బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియామకం….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T131256.308-1.wav?_=1

 

బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియమితులయ్యారు బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిషిధర్ రెడ్డి నియమాకాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దొంగల రాజేందర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి నాగపూర్ రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు నిషేధర్ రెడ్డికి మండల అధ్యక్షులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భూపాలపల్లి జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలవడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-13-6.wav?_=2

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్‌గా ఊరటి మునెందర్ నియమితులయ్యారు.బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు,జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఊరటి మునెందర్ మాట్లాడుతూ “బీజేపీ భావజాలాన్ని,కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్వచ్ఛందంగా చేరవేయడం, పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేయడం నా ప్రధాన బాధ్యత అని జిల్లా లోని ప్రతి గ్రామం,ప్రతి మండలానికి పార్టీ స్వరం చేరేలా కృషి చేస్తాను”అని అన్నారు.జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ… మునెందర్ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు అని మీడియా విభాగంలో ఆయన అనుభవం పార్టీకి మరింత బలాన్నిస్తుంది అని అభిప్రాయపడ్డారు.ఈ నా పార్టీ పదవికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న కి కన్నం యుగదీశ్వర్ కు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమమే టీడబ్ల్యూజే ఎఫ్ లక్ష్యం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T130248.808-1.wav?_=3

 

 

జర్నలిస్టుల సంక్షేమమే టీడబ్ల్యూజే ఎఫ్ లక్ష్యం

జర్నలిస్టు మరణిస్తే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటాలు నిర్వహిస్తాం

రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జర్నలిస్టుల సంక్షేమమే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లక్ష్యమని, జర్నలిస్టు మరణిస్తే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, హక్కులను సాధన కోసం పోరాటాలను ఉదృతం చేస్తామని టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ అన్నారు. శుక్ర వారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జర్నలిస్టుకు జీతభత్యాలు లేకుండా 24 గంటలు నిద్రాహారాలు మాని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ పనిచేస్తున్నారన్నారు.
జర్నలిస్టులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని , జర్నలిస్టు ఆరోగ్య భద్రత లేక ఇబ్బందులకు గురవుతున్నారని
ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబానికి మీడియా అకాడమీ నుండి కేవలం లక్ష రూపాయలు మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నారని ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు . మృతిచెందిన జర్నలిస్టు భార్యకు కేవలం 3వేల పెన్షన్ అందిస్తున్నారని ఇకనుండి 5వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు జారీ చేసిన హెల్త్ కార్డులు పనిచేయకుండా పోయాయని పని ఒత్తిడి వలన అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యం పాలవుతురని తెలిపారు.జర్నలిస్టులతో పాటు వారి కుటుంబాల ఆరోగ్య పరిస్థితులు గాలిలో దీపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.అర్హులైన జర్నలిస్టుల కు ఆక్రిడిటేషన్ కార్డ్స్ అందించటం లో ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు నివేశ స్థలాలను సంబంధించి పాలసీ ప్రకటించి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో వివిధ రకాల మీడియా సంస్థలు పుట్టగొడుగుల పుట్టు కోస్తున్నాయని పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు జర్నలిస్టులకు గడ్డుకాలం రాబోతుందని హెచ్చరించారు. మీడియా గడ్డు పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత జర్నలిస్టు యూనియన్ల భుజస్కందాలపై ఉందన్నారు. జర్నలిస్టు సమస్యల సాధన కోసం యూనియన్లకు అతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని,రానున్న రోజులలో మీడియాస్థితిగతులు మరింత జటిలంగా మారనున్నాయని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు సాధించేవరకు పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
యూనియన్ సభ్యత్వనమోదును పూర్తి చేసుకొని త్వరలోనే జిల్లా మహా సభలు నిర్వహించి నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. మంచి ఆలోచన విధానంతో పని చేసి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం టియుడబ్ల్యూ జే హెచ్(143)
టియుడబ్ల్యూజే (ఐజేయు) చెందిన కొందరు నాయకులు టిడబ్ల్యూజేఎఫ్ లో చేరడంతో వారికి దయాసాగర్ సభ్యత్వం అందించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా నాయకులు ఎర్రం సతీష్ కుమార్, గుజ్జ సారేశ్వర్ రావు, చెరుకు సుధాకర్, ములకల లక్ష్మారెడ్డి, దూలం కుమారస్వామి,జగన్, వెల్దండి సత్యనారాయణ, రహీం పాషా, సృజన్,ఆకుతోటప్రవీణ్,భూమిరెడ్డి,భాస్కర్,సమీర్,మార్క మురళీ కృష్ణ,రాజేందర్,సాగర్,తిరుపతి, మాదాసి ఉమేష్, ప్రభాకర్, లతోపాటు జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.

