79వ స్వతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ

79వ స్వతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ

గణపురం సిఐ సిహెచ్ కర్ణాకర్ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ గణపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఐ సిహెచ్ కర్ణాకర్ రావు పోలీసు లాంఛనాలతో జెండా ఎగర వేయడం జరిగింది అనంతరం సీఐ మాట్లాడుతూ గణపురం రేగొండ కొత్తపల్లి గోరి మండలాలకు సర్కిల్ గా అపాయింట్మెంట్ చేసినందుకు ఎస్పీ కిరణ్ కార్కే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజల శాంతి భద్రతలను సమర్థవంతంగా పనిచేస్తానని గణపురం పోలీస్ స్టాప్ ఎస్సై రేఖ అశోక్ ఆధ్వర్యంలో పోలీస్ అందరూ సహకరించాలని వారిని కోరడం జరిగింది

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-40-1.wav?_=1

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

తొర్రుర్ డివిజన్ నేటి ధాత్రి

తెలంగాణ, ముఖ్యంగా గౌడ సామాజిక వర్గానికి గర్వంగా నిలిచిన బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 16, 2025 (శనివారం)న వైభవంగా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా మోకు దెబ్బ కార్యదర్శి మెరుగు మల్లేశం గౌడ్ గారు ప్రతి గౌడ బిడ్డ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేక పిలుపునిచ్చారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ – ప్రేరణాత్మక జీవితం
17వ శతాబ్దాది చివరి, 18వ శతాబ్దాది మొదటిబాగంలో (1650–1710) జనగామ జిల్లా, ఖిలాషాపూర్ గ్రామంలో గౌడ్ కుటుంబంలో పుట్టిన పాపన్న.

తండ్రి నాసగోని ధర్మన్న గౌడ్, తల్లి సర్వమ్మ. చిన్నతనం నుంచే సామాజిక సమస్యలను గమనించే శీలం.

ధూళిమిట్ట శాసనం ప్రకారం తన జననం “ఆగస్టు 18, 1650″గా గుర్తించబడింది.

గౌడ వృత్తిని స్వీకరించిన అతను, తాటిచెట్లు ఎక్కి (కలాలి) కల్లు గీయడంలో ప్రావీణ్యం గలవాడు.

పశువులను కాస్తూ, చుట్టుపక్కల గ్రామస్తులతో సామరస్యాన్ని పాటిస్తూ అభినవ దళిత & బహుజన ఉద్యమానికి నాయకుడుగా ఎదిగాడు.

పాపన్న గొప్పతనం, పోరాటం
అగ్రకులాల ఆధిపత్యం, జమీందార్ల అరాచకపు పాలనకు వ్యతిరేకంగా తన సిద్ధాంతాలు, ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు.

స్వీయ సైన్యంతో దాదాపు 20 కోటలను జయించాడు; గోల్కొండ కోటను స్వాధీనపర్చుకుని 7 నెలలు పరిపాలించాడు.
మొగలయ్యిన అధికారులను తెలంగాణ లో తొలిసారి ఎదుర్కొన్న బహుజన నాయకుడు పాపన్న గౌడ్.
బహుజనుల ఏకత్వం, మత-కుల-వర్గ వైషమ్యాలు లేకుండా సాగిన రాజ్యానికి ఆయనే పరిచయమిచ్చిన గొప్ప చక్రవర్తి.
విగ్రహావిష్కరణ కార్యక్రమం మహత్యం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇది గౌడ జాతి గర్వానికి, అనేక తరాల పాపన్న ఆశయాలకు కొత్త ప్రేరణనిచ్చే వేడుకగా నిలుస్తుంది.
ప్రతి గౌడ బిడ్డ, గౌడ కుటుంబం, బహుజన సమాజం పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను గౌడ జాతి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు కూడా స్మరిస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ సంస్కరణాత్మక చాయలను ప్రజల్లోకి చాటిచెప్పే అవకాశం. పాపన్న తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించి, సామాన్య ప్రజానీకానికి న్యాయం అందించేందుకు చేసిన పోరాటం అందరికీ ఆదర్శంగా నిలవాలి.
ఈ కార్యక్రమంలో ప్రతి గౌడ బిడ్డ, సామాజిక భావాలుతో మహబూబాబాద్ జిల్లా యువత పాల్గొనాలి

దళిత ఎమ్మెల్యే అవమానం – జహీరాబాద్‌లో ఉద్రిక్తత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-22-5.wav?_=2

దళితుడు అన్న కారణంగా ఎమ్మెల్యే గారిని అవమానించారు

◆:- తీవ్రంగా ఖండించిన ఝరాసంగం దళిత నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఫ్రెండ్స్ ఫంక్షనల్ లో నిరుపేదలకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇంటి తాళాలను ఇవ్వడం గురించి సభ నిర్వహించడం జరిగింది అక్కడికి జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వెళ్లడం జరిగింది అక్కడ అధికార సభ కాబట్టి స్థానిక అధికారులు సమక్షంలో నిర్వహించాలి కానీ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకునితో సభ అధ్యక్షత నిర్వహించడం జరిగింది.ఎమ్మెల్యే మీటింగ్ ప్రాంతానికి వెళ్లిన అక్కడ అధికారులు వేదికపై పిలవకుండా అవమానించడం జరిగింది దీన్ని మేము ఒక దళితుడు అన్న కారణంగా ఎమ్మెల్యే గారిని అవమానించారని అనుకుంటున్నామని దళిత సంఘాల నాయకులు వ్యతిరేకించారు.గత ప్రభుత్వం టిఆర్ఎస్ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పట్టాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ బెడ్ రూమ్ అర్హులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అది తెలుసుకొని బి ఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు ఇట్టి విషయంపై కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వెంటనే ఇళ్ల తాళాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది గురువారం జరిగిన మీటింగ్ లో శాసనసభ్యులు మాణిక్ రావు వేదికపై పిలవకుండా అవమానించడం ఇది కాంగ్రెస్ రౌడీ రాజకీయానికి నిదర్శనం అని కాంగ్రెస్ నాయకులు రౌడీల్ల వివరిస్తున్నారని మరొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే దళిత సంఘాల నాయకులము చూస్తూ ఊరుకోమని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమం లో దళిత సంఘాల నాయకులు సామెల్ బాలరాజ్ సంగమేష్ రాజకుమార్, సుధాకర్ ప్రభాకర్ శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు.

కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా మంత్రి సీతక్క…

కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా మంత్రి సీతక్క

#ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దాపురం మొగిలి తల్లి మరణించగా వారిని పరామర్శించిన సీతక్క

#కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం…

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

 

గోవిందరావుపేట మండల చల్వాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దాపురం మొగిలి తల్లి గారైన పెద్దాపురం లచ్చమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు దనసరి అనసూయ సీతక్క పరామర్శించి, కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా నిలబడింది. కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి గార్లతో పాటుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.

వీరశైవ లింగాయతుల విశ్వశాంతి పాదయాత్ర..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-21-5.wav?_=3

వీరశైవ లింగాయతులు పాదయాత్రలో సమాజ సేవకు కొత్త అడుగు

జహీరాబాద్ నేటి ధాత్రి:

విశ్వ శాంతికై వీర శైవుల పాదయాత్ర జిల్లాఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజు జహీరాబాద్, విశ్వశాంతి కై తాలూకా వీరశైవ లింగాయత్ సమాజంతో పాటు శ్రీ రాచన్న స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జహీరాబాద్ నుండి బడంపేట్ మహా పాదయాత్ర ఈ నెల 17న ఆదివారం ఉదయం 7.00 గంటలకు జహీరాబాద్ శ్రీ రాచన్న స్వామి ఆలయం నుండి బయలుదేరుతుందని ఆ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం చేపడుతున్న ఈ మహా పాదయాత్ర కార్యక్రమానికి వీర శైవ లింగాయత్ సమాజ్ సభ్యులు శివ నామ స్మరణతో సంకీర్తన చేస్తూ పాదయాత్ర లో పాల్గొంటారని తెలిపారు. పాదయాత్ర జహీరాబాద్ నుండి ప్రారంభమై శివాలయం, షేకాపూర్ మీదుగా పర్సుపల్లి నుండి బడంపేట్ కు చేరుతుందన్నారు.సభ్యులు, భక్తబృందం సాంప్రదాయ వస్త్రధారణతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ జిల్లా సలహాదారులు అనిమిశెట్టి జయప్రకాష్, తాలూకా వీరశైవ లింగాయత్ యూత్ అధ్యక్షులు శ్రీ సిద్దాపురం అరుణ్, జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండి శ్రీనివాస్, రాష్ట్రీయ బసవ దాల్ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేష్, అమర్ కౌలాస్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

కోర్వి కృష్ణ స్వామి జయంతి: ముదిరాజ్ సంఘం ఘన నివాళి

 

కోర్వి కృష్ణ స్వామి జయంతి: ముదిరాజ్ సంఘం ఘన నివాళి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ వ్యవస్థాపకుడు కోర్వి కృష్ణ స్వామి జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న కొల్లూర్ యూవకులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-37-1.wav?_=4

మానవత్వం చాటుకున్న కొల్లూర్ యూవకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాలగారి రమేష్ కుమార్ వాలా భార్య లివర్ సమస్య తో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతు బాధపడుతున్న సమయంలో డాక్టర్ లు ఆమెకు బి పాస్టివ్ బ్లడ్ కావాలి లేకపోతే ఆమె ఆరోగ్యనికి ప్రబులం అవుతుంది అని చెప్పగానే. వెంటనే వాలా భర్త విషయం తెలుసుకొని ఆయనకు తెలిసిన వాట్సాప్ గ్రూప్ లో మా భార్యకు బి పాస్టివ్ బ్లడ్ కావాలి ఎవరైనా హెల్ప్ చెయ్యండి అని మెసేజ్ పెట్టగా గ్రూప్ లో మెసేజ్ చూసుకొని వెంటనే కొల్లూర్ గ్రామం యూవకులు తమ్ముడు నివ్వు బాధపడకు అని మేము ఇస్తాం బ్లడ్ అని చింతలగట్టు కృష్ణ కుమార్ మంతురి మధు మాలగారి వంశీ మాలగారి రమేష్ కుమార్ భార్యకు బి పాస్టివ్ బ్లడ్ తమవంతు. కృషి తో మనవత్వం చాటుకున్న మంచి మనసున్న మహానుభావులు వాళ్లకి దేవుడు. నిండు నూరేళ్లు చల్లగా ఉంచాలి అని భగవంతుణ్ణి వేడుకుంటున్న అని మాలగారి రమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలియచేశారు,

ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న సీనియర్ అసిస్టెంట్ స్వాతి….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T153003.119.wav?_=5

ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న సీనియర్ అసిస్టెంట్ స్వాతి

నేటిధాత్రి, హనుమకొండ

 

 

హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న చింతం స్వాతి, కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో ఉత్తమ ఉద్యోగిణిగా సేవా ప్రశంసా పత్రం అందుకున్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, రెవెన్యూ శాఖలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సిఎచ్ స్వాతి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా ప్రభుత్వ ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రశంసా పత్రం అందుకున్న స్వాతిని రెవెన్యూ అధికారులు, హనుమకొండ కలెక్టరేట్ సిబ్బంది, స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు

ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-20-5.wav?_=6

ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత
కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణానికి చెందిన కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్ ఒకవైపు రక్షక భటుడిగా,మరొకవైపు రచయితగా ఎదుగుతూ అనేకమైన అంశాలపై సాహిత్యంలో పెన్నును,గన్నుగా చేస్తూ రానిస్తున్నటువంటి సాయి మహేష్ సమాజంలో జరిగే అంశాలను తన లోతుల వైపు చూస్తూ గన్నును పెన్నుగా మారుస్తూ సమాజ శ్రేయస్సుకు వివిధ అంశాలతో కూడిన కవిత్వాన్ని క్రూడీకరించి విశ్లేషించి అనేక అంశాలను కవితలుగా మార్చి సమాజాన్ని తట్టు లేపుతున్నటువంటి ముడారి సాయి మహేష్ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సభ్యులు గా మరియు అనేక అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి ముడారి సాయి మహేష్. అంతేకాకుండా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పథకం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ చేతులమీదుగా,,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే చేతుల మీదుగా అందుకోవడం విశేషం. అలాగే జిల్లా కవులు రచయితలు, రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, బురదేవానందం,అంకారపు రవి ,గుండెల్ని వంశీ కృష్ణ, మొదలైన సాహితీ మిత్రులు అభినందించారు.

