కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

హైదరాబాదులోని ఎల్.బీ స్టేడియం లో నిర్వహించ తలపెట్టిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రానున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ నాయకులకు సూచించారు. గురువారం చిట్యాల లోని ఎమ్మెల్యే మినీ క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ మోత్కురి ధర్మారావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. హైదరాబాదులోని ఎల్.బీ స్టేడియం లో నిర్వహించ తలపెట్టిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, భూపాలపల్లి నియోజకవర్గం నుండి వెయ్యి మందికి తగ్గకుండా రావాలని సూచించారు. ఈ సమ్మేళనానికి మల్లికార్జున ఖర్గే పాటు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య కాంగ్రెస్ గ్రామ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌బీ స్టేడియంలో నేడు ‘ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్

ఎల్‌బీ స్టేడియంలో నేడు ‘ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ బహిరంగ సభ

సభను విజయవంతం చేద్దాం : భీమ్ భరత్

శంకర్పల్లి, నేటిధాత్రి:

 

 

 

ప్రజలందరినీ జాగృతం చేసేందుకు “జై బాపు, జై భీం, జై సంవిధాన్” పేరిట మానవ హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణపై విస్తృత కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. జూలై 4న ఎల్‌బీ నగర్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ (AICC) జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరై ప్రసంగించనున్నట్లు భీమ్ భరత్ తెలిపారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడులపై ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా సమానత్వం, హక్కుల పరిరక్షణపై స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ కమిటీల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మైనారిటీ సెల్ మహిళా అధ్యక్షులు, బీసీ సెల్ అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో హాజరవ్వాలని భీమ్ భరత్ ఈ సందర్భంగా కోరారు.

ఎల్బీ స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళనం బహిరంగ సభను విజయవంతం చేయండి

➡ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమేళనం నిర్వహిచబడుతుంది.ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేసి ఈ బహిరంగ సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్,రామలింగారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి,మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,సామెల్,మరియు కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,రచన్న,తదితరులు పాల్గొన్నారు.

నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల.

నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల ఆత్మీయ సమ్మేళనం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జై బాపు – జై భీమ్ -జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఐఎన్టియుసి నేతలు పిలుపునిచ్చారు.ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులంతా పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.ఐఎన్టియుసి రాష్ట్ర నేత,తెలంగాణ ప్రభుత్వ మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్,ఎస్ సి ఎం ఎల్ యు సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ జైపూర్ లో మీడియాతో ఈసందర్భంగా మాట్లాడుతూ..గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రాధాన్యత ఉంది.కానీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకురావడం అనేది చాలా అవసరం. జూలై 4న జరిగే ఈ సభలో కాంగ్రెస్ పార్టీని నమ్మి నిస్వార్థంగా పని చేస్తున్న నాయకులకు అర్థవంతమైన ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.సెంట్రల్ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు,పార్టీలోని అందరూ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.మల్లికార్జున ఖర్గే స్వయంగా ఈసమావేశంలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.అలాగే పార్టీ శ్రేణుల మద్దతును సమీకరించుకునే గొప్ప అవకాశం అని తెలిపారు.అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు,ఐఎన్టియుసి మిత్రులు అందరు కూడా తప్పకుండా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version