రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని కేంద్రమంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు.
అమరావతి, నవంబర్ 6: రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్ట్‌టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు మంత్రి అచ్చెన్నాయుడు (Union Minister Atchannaidu) లేఖ రాశారు. మొంథా తుఫాను ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తి అమ్ముకోవాల్సి వస్తోందని లేఖలో వెల్లడించారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్ సీజన్‌లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు, 8 లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం ఏపీపీ (CM APP), ఆధార్ ఆధారిత e-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App)ను రాష్ట్ర CM APPతో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో వివరించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఈవీఎం జిల్లా గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం పరిశీలించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకోసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
రోజుకు రూ.6తో SBI నుంచి రూ. 40 లక్షల లబ్ధి పొందవచ్చని మీకు తెలుసా?
రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే, అదే మీకు ఆపదలో ఎంతో అండగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చని మీకు తెలుసా..
BanSBI Account: రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ.. రూ.5.48 ఖర్చుపెట్టండి. అదే మీకు ఆపదలో ఎంతోడగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చు. ఈ పాలసీ పొందడానికి ఖాతాదారుడు ఏడాదికి రూ.2000 ప్రీమియం చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది.
మీరు ఏడాదికి రెండు వేలు చెల్లిస్తే, రూ. 40 లక్షలు, ఏడాదికి వెయ్యి చెల్లిస్తే రూ. 20 లక్షలు, లేదూ.. ఏడాదికి వంద రూపాయలు మాత్రమే చెల్లిస్తే, రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ అనుబంధ సంస్థ అయిన, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తమ ఖాతాదారులకు సమగ్రమైన, చౌకైన ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అందిస్తోంది. ఇది అనుకోని ప్రమాదాల బారిన పడ్డప్పుడు ఎంతో ఊరటనిస్తుంది.
రోడ్డు, విద్యుత్తు ప్రమాదాలు, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు.. యాక్సిడెంట్స్, పాముకాటు వంటి కారణాలతో మరణించినా బాధితుడు సూచించిన నామినీకి రూ.40 లక్షలు, ఎస్‌బీఐ అందిస్తుంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు లోపు వారికి అర్హత ఉంటుంది. ఈ తరహా స్కీమ్స్ ఇతర బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. హెల్త్ పరంగానే కాదు, ఇతర రంగాలకు కూడా తక్కువ ప్రీమియంతో ఎస్బీఐ ఇన్స్యూరెన్స్ సదుపాయం కల్పిస్తోంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా. కాలనీలో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 7వ తేదీ బుధవారం కార్తీక్ పౌర్ణమి రోజున అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని, గురువారం ఉదయం ఆలయ చైర్మన్ నర్సింహా రెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ ఘటనతో పట్టణంలో కలకలం రేగింది. దొంగలు ఆలయంలోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కార్తీక దీపాల వెలుగులతో కళకళలాడిన కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి… భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి దేవస్థానం కార్తీక దీపాల వెలుగులతో కళకళలాడింది. కార్తీకమాసం ఆఖరికి రోజైన అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. కార్తీక దీపాలు వెలిగించి,స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు కోనేటిలో దీపాలు వదిలారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని విశేష పూజలు చేశారు.
భూ వివాదంలో తుపాకీ కలకలం సృష్టించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి.
మెదక్, నవంబర్ 6: భూ వివాదంలో తుపాకీ కలకలం సృష్టించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూ వివాదంపై మెదక్ జిల్లా కోర్టు నుంచి సిద్దమ్మ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యర్ధులు.. గ్రామ శివారులోని పొలం వద్ద సిద్దమ్మ సహా ఆమె కుటుంబీకులను తుపాకీతో బెదిరించారు. భూమి వద్దకు వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానంటూ బెదురింపులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తమను బెదిరించారని, కాల్చేస్తామంటూ బయపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోహిర్ మున్సిపల్ కౌన్సిల్‌కు ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం
ముహమ్మద్ ఫిర్దౌస్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక మెమోరాండం సమర్పించారు. మున్సిపల్ కౌన్సిల్‌కు సంబంధించిన చాలా ప్రజా సమస్యలను పరిష్కరించాలని
◆:- బిఆర్ఎస్ యువ నాయకుడు ముహమ్మద్ ఫిర్దౌస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ టౌన్ కు చెందిన సామాజిక కార్యకర్త మరియు బిఆర్ఎస్ యువ నాయకుడు మహ్మద్ ఫిర్దౌస్ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కోహెర్ టౌన్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు కలిసి కోహిర్ మజ్లిస్ బడియాకు సంబంధించిన చాలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక లిఖిత పూర్వక మెమోరాండం ను అందజేశారు, దీనికి కోహిర్ టౌన్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి, సంబంధిత శాఖల అధికారులకు సూచనలు జారీ చేశానని మరియు కోహిర్ మజ్లిస్ బడియాకు సంబంధించిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా మరికొందరు కూడా పాల్గొన్నారు.