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-36-2.wav?_=7

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్యామల మధుసూదన్ రెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిషిధర్ రెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా శ్యామల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నా నియమాకానికి సహకరించిన బిజెపి పార్టీ అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు అర్బన్ అధ్యక్షుడిగా ఉన్న నన్ను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతను అప్పగించారు కావున బిజెపి పార్టీ జిల్లాలో మరింత అభివృద్ధి చెందింది నా వంతు కృషి చేస్తాను

79వ స్వాతంత్ర్య దినోత్సవంలో రచయితల వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-19-5.wav?_=8

సిరిసిల్ల జిల్లా కవులు,రచయితల సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలాగొండ రవి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యo వచ్చి 79 సంవత్సరాలు అయిన సందర్భంగా జిల్లా కవులకు మరియు రచయితలకు శుభాకాంక్షలు తెలపడం జరిగినది అంతేకాకుండా. మాజీ సిరిసిల్ల జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కవులు,రచయితలు,
కళాకారులు దేశ సర్వతో ముఖ అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగాలని అద్వితీయమైనటువంటి దేశ ప్రగతికి కలాలను గళాలుగా వినిపించాలని తెలిపారు. అలాగే సీ.సా.స అధ్యక్షులు జనపాల శంకరయ్య సిరిసిల్ల జిల్లాలోని యువ రచయితలు ముందుకు రావాలని సమాజ శ్రేయస్సుకు తమ కలాలను ఎక్కు పెట్టాలని కోరారు. జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులు వెంగళ లక్ష్మణ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాటను పాడారు. అలాగే ఈ కార్యక్రమంలో సీ.సా.స గౌరవ అధ్యక్షులు కోడం నారాయణ, మరియు చిటికెన కిరణ్ కుమార్,జిల్లా రచయితల సంఘం యువజన కార్యదర్శి అంకారపు రవి, దూడం గణేష్, గుండెల్లి వంశీ, కోడం సురేష్, తదితర కవులు,రచయితలు పాల్గొన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి…

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

నిర్వహించాలని,ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు నేరెళ్ల సుభాష్ కోరారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తోందని గౌడ సోదరులు ముందుండి బహుజన సోదరులను ఆహ్వానిస్తూ అందరూ కలిసి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఆయన బహుజన బహుజనుల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని కోరారు.చాలా గ్రామాల్లో పాపన్న గౌడ్ విగ్రహాలు ఉన్నాయని లేనిచోట్ల ఆయన ఫోటోకు పూలదండలు వేసి వేడుకలను నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ గౌడ సంఘం అధ్యక్షులు ఎలుక అశోక్ గౌడ్, నేరెళ్ల సత్యం గౌడ్, గౌడ సంఘ సభ్యులు అబ్బూరి ఆనంద్ రాజ్, చీకట్ల వేణు గౌడ్, అబ్బూరి ప్రకాష్ గౌడ్, నేరెళ్ల రాజకుమార్ గౌడ్, అబ్బూరి శ్రీనివాస్, నేరెళ్ల అంజా గౌడ్, ఎలుక శివలింగం, అబ్బూరి దశ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

భారీవర్షాల వల్ల ఆస్తి,ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-18-5.wav?_=9

భారీవర్షాల వల్ల ఆస్తి,ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలి

భారీ వర్షాల పట్ల జాగ్రత్త చర్యలు చేపట్టాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

ఈనెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా శిథిలావస్థలో ఉన్న గృహాలు, పాఠశాలలను గుర్తించి అందులో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.రాబోయే రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు.జిల్లా సంబంధిత వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పలు పథకాల క్రింద చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు లేనప్పటికిని , వాగులు, వంకలు ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా రోడ్డు మార్గాలను డైవర్ట్ చేయాలన్నారు.ఇందుకు గాను పోలీసు, గ్రామ కార్యదర్శుల సహకారం తీసుకోవాలని సూచించారు.తీవ్ర వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.లోతట్టు బ్ప్రాంతాల్లో జలమయం కు ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలి. డ్రైనేజీ వ్యవస్థ మరమ్మత్తులు, వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని అధికారులను ఆదేశించారు.ప్రత్యేకంగా డ్యామ్‌లు, చెరువుల స్థితిగతులు నిరంతరం పరిశీలించాలని,ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

“Precautions for Heavy Rains in Warangal”

కొన్ని ప్రాంతాలలో వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు.ఈనెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, మండల స్థాయి టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధికారులు సెలవులో వెళ్లకుండా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటూ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.వర్షాల వల్ల నీరు కలుషితమై దోమలు ప్రబలి సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి,ఇరిగేషన్ శాఖ ఈఈలు శంకర్,సునీత,జిల్లా ఆర్ అండ్ బి అధికారి,జిల్లా పంచాయతీ అధికారి కల్పన,జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,ఆర్డీఓ లు సత్యపాల్ రెడ్డి,ఉమారరాణి,తహసీల్దార్లు వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న సిసిఎస్ కానిస్టేబుల్ ఉపేందర్..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T144316.760.wav?_=10

 

ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న సిసిఎస్ కానిస్టేబుల్ ఉపేందర్..

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

వరంగల్ సబ్ డివిజన్ పరిధిలో, వరంగల్ సిసిఎస్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గట్టు ఉపేందర్ ఉత్తమ పోలీస్ సేవా ప్రశంసా పత్రం అందుకున్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, పోలీస్‌శాఖలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సత్కరించారు. ఈ సందర్భంగా వరంగల్ సిసిఎస్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గట్టు ఉపేందర్, హనుమకొండ జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమీషనర్ చేతుల మీదుగా ప్రభుత్వ ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రశంసా పత్రం అందుకున్న ఉపేందర్ కు వరంగల్ సీసీఎస్ పోలీసు స్టేషన్ సీఐ, ఎస్ఐ, సిబ్బంది, తోటి స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు.

ఉత్తమ ఎంపీడీవో గా గుర్రం సత్యనారాయణ గౌడ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-17-4.wav?_=11

ఉత్తమ ఎంపీడీవో గా గుర్రం సత్యనారాయణ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుర్రం సత్యనారాయణ గౌడ్ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎంపీడీవో గా ఎంపికై ప్రశంస పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా అందుకున్నారు.నిస్వార్ధంగా,నిబద్ధతతో,నియమనిష్ఠలతో తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ కి ఉత్తమ ఎంపీడీవో పురస్కారం లభించడం ఆనందదాయకమనీ తోటి అధికారులు హర్షం వ్యక్తం చేశారు.ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తీరుస్తూ తోటి ఉద్యోగులతో కలిసి సమన్వయంతో పని చేస్తున్నటువంటి సత్యనారాయణ గౌడ్ కి మరెన్నో మంచి ఉన్నత స్థానాన్ని లభించాలని ఆకాంక్షించారు.

