రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.