వీధిలైట్లు ఏర్పాటు చేయాలి
కోహీర్ మున్సిపల్ పట్టణంలోని పలు కాల నీల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోహీర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయ కుడు ఫిర్దౌస్ పాటు కోహీర్కు చెందిన పలువురు యువకులు కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు.
‘నాకు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది.. నా ఛాంబర్ ఎక్కడా?’.. మహిళ హల్‌చల్
తనకు కామారెడ్డి కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని, తన ఛాంబర్ ఎక్కడ అంటూ కలెక్టర్ కార్యాలయంలో మహిళ హడావిడి చేసింది. నకిలీ ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయంలో హల్ చల్ చేసి అక్కడినుంచి వెళ్లిపోయింది.
కామారెడ్డి, నవంబర్ 6: కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళ హల్‌చల్ చేసింది. ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మహిళ.. తనకు కామారెడ్డి కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని, తన ఛాంబర్ ఎక్కడ అంటూ కలెక్టర్ కార్యాలయంలో హడావిడి చేసింది. నకిలీ ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయంలో హల్ చల్ చేసి అక్కడినుంచి వెళ్లిపోయింది. దీంతో మహిళపై డిఆర్ఓ మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులతో కారులో బుధవారం మధ్యాహ్నం సమయంలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ వద్ద సదురు మహిళను గుర్తించారు. అదనపు కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భీకర కాల్పలు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 6: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు
విద్యార్థి దశ నుండి నేటి వరకు ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఝరాసంగం మండల్ బర్దిపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ప్రతాప్ కు ఆయన చేసిన సేవలను గుర్తించి ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను రీసర్చ్ అండ్ కల్చర్ భవన్ హైదరాబాద్ నందు అందించడం జరిగింది. ఆయన చేసిన సామాజిక సేవ కార్యక్రమాలకు గుర్తింపుగా డాక్టరేట్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, డాక్టరేట్ రావడంతో ఇంకా సామాజిక బాధ్యత పెరిగిందని డాక్టర్ ఎర్రోళ్ల ప్రతాప్ అన్నారు.
ఆయన విద్యార్థి దశలో విద్యార్థుల ఎన్నో సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల యొక్క విద్య సమస్యలే కాకుండా మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించి నిరుపేదలకు మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నారు. సమాజంలో విద్యా వైద్యం రెండు సంపూర్ణంగా అందినప్పుడే నిరుపేదల జీవితాలు బాగుపడతాయని వారన్నారు. అటు విద్యార్థి సమస్యలపై ఇటు నిరుపేదల ఆరోగ్యాలను కాపాడడానికి మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తండ్రి బాటలో తనయుడు వారి తండ్రి ఎర్రోళ్ల జయప్ప ఎన్జీవో ద్వారా దాదాపు 45 సంవత్సరాల నుండి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. వారి తండ్రి జయప్ప స్ఫూర్తి బాటలోనే తనయుడు డాక్టర్ ఎర్రోళ్ల ప్రతాప్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గౌరవ డాక్టర్ రేట్ రావడం తో ఇంకా సామాజిక బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో బాధ్యత యుతంగా, భావి భారత పౌరునిగా తన వంతు బాధ్యతను కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తానని వారన్నారు
జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో అధికారకాంగ్రెస్పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గం లోని డివిజన్ల వారీగా మంత్రులు ప్రచారంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రుల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ను ఇన్చార్జిలుగా నియమించిన కాంగ్రెస్ మిగతా మంత్రులకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఇక నియోజకవర్గంలో నేతలు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తు న్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదప్పైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తిప్పికొడుతూ ప్రజలకు వివరిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరణ ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రచారంలో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రతి డివిజన్కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మందికి ప్రచార బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. మంత్రితో పాటు నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు ఒక బృందంగా ప్రచార బాధ్యతలు చేపట్టారు. కాగా, ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సమావేశమయ్యారు.జూబ్లీహిల్స్ఎన్నిక ప్రచార తీరు, వ్యూహాలను చర్చించినట్లు సమాచారం.
