త్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ

త్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ

 

రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని కేంద్రమంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు.

అమ‌రావ‌తి, నవంబర్ 6: రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్ట్‌టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు మంత్రి అచ్చెన్నాయుడు (Union Minister Atchannaidu) లేఖ రాశారు. మొంథా తుఫాను ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తి అమ్ముకోవాల్సి వస్తోందని లేఖలో వెల్లడించారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్ సీజన్‌లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు, 8 లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం ఏపీపీ (CM APP), ఆధార్ ఆధారిత e-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App)ను రాష్ట్ర CM APPతో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో వివరించారు.

 రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..

 రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..?

 

తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? అని కవిత ప్రశ్నించారు. చనాక-కొరటా బ్యారేజీ ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.

ఆదిలాబాద్: పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మొంథా తుఫాన్ వల్ల పంట దెబ్బ తిని నష్ట పోయారని చెప్పారు. అమ్మడానికి పోతే తేమ పేరుతో పత్తి రైతులను వ్యాపారులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) మీడియాతో మాట్లాడారు.. 20 శాతానికిపై తేమ ఉన్న పంటను కూడా పూర్తి మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో సీసీఐ వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? అని కవిత ప్రశ్నించారు. చనాక-కొరటా బ్యారేజీ ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు అంచనాలు పెంచారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక పనులను ఆపేశారని పేర్కొన్నారు. దీంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు.. సీసీఐ రోజుకో నిబంధన తీసుకురావడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవల మోంథా తుపాన్‌ వరదలతో పత్తికి భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని 20 శాతం తేమ ఉన్నా సీసీఐ కొనుగోలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు నిలిపివేస్తామని తెలంగాణ జిన్నింగ్‌ మిల్లర్స్‌, ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version