వనపర్తి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-12-7.wav?_=4

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల లో చీఫ్ విప్ ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసినబీ79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ Lరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరిం చారు వనపర్తి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై నివేదికను చీఫ్ విప్ చదివి వినిపించారు అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య అధికారులు పాల్గొన్నారు
పాఠశాలల విద్యార్థుల ద్వారా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్సును చీఫ్ విప్ మహేందర్ రెడ్డి కలెక్టర్ ఎమ్మెల్యే లతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు వనపర్తి
జిల్లాలోని మెప్మా మహిళా సంఘాలకు రుణాలకు సంబంధించిన రూ.10.08 కోట్ల చెక్కును అందజేశారు.
ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్. రవి నాయక్ టీజీఎమ్ఎస్ పెబ్బేరు మధుగాని కళ్యాణి టీజీఎమ్ఎస్ పెబ్బేరుకే నరేష్ టీజీఎమ్ఎస్ ఘనపూర్ వి మౌనిక టీజీఎమ్ఎస్ ఘనపూర్లకు ఒక్కొక్కరికి పదివేల చెక్కును అందజేశారు స్థానిక సంస్థలలో
విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే విధంగా బి సి బిల్లులను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో ఆమోదించిందన్నారు
వనపర్తి జిల్లాలో పకడ్బందీగా శాంతిభద్రతల పరిరక్షణ
గంజాయి, డ్రగ్స్, ఇతర మపదార్ధాల వాడకంపై జిల్లాలో ప్రత్యేక పోలీస్ నిసూ టీమ్స్ బస్టాండ్లలో కళాశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహినచడపై పోలీసులను అభినందించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అడిషనల్ ఎస్పీ వీరా రెడ్డి, డీఎస్పీలు, జిల్లా అధికారులు, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పెబ్బేరు మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమోదిని ప్రజాప్రతినిధులు చిన్నారులు, ప్రజలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

హద్నూర్ లో మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T125406.062.wav?_=5

 

హద్నూర్ లో మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమి దొడ్డి అశోక్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, బీహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మన్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఐదు నెలలుగా బీదర్ లో పని చేసుకుంటున్న లక్ష్మన్, కూలీ డబ్బులు సరిపోక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.

కృష్ణవేణి స్కూల్‌లో స్వాతంత్ర్య, కృష్ణాష్టమి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-11-5.wav?_=6

శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు

నృత్యాలతో అలరించిన విద్యార్థులు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు దేవన్న గౌడ్ ఘనంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.పాఠశాల విద్యార్థులతో వివిధ రకాల వేషధారణలో విద్యార్థులను అలంకరించి,ఆటపాటలతో చిందులు వేపించారు.అలాగే పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు.

