-స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పదివేల నగదుతో పాటు ఘన సత్కారం
మోడల్ స్కూల్ విద్యార్థి చందా అజయ్
-జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా సన్మానం
మొగులపల్లి నేటి ధాత్రి
2004-2005 ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మోడల్ స్కూల్ విద్యార్థి చందా అజయ్ ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్ మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల మోడల్ స్కూల్ లో 2004-2005 లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో చందా అజయ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నగదు బహుమతితో ప్రోత్సహించి వారిని ఉన్నత చదువులలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రారంభించిన నగదు బహుమతి ప్రోత్సాహాన్ని 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చందా అజయ్ ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా పదివేల రూపాయల నగదు బహుమతితో పాటు, శాలువాతో ఘనంగా సత్కరించడం సంతోషం కలిగించిందన్నారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో చందా అజయ్ ఉన్నత స్థాయిలో రాణించాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థినీ, విద్యార్థులు చదువుల్లో రాణించి, ఉన్నత శిఖరాలను అధిరోహించి, చదువుతోపాటు నైతిక విలువలు, సామాజిక స్పృహను పెంపొందించుకోవాలన్నారు. తమ స్కూలుకు చెందిన విద్యార్థి చందా అజయ్ సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, తమ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందనేదానికి ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయన్నారు. ఈ విజయం వెనుక విద్యార్థుల కటోర శ్రమ, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు