మండల కేంద్రంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నడికూడ,నేటిధాత్రి:
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నడికూడ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ మండల పార్టీ అద్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీలాపానా చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,బిఆర్ఎస్ మండల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.