Krishnaveni School

చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో నృత్యాలు చేసి అందరినీ ఆహ్లాదపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ బత్తిని రాకేష్ గౌడ్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జాతీయ జెండాకు అవమానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T123932.348-1.wav?_=7

 

జాతీయ జెండాకు అవమానం

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాతీయ జెండాను అవమానపరుస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పోస్ట్ ఆఫీస్ లో జెండా ఎగరేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాతీయ జెండాను అవమాన పరిచారు. సంబంధిత అధికారి సెలవులో ఉన్నట్టు నీ లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యతగల వ్యక్తులే ఇలా చేస్తే ఎలా ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒకపక్క భారత్ మాతాకీ జై అంటూ దేశం పట్ల ప్రజలకు ప్రేమ ఉండాలని దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపై భారత జాతీయ జెండా ఎగరేస్తూ దేశభక్తిని చాటుతుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వ పనితీరుకు
ఆ పార్టీ వారు చెప్పే మాటలకు చాలా తేడా కనిపిస్తున్నట్టు పలు వర్గాల ప్రజలు విమర్శిస్తున్నాయి.

నస్పూర్ మెకానిక్స్ అసోసియేషన్‌లో స్వాతంత్ర్య వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-10-6.wav?_=8

టూ వీలర్ మెకానిక్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించడం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్ జెండాను ఆవిష్కరించి అనంతరం వారు మాట్లాడుతూ..స్వతంత్ర పోరాటంలో అమరులైన వీరులను స్మరిస్తూ,వారు ప్రసాదించిన స్వేచ్ఛను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని కోరుతూ,రోజువారి మానవ జీవన ప్రయాణంలో అత్యంత అవసరమైన మోటార్ సైకిల్ లను బాగుచేస్తూ ఎంతో మంది రోజువారి జీవితాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్న మెకానిక్ సోదరులందరికీ,ఇంకో విధంగా చెప్పాలంటే మోటార్ సైకిల్ వైద్యులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే మెకానిక్ మిత్రులు అందరూ ఐక్యతతో ఉండాలని,వృత్తి పట్ల నిబద్ధతతో,నిజాయితీతో వ్యవహరించాలని,నమ్మి వచ్చిన కష్టమర్లకు న్యాయం చేయాలని సూచించారు.యూనియన్ కి అన్న విధాల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్, ఉపాధ్యక్షులు పభాస్కర్, జనరల్ సెక్రెటరీ నేరెళ్ల నరేష్ గౌడ్,సహాయ కార్యదర్శి జడల మహేష్,ప్రచార కార్యదర్శి మహమ్మద్ అల్లావుద్దీన్, భానేష్ సభ్యులు,తోటి మెకానికులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకున..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-9-5.wav?_=9

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకున మజీద్ మదర్స సదర్ సయ్యద్ మాజీద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఝరాసంగం మదర్సా జామియా హబీబా నిస్వాన్ మదర్సలో లో సదర్ సయ్యద్ మజీద్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.దేశ స్వాతంత్ర్యం‌ కోసం త్యాగాలు చేసిన అమరవీరులను, ఉద్యమకారుల పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ప్రతి భారతీయుడి గుండెలోనూ దేశభక్తి నిండిపోయే రోజు ఆగస్టు 15. ఇది మనకు కేవలం ఒక సెలవు రోజు కాదు, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పవిత్రమైన రోజు.ఈ రోజున మనం అందరం కుల, మత, ప్రాంతీయ భేదాలు మరచిపోయి, భారతీయులమనే గర్వంతో ఏకమవుతాం. దేశమంతా ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో ప్రతిధ్వనిస్తుంది. ఇలాంటి గొప్ప రోజున మన ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పడం మన సంప్రదాయం. ఈ దేశభక్తి సందేశాలు మన బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, దేశభక్తిని, ఐక్యతను కూడా పెంచుతాయన్నారు,ఈ కార్యక్రమంలో మస్జిద్ గురువు మూఫ్తీ ఫిర్దోస్ హఫీస్ బాబర్ ఖాదర్ అలీ రాజ్ మహమ్మద్ అమీరుద్దీన్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు,

రెండోసారి పొడగించిన పిఎసిఎస్ చైర్మన్ పదవి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-5.wav?_=10

