తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు..

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరం SSC, ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగించింది. జూలై 31 వరకు సాధారణ ఫీజుతో, ఆగస్ట్ 28 వరకు లేట్ ఫీజుతో అప్లికేషన్లు అధికారిక వెబ్సైట్లో www.telanganaopenschool.org లేదా MeeSevaలో అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ తర్వాత అభ్యర్థులు మూడు రోజుల్లో ధృవపత్రాలను సంబంధిత స్కూల్లు/కళాశాలలకు ఇవ్వాలి.

ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాల కోసం దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు జులై 5 వరకు పొడిగించినట్లు తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తెలిపారు. దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు, వ్యాపార వాహనాలు, వినికిడి పరికరాలు, వాకింగ్‌ స్టిక్స్, వీల్‌ఛైర్లు తదితర ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జులై 5 వరకు దరఖాస్తు గడువు ను ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. అర్హులైనవారు టీజీఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఎల్ఆర్ఎస్ గడువు మే 31 వరకు పొడిగింపు.

ఎల్ఆర్ఎస్ గడువు మే 31 వరకు పొడిగింపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ రాయితీ చెల్లింపు గడువు మే మాసం 31 వరకు పొడిగింపు చేసినట్లు మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన. పత్రికా ప్రకటన లో జహిరాబాద్ పురపాలక సంఘం కమిషనర్ ఉమామహేశ్వరరావు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version