గల్లీ గల్లీకి మంత్రులు
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్? ను గెలిపించాలని కోరుతూ మంత్రి సీతక్క శనివారం బోరబండలో దోశలు వేసి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. యూసుఫ్గూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడిపి ఓట్లు అభ్యర్థించారు. షేక్?పేట డివిజన్ లో మంత్రి వివేక్? ఇంటింటి ప్రచారం చేశారు. అలాగే ఎర్రగడ్డ రైతు బజార్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో సమష్టిగా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు.
◆:- 420 హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.
◆:- రైతు ప్రభుత్వం అంటూనే రైతుల పొట్ట కొడుతోంది.
◆:- బోరేగావ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేందర్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ ఎన్నికల పైన ఉన్న, శ్రద్ద పట్టింపు రైతుల పైనా గ్రామ పంచాయతీ ల పైనా మంత్రివర్గంనకు లేకపాయె అని ఝరాసంగం మండల బోరేగావ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేందర్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ మరియు ప్రభుత్వం రైతు సంక్షేమం కాంక్షిస్తామన్నా కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. రైతులకు సరిగా రుణమాఫీ చెయ్యలేదు, రైతు బంధు ఇవ్వలేదు. ఇస్తామన్న బోనస్ ను సైతం ఇప్పటికి రైతులకు అందించలేదు. అన్నం పెట్టిన రైతులే అధికారాన్ని కులగొట్టే పరిస్థితి ఏర్పడింది. నీళ్లు కరెంట్ ఇచ్చి పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసిన నాయకుడు కేసీఆర్ ఆనవాళు ఏ చేరిపివెయ్యడం ఎవరి తరం కాదు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామి ఒక్కటీ నెరవేర్చలేదు. 420 హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. ప్రజల కడుపు నింపే రైతుల కడుపు కొట్టకుండా వాళ్ళకైనా రైతు భరోసా వేసి అండగా నిలవాలని కోరుతున్నాము.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోపంతో రగిలిపోతున్నారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ సోషలిస్ట్ అభ్యర్థి, భారత మూలాలున్న జోహ్రాన్ మందానీ విజయం సాధించడంపై ట్రంప్ తీవ్ర అసహనం
Trump-New Yorkers: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోపంతో రగిలిపోతున్నారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ సోషలిస్ట్ అభ్యర్థి, భారత మూలాలున్న జోహ్రాన్ మందానీ విజయం సాధించడంపై ట్రంప్ తీవ్ర అసహనం వెళ్లగక్కుతున్నారు. మందానీ పాలనలో న్యూయార్క్ నగరం కమ్యూనిస్ట్ క్యూబా లేదా సోషలిస్ట్ వెనిజులాగా మారుతుందని ట్రంప్ అంటున్నారు.
`పిల్లలు సైతం ‘‘దేక్‌లేంగే’’ అని పాటలు పాడుతున్నారు
`’’కేటీఆర్’’ అంకుల్ నమస్తే అంటూ స్వాగతిస్తున్నారు
హైదరాబాద్, నేటిధాత్రి: తులం బంగారం ఇయ్యరు. వృద్దులకు ఇస్తామని చెప్పిన నాలుగు వేల పించన్లు ఇయ్యరు. మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇయ్యరు. విద్యార్దినులకు ఇస్తామన్న స్కూటీల జాడ లేదు. రైతులకు ఇచ్చే రైతు బంధుకు రాం..రాం..అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ పంచ్ డైలాగులు కొడుతుంటే జూబ్లీహిల్స్ జనం కేరింతలు కొడుతున్నారు. కేటిఆర్ చెబుతున్నప్పుడు వంత పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్న కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిరచాలంటూ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ కేటిఆర్ అంటుంటే రోడ్‌షోలకు హజరైన జనం మన ఓటు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అంటున్నారు. ఇదీ కేటిఆర్ క్రేజ్ అంటూ బి ఆర్‌ఎస్ శ్రేణులు సంబరపడుతున్నాయి. చాలా కాలం తర్వాత ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో, స్ట్రీట్ కార్నర్ సభల్లో, కేటిఆర్ రోడ్‌షోలకు విపరీతంగా హజరౌతున్నారు. స్వచ్చంధంగా వచ్చి కేటిఆర్ చెప్పే మాటలు వింటున్నారు. కేటిఆర్ వేస్తున్న పంచ్ డైలాగులకు జనం ఊడిపోతున్నారు. ఇంతటి క్రేజ్ ఈ మధ్య మరే నాయకుడికి లేదు. సహజంగా బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్‌ను చూసేందుకు జనం ఇలా ఎగబడుతుంటారు. సభలకు హజరౌతుంటారు. ఆయన మాటలు వినడానికి లైవ్ కార్యక్రమాలు చూస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా ఆ క్రెడిట్‌ను కేటిఆర్ సొంతం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ సెంటఆర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. కేటిఆర్ సభలకు విచ్చినంత జనం ఇతర పార్టీలకు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ తరుపున అసలైన స్టార్ క్యాంపెయిన్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఇంత మంది రావడం లేదు. ఆయన సభలు చాలా సప్పగా సాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి సిఎం. రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారు. ప్రచారంలో విసృతంగా పాల్గొంటున్నాడు. అటు మంత్రులు, ఇటు కాంగ్రెస్ అభ్యర్ధిని వెంట పెట్టుకొని సిఎం. రేవంత్ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. దానికి తోడు రహమత్ నగర్‌లో సిఎం. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఇటీవల ఇచ్చిన 25వేల రేషన్‌కార్డులు కట్ అవుతాయని హెచ్చరించారు. ఉచిత కరంట్ బంద్ అవుతుందన్నారు. సన్న బియ్యం ఆపేస్తామన్నారు. సబ్సిడీ సిలిండర్ ఇవ్వమన్నారు. ఇదిలా వుంటే తాజాగా కొత్తగా నియామకమైన మరో మంత్రి అజహరుద్దీన్ కాంగ్రెస్‌ను గెలిపించకపోతే జూబ్లీహిల్స్ రాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది కేటిఆర్‌కు ఆయుధాలుగా మారాయి. మామూలుగానే కేటిఆర్ లాంటి వాగ్ధాటి వున్న నాయకులకు చిన్న అవకాశం దొరికినా రచ్చ రచ్చ చేస్తారు. అలాంటిది సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి బియ్యం ఆపేస్తాం. రేషన్ కార్డులు కట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? వీటిపై కేటిఆర్ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నారు. దుమ్ము దుమారం రేపుతున్నారు. ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజలను బెదిరిస్తే ఓట్లు పడతాయని రేవంత్ అనుకుంటున్నారు. అలాంటి నియంతకు తగిన బుద్దిచెప్పాలంటూ కేటిఆర్ ప్రజలకు సూచిస్తుంటే జనం చప్పట్లు కొడుతున్నారు. సహజంగా రోడ్ షోలలో కార్నర్ మీటింగ్‌లు పది నిమిషాలు, పావు గంట సాగితేనే ఎక్కువ. కాని కేటిఆర్ కార్నర్ సభలు గంటకు పైగా సాగుతున్నాయి. జోరు వానలో కేటిఆర్ మాట్లాడుతుంటే జనం కదలడం లేదు. పైగా వానలో కూడా డ్యాన్సులు చేస్తూ కేటిఆర్‌కే ఉత్సాహాన్ని నింపుతున్నారు. దాంతో కాంగ్రెస్, బిజేపి నాయకులకు దక్కని క్రేజ్ కేటిఆర్‌కు సొంతమౌతోంది. ఇక బిజేపి నుంచి స్టార్ క్యాంపెయినర్లు ఎంత మంది వున్నా, రోడ్‌షోలకు, సభలకు, ప్రచారానికి పెద్దగా స్పందన లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆది నుంచి అన్ని రకాల బాధ్యతలు కేటిఆర్ నిర్వహిస్తూ వస్తున్నారు. అన్ని రకాల ప్రచార బాద్యతలు ఆయన భుజాన వేసుకున్నారు. మాగంటి గోపీనాధ్ చనిపోయిన నుంచి జూబ్లీహిల్స్‌లో అనేక రకాల పార్టీ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులకు అప్పగించే బాధ్యతలు అప్పగించినా, అందిరికన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కౌంటర్ల కోసం ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తూర్పారపడుతున్నారు. పైగా ఓట్ చోరి అంశంలో జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమీషన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉప ఎన్నికల వేళ పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు ఎంఐఎం, బిజేపిలనుంచి బిఆర్‌ఎస్‌లోకి డివిజన్ల వారిగా చేరికలు జరుగుతూనే వున్నాయి. వాటన్నింటికీ హజరౌతూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నారు. పార్టీలోకి చేరుతున్న వారికి స్వయంగా కేటిఆర్ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఇటీవల ప్రభుత్వం వల్ల నష్టపోయిన హైడ్రా బాదితులు, మూసీ బాధితులను స్వయంగా కలుస్తున్నారు. వారు తెలంగాణ భవన్‌కు వస్తామంటే రమ్మంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ కుటుంబాలు పడిన భాధనలు, వేధనలు వింటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా బాదితులతో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోయిందనే చెప్పాలి. అందుకే వెంటనే స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి హైడ్రా వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. అంటేనే హైడ్రా పేదల జీవితాలను ఎలా తలకిందులు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ భవన్‌కు వచ్చిన చిన్న పిల్లలు తమ అనుభవాలను చెబుతూ కన్నీటి పర్యంతమౌతుంటే కేటిఆర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలనుంచి కేటిఆర్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హమీలు, ప్రజలకు ప్రభుత్వం వున్న బాకీలను గుర్తు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తూ, ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం వల్ల నష్టపోయిన వారికి హైడ్రా బాధితులకు తప్పకుండా పార్టీ అండగా వుంటుందని భరోసా కల్పిస్తున్నారు. పొరపాటున జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను నమ్మితే, ఇక్కడికి కూడా బుల్డోజర్ వస్తుందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇలా ఎక్కడిక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్షణం తీరుకలేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్ది సునీతను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. గతం కన్నా వినూత్నమైన రీతిలో కేటిఆర్ ప్రచారం సాగిస్తున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ప్రభుత్వం ఇచ్చిన హమీలు, చేసిన మోసాలు చూపిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డి సభలకు, రోడ్‌షోలకు వస్తున్న జనాలకంటే రెట్టింపు జనాలు కేటిఆర్ సభలకు ప్రజలు హజరౌతున్నారు. కేటిఆర్ రోడ్‌షోలకు జనం ప్రభంజనంలా వస్తున్నారు. 