రెండోసారి పొడగించిన పిఎసిఎస్ చైర్మన్ పదవి,
– మరో ఆరు నెలలు పొడగింపు.
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

 

– నేటి ధాత్రి, మొగుళ్ళపల్లి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సహకార సంఘాలతో పాటు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గాలను మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, రెండోసారి మొగుళ్ళపల్లి పి ఎస్ సి ఎస్ చైర్మన్ గా సంపెల్లి నరసింగరావు వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్ తో పాటు 11 మంది డైరెక్టర్లు మరో ఆరు నెలల పాటు కొనసాగనున్నారు. గతంలో 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించగా. ఐదు సంవత్సరాల కాలం పాటు పాలకవర్గం కొనసాగింది. పదవీకాలం ముగియడంతో మరో ఆరు నెలల పాటు పాలకవర్గాన్ని కొనసాగింపు చేసింది ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సొసైటీ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాజాగా ప్రభుత్వం రెండవసారి పాత పాలకవర్గాన్నే కొనసాగించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది,

అమ్మా.. నీ వెంటే..నేను..!

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T122845.722.wav?_=11

 

అమ్మా.. నీ వెంటే..నేను..!

◆:- గ్యాస్ లీకైన ఘటనలో కుమారుడి మృతి

◆:- ఏడాకులపల్లిలో విషాదఛాయలు

◆:- బోరున విలపిస్తున్నభార్య, పిల్లలు

◆:- రెండుకు చేరిన మృతుల సంఖ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం: అమ్మా… నీ వెంటేనే వస్తా…! ఈ కాలిన మంటలు, తీవ్ర గాయాలతో తట్టుకోలేకపోతున్నానమ్మా.. నీవు లేవన్న మాటలు మరింత దుఃఖాన్ని తెప్పించాయి. అమ్మ నేను ఉండలేనికా అన్నాడేమో… తల్లి మరణం మరవక ముందే కొడుకు మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయాడు. అయ్యో కొడకా అమ్మ వెంట నువ్వు కూడా వెళుతున్నావా అంటూ తండ్రి బక్కన్న పుత్రశోకంతో కుమిలిపోతుంటే చూసినవారికి కన్నీటి దారలు ఆగలేదు.. చిన్ని పాపకు ఏమి చెప్పి వెళ్ళవయ్యా ప్రభు అంటూ భార్య సరిత గుండెల మీద బాదుకుంటూ చేసిన రోదనతో ఒక్కసారిగా ఏడాకులపల్లి గ్రామస్తులు, బంధుమిత్రులు దుఃఖంలో మునిగిపోయారు. ఈనెల 6న సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఏడాకులపల్లి లో గ్యాస్ లీక్ అయిన ఘటనలో తల్లితోపాటు ఇద్దరి కొడుకులకు తీవ్ర గాయాలైన సంగతి పాఠకులకు విదితమే. తల్లి శంకరమ్మ (65)మృత్యువుతో పోరాడుతూ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 8న మృతి చెందింది. తల్లి దశదినకర్మ ఈనెల 14న గ్రామంలో నిర్వహించారు.తల్లి మరణం మరవక ముందే ఆమె రెండవ కుమారుడు ప్రభు (35) పది రోజులుగా చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం పటాన్ చెరువులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

 

 

 

ఈయన ఓ కెమికల్ కర్మాగారంలో రోజువారీ కూలి గా పనిచేసేవాడు. మృతుడికి రెండు సంవత్సరాల లోపు కూతురు ఉంది. మృతుడి భార్య సరిత కన్నీరు కారుస్తూ ఇక నాకు దిక్కు ఎవరు చూసేది ఎవరు అంటూ రోదించడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. తల్లి వెంటే కొడుకు మృతి చెందడం గ్రామస్తులతో పాటు బంధువులు, స్నేహితులు దుఃఖంలో మునిగిపోయారు. మరో కుమారుడు విట్టల్ కు తీవ్ర గాయాలు కాగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబానికి జీవనాధారం లేదని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ వివరణ కోరగా గతంలోనే కేసు నమోదు అయిందని దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు

తండ్రికి తగ్గ తనయుడు సిరికొండ ప్రశాంత్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-7-5.wav?_=12

తండ్రికి తగ్గ తనయుడు సిరికొండ ప్రశాంత్

-సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

-మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఘనంగా సిరికొండ ప్రశాంత్ జన్మదిన వేడుకలు

నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కుడి భుజంలా ఉంటూ..2021లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యవస్థాపక సభ్యుడిగా..పొలిట్ బ్యూరో సభ్యుడిగా కేసీఆర్ తో పాటు తెలంగాణ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి వరకు ఉవ్వెత్తున ఉగిసి పడేలా కార్యాచరణను రూపొందించిన అపర మేధావి మాజీ స్పీకర్..ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాడని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి అన్నారు. శుక్రవారం సిరికొండ ప్రశాంత్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని..బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కేక్ ను చదువు అన్నారెడ్డి కట్ చేసి సిరికొండ ప్రశాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు ప్రజలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిరికొండ ప్రశాంత్ తండ్రి సిరికొండ మధుసూదనా చారి అడుగుజాడల్లో పయనిస్తూ..ఏ పదవి లేకున్నా భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేస్తూ..ఎవరికి ఏ ఆపదోచ్చినా తానున్నానంటూ..భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ..ప్రజల మన్ననలను పొందుతున్నయువనేతగా ఆయనకు ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ చింతలపల్లి దార్ల ఆనంద్ అరికాంతపు అన్నారెడ్డి, దేవునూరి కుమారస్వామి, కక్కెర్ల ప్రశాంత్ గౌడ్, గుడిమల్ల రమేష్, ఎరబాటి మహేందర్, మల్సాని బాపురావు, రాస శ్రీనివాస్, బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ధనసిరి గ్రామంలో అమర జవాన్ స్థూపం ప్రారంభం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T121835.235.wav?_=13

 

ధనసిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర జవాన్ స్థూపం ప్రారంభోత్సవ

◆:- ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ధనసిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర జవాన్ స్థూపం ప్రారంభోత్సవ పాల్గొని
ఈ సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశానికి చేస్తున్న సేవ అభినందనీయం అని ,నేటి యువతక జవాన్ లను ఆదర్శంగా తీసుకోవాలి అని , మన నియోజకవర్గం ధనసిరి గ్రామంలో 80 మంది వరకు సైనికులుగా ఉన్నారు ఇది మన అందరికి గర్వ కారణం అని అన్నారు .

 

ఎమ్మెల్యే గారితో పాటు గా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి సర్పంచ్ లు హస్బి రాజు ,చిన్న రెడ్డి ,మహిపాల్ ,అశోక్ రెడ్డి, ప్రవీణ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

డాక్టర్.దొమ్మటి.ప్రసన్నకుమార్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T121008.117.wav?_=14

డాక్టర్.దొమ్మటి.ప్రసన్నకుమార్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు

అవార్డు అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 

పరకాల నేటిధాత్రి
ఆగస్టు 15నాడు ఖిలావరంగల్లో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ఎంజీఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.దొమ్మటి ప్రసన్నకుమార్ కు పేద ప్రజలకు వైద్యాన్ని అందించంలో ముందున్నందున ఉత్తమ డాక్టర్ అవార్డును శుక్రవారం రోజున రాష్ట్ర మంత్రివర్యులు,ఇంచార్జ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్బంగా డాక్టర్.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అవార్డును అందించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

నేనెప్పుడూ ప్రజల వెంటే…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T120216.161.wav?_=15

 

నేనెప్పుడూ ప్రజల వెంటే

వార్డులో సమస్యల పరిష్కారానికి ముందువరుసలో నేను

మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్

 