సంగారెడ్డి జిల్లాలో 13.7 సెంటీమీటర్ల వర్షం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-16-4.wav?_=12

సంగారెడ్డి జిల్లాలో 13.7 సెంటీమీటర్ల వర్షం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి
వర్షం దంచి కొట్టింది. దీంతో చెరువులు, కుంటలు, బోరు బావులకు భారీగా నీరు చేరి చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలకు నీరు చేరింది. జిల్లాలోని పుల్కల్ (లక్ష్మీ సాగర్) 13.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా మొగుడంపల్లి 0.73 సెంటీమీటర్ల అతి తక్కువ వర్షపాతం నమోదయింది. ఝరాసంగం వాలాద్రి వాగు పొంగి ఏడాకులపల్లి, ప్యారవరం, ఎల్లోయి, జీర్లపల్లి చెరువు పొంగడంతో మంజీరాకు వరద నీరు వెళుతుంది. ప్యారవరం వాగు ఎప్పటి మాదిరిగానే పొంగిపొర్లుతోంది. కుప్పానగర్, మచ్నుర్, కృష్ణాపూర్, బర్దిపూర్, జీర్లపల్లి, ఝరాసంగం, కక్కెర వాడ, చిలేపల్లి, చిలపల్లి తండా, దేవరంపల్లి, ఈదులపల్లి, మేదపల్లి, ఏడాకులపల్లి, కృష్ణాపూర్ తదితర గ్రామాల్లో వర్షం దంచి కొట్టింది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు ఉన్న జాతీయ పెట్టుబడి రహదారికి ఇరువైపులా పంట పొలాల్లో భారీగా నీరు చేరింది. పంట పొలాలు వాగులను తలపిస్తున్నాయి.

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు..

పుల్ కల్ (లక్ష్మీసాగర్) – 13.7 సెంటీమీటర్లు

గుమ్మడిదల (నల్లవల్లి) – 9.70 సెంటీమీటర్లు

చౌటకూర్ (చౌటకూర్) – 8.89 సెంటీమీటర్లు

అమీన్ పూర్ (సుల్తాన్ పూర్) – 8.10 సెంటీమీటర్లు

ఝరాసంగం (ఝరాసంగం) – 7.48 సెంటీమీటర్లు

నిజాంపేట్ (నిజాంపేట్) – 6.60 సెంటీమీటర్లు

పుల్ కల్ (పుల్ కల్) – 5.93 సెంటీమీటర్లు

రాయికోడ్ (రాయికోడ్) – 5.73 సెంటీమీటర్లు

హత్నూర్, వట్ పల్లి, అమీన్ పూర్, జిన్నారం ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా పటాన్ చెరువు, రామచంద్రపురం, సదాశివపేట్, జహీరాబాద్, కంది ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. మిగతా ప్రాంతాల్లో మోస్తారుగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆదివాసీ జేఏసీ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుక…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-5.wav?_=13

ఆదివాసి సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ.

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలో గల కొమరం భీమ్ సెంటర్ యందు ఆదివాసి సంఘాల ఐక్యవేదిక(జేఏసీ) కరకగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ జాతీయ పతకం ఆవిష్కరించి 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ. బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో మగ్గిపోయిన భారతీయుల జీవితాలకు 15 ఆగస్టు 1947న బ్రిటిష్ బానిస సంకెళ్ళను తెంచి భారతీయ పౌరులందరికి స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించుటకు ఎందరో మహానుభావులు మహనీయులు ప్రాణ త్యాగాల ఫలితమే మనం ఇప్పుడు జరుపుకుంటున్న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అని కొనియాడారు. ఇప్పుడే కాదు ఎప్పుడు వారి త్యాగాలను మరవకుడదు వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ యువత ముందుండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు వారి స్వలాభం కోసం పోరాటం చేయలేదు దేశంలోని పౌరులందరూ స్వతంత్ర భారతదేశంలో సగౌరవంగా జీవించుటకు, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో మెలగాలని, ప్రతి ఒక్కరి హక్కులు హరించకుండా వారి వారి హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మహనీయులైనటువంటి మాహత్మ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాంటి వారు ఎందరో మహనీయులు స్వాతంత్ర ఉద్యమం ప్రారంభించి మనకోసం స్వాతంత్ర తెచ్చిపెట్టారు. కానీ ఇప్పుడున్న సమాజంలో స్వచ్చ, సమానత్వం, సోదర భావం కరువైయ్యాయాని వారి ప్రాణ త్యాగాలకు విలువ లేకుండా పోయిందని ఇప్పటి నుంచి అయినా యువత ఆయొక్క మహనీయుల ఆశయాలకై పని చేయాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చందా రామకృష్ణ, జేఏసీ నాయకులు పోలేబోయిన సర్వేష్, కొమరం శంకర్, కలం సంపత్, ఊకె నరేష్, పోలేబోయిన స్వామి ప్రసాద్, ఆదివాసీ ఉద్యోగులు కొమరం అశోక్, పూనెం శంకర్, ఆదివాసీ సీనియర్ నాయకులు కొరగట్ల నరసింహారావు, గోగ్గల నరేష్, రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

హనుమకొండలో గంజాయి పట్టివేత…..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-4.wav?_=14

హనుమకొండలో గంజాయి పట్టివేత

#స్మగ్లర్స్ నలుగురు అరెస్ట్

హన్మకొండ, నేటిధాత్రి:

