తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే…

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
బిజెపి.ఆర్ఎస్ఎస్. లకు పోరాటానికి ఎలాంటి సంబంధం లేదు
ఉద్యమ కాలంలో తెల్లదొరల సేవలో ఆర్ఎస్ఎస్. బిజెపి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం చుక్కయ్య

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపినకమ్యూనిస్టులు నిజాం ప్రభువు, రజాకార్లు భూస్వాములు, జాగీర్దార్ల ఆధీనంలో ఉన్న భూముల్ని స్వాధినం చేసుకుని 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులది. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా 1946 నుంచి 1951 వరకు ఎర్రజెండా నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్ట్ లు అమరులయ్యారు. వేలాది గ్రామాలు నిజాం నవాబు పాలన నుంచి విముక్తి పొందాయి. అలాంటి మహోత్తరమైన ప్రజాపోరాటంలో ముస్లింలు సైతం ముఖ్యపాత్ర పోషించారు. అని అన్నారు. పోరాటానికి ఎలాంటి సంబంధంలేని బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లీం పోరాటంగా చిత్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది’ అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. చుక్కయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ .సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం. సిపిఎం మండల కమిటీ సభ్యులు రామ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణ పై స్టడీ.సర్కిల్ . ఏం చుక్కయ్యగారు బోధించారు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం పాలనలో తెలం గాణ ప్రాంతం మంత వెట్టి నడిచేదని, భూస్వాములు, పెత్తందార్లు, పటేల్‌. పట్వారీ లకు లొంగి పనిచేయాల్సిన దుస్థితి ఉండేదన్నారు.

 

 

 

దుర్భర పరిస్థితి నుంచి విముక్తి కల్గించి, ప్రజల్ని కాపాడేందుకు 1930లో ఆంధ్రమహాసభ పేరుతో కమ్యూనిస్టులు ప్రజల ముందుకొచ్చారని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ఐదెకరాల పంటను భూస్వామ్య గుండాలు ఎత్తుకెళ్లేందుకు పూనుకుంటే భీంరెడ్డి నర్సింహారెడ్డి. మల్లు స్వరాజ్యం. కృష్ణమూర్తి. మల్లు వెంకట నరసింహారెడ్డి దళం ఆ పంటను రక్షించి భూస్వామ్య గుండాలను ఎదిరించిన విషయాలను ఆయన వివరించారు. దొడ్డి కొమరయ్య బలిదానం తర్వాత సాయుధ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిందని, అన్నారు సిపిఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ. బాంచన్‌ కాల్మొక్త అన్న ప్రజలు బంధూకులు పట్టి పోరాటంలోకి దూకారని తెలిపారు. సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న సిపిఎం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరిన్ని ఉద్యమాలు నడిపేందుకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కే నారాయణరెడ్డి. మడిగే నాగరాజు. గుండెకారి బాబురావు వరికల్ గోపాల్ రావు .గుండెకారి. చిన్న మహేందర్. కే కవిత.రాజేశ్వర రావు. తదితరులు పాల్గొన్నారు

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి.

 

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు.

నర్సంపేట,నేటిధాత్రి:

భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి
విముక్తి కోసం సంఘం కట్టి బడిసెలు పట్టి బాంచన్ నీ కాళ్లు మొక్కుతా అన్న చేతులతో బందుకులు ఎక్కుపెట్టి మట్టి మనుషులు చేసిన చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన
స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య 59వ వర్ధంతిని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య బలిదానం కొలిమోలే రాజుకుంది.భూస్వాముల ఆగడాల్నీ కాల్చి బూడిద చేసింది. దొడ్డి కొమురయ్య అక్షరాస్యడు కాదు. మార్క్స్ ను చదవలేదు, మావోను అధ్యయనం చేయలేదు. కానీ వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అగ్గి రాజేశాడని వర్ణించారు. అప్పటికే జాగీర్దార్ల, జమీందార్ల, దేశముఖ్ ల ఆగడాలతో విసిగి వేసారిన తెలంగాణ పల్లెలు ఆవేదన, ఆగ్రహంతో లావాలా కుతకుత ఉడికి పోతున్నాయి. ముఖ్యంగా విస్నూర్ దేశముఖ్, రాపాక రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు బాబు దొర అరాచకాలు పల్లెలను నిద్ర లేకుండా చేసాయి.దొరల అణిచివేతకు,అరాచకాలకు వ్యతిరేకంగా,కౌలు,లెవీ రద్దు చేయాలని,కూలిరేట్లు పెంచాలని, పేదలకు భూములు పంచాలని, వెట్టిచాకిరి నిర్మూలించాలని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజా పోరాటాలు పెరిగాయని పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనలు, సభలు, వినతులు వంటి ప్రజాస్వామిక పద్ధతులలో పోరాటాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రజా నిరసన ప్రదర్శన 1946, జూలై 4న విస్నూర్ దేశముఖ్ ఇలాకాలోని కడవెండి గ్రామంలో ప్రారంభిమైంది. విస్నూర్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ గడి ముందుకు ప్రదర్శన చేరగానే, ఆయన గూండాలు ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ప్రదర్శనలో ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమురయ్య తుపాకీ గుళ్ళకు బలయ్యాడని బాబు తెలిపారు.ఈ వార్త దావానలంలా తెలంగాణ పల్లెలన్నీ ఆవహించింది.ప్రజల్లో అప్పటికే రగులుకొంటున్న అసంతృప్తి ఒక్క ఉదుటున పెల్లుబికింది. ఆగ్రహంతో కుతకుత ఉడుకుతున్న అగ్ని పర్వతం కడవెండిలో బద్దలైందన్నారు.ఈ నేపథ్యంలో కొమురయ్య బలిదానం తెలంగాణను కొలిమోలే రాజేసింది.ఊరూరా ప్రతిఘటన పోరాటాలు ఉవ్వెత్తునలేచాయి. భూస్వాముల గూండాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు గొడ్డలి, పార, పలుగు, గుతుపకర్ర, వడిశెల వంటి వ్యవసాయ పనిముట్లను ఆత్మరక్షణ ఆయుధాలుగా మలుచుకున్న క్రమంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటరూపం తీసుకున్నదని పేర్కొన్నారు.కాగా ఈ పోరాటంలో భూస్వాముల గడీలు నేలమట్టమయ్యాయి. దొరలు పల్లెలిడిచి పట్నంకు పరుగు తీసిండ్లు. వేలాది గ్రామాలు భూస్వాముల పాలన నుండి విముక్తి చెందాయన్నారు.ఆ పోరాటం ముందుకుతెచ్చిన ఎంజెడా ఇంకా మిగిలే ఉందన్నారు. మరోవైపు దేశంలో కార్పొరేట్ శక్తుల, మతోన్మాదుల కూటమి దేశాన్ని పట్టిపీడిస్తున్నదని,ప్రజా వనరులన్నిటిని దోచి బడా పెట్టుబడిదారుల ఖజానా నింపుతున్నదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, పరికి మధుకర్ పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మండల, పట్టణ నాయకులు బుర్రి ఆంజనేయులు, పుచ్చాకాయల నర్సింహా రెడ్డి, నాయకులు లక్క రాజు, తోటకూరి రాజేష్, కందికొండ సంతోష్, వీరన్న, ప్రశాంత్, నర్సింహారాములు తదితరులు పాల్గొన్నారు.

దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు.!

ఘనంగా సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

నాగారం మున్సిపాలిటీ సత్యనారాయణ కాలనీలో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారి 98 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి అన్నం రాజ్ సురేష్ , కురుమ సంఘం అధ్యక్షుడు జెన్నేయాదగిరి , ప్రధాన కార్యదర్శి నోములనాగరాజు కురుమ, సలహాదారుడు చిన్నం భాస్కర్ కురుమ ,జంగారెడ్డి, రెడ్డినాయక్, నాగరాజు,కురుమ సంఘం సభ్యులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version