డాక్టర్.దొమ్మటి.ప్రసన్నకుమార్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు
అవార్డు అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
ఆగస్టు 15నాడు ఖిలావరంగల్లో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ఎంజీఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.దొమ్మటి ప్రసన్నకుమార్ కు పేద ప్రజలకు వైద్యాన్ని అందించంలో ముందున్నందున ఉత్తమ డాక్టర్ అవార్డును శుక్రవారం రోజున రాష్ట్ర మంత్రివర్యులు,ఇంచార్జ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్బంగా డాక్టర్.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అవార్డును అందించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.