ఈరోజు హన్మకొండ పోలీస్ మరియు తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ టీం ఆద్వర్యంలో ఉదయం హన్మకొండ లోని కుమార్పల్లి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కి దగ్గరలో ఉన్న నలుగురు వ్యక్తులు ఎండు గంజాయి కలిగి ఉన్నారని నమ్మదగిన సమాచారం రాగా టి ఎస్ ఎన్ ఏబి సీఐ శ్రీకాంత్ మరియు యస్.ఐ. సిహెచ్. పరశురాములు తమ సిబ్బందితో అక్కడకు వెళ్లేసరికి అక్కడ నలుగురు వ్యక్తులు మహీంద్రా ఎక్స్ యు వి కారులోగంజాయిని తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి 25 కిలోల 800 గ్రాముల ఎండుగంజాయి, ఐదు సెల్ ఫోన్స్ లు, ఎక్స్ యు వి మహేంద్ర గల కారు మరియు వారు ప్యాకింగ్ చేసే కవర్లు స్వాధీనం చేసుకొని ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామ నిర్వహించి పోలీస్ స్టేషన్ కు తీసుక రాగా హన్మకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివ కుమార్ గారు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినారు. ఈ నలుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ పంపడమైంది.
ఇందులో కరీంనగర్ టౌన్ కి చెందిన ముగ్గురు నేరస్తులు
1) ఎండి. ఫైజాన్, తండ్రి: మున్నిర్ వలి, వయస్సు: సం
2) ఎస్డి. అన్సార్, S/o ఎస్డి. యూసుఫ్, వయస్సు: 24 సంవత్సరాలు
3) ఎండి. అర్బాస్, S/o అన్సార్, వయస్సు: 24 సంవత్సరాలు, కలిసి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ నుండి ఇట్టి గంజాయిని బాలు అనే వ్యక్తి వద్ద నుండి తీసుకువచ్చి ఇక్కడ హనుమకొండ లోని కుమార్ పల్లికి చెందిన నిందితుడు
4) అర్షద్ అలీ ఖాన్, S/o లాయక్ అలీ ఖాన్, వయస్సు: 37 సంవత్సరాలు, ఇంట్లో ప్లాన్ ప్రకారం దాచి అవసరమైన వాళ్లకి అమ్ముదామనే ఉద్దేశంతో ఈరోజు గంజాయిని వెహికల్ లో తీసుకెళ్తుండగా పోలీసు వారికి పట్టుబడ్డారు
ఈ సందర్భంగా హన్మకొండ ఏసీపీ నరసింహ రావు యువతను ఉద్దేశించి ఇలాంటి వ్యాసనాలకు అలవాటు పడితే ఆనరోగ్యంతో పాటు కటకటాల పాలై జీవితం సర్వనాశనమవుతుందని, చదివిన చదువు వ్యర్ధం అవుతుందని చెప్పినారు. అలాగే గంజాయిని అమ్ముతున్నవారి, త్రాగుతున్నవారి వివరాలు తెలిసినచో పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరని చెప్పినారు.

79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని..

79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు జిల్లా, నేటిధాత్రి:

మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రముఖులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, విద్యార్థిని, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక 79వ భారత స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు.
ప్రపంచ చరిత్రలో ఆగస్టు,15కు విశిష్ట స్థానం ఉంది. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచిన మనం.. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శతృవులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి, భారతదేశ పునాది పత్రాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పౌరులకు, అణగారిన వర్గాలకు సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కుల రక్షణ కోసం నిబంధనలు ఉండేలా చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులు ఊదారు. మనం సాధించుకున్న స్వాతంత్ర్యానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం.
2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం.
స్థానిక సంస్థలలో… విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది.
యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
ములుగు జిల్లా 2019లో ఏర్పడినప్పటి నుండి వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లుటకు నూతన ప్రణాళికలు రూపొందించాం. అందులో భాగంగా జిల్లాలో నూతన ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం, జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమైనవి. ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాల సేవలు జిల్లా ప్రజలకు అందించుటకు నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, శాశ్వత భవనాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో టాస్క్ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకశాలను పెంచుటకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. తద్వారా 51 మంది యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. ములుగు, బండారుపల్లి, జీవింతరావుపల్లి గ్రామాలతో ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయటకు కృషి చేయడం జరిగింది. మల్లంపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం, జిల్లాలో మరో 15 సబ్ సెంటర్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2026 లో జరగనున్న శ్రీ సమ్మక్క- సారలమ్మ మేడారం జాతరకు దాదాపు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు దర్శించుకొనున్ననేపధ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లకై ప్రతి శాఖను సమాయత్తం చేయడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను.

మహాలక్ష్మి పథకం :
ఆడబిడ్డలకు పైసా ఖర్చు లేకుండా ఆర్టీసి బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించుటకు ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పధకం ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి 35 లక్షల మంది మహిళలకు 81 కోట్ల 23 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగినది. జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో 4 కోట్ల 80 లక్షలతో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో 6 కోట్ల 28 లక్షలతో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమైనవి. మంగపేటలో 52 లక్షల నిధులతో బస్టాండ్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నవి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది.

వైద్య ఆరోగ్య శాఖ :
ఆరోగ్య శ్రీ బ్రాండ్ స్కీం : మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన ఈ పథకం ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో 2800 మందికి వైద్య సేవలకుగాను 10 కోట్ల 99 లక్షలకు పైగా రూపాయాల లబ్ది చేకూర్చడం జరిగింది. ఈ సంవత్సరం 1056 గర్భిణి స్త్రీలకుగాను 748 స్త్రీలకి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు (71 శాతం) చేయడం జరిగినది. సీజనల్ వ్యాధుల నిర్మూలన కొరకు ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా 24 వేల 38 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 34 మలేరియా 10 డెంగ్యూ కేసులను నిర్ధారించి, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం జరిగినది. అటవీ ప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించుటకు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నూతన ఆలోచనతో 3 తాత్కాలిక కంటైనర్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి 4182 మంది పేద గిరిజన ప్రజలకు పరీక్షలు నిర్వహించి, 19 లక్షల 56 వేల రూపాయలను లబ్ది చేకూర్చడం జరిగింది.

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్:
ఓ.పి, ఐ.పి. సేవలు గత సంవత్సరం కన్నా 10 శాతం పెరిగినవి. రోజువారి ఓపి 715, ఐ.పి. 165 గా ఉన్నది. మాతా శిశు సంబంధిత సేవలు మరింతగా పెరిగాయి. జనరల్ సర్జరీ విభాగంలో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నవి. ఈ నెల ఇద్దరికీ రొమ్ము కణితి, ఒకరికి దవడ కణితి విజయవంతంగా తొలగించి మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని అభినందిస్తున్నాను.

ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాల :
ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం కొరకు 50 సీట్లకు ఎన్.ఎం.సి. నుండి అనుమతి పొందడం జరిగింది. కళాశాలలో కావాల్సిన మైక్రోబయాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మా కాలేజీ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబిబిఎస్ కోర్స్ తో పాటు పారామెడికల్ కోర్స్ డి.ఎం.ఎల్.టి., డి.ఎం.ఎస్.టి. 60 సీట్లతో ల్యాబ్, తరగతి గదుల సౌకర్యాలను కల్పిస్తూ తరగతులను ప్రారంభించడం జరిగింది.

