ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు రోశయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, డిబిసిడిఓ పుష్పాలత, కలెక్టరేట్ ఏ.ఓ విశ్వ ప్రసాద్, ఇతర అధికారులు, సంఘ నాయకులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.