టూ వీలర్ మెకానిక్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించడం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్ జెండాను ఆవిష్కరించి అనంతరం వారు మాట్లాడుతూ..స్వతంత్ర పోరాటంలో అమరులైన వీరులను స్మరిస్తూ,వారు ప్రసాదించిన స్వేచ్ఛను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని కోరుతూ,రోజువారి మానవ జీవన ప్రయాణంలో అత్యంత అవసరమైన మోటార్ సైకిల్ లను బాగుచేస్తూ ఎంతో మంది రోజువారి జీవితాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్న మెకానిక్ సోదరులందరికీ,ఇంకో విధంగా చెప్పాలంటే మోటార్ సైకిల్ వైద్యులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే మెకానిక్ మిత్రులు అందరూ ఐక్యతతో ఉండాలని,వృత్తి పట్ల నిబద్ధతతో,నిజాయితీతో వ్యవహరించాలని,నమ్మి వచ్చిన కష్టమర్లకు న్యాయం చేయాలని సూచించారు.యూనియన్ కి అన్న విధాల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్, ఉపాధ్యక్షులు పభాస్కర్, జనరల్ సెక్రెటరీ నేరెళ్ల నరేష్ గౌడ్,సహాయ కార్యదర్శి జడల మహేష్,ప్రచార కార్యదర్శి మహమ్మద్ అల్లావుద్దీన్, భానేష్ సభ్యులు,తోటి మెకానికులు పాల్గొన్నారు.