మహనీయుల సేవలు చిరస్మరణీయం
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఘనంగా రోశయ్య జయంతి,దొడ్డి కొమురయ్య వర్ధంతి నివాళులు
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహనీయుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి, వేడుకలను దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ మరియు జిల్లా యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం
దొడ్డి కొమురయ్యకు నివాళి
జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమాల్లో డి.వై ఎస్ ఓ రాందాస్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి రాజ మనోహర్ రావు,జిల్లా అధికారులు , సిబ్బంది, ఆయా కుల సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.