అల్లం పంట పైన అవగాహన సదస్సు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ,కోహిర్ మండలం,పిచేర్యాగడి గ్రామంలోనీ రైతు వేదికలో ఉద్యాన శాఖ,కొహీర్ మండల్ ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో, రైతులకు అల్లం పంట సాగు పై అవగాహన కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పంటల మీద ,ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ,అవగాహన కలిపించడం జరిగింది.
మామిడి, జామ, బొప్పాయ, అరటి, అల్లం, వెదురు, తదితర పంటల మీద ఉద్యాన శాఖ సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని , ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ,కోహిర్ ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సునీత అన్నారు.ఈ సందర్భంగా ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులకు మొక్కలను 90 శాతం రాయితీ, డ్రీప్ ఏర్పాటుకు 80 శాతం నుంచి వంద శాతం రాయితీ వస్తుందన్నారు. పంటను కంపెనీయే కొంటుందని, దీని కోసం కోహిర్ మండల్ లోనే ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదేవిధంగా సీనియర్ సైంటిస్టులు మాట్లాడుతూ , కోహిర్ ప్రాంతం ముఖ్యంగా అల్లం మరియు ఆలుగడ్డ జామ సాగులో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.అల్లం సాగులో ఎక్కువగా వచ్చే వ్యాధులకు సంబంధించిన నివారణను మరియు ఆ తెగుళ్లను ఎలా ఎదుర్కోవాలో వారు చాలా చక్కగా రైతులకు వివరించడం జరిగిందని రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సవిత, సంగారెడ్డి డిహెచ్ఎస్ఓ సోమేశ్వరరావు, డిడిఎస్, కెవికె సీనియర్ సైంటిస్ట్ వరప్రసాద్, శైలజ, నేటాఫిన్ సౌత్ ఇండియా హెడ్ సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి సునీత, మండల వ్యవసాయ అధికారి వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారి సవిత, ఆయిల్ ఫామ్ ఆఫీసర్ రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ అమృత వీరారెడ్డి, అనంతరం, చంద్రశేఖర్, గ్రామ మైనార్టీ చైర్మన్ జహీరుద్దీన్, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.