసిన స్వాతంత్య్ర పోరాట ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారున్నారు.దేశ స్వాతంత్య్ర్యం ప్రకటించ బడిన తర్వాత కూడా, బ్రిటిష్ కు మద్దతుగా ర్యాలీ లు నిర్వహించిన వారున్నారు.సమయం. దాటిన తర్వాత పరిస్తితులకు తల వగ్గే జనాలు సమాజం లో ఎక్కువ..అందుకే కాబోలు, పెద్ద పెద్ద సంఘ సంస్కర్తలు సమాజం నుంచి తిరస్కరించ బడ్డ వారే ఎక్కువ.సామాజిక, రాజకీయ, సంస్కతిక విలువల్ని కాపాడేందుకు సంఘ సంస్కర్తల కోసం వేచి చూడకుండా జనమే మేల్కొనాలి.గళం వినిపించాలి.పెద్ద పెద్ద ఉద్యమాలు చేయ లేక పోయినా వ్యక్తిగతంగా తన వంతు మార్పు కోసం యువత నడుం బిగించాలి.మేధావి వర్గం కూడ అవినీతి రహిత మానవీయ సమాజాన్ని నిర్మించడానికి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహనీయుల సేవలు చిరస్మరణీయం..

మహనీయుల సేవలు చిరస్మరణీయం

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఘనంగా రోశయ్య జయంతి,దొడ్డి కొమురయ్య వర్ధంతి నివాళులు

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహనీయుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి, వేడుకలను దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ మరియు జిల్లా యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం
దొడ్డి కొమురయ్యకు నివాళి
జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమాల్లో డి.వై ఎస్ ఓ రాందాస్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి రాజ మనోహర్ రావు,జిల్లా అధికారులు , సిబ్బంది, ఆయా కుల సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

అసత్యపు ఆరోపణలు మానుకో..

అసత్యపు ఆరోపణలు మానుకో.. బహిరంగ చర్చకు సిద్ధమా ..?

సింగల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

అసత్యంతో కూడిన కల్పిత ఆరోపణలు మానుకోవాలని సంబంధిత ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సింగల్ విండో డైరెక్టర్(21వ వార్డు ఇంచార్జ్) ధర్ని మధుకర్ మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణకు సవాల్ విసిరారు.

గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఈనెల 2వ తేదీన స్థానిక ప్రెస్ క్లబ్ లో బేర సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడిన అసత్యపు మాటలను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

నిరాధారణమైన వాక్కులు అంత మంచివి కావని హితువు పలికారు.తాను ఎవరి భూములను అక్రమంగా తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఒకవేళ ఆధారాలతో నిరూపిస్తే దైవ సాక్షిగా ఆ భూములను ఈ ప్రాంత ప్రజలకు బే షరతుగా పంచుతానని పత్రికా ముఖంగా తెలుపుతున్నానని అన్నారు.

తగిన ఆధారాలతో శనివారం సర్వేనెంబర్ 8 లోని రైస్ మిల్లు వద్దకు వస్తే నేను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని అన్నారు.

నీ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ లబ్ధి కోసం అనేక పార్టీలు మారావే కానీ నిన్ను గెలిపించి రాజకీయంగా పదవులు కట్టబెట్టిన 21వ వార్డు ప్రాంత ప్రజలకు ఏ విధంగా నువ్వు సహాయం చేయలేదని విమర్శించారు.

నువ్వు ఎంపీపీ స్థానంలో ఉండి రొడ్డ రాజేశం,గాజుల విజయలక్ష్మి,తిప్పని పద్మ, పోతురాజుల రమేష్ వంటి పేద ప్రజలకు సంబంధించిన భూములను అక్రమంగా లాక్కొని వారిని అనేక రకాలుగా ఇబ్బంది చేసిన విషయాన్ని మర్చిపోయావ అని గుర్తు చేశారు.వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా 21 వార్డులో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక రాజకీయంగా భవిష్యత్తులో తన ఉనికిని కోల్పోతాడనే ఉద్దేశ్యంతో అసత్య ప్రేలాపనలు పేలుతున్నాడని మండిపడ్డారు.

భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి తాను సిద్ధమని ప్రజల మద్దతు ఎవరికో వేచి చూడాలని సవాలు విసిరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

జపాన్‌లో రేపు ఏం జరగనుంది.

జపాన్‌లో రేపు ఏం జరగనుంది

 

 

 

 

 

జపాన్‌లో 2025 జూలై 5న ఒక పెనువిపత్తు సంభవిస్తుంది. జపాన్‌కి, ఫిలిప్పీన్స్‌కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది.