వ్యవసాయ శాఖ : రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతు భరోసా పథకం కింద వ్యవసాయ భూములకు వానా కాలానికి ఎకరానికి 12 వేల చొప్పున 79 వేల 481 మంది రైతుల ఖాతాలో 99 కోట్ల 10 లక్షల జమ చేయడం జరిగింది. రైతు బీమా పథకం కింద 2024-25 సంవత్సరంలో 218 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున 10 కోట్ల 90 లక్షలను రైతుల నామినిల కుటుంబ ఖాతాలో జమ చేయడం జరిగింది. సబ్ మిషన్ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఎస్సీ, ఎస్టీ మహిళా సన్న చిన్న కారు రైతులకు 50% రాయితీపై 79 లక్షల 60 వేల రూపాయలను వ్యవసాయ పరికరాలు అందించుటకు కేటాయించడం జరిగింది. జిల్లాలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన 671 మంది రైతులకు 3 కోట్ల 80 లక్షల 97 వేల రూపాయలను నష్టపరిహారం ఇప్పించడం జరిగింది.

విద్యుత్ శాఖ : గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో 200యూనిట్ల వరకు 39వేల 79 విధ్యుత్ వినియోగదారులకు ఉచితంగా జీరో బిల్లులు అందించడం జరిగింది. తద్వారా ఇప్పటి వరకు 39 కోట్ల 44 లక్షల రూపాయలను లబ్దిదారులకు సబ్సిడీ కల్పించాము. 21 కోట్ల 29 లక్షల నిధులతో బుచ్చంపేట, అడవీరంగాపూర్, గట్టమ్మ, జగ్గన్నపేట, నార్లపూర్, లింగాల, రోయ్యూరు గ్రామాల్లో నూతన 33 / 11 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాట్లకు శంకుస్థాపన చేయడం జరిగినది. కోడిశాల కుంటలో 2 కోట్ల 70 లక్షలతో నిర్మించుకున్న 33 / 11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించడం జరిగింది.

పౌర సరఫరాల శాఖ :70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. సన్నధాన్యానికి ఇప్పటివరకు 52 కోట్ల 70 లక్షల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు యాసంగి సీజన్ పంటలకు కనీస మద్దతు ధర పై 78 వేల 701 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో 485 కోట్ల 49 లక్షల రూపాయలను చెల్లింపు చేయడం జరిగింది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ భారంగా మారకుండా మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో 50 వేల 64 మందిని అర్హులుగా గుర్తించి, ఇప్పటి వరకు 500 రూపాయల చొప్పున ఒక లక్ష 64 వేల 169 సిలెండర్లను డెలివర్ చేసి, 4 కోట్ల 39 లక్షల సబ్సిడీని లబ్దిదారుల ఖాతాలో జమ చేశాం. రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు జిల్లాలో 6 వేల 207 కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. పేదల ఆకలి తీర్చటంతో పాటు, వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు జిల్లాలో ప్రతినెల 97 వేల 634 రేషన్ కార్డుదారులకు, ప్రతి నెల 7 కోట్ల 88 లక్షల రూపాయలను వెచ్చించి 1,751 టన్నుల పోషకాలతో కూడిన సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతున్నది.

జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ : గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో చేపట్టిన ఇందిరా మహిళ శక్తి పథకం లో భాగంగా ఎస్.హెచ్.జి. లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలోని 28 వేల 797 మంది విద్యార్థులకు ఏకారూప దుస్తులను వీరి ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాల ద్వారా జిల్లాలో పౌల్ట్రీ మదర్ యూనిట్లు 5, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు యూనిట్లు 2 ఏర్పాటు చేయడం జరిగినది. సదరం క్యాంపు ద్వారా 6,776 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. బ్యాంకు లీకేజీ కింద 1060 మహిళా సంఘాలకు 80 కోట్ల 54 లక్షల రుణాలు మంజూరు చేశాం. స్త్రీ నిధి కింద 33 వి.ఓ. లకు, 136 సంఘాల సభ్యులకు 4 కోట్ల 50 లక్షలు మంజూరు చేశాం. చేయూత పెన్షన్ పథకం ద్వారా 38 వేల 60 మంది లబ్దిదారులకు 9 కోట్ల 87 లక్షల రూపాయలను ప్రతి నెల పెన్షన్స్ అందిచడం జరుగుతుంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సంవత్సరం 7లక్షల 57 వేల పనిదినాలు కల్పించి, 47 వేల 50 మంది కూలీలకు 20 కోట్ల 80 లక్షల రూపాయలను వేతనంగా చెల్లించడమే కాకుండా, 12 కోట్ల 32 లక్షల రూపాయలను మెటీరియల్ కొరకు ఖర్చు చేయడం జరిగింది.

జిల్లా పంచాయతీ శాఖ : జిల్లాలోని 171 గ్రామ పంచాయితీలలో ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి, డంపింగ్ యార్డులకు తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. జిల్లా లోని 171 పంచాయితిలలోని నర్సరిలలో 11 లక్షల 39 వేలకు పైగా మొక్కలను సంరక్షించడం జరుగుతుంది.

నీటిపారుదల శాఖ : యాసంగి పంట సాగుకు 53 వేల 278 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడం జరిగింది. అంతేగాకుండా ప్రస్తుత సంవత్సరం వానకాల పంటల కొరకు సుమారు 88 వేల 18 ఎకరాలకు పైగా సాగునీరు అందించుటకు చర్యలు తీసుకొన బడుచున్నవి.

మిషన్ భగీరథ: జిల్లాలో 601 ఓ. హెచ్.ఎస్.ఆర్. లతో 88 వేల 30గృహాలకు అన్ని అవసరాలకు సరిపడు సురక్షిత మంచినీరు సరఫరా చేయడం జరుగుతున్నది.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం: నిరుపేదలకు ప్రతి ఒక్కరికీ సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలుపరుస్తోంది. మొదటిదశలో నిరుపేదలై ఉండి.. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారిని ప్రామాణికంగా తీసుకుని 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో బాగంగా జిల్లాలోని 10 మండలాలు, ఒక మున్సిపాలిటీకి మొదటి దశలో 4601 ఇండ్లు మంజూరు కాగా 3 వేల 678 ఇండ్లు గ్రౌండ్ అయ్యాయి. 1561 ఇండ్లు నిర్మాణ పనులు వివిద దశల్లో పురోగతిలో ఉండగా ఇప్పటి వరకు 9 కోట్ల 81 లక్షలు చెల్లించాం. ఈ పథకంతో పేదవాళ్లకు సొంతింటి కల సాకారమైంది.

కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకం:
2025-26 సంవత్సరంలో కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకాల క్రింద వివాహాలు జరిగిన పేద కుటుంబాలకు రూ.1 లక్ష 116/- ల చొప్పున 2 కోట్ల 71 లక్షల రూపాయలను 271 మంది లబ్దిదారులకు అందించడం జరిగినది.