2015 జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో కేటిఆర్ రోడ్‌షోలకు జనం తండోపతండాలుగా వచ్చే వారు. కేటిఆర్ ఎక్కడికెళ్లినా జనం పెద్దఎత్తున సమూహమయ్యేవారు. ఇక రోడ్‌షోలలో కేటిఆర్ వెహికిల్ కదిలేది కాదు. అంత జనం వచ్చే వారు. ఇప్పుడు సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కేటిఆర్ సభలకు ప్రజలు వస్తున్నారు. కేటిఆర్‌కు హైదరాబాద్ ప్రజల్లో ఎంత ఆదరణ వుందో, క్రేజ్ వుందో ఈ రోడ్‌షోల ద్వారా మరోసారి రుజవౌతోంది. తెలంగాణ ప్యూచర్ లీడర్ కేటిఆరే అనేది తేలిపోతోంది. అందుకే కేటిఆర్‌ను చూస్తూ జనం కేరింతలు కొడుతున్నారు. ఈలలు, చప్పట్లతో ఆయన మాటలకు ఫిదా అవుతున్నారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో అకాల వర్షంతో నీళ్లలోనే పొలాలు రైతుల కంట కన్నీళ్లు. అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది ఇటీవల కురిచిన భారీ వర్షాలతో చేతికి వచ్చే దశలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది కోతకు వచ్చిన పంట పొలాల్లో నీరు చేరి గొలుసులు మొలకెత్తుతున్న పట్టించుకోని అధికారులు. కండ్ల ముందే దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు ప్రతికూల పరిస్థితుల్లో రెక్కలు కండ్ల ముందే దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. ప్రతికూల పరిస్థితిలో రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట చేతికి రాక గుండెలు బాదుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరడమైనది
అప్పుల ఊబిలో అన్నదా తలు
సాగు చేసిన మొదలు విత్త నాలు ఎరువులు, మందులు కోతల ఖర్చులు రూపంలో రూపాయల లక్షలు అప్పు చేసి పంట పండించిన రైతులు తుఫాను తీవ్రతకు చేతికి వచ్చిన వరి పంట నేల వాలి మొలకెత్తుతున్న దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరు పెడుతున్నారు.కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వంలో చలనం లేదు
మాజీ స్పీకర్ మధుసూదనాచారి
ఆరు గాలం శ్రమించి పండించిన పంట నేల వారిన పంట మొలకెత్తుతుంటే చేనులో నీళ్లు రైతుకు కన్నీళ్లు మిగిల్చాయి. మాజీ స్పీకర్ చారి మాట్లాడుతూ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది భారీ తుఫానుకు పంట పొలాలు తీవ్ర నష్టం వాటిల్లాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతే రాజును చేసిన ఘనత. అదేవిధంగా మండల, గ్రామాల అభివృద్ధి, రైతులకు అందుబా టులోకి సౌకర్యాలు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వా న్నిది. మాజీ స్పీకర్ గా ఉన్నప్పుడు రైతులకు అందు బాటులోకి రోడ్డు మార్గం అభివృద్ధి చేసి, రైతులకు న్యాయం చేయడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వం యూరియా కొరత రైతులను ఇబ్బంది పెట్టడం, తుఫాను ప్రభావంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలు అంచనా వెయ్యక పోవడం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్న ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామివారి దేవస్థానము లో పార్వతి పరమేశ్వరుల కళ్యాణోత్సవ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు మరియు తోటి మిత్రులతో దైవదర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లికార్జున్ ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది,
బుగులోని వేంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. మెట్ల మార్గం ద్వారా ఎమ్మెల్యే వెళ్తూ, భక్తులతో మాట్లాడారు. పలువురు భక్తులు ఎమ్మెల్యే తో సెల్ఫీలు దిగారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఎమ్మెల్యే గుట్ట కింద ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే భక్తులనుద్దేశించి మీడియాతో మాట్లాడారు. శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జాతరకు రూ.7 కోట్లు నిధులు కేటాయించిందని, ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
