అద్వాన్నపుస్థితిలో మార్కండేయ నగర్ కాలనీ*
మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీలో గల 2వార్డు పరిధిలోని మార్కండేయ కాలనీ వాసులు వర్షం పడితే చాలు బురద గుంటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్ తెలిపారు.ఈ సందర్భంగా పెండెం శివానంద్ మాట్లాడుతూ 200 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్న మార్కండేయ కాలనీలో డ్రైనేజీ ,రోడ్ల వ్యవస్థ లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో కాలనీ గురించి అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని ఆరోపించారు.వర్షాకాలం వస్తే చాలు గుంతలలో నీరుచేరి డెంగ్యూ, మలేరియా లాంటి రోగాల బారిన పడుతున్నారు. వాహనదారులు కాలనీలో వాహనాలు నడపాలంటే తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అన్నారు.
గతంలో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మరమ్మతులు చేస్తామంటూ దాటవేస్తున్నారని అన్నారు. ఇకనైనా మున్సిపాలిటీ కమిషనర్ ర్,సిబ్బంది పట్టించుకోని కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని మార్కండేయ కాలనీ వాసుల తరఫున కోరుతున్నట్లు శివానంద్ తెలిపారు.