అటవీశాఖ : వనమహోత్సవములో భాగంగా 171 గ్రామపంచాయితీలలో 14 లక్షల 26 వేల మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా వివిధ శాఖలలోని నర్సరీలలో 25 లక్షల 40 వేల మొక్కలను పెంచడం జరిగినది. తూనికాకు సేకరణలో 10వేల 359 “ఎస్. బి. “లకు 341 లక్షల 86 వేల కలెక్షన్ చేసి, 10 వేల 631 కూలీలకు రుసుముగా ఇవ్వడం జరిగింది. కాంపా అభివృద్ధి పనుల కింద ఒక లక్ష 33 వేల పని దినాలు కల్పించడం జరిగింది.

పశు వైద్య, పశుసంవర్ధక శాఖ : పాడి పశువులకు ఒక లక్ష 75 వేల గాలి కుంటు, జబ్బ వాపు, గురక వ్యాది టీకాలను, 65 వేల లంపి చర్మవ్యాధి టీకాలను వేయడం జరిగింది. గొర్రెలలో మేకలలో చిటుకు రోగం నీలి నాలుక వ్యాధి నివారణకు 42 వేల 194 టీకాలు వేయడం జరిగింది.

పరిశ్రమల శాఖ : టీజీ ఐపాస్ క్రింద 24 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు 40 వివిధ రకముల అనుమతుల మంజూరు చేయడం జరిగింది. ఇట్టి పరిశ్రమల ద్వారా 38 కోట్ల 20 లక్షల పెట్టుబడితో 221 మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది. టీ ప్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, పి.హెచ్.సి. పారిశ్రామిక వేత్తలకు 10 యూనిట్లకు 33 కోట్ల 32 లక్షల రూపాయలు రాయితి మంజూరు చేయడం జరిగింది.

పర్యాటక శాఖ : రామప్ప ఐలాండ్ వద్ద 13 కోట్ల నిధులతో అభివృద్ది పనులను, ప్రసాద్ స్కీమ్ లో భాగంగా 61 కోట్లతో యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పర్యాటక ప్రాంతం పాలంపేట గ్రామంలో ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఫుడ్ కోర్టులు, సావనీర్ షాప్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టడం జరుగుతుంది.

రెవెన్యూ శాఖ : రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను అత్యంత పారదర్శకంగా, సరళతరంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుటకు గాను నూతన ఆర్.ఓ.ఆర్. భూ భారతి చట్టంను రూపొందించినది. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుండి 36 వేల 673 అర్జీలను స్వీకరించి, రికార్డులు పరిశీలన అనంతరం 6 వేల 284 దరఖాస్తులను ఆమోదించడం జరిగినది. భూములను రీసర్వే నిమిత్తం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలను ఎంపిక చేసిన దానిలో వెంకటాపురం మండలంలోని నూగూరు రెవెన్యూ గ్రామం ఒకటి. దీనిలో భాగంగా ప్రతి భూ భాగాన్ని సర్వే చేసి రైతుల యొక్క విభాగానికి ల్యాండ్ పార్సెల్ మ్యాప్ తయారు చేసి రైతుల యొక్క ఆమోదం ద్వారా రెవెన్యూ రికార్డులలో అప్ డేట్ చేయుటకు ప్రక్రియ మొదలైనదని తెలుపుతున్నాను.

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖలు : జిల్లాలోని 48 వసతి గృహాల్లోని విద్యార్థులకు కామన్ డైట్ అమలు చేస్తున్నాం. ఆహార నాణ్యత పరిశీలనకు ఫుడ్ కమిటీలను ఏర్పాటు చేశాం. సంక్షేమ, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార తనిఖీలు నిర్వహించడం, నాణ్యత పరిశీలనకు ప్రతి వారం ఫుడ్ విత్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రత్యేక అధికారులు వారంలో 3 రోజులు విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి నాణ్యత, సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాం. డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాం. ఈ శాఖల ద్వారా విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, బెస్ట్ అవైలబుల్ స్కీం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి తదితర పథకాలు అమలు చేస్తున్నాం.

విద్య శాఖ : ఈ విద్య సంవత్సరము ఇంటర్మీడియట్ ఫలితాలలో 81.12 శాతం సాదించి ములుగు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన, విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు. ఈ విద్య సంవత్సరం కన్నాయిగూడెం మండలంలోని కే.జి.బి.వి. పాఠశాలను జూనియర్ కాలేజీగా ఉన్నతీకరించడం జరిగినది. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన, నాణ్యమైన విద్యా బోధనకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 6 కోట్ల 91 లక్షలతో 239 పాఠశాలల్లో మరమ్మత్తు పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 413 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 20 వేల 112 మంది విద్యార్థులకు లక్షా 27 వేల 880 ఉచిత పాఠ్య పుస్తకాలు, లక్షా 9 వేల 215 వ్రాత పుస్తకాలను పంపిణీ చేశాం.

State Minister Danasari Anasuya Seethakka

ఉద్యానశాఖ : జిల్లాలో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం, తెలంగాణ సూక్ష్మనీటి పారుదల పథకం, సమీకృత జాతీయ నూనె గింజల ఆయిల్ పామ్ పథకాలు అమలు చేస్తున్నాం. సమీకృత జాతీయ నూనె గింజలు, ఆయిల్ పామ్ పథకం లో భాగంగా 265 మంది రైతులకు 343.78 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు పరిపాలన అనుమతులు, 72 మంది రైతులకు 88.74 హెక్టార్లలో 33.35 లక్షల రూపాయలను సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు, రైతులు ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభం పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం12 ఎకరాల్లో ఆయిల్ ఫ్యాక్టరీకోసం కేఎన్ బయోసైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి అనుమతి ఇచ్చి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది.

సమ్మక్క సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ: బీఏ ఎకనామిక్స్ హానర్స్, ఇంగ్లీష్ హానర్స్ కోర్సులతో ప్రారంభమైన యూనివర్సిటీ లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత యూనివర్సిటీ భవనాల నిర్మాణం కోసం జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయానికి ఎదురుగా 287 ఎకరాల రెవెన్యూ భూమిని, 50 ఎకరాల అటవీ భూమిని కేటాయించి, త్వరలో యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.