జగ్గయ్యపేటలో ఏనుగు రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.. కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒడ్డాల తిరుపతికి చెందిన ఏనుగు రథం వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి రథాన్ని జాతరకు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేసి టెంకాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో భూమిలోని జాతర చైర్మన్
విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి *డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి*
నర్సంపేట,నేటిధాత్రి:
విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, దానికి ప్రభుత్వం చొరవచూపి ఎక్కువ నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా పీజీ, డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ విద్యారంగం పేదలకు అందని విధంగా తయారు కావడం జరిగిందన్నారు. పాలకులు కేటాయించవలసిన నిధుల కేటాయింపులో పక్షపాతం చూపడం తో విద్యారంగం ముందుకు పోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని మానవనరుల అభివృద్ధిలో భాగంగా కాకుండా లాభనష్టాల కోణంలో చూపడంతో నేడు విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు అందరికీ విద్య అందాలనే కొఠారి కమిషన్ ను అమలు పరచకుండా వ్యాపారంగా చూడడంతో నేడు విద్యారంగం వెనుకబడిపోయిందన్నారు. గ్రామీణ ప్రాంతా బడుగు బలహీన వర్గాల చదువు కోసం ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడమే దీనికి ప్రధానమైన కారణం అన్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డెమొక్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రఘు శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడడం కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయి ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ విద్యారంగంలో మార్పు లేదన్నారు. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన కాగిత యాకయ్య పదవీ విరమణ సందర్భంగా ఆయనను డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.ఈ జిల్లా సదస్సులో అధ్యాపక జ్వాలా సంపాదకుడు డాక్టర్ గంగాధర్, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ. శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రాజ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోవిందరావు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోవిందరావు, నర్సంపేట ఎంఈఓ కొర్ర సారయ్య, ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షులు గుంటి రామచందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు జి. ఉప్పలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మబూబాబాద్ జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తంగెళ్ల సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు దార్ల రవీందర్ రాష్ట్ర కౌన్సిలర్ కొమ్మాలు జిల్లా ఉమా శంకర్ ఉపాధ్యక్షురాలు సుధారాణి, వివిధ మండలాల బాధ్యులు ఎస్కే సర్దార్ కొర్ర రమేష్ మాలోతు జగన్ ఈదుల వెంకటేశ్వర్లు రావుల దేవేందర్ శ్యాంప్రసాద్, ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి
పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి..
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసఫ్ లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుందని, ఇప్పటివరకు విద్య రంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింద ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించలేదని, ముఖ్యంగా రాష్ట్రంలో 9000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, పెండింగ్ బకాయలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దుర్మార్గమని అది సరి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్య రంగ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని కళాశాల హాస్టల్ భవనానికి సొంత భవనం ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ కళాశాలల బాయ్స్ హాస్టల్ కు సొంత భవనం లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే సొంత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. లేనియెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ ధర్నాకు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రవీణ్, పోతుల పవన్, రమాకాంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, సురేష్, వంశీ, కృష్ణ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రముఖ పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్రహ్మశ్రీ జె వెంకటేశ్వర శర్మ,మణిదీప్ శర్మ ల ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు.అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,భక్తులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.