 

పరకాల నేటిధాత్రి
మున్సిపాలిటీలోని ఒకటో వార్డు సీఎస్ఐ కాలనీలో మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఎప్పటికప్పుడు సానిటేషన్ పనులుచేపడుతున్నారు.పదవికాలం ముగిసినప్పటికి నేనెప్పుడు ప్రజల వెంటే ప్రజలకోసమే అన్నరీతిలో సమస్యలకు తనదైన శైలిలో పరిస్కారం చూపుతున్నాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ఇంటింటి చెత్త స్వచ్ఛ ఆటోల ద్వారా క్రమం తప్పకుండా వీధులలోని చెత్త ట్రాక్టర్ల ద్వారా సేకరించాలని, దుర్వాసన వస్తున్న పరిసర ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వవున్న ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లించాలని,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల మందు పాగింగ్ చేపించి,డ్రైనేజీలు ఎప్పటికప్పుడు తీపించి,తీసిన చెత్త కుప్పలు వెను వెంటనే శుభ్రంగా ఉంచాలని,వార్డులో సంచరించే కోతుల,కుక్కల బెడద ఉందని వాటినుండి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని,వార్డులోని ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జీవించేలా చూడాలని స్థానిక కౌన్సిలర్ కమిషనర్ సుస్మ ని కోరారు.

 

 

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.వార్డులోని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు,వ్యక్తిగత శుభ్రత పాటించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు యువత,మడికొండ.ఐలయ్య, ఇమ్మానియేల్,పాలకుర్తి భాస్కర్,జవాన్ మంద. మహేష్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మోడల్ స్కూల్ విద్యార్థి చందా అజయ్ ఘన సత్కారం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T115222.050.wav?_=16

 

-స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పదివేల నగదుతో పాటు ఘన సత్కారం
మోడల్ స్కూల్ విద్యార్థి చందా అజయ్
-జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా సన్మానం
మొగులపల్లి నేటి ధాత్రి

 

 

2004-2005 ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మోడల్ స్కూల్ విద్యార్థి చందా అజయ్ ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్ మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల మోడల్ స్కూల్ లో 2004-2005 లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో చందా అజయ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నగదు బహుమతితో ప్రోత్సహించి వారిని ఉన్నత చదువులలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రారంభించిన నగదు బహుమతి ప్రోత్సాహాన్ని 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చందా అజయ్ ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా పదివేల రూపాయల నగదు బహుమతితో పాటు, శాలువాతో ఘనంగా సత్కరించడం సంతోషం కలిగించిందన్నారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో చందా అజయ్ ఉన్నత స్థాయిలో రాణించాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థినీ, విద్యార్థులు చదువుల్లో రాణించి, ఉన్నత శిఖరాలను అధిరోహించి, చదువుతోపాటు నైతిక విలువలు, సామాజిక స్పృహను పెంపొందించుకోవాలన్నారు. తమ స్కూలుకు చెందిన విద్యార్థి చందా అజయ్ సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, తమ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందనేదానికి ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయన్నారు. ఈ విజయం వెనుక విద్యార్థుల కటోర శ్రమ, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు

స్వాతంత్ర దినోత్సవంలో పప్పెట్రీకి ప్రశంసలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T113348.467.wav?_=17

 

 

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనలో పప్పేట్రి కి విశేష స్పందన తిలకించిన మంత్రివర్యులు, కలెక్టర్, జిల్లా విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల రెజింతల్ గ్రామ ప్రధాన ఉపాధ్యాయురాలు సఫియా సుల్తానా
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రదర్శనలో. ఎన్ఈపి 2020 అమలు కార్యక్రమాల భాగంగా,సి సి ఆర్ టి న్యూ ఢిల్లీలో శిక్షణ పొందిన సఫియా సుల్తానా ఆ శిక్షణలోని అంశాలను జిల్లా విద్యాశాఖ తరుపున ప్రదర్శించారు.ఈ ప్రదర్శనను రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి, జిల్లా నోడల్ ఆఫీసర్, సీఎంఓ, జిల్లా సైన్స్ ఆఫీసర్ ప్రదర్శన కు సందర్శించి తిలకించిన రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ,