మహిళా, శిశు సంక్షేమ శాఖ : ఈ సంవత్సరంలో సఖి కేంద్రం ద్వారా 196 మంది మహిళలకు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. 1372 మంది గర్భిణి స్త్రీలకు, 1037 మంది పాలిచ్చే తల్లులకు ప్రతి రోజు అన్నము, పప్పు, కూరగాయలు పాలు, గుడ్డుతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నాము. 5,938 మందికి 7 నెలల నుండి 3 సం.ల లోపు చిన్నారులకు నెలకు 2.5 కేజీల బాలామృతముతో పాటు 16 గుడ్లను అందిస్తున్నాము. 6 వేల 424 మందికి 3 నుండి 6 సం.ల లోపు పిల్లలకు ఒక గ్రుడ్డు, అన్నము, పప్పు, కూరగాయలు, స్నాక్స్ ప్రతి రోజు పంపిణి చేయడం జరుగుతున్నది. వికలాంగుల కోసం సదరం సర్టిఫికెట్లు పొందే ప్రక్రియను సులభతరం చేసాము. గతంలో కేవలం 7 రకాల వైకల్యాలను మాత్రమే సదరం క్యాంపులలో గుర్తించే వారు. ఇప్పుడు 21 రకాల వైకల్యాలను గుర్తించి సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాం. జిల్లాలో 600 మంది దివ్యాంగులను గుర్తించి వారికి బ్యాటరీ వీల్ చైర్స్- 150, వీల్ చైర్స్- 250, హియరింగ్ ఎయిడ్స్- 40, ట్రై సైకిల్స్ 150, మోటరైజ్డ్ వెహికల్స్ 10, అందించడం జరిగింది. జిల్లాలో ఐదుగురు దివ్యాంగులు సకలాంగులను వివాహం చేసుకున్న 3 జంటలకు లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించడం జరిగింది.

గిరిజన అభివృద్ధి శాఖ : జనవరి 28 నుండి 31 వరకు మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ మహా జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఎస్టి, ఎన్డీ.ఎఫ్ పథకంలో భాగంగా గత రెండు సంవత్సరాలలో 52 రోడ్లు, 68 కోట్ల 51 లక్షలతో మంజూరు కాగా 12 రోడ్లు పూర్తి అయినవి. మిగతావి ప్రగతిలో ఉన్నవి. 25 గ్రామ పంచాయతీ బిల్డింగ్ పనులు 5 కోట్లతో మంజూరు కాగా 2 పూర్తి అయి మిగతావి పురోగతిలో ఉన్నవి. అసిస్టెంట్ టు ఐటీడీఏ లో భాగంగా గత రెండు సంవత్సరములలో 110
పనులు 723 లక్షల 30 వేలతో మంజూరు కాగా 70 పనులు పూర్తి అయినవి. అంగన్వాడి కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలలు, సబ్ సెంటర్ల రిపేర్ల నిమిత్తము 227 పనులు, 11 కోట్ల 65 లక్షలతో మంజూరు కాక 126 పనులు పూర్తయినవి. 101 పనులు పూర్తి దశలో ఉన్నవి.

రహదారులు, భవనముల శాఖ :జిల్లాలో ఎస్టి.యస్.డి.ఎఫ్., ఆర్.డి.ఎఫ్., తదితర పథకాల ద్వారా 93 పనులకు గాను 228 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. 12 పనులు పూర్తికాగా 81 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయ భవనం (కలెక్టరేట్), నివాస గృహముల నిమిత్తం 63 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. శరవేగంగా నిర్మాణం పనులు జరుగుచున్నవి. కోర్టు సముదాయ భవన నిర్మాణం కొరకు 81 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగినది. త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది.

పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ :జిల్లాలో మహత్మా గాంధీ జాతీయ ఉపాది హామీ పథకం క్రింద 9 కోట్ల 52 లక్షల అంచనా వ్యయంతో 22 గ్రామ పంచాయతీ భవనాలు 30 అంగన్వాడి కేంద్రాలు 76 స్కూల్ టాయిలెట్స్ పనులు చేపట్టడం జరిగింది. సి.ఆర్.ఆర్. పథకం ద్వారా 73 కోట్ల 98 లక్షలతో 37 రోడ్లు, ఎం.ఆర్.ఆర్. పథకం ద్వారా 109 కోట్ల 76 లక్షలతో 62 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. ఎఫ్ డి ఆర్, ఎస్టి ఆర్ పథకాల ద్వారా 28 కోట్ల 49 లక్షల నిధులతో 24 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. ఎస్.డి.ఎఫ్. గ్రాంటు క్రింద ఎస్.టి కాంపోనెంట్ లో 33 కోట్ల 25 లక్షల తో 10 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. ఎస్.ఎస్.ఎం. జె. గ్రాంట్ క్రింద 7 కోట్ల 14 లక్షలతో 11 కూడలి అభివృద్ధి వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. 6 కోట్ల అంచనా వ్యయంతో 3 ఎం.పి.డి.ఓ. కార్యాలయ భవనాలు, ఒక కోటి 80 లక్షలతో 2 పి. ఆర్. సబ్ డివిజన్ ఆఫీస్ భవనాలు, 2 కోట్లతో ఒక పి.ఆర్.ఎస్. ఈ. ఆఫీస్ భవనం మంజూరు చేయడం జరిగినది.

యాస్పిరేషన్ అవార్డు : మన జిల్లాకు యాస్పిరేషన్ అంశాలలో రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లాకు అవార్డు ఇవ్వడం ఎంతో గౌరవంగా ఉంది. ఈ సందర్భంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ ని, జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను. మన జిల్లా యాస్పిరేషన్ నుండి ఇన్పిరేషన్ జిల్లాగా అభివృద్ధి చెంది రోల్ మాడల్ గా నిలవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను.

పోలీస్ శాఖ : శాంతి భద్రతల పరిరక్షణకు పొలిసుశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటూ, ఆధునిక టెక్నాలజీ వినియోగంతో నేరాలను చేధించడంతో పాటు నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమైన జిల్లా ఎస్పి, పోలిస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు.
మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న మన జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారికి, జిల్లాలో ప్రభుత్వ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు తమ పూర్తి సహకారం అందిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, వివిధ సంస్థల గౌరవ చైర్మన్లు. డైరెక్టర్లు, సభ్యులు, స్థానిక గౌరవ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న ఈ పండుగ వేళ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ ముగిస్తున్నాను.

బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియామకం….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T131256.308-1.wav?_=15

 

బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియమితులయ్యారు బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిషిధర్ రెడ్డి నియమాకాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దొంగల రాజేందర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి నాగపూర్ రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు నిషేధర్ రెడ్డికి మండల అధ్యక్షులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భూపాలపల్లి జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలవడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version