  • జూలై 5న భయంకరమైన సునామీ వస్తుందంటూ..
  • 1999లో చెప్పిన జపనీస్‌ మాంగా ఆర్టిస్ట్‌ టట్సుకీ
  • కొవిడ్‌ గురించి, 2011లో జపాన్‌ను వణికించిన భూకంపం, సునామీలపై నిజమైన ఆమె జోస్యాలు
  • రెండు వారాలుగా జపాన్‌లోని టొకారో దీవుల్లో 900కు పైగా భూప్రకంపనలతో ప్రజల్లో ఆందోళన

టోక్యో, జూలై 3: ‘జపాన్‌లో 2025 జూలై 5న ఒక పెనువిపత్తు సంభవిస్తుంది.
జపాన్‌కి, ఫిలిప్పీన్స్‌కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది. .
దాని ప్రభావంతో 2011లో పెను విధ్వంసం సృష్టించిన సునామీకన్నా ఎత్తైన అలలు సముద్రంలో ఏర్పడతాయి’

జపాన్‌కు చెందిన మాంగా ఆర్టిస్ట్‌, ‘న్యూ బాబా వంగా’గా పేరొందిన ర్యోటుట్సుకీ రాసిన ‘ద ఫ్యూచర్‌ ఐ సా’ పుస్తకంలో చెప్పిన జోస్యం ఇది! 1999లో మొదటిసారి ప్రచురితమైన ఈ పుస్తకం..
2021 అక్టోబరులో పునఃప్రచురితమైంది.
2019లో ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్‌ సహా ఆ పుస్తకంలో ఆమె చెప్పిన పలు జోస్యాలు నిజంకావడంతో ఇది కూడా నిజమవుతుందేమోనని జపనీయులు భయపడుతున్నారు.
గత రెండువారాలుగా దక్షిణ జపాన్‌లోని టొకారా దీవుల్లో 900కుపైగా భూప్రకంపనలు నమోదవడం వారి భయాన్ని మరింత పెంచుతోంది.
‘‘ఎప్పుడూ కదులుతున్నట్టే ఉంది.
నిద్రపోవాలంటే భయమేస్తోంది’’ అని ఆ దీవుల ప్రజలు వాపోతున్నారు.
సునామీ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని భావిస్తున్నారు.

జూన్‌ 21 నుంచి మొదలైన ఈ భూప్రకంపనల తీవ్రత క్రమంగా పెరుగుతూ తాజా గా 5.5 తీవ్రతతో ఒక భూకంపం నమోదుకావడంతో జపాన్‌ వాతావరణ సంస్థ అప్రమత్తమైంది. అయితే..

టట్సుకీ జోస్యాన్ని నమ్మలేమని, అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి సహేతుకమైన, శాస్త్రీయ ఆధారాలూలేవని జపాన్‌ వాతావరణ సంస్థ అధికారులు కొట్టిపారేస్తున్నారు.

12 దీవుల సమాహారమైన టొకారాలో..

7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు.

4 ప్రధాన టెక్టానిక్‌ ప్లేట్ల నడుమ ‘పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’గా పేర్కొనే ప్రాంతంలో ఉండే జపాన్‌కు భూప్రకంపనలు కొత్తకాదు.

ముఖ్యంగా టొకారో దీవుల్లో ఉండే వారికి భూప్రకంపనలు సాధారణమే.

2023 సెప్టెంబరులో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి.

కానీ టట్సుకీ చెప్పిన తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఇన్ని ప్రకంపనలు వారిని భయపెడుతోంది.

 

టట్సుకీ జోస్యం గురించి విస్తృతంగా ప్రచారంకావడంతో చైనా, దక్షిణ కొరియా, తైవాన్‌ దేశాల నుంచి జపాన్‌కు ఎక్కువగా వచ్చే పర్యాటకుల సంఖ్య మూడు నెలలుగా బాగా తగ్గిపోయింది.

కిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో పర్యాటకుల సంఖ్య 50శాతం తగ్గింది.

సాధారణంగా హాంకాంగ్‌ నుంచి జపాన్‌కు వెళ్లే పర్యాటకులు సంఖ్య ఎక్కువుంటుంది.

జూన్‌-జూలై నెలల్లో హాంకాంగ్‌ నుంచి జపాన్‌కు విమాన టికెట్ల బుకింగ్‌లు 83శాతం పడిపోయాయి.

బుకింగ్‌లు లేకపోవడంతో దక్షిణ జపాన్‌లోని పలు నగరాలకు ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో నడపాల్సిన విమానాలను హాంకాంగ్‌ ఎయిర్‌లైన్స్‌ రద్దు చేసింది.

తస్మాత్‌ జాగ్రత్త: ‘2020 ఏప్రిల్‌లో ప్రపంచమంతా ఒక వైరస్‌ వ్యాపిస్తుంది..

’’అంటూ కొవిడ్‌ గురించి టట్సుకీ 1999లోనే జోస్యం చెప్పారు.

అది నిజమైంది.

ఆమె జోస్యం అక్కడితో ఆగలేదు.

‘‘ఆ వైరస్‌ కొంతకాలంపాటు మాయమై 2030లో మరింత ప్రాణాంతకంగా మారి మళ్లీ వస్తుంది’ అని చెప్పారు.

ఆమె చెప్పినట్టే జపాన్‌లో ఇప్పుడు సునామీవస్తే 2030ని తల్చుకుని ప్రపంచం వణికిపోవడం ఖాయం!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version