ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ : దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాల కోసం దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు జులై 5 వరకు పొడిగించినట్లు తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తెలిపారు. దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు, వ్యాపార వాహనాలు, వినికిడి పరికరాలు, వాకింగ్ స్టిక్స్, వీల్‌ఛైర్లు తదితర ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జులై 5 వరకు దరఖాస్తు గడువు ను ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. అర్హులైనవారు టీజీఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.