సిద్ధాపూర్ ఏఈఓకి ఉత్తమ పురస్కారం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T111233.146-1.wav?_=18

 

సిద్ధాపూర్ ఏఈఓకి ఉత్తమ పురస్కారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండలంలోని సిద్ధాపూర్ క్లస్టర్ ఏ ఈ ఓ సుకుమార్ కి ఉత్తమ సేవ అవార్డు లభించింది , జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ ప్రవీణ్యా ఎస్పీ పారితోష్ పంకజ్ టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ చేతుల మీదుగా సుకుమార్ అవార్డు అందుకున్నారు,ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ 8 ఏళ్లుగా రైతులకు విశిష్ట సేవలు అందించిన ఉద్యోగానికి గుర్తింపు వచ్చిందన్నారు, అవార్డు రావడం వల్ల క్లస్టర్ రైతులు మరియు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వీరులను స్మరించిన సాయినగర్

ఎందరో మహానుభావుల త్యాగం ఫలితం ఈ స్వాతంత్ర మన దేశానికి వచ్చింది

తిరుపతి(నేటి ధాత్రి)ఆగస్టు 15:

 

 

మన కోసం కాకుండ దేశం కోసం జీవించాలి 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ సర్పంచ్ డివి రమణ గావించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగం ఫలితం ఈ స్వాతంత్ర మన దేశానికి వచ్చింది అన్నారు.మహాత్మా గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంకో ఇంకో చెంప కూడా చూపించారని. భగత్ సింగ్ తక్కువ వయసులోనే ఉరివేస్తున్నప్పుడు చిరునవ్వు చిందించారని భగత్ సింగ్ గారి తల్లి ఆవేదన చెందుతూ ఏడుస్తుంటే ఏంటమ్మా అని అడిగినప్పుడు దేశం కోసం నా కుమారుడు అమరడు అయ్యారు నాకు మరో ఒక కుమారుడు ఉంటే దేశ స్వాతంత్ర కొరకు పంపేదాని అని అన్నారు. మరొక్క సందర్బం లో ఉక్కు మనిషి గా పేరు గాంచిన సర్ధార్ వల్ల భాయ్ పటేల్ 1909 సంవత్సరలో తల్లీ మరణించిన బాధను దిగ మింగుకుని జైల్లో ఉన్న వారి కోసం వాదించి విజయం సాధించారు.అదేవిదంగా అజాత్ హిందూ ఫోజ్ సంస్థను స్థాపించి తన యుద్ధ పోరాటాలు ద్వారా బ్రిటిష్ వారిని భయబ్రాంతులకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురి చేశారు.అల్లూరి సీతా రామరాజు,జాన్సీ లక్ష్మి భాయ్ లాంటి ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలితం గా ఈ స్వతంత్రం వచ్చింది అని తెలిపారు.అనంతరం గ్రామ సభ నిర్యహించారు సోలార్ ప్రాజెక్టు ను ఉపయోగించు కోవాలి అని కోరారు.భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు పంచాయతీకి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ప్రతి ఒక్కరు మన కోసం కాకుండ దేశం ప్రయోజనాలు కోసం జీవించాలి అని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో పంచాయతీ సెక్రటరీ,ఉప సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, వార్డ్ మెంబర్లు, నాయకులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, పంచాయతీ పాఠశాల ఉపాధ్యాయులు,ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, డ్వాక్రా సంఘమిత్రలు, మహిళలు, యువత, పాల్గొన్నారు.

నడికూడలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర వేడుకలు

మండల కేంద్రంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నడికూడ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ మండల పార్టీ అద్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీలాపానా చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,బిఆర్ఎస్ మండల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version