స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

◆: ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దాం

◆: జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు మహమ్మద్ షౌకత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం తేద్దామని జహీరాబాద్ యువనాయకులు రాంజోల్ మండలం మహమ్మద్ షౌకత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ శ్రేణులు, నాయకులు సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బిఆర్ఎస్, బీజేపీల చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దామని, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీలను ఎదుర్కొనేందుకు నావంతు కృషి చేస్తానాని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూభారతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద వర్గాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ 500 లకే వంట గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డుల మంజూరి, ఖాళీ పోస్టుల భర్తీ తదితర పథకాలు అమలుతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని, వారికి స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పిస్తునదని స్పష్టం చేశారు. త్వరలో సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించి పార్టీ శ్రేణుల కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిగా మంత్రి గారి మద్దతు ఉంటుందని తెలిపారు.

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాలన

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాలన రావాలని తిరుమల శ్రీవారిని వేడుకున్న రవీందర్ యాదవ

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం యువనేత, బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌ను కేటీఆర్ ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దారని రవీందర్ యాదవ్ కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి, కమీషన్ల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతి పనికి కమీషన్ల పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని రవీందర్ యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version