ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు.

ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝారసంగం మండలంలో రైతుబంధు ఆయిల్ పామ్ మరియు మామిడి పంటల మీద ఆహ్వాన సదస్సు నిర్వహించడం జరిగింది ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది మరియు సంగారెడ్డి జిల్లాలో 3000 ఎకరాల oil palm సాగులో ఉంది ఈ సంవత్సరం 3750 ఎకరాలు ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించబడినది అదే విధంగా ఝరాసంగం మండలంలో 160 ఎకరాలకు సాగులో ఉంది మరియు కొత్తూరు D నర్సరీలొ 150000 మొక్కలను,ఆయిల్ పామ్ పంటని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు మరియు కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త శైలజ గారు మామిడిలో చేపట్ట వలసిన యాజమాన్య చర్యలు మరియు సస్యరక్షణ చర్యల మీద వివరించడం జరిగింది. తదుపరి మామిడి తోటలో చేపట్ట వలసిన కొమ్మ కత్తిరింపులను క్షేత్రం లో చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి సునీత రోజు గారు వ్యవసాయ అధికారి వెంకటేష్ గారు కెవికె సైంటిస్ట్ శిరీష గారు మరియు ఏపీవో రాజ్ కుమార్ గారు ఏఈఓ జ్ఞానం గారు గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రతినిధులు కొండలరావు గారు, రాజేష్ రెడ్డి, దినేష్ మరియు డ్రిప్పు ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

అల్లం పంట పైన అవగాహన సదస్సు.

అల్లం పంట పైన అవగాహన సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ,కోహిర్ మండలం,పిచేర్యాగడి గ్రామంలోనీ రైతు వేదికలో ఉద్యాన శాఖ,కొహీర్ మండల్ ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో, రైతులకు అల్లం పంట సాగు పై అవగాహన కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పంటల మీద ,ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ,అవగాహన కలిపించడం జరిగింది.
మామిడి, జామ, బొప్పాయ, అరటి, అల్లం, వెదురు, తదితర పంటల మీద ఉద్యాన శాఖ సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని , ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ,కోహిర్ ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సునీత అన్నారు.ఈ సందర్భంగా ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులకు మొక్కలను 90 శాతం రాయితీ, డ్రీప్ ఏర్పాటుకు 80 శాతం నుంచి వంద శాతం రాయితీ వస్తుందన్నారు. పంటను కంపెనీయే కొంటుందని, దీని కోసం కోహిర్ మండల్ లోనే ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదేవిధంగా సీనియర్ సైంటిస్టులు మాట్లాడుతూ , కోహిర్ ప్రాంతం ముఖ్యంగా అల్లం మరియు ఆలుగడ్డ జామ సాగులో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.అల్లం సాగులో ఎక్కువగా వచ్చే వ్యాధులకు సంబంధించిన నివారణను మరియు ఆ తెగుళ్లను ఎలా ఎదుర్కోవాలో వారు చాలా చక్కగా రైతులకు వివరించడం జరిగిందని రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సవిత, సంగారెడ్డి డిహెచ్ఎస్ఓ సోమేశ్వరరావు, డిడిఎస్, కెవికె సీనియర్ సైంటిస్ట్ వరప్రసాద్, శైలజ, నేటాఫిన్ సౌత్ ఇండియా హెడ్ సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి సునీత, మండల వ్యవసాయ అధికారి వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారి సవిత, ఆయిల్ ఫామ్ ఆఫీసర్ రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ అమృత వీరారెడ్డి, అనంతరం, చంద్రశేఖర్, గ్రామ మైనార్టీ చైర్మన్ జహీరుద్దీన్, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఎస్ఐ రేఖ అశోక్.

మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఎస్ఐ రేఖ అశోక్

విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు

చదువుతూనే మీ భవిష్యత్తు

చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదివే మూలధనం

విద్యార్థులకు చదివే నీ గమ్యానికి నిచ్చిన

చదివే జ్ఞానం పెంచుతుంది

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో
ఆదర్శ మోడల్ స్కూల్ లో స్థానిక ఎస్ ఐ వారి ఆధ్వర్యంలో మారక ద్రవ్యాల నిర్మూలనకై, ఆన్లైన్ లో జరిగే ఆర్ధిక మోసాల పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ మాట్లాడుతూ మత్తును కలిగించే మారక ద్రవ్యాలను వాడకూడదని వాటిని వినియోగిస్తే కలిగే అనర్థాలు ఎంతో వివరించడం జరిగింది. ఆర్ధిక మోసాలకు కారణమైన అనవసరపు మెసేజ్ లు, వాటి లింకులు ఓపెన్ చేసి రిప్లై ఇస్తే కలిగే ఆర్ధిక నష్టాల పట్ల అవగాహన
కలిగించారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ.తిరుపతి మాట్లాడుతూ
విద్యార్థులు తమ పూర్తి సమయాన్ని చదువుకోసం కేటాయించి గొప్ప ప్రయోజకులు కావాలని అందుకోసం ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. మారక ద్రవ్యాలు వినియోగిస్తే మన శరీరంపై కలిగే దుష్ప్రభావాలను చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో టీచర్స్ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

వ్యవసాయ కళాశాలలో రైతులకు అవగాహన సదస్సు..

వ్యవసాయ కళాశాలలో రైతులకు అవగాహన సదస్సు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న రైతులు అధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో జూన్ 4న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం రైతు వేదికలో జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను పచ్చి రొట్ట ఎరువులను వర్మి కంపోస్టు జీవన ఎరులను భూసార పరీక్ష ఫలితాలను బట్టి పంటలకు ఎరువులను.

అందించడం బట్టి రసాయన ఆధారిత పురుగు మందులను.మాత్రమే ఉపయోగించడం మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను పాటించడం పంట కోసం చేసిన వివిధ విత్తనాలను రసాయనిక ఎరులను మరియు రసాయనిక మందులు కొనుగోలు చేసిన రసీదులను.

భద్ర పరచాలని. సాగునుటి యజమాన్యం తడి పొడి పద్ధతితో పాటు వరి సాగు.

మల్చింగ్ సుస్థిరమైన వ్యవసాయ కోసం పంట మార్పిడి మరియు పంట వైవిద్దీకరణ పూల మరియు మునగ సాగు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం యూట్యూబ్ ఛానల్ ను మరియు ఏ యు వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని..

ఉపయోగించడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రైతుల వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు తదుపరి కార్యక్రమంలో అంశాలను పాటిస్తామన్నారు ఇట్టి కార్యక్రమంలో.

శాస్త్రవేత్తలు. డాక్టర్ . సిహెచ్. రమేష్. డాక్టర్ హిందూజ. ఎన్ ఏ..lcar.llrr. శాస్త్రవేత్త డాక్టర్ శృతి. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు. శ్రీనివాస్ రెడ్డి. వేణుగోపాల్. వ్యవసాయ అధికారి. కే సంజీవ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

ఈ శ్రీనివాస్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహాయ సంగం చైర్మన్ కె భాస్కర్. విజేందర్ రెడ్డి. వ్యవసాయ విస్తరణ అధికారులు. గౌతమ్ లక్ష్మణ్. విద్యార్థులు సిద్ధార్థ్ మరియు సన్నీ ప్రసాద్ రైతులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు.

విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు

మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలోని ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం అని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని,అలాగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు.ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి షీ టీం సభ్యులు శ్రవణ్,జ్యోతి,శ్రీలత, విద్యార్థులు,టీచర్స్ పాల్గొన్నారు.

ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు.

ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ శివారులో జరుగుతున్న 100 రోజుల పని తీరులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం ప్రతి ఒక్కరు వారి పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్
గురించి తెలపాలని,మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు.అలాగే సైబర్ నేరాల గురించి వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని అన్నారు. ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫిల్డ్ ఆఫీసర్ గుమాస మల్లేష్, షీ టీం సభ్యులు జ్యోతి,శ్రీలత, భరోసా సెంటర్ సబ్ ఆర్డినేటర్ పుష్పాలత,గ్రామస్థులు పాల్గొన్నారు.

భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహణ.

భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహణ.

రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలో మంగళవారం భూ భారతి కొత్త ఆర్‌ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్‌డీవో మహేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ భూవ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, భూవివాదాలను తగ్గించడం, రైతులకు భద్రత కల్పించడం ఈకొత్త చట్టం ప్రధాన లక్ష్యమన్నారు. భూభారతి యాప్ ఉపయోగం, భూమి హక్కులపై పూర్తి సమాచారం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ధరణి వ్యవస్థలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని, రైతులకు న్యాయం జరగలేదని, రైతులు తమ హక్కులను కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురయ్యారని, దీనివల్ల ఆత్మహత్యలు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో సాక్షాత్తు ఓతహసిల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కూడా జరిగిందన్నారు. కొత్త భూభారతి చట్టం రైతులకు అండగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, బోనస్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ వంటి పునరుద్ధరణ చర్యలు తీసుకువస్తోందని, రాష్ట్రంలో ఎనభై నుండి తోంభై శాతం రైతులు లబ్ధి పొందేందుకు ఇరవై ఒకవేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. సాంకేతిక సమస్యల వల్ల కొందరికి రుణమాఫీ ఆలస్యం అవుతోందని, త్వరలో రెండు లక్షల లోపు రుణాలన్నీ మాఫీ కానున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టం అమలైనందున రైతుల ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో అనేక సంక్షేమ పథకాలు రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుందని తెలిపారు. ఈసదస్సులో అధికారులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని చట్టంపై సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన సదస్సులో మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్ కిరణ్, తహశీల్దార్ వెంకటలక్ష్మి, గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మెరవేని తిరుమల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్, ఎంపీడీవో రాజేశ్వరి, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు.

నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి మండలం వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ వారు ఆధ్వర్యంలో సారంగపల్లి గ్రామ పంచాయతీలో కార్యాలయంలో రైతు లతో నిషేధిత గ్లసిల్ పత్తి విత్తనాల వినియోగం నిషేధిత గ్లోపోనేటు వినియోగం వల్ల కలుగు నష్టాలపై అవగాహన ఈ కార్యక్రమం పోలీసు వారు మరియు రెవెన్యూశాఖ వ్యవసాయ శాఖ నిర్వహించిన ప్రజలకు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించరు ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ ఏవో కిరణ్మయి ఏ ఈ ఓ తిరుపతి మండల ప్రజా పరిషత్ ఆఫీసర్ రాజేశ్వర్ పంచాయతీ కార్యదర్శి సవ్య పోలీస్ శాఖ మందమర్రి ఎస్సై రాజశేఖర్ ఏ.స్ఐ మజీద్ ఖాన్ పోలీస్ సిబ్బంది మాజీ సర్పంచ్  పాల్గొన్నారు

ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు…

ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు…

●సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ,

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో, కస్తూర్భా బాలికల విద్యాలయంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సూరి కృష్ణ నిర్వహించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించి, సూచనలు చేశారు. న్యాయమూర్తి న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధి చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో నిజజీవితంలో చట్టాల ఉపయోగం, సైబర్ క్రైమ్, సమాచార హక్కు చట్టం, మోటారు వాహనాల చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులందరూ చట్టాలను గౌరవించాలని సూచించారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ గోపాల్ , వైస్ ప్రెసిడెంట్ మానెన్న సీనియర్ న్యాయవాది పాండురంగా రెడ్డి న్యాయ వాదులు రుద్రయ్య స్వామి సయ్యద్ షకీల్ లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version