ఎందరో మహానుభావుల త్యాగం ఫలితం ఈ స్వాతంత్ర మన దేశానికి వచ్చింది
తిరుపతి(నేటి ధాత్రి)ఆగస్టు 15:
మన కోసం కాకుండ దేశం కోసం జీవించాలి 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ సర్పంచ్ డివి రమణ గావించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగం ఫలితం ఈ స్వాతంత్ర మన దేశానికి వచ్చింది అన్నారు.మహాత్మా గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంకో ఇంకో చెంప కూడా చూపించారని. భగత్ సింగ్ తక్కువ వయసులోనే ఉరివేస్తున్నప్పుడు చిరునవ్వు చిందించారని భగత్ సింగ్ గారి తల్లి ఆవేదన చెందుతూ ఏడుస్తుంటే ఏంటమ్మా అని అడిగినప్పుడు దేశం కోసం నా కుమారుడు అమరడు అయ్యారు నాకు మరో ఒక కుమారుడు ఉంటే దేశ స్వాతంత్ర కొరకు పంపేదాని అని అన్నారు. మరొక్క సందర్బం లో ఉక్కు మనిషి గా పేరు గాంచిన సర్ధార్ వల్ల భాయ్ పటేల్ 1909 సంవత్సరలో తల్లీ మరణించిన బాధను దిగ మింగుకుని జైల్లో ఉన్న వారి కోసం వాదించి విజయం సాధించారు.అదేవిదంగా అజాత్ హిందూ ఫోజ్ సంస్థను స్థాపించి తన యుద్ధ పోరాటాలు ద్వారా బ్రిటిష్ వారిని భయబ్రాంతులకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురి చేశారు.అల్లూరి సీతా రామరాజు,జాన్సీ లక్ష్మి భాయ్ లాంటి ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలితం గా ఈ స్వతంత్రం వచ్చింది అని తెలిపారు.అనంతరం గ్రామ సభ నిర్యహించారు సోలార్ ప్రాజెక్టు ను ఉపయోగించు కోవాలి అని కోరారు.భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు పంచాయతీకి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ప్రతి ఒక్కరు మన కోసం కాకుండ దేశం ప్రయోజనాలు కోసం జీవించాలి అని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో పంచాయతీ సెక్రటరీ,ఉప సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, వార్డ్ మెంబర్లు, నాయకులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, పంచాయతీ పాఠశాల ఉపాధ్యాయులు,ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, డ్వాక్రా సంఘమిత్రలు, మహిళలు, యువత, పాల